తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారు | KTR Satirical Comments On CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారు

Feb 23 2026 4:25 AM | Updated on Feb 23 2026 4:25 AM

KTR Satirical Comments On CM Revanth Reddy: Telangana

ఆ విషయం సీఎం రేవంత్‌రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలా మార్చా­రని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఏటీ­ఎంలా మారిందని తాము అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్‌ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

అభి­వృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజ­నాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీ­కరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్‌­సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్‌ విమ­ర్శించారు.

హిల్ట్‌ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ‘ఎనుముల బ్రదర్స్‌’ పద్ధ­తి ప్రకారం లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచు­కోవడం, సొంతానికి దాచుకోవడం.. తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్‌ రెడ్డి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement