పూత రాలిందనే మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య | Mango farmer commits suicide in Manchiryal district | Sakshi
Sakshi News home page

పూత రాలిందనే మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య

Feb 23 2026 3:58 AM | Updated on Feb 23 2026 3:58 AM

Mango farmer commits suicide in Manchiryal district

చెన్నూర్‌: మారిన వాతావరణ పరిస్థితు­లతో మామిడి పూత మొ­త్తం రాలిపోవ­డం.. పూత­ను కాపాడేందుకు చేసిన ప్రయ­త్నాలు ఫలించకపోవడంతో మ­నస్తాపం చెంది ఓ రైతు ఆత్మ­హత్య చేసుకున్నాడు. ఈ విషా­ద ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలో జరిగింది. పట్టణంలోని కొ­త్త గూడెం కాలనీకి చెందిన మామిడి రైతు ఎల్లబో­యిన మల్లేశ్‌ (47)కు రెండెక­రాల మామిడితోట ఉంది. ఈ ఏడాది దండిగా పూత రావడంతో మంచి ది­గు­బడి వస్తుందని ఆశించాడు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడిపూత రాలిపోయింది.

పూతను కాపాడేందుకు రసాయన ఎరువులు పిచికారీ చేసినా నిరాశే మిగిలింది. దీంతో శనివారం సాయంత్రం మామిడి తోటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కు­టుంబసభ్యులు తోట దగ్గరికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మరక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక అస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రి తీసు­కెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement