శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం.. | Protest Erupts in Nagarkurnool After Infant Death: Telangana | Sakshi
Sakshi News home page

శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం..

Feb 23 2026 3:52 AM | Updated on Feb 23 2026 3:52 AM

Protest Erupts in Nagarkurnool After Infant Death: Telangana

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న

నాగర్‌కర్నూల్‌ పీఎస్‌ ఎదుట కుటుంబసభ్యుల నిరసన 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రెండు రోజుల క్రితం ఆల­యంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహ­కులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘ­టనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల­తో­పాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని పో­లీ­స్‌స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.

నిందితులను తక్షణమే అదుపు­లోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మె­ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరా­మర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొ­న్నా­రు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్‌కర్నూల్‌ ఎమ్మె­ల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితు­లు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్ప­డ్డారు’ అని మర్రి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement