రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Visit To Mulugu Devadula Project | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌

Feb 22 2026 6:12 PM | Updated on Feb 22 2026 6:17 PM

CM Revanth Visit To Mulugu Devadula Project

ములుగు: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగా ఉన్నాయని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు సీఎం రేవంత్‌. 

రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని,  ప్రస్తుతం నిధుల కొరత ఉందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింద్నారు.  ఇక కృష్ణా జలాల తరలింపుపై సభలో క్లారిటీ ఇచ్చామన్నారు. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీఓ చర్చిద్దామన్నారు. చౌకబారు రాజకీయాలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం, ఫిబ్రవరి 22వ తేదీ) దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్‌. 

దీనిలో భాగంగా ఇంజనీరింగ్‌ అధికారులతో నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement