కాబోయే వరుడి వేధింపులు.. తట్టుకోలేక తనువు చాలించిన యువతి | Woman Dies In Jogulamba Gadwal District | Sakshi
Sakshi News home page

కాబోయే వరుడి వేధింపులు.. తట్టుకోలేక తనువు చాలించిన యువతి

Feb 22 2026 4:55 PM | Updated on Feb 22 2026 5:02 PM

Woman Dies In Jogulamba Gadwal District

సాక్షి,జోగులాంబ: వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవ్వాల్సిన ఇద్దరి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. వధువు ఇంట విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు తరచూ ఫోన్‌లో అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక యువతి తనువు చాలించింది.

జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక యువతి స్నేహ ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్‌పై కాబోయే వరుడు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. తరుచూ ఫోన్‌ వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement