సీఎం రేవంత్‌పై అరవింద్‌ తీవ్ర విమర్శలు | Arvind made Harsh comments on CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌పై అరవింద్‌ తీవ్ర విమర్శలు

Feb 22 2026 4:46 PM | Updated on Feb 22 2026 5:17 PM

Arvind made Harsh comments on CM Revanth

సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 

కాంగ్రెస్‌ పార్టీకి ఈ రెండేళ్లలో అధికంగా డబ్బు సంపాదించి అది కొవ్వుగా మార్చుకున్నారని దీంతో అక్రమ హౌస్ అరెస్టుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలన నడుస్తుందన్నారు. అమ్మాయిపై ఒక వర్గం వారు  దౌర్జన్యం చేస్తే మరో వర్గం వారిని అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

MLA వెంకటరమణారెడ్డపై దాడి జరిగితే కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించారా? ఎమ్మెల్యేపై దాడి గురించి ఏమైనా ఆరా తీశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల రెస్పాన్సిబులిటీ స్పీకర్ ది కాదా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ చాలా డేంజరని ఆరోపించారు. కేసీఆర్ ధోరణిలోనే కాంగ్రెస్‌ సైతం  హౌస్ అరెస్టులు చేస్తుందని వాటిని తాము ఖండిస్తున్నామని అరవింద్ తెలిపారు. సూపర్ మార్కెట్ లోకి వచ్చి గొడవ చేసిన  వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని  MLA క్యాంప్ ఆఫీస్ పై దాడికి వచ్చిన వారిని వెంటనే  అరెస్ట్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement