హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా? | World Famous Haleem Preparation at Pista House | Sakshi
Sakshi News home page

హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా?

Feb 22 2026 7:43 PM | Updated on Feb 23 2026 8:55 AM

World Famous Haleem Preparation at Pista House

సాక్షి,హైదరాబాద్‌: రంజాన్‌ మాసం అంటే హలీమ్‌కి పెట్టింది పేరు. ముస్లిం సోదరులు ఉపవాసం ముగిసిన తర్వాత ఇఫ్తార్‌ సమయంలో హలీమ్‌ వడ్డించడం ఒక సంప్రదాయంగా మారింది. గోధుమలు, మాంసం, పప్పులు, మసాలాలు కలిపి గంటల తరబడి మెల్లగా ఉడికించే ఈ వంటకం బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు. రంజాన్‌ సమయంలో ఐక్యత, పంచుకోవడం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది.

హలీమ్‌కి హైదరాబాద్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం కాలంలో ఇది రాజభవన విందుల్లో మాత్రమే లభించేది.   తర్వాత సాధారణ ప్రజలలో విస్తరించి ప్రతి ఒక్కరినీ మైమరిచిపోయేలా చేసింది.

2010లో హైదరాబాద్‌ హలీమ్‌కి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (GI) గుర్తింపు కూడా లభించింది. రంజాన్‌ మాసంలో హలీమ్‌ అంటే వంటకం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, సంప్రదాయం. అలాంటి హైదరాబాదీ స్పెషల్‌ హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం వీడియోను క్లిక్‌ చేసి వీక్షించండి. 

 

Advertisement
 
Advertisement
Advertisement