breaking news
Pista House Halim
-
హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా?
సాక్షి,హైదరాబాద్: రంజాన్ మాసం అంటే హలీమ్‌కి పెట్టింది పేరు. ముస్లిం సోదరులు ఉపవాసం ముగిసిన తర్వాత ఇఫ్తార్ సమయంలో హలీమ్ వడ్డించడం ఒక సంప్రదాయంగా మారింది. గోధుమలు, మాంసం, పప్పులు, మసాలాలు కలిపి గంటల తరబడి మెల్లగా ఉడికించే ఈ వంటకం బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు. రంజాన్ సమయంలో ఐక్యత, పంచుకోవడం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది.హలీమ్‌కి హైదరాబాద్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం కాలంలో ఇది రాజభవన విందుల్లో మాత్రమే లభించేది. తర్వాత సాధారణ ప్రజలలో విస్తరించి ప్రతి ఒక్కరినీ మైమరిచిపోయేలా చేసింది.2010లో హైదరాబాద్ హలీమ్‌కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపు కూడా లభించింది. రంజాన్ మాసంలో హలీమ్ అంటే వంటకం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, సంప్రదాయం. అలాంటి హైదరాబాదీ స్పెషల్ హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం వీడియోను క్లిక్ చేసి వీక్షించండి. -
ఆన్లైన్లో ‘పిస్తాహౌస్ హలీమ్’
* ‘స్విగ్గీ’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసేందుకు అవకాశం * నగరంలోని ఏమూలకైనా డెలివరీ సదుపాయం * ఈ ఏడాది మైసూరు, తుమకూరులో సైతం ఔట్లెట్ల ఏర్పాటు సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరి వాసుల మనసుదోచిన హైదరాబాదీ వంటకం ‘పిస్తాహౌస్ హలీమ్’ ఈ రంజాన్ మాసం సందర్భంగా మరోసారి బెంగళూరు నగరంలో అందుబాటులోకి వచ్చేసింది. కాగా, ఈ ఏడాది పిస్తాహౌస్ హలీమ్‌ను ‘స్విగ్గీ’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని పిస్తాహౌస్ సంస్థ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్రాంచైజీ ప్రతినిధి షఫీక్ మాట్లాడుతూ... ఏడాదికేడాదికి బెంగళూరులో పిస్తాహౌస్ హలీమ్ అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రముఖ ఫుడ్ ఆన్లైన్ పోర్టల్ ‘స్విగ్గీ’తో ఈ ఏడాది ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.తద్వారా రంజాన్ మాసమంతా బెంగళూరు నగరంలోని ఏ మూలకైనా సరే పిస్తాహౌస్ హలీమ్‌ను డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు మరింత చేరవకావడంలో భాగంగానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఔట్లెట్లలో పిస్తాహౌస్ హలీమ్‌తో పాటు హైదరాబాదీ బిర్యానీ, సమోసా, గాజర్ కా హల్వా, కుబానీ కా మీఠా సైతం ఆహార ప్రియుల కోసం అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇక ఈ ఏడాది కేవలం బెంగళూరులోనే కాక మైసూరు, తుమకూరులో సైతం తమ ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సైతం తమ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం, కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో తమ ఔట్లెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 330 గ్రాముల హలీమ్ ధర రూ.160, ఒకటిన్నర కిలోల హలీమ్ ధర రూ.650గా నిర్ణయించినట్లు తెలిపారు.


