breaking news
inspiration
-
ఐరావతం సాయం
సుందరవనంలో ఐరావతం అనే ఒక ఏనుగు ఉండేది. అది అన్నింటికీ సాయం చేసేది. ఇలా ఉండగా, ఒకరోజు ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. దానికి ఎదురుగా ఆకస్మికంగా ఒక పెద్దపులి కనబడింది. వెంటనే అది ఆ పెద్దపులిని చూసి భయంతో ఆగిపోయింది. ఆ పులి భయానికి అది తప్పించుకోవడానికి దారి లేక అది తనకు చావు తప్పదని భావించి అక్కడ ఉన్న చోటనే కళ్ళు మూసుకొంది.ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన ఐరావతం అది చూసి, పరిగెత్తి వస్తున్న ఆ పులిని ఆగమని చెప్పింది. కానీ ఆ పెద్దపులి దాని మాటను పట్టించుకోకుండా ఆ జింక పైకి దూకాలని పరుగున వచ్చింది. వెంటనే ఆ ఐరావతం ఆ కళ్ళు మూసుకున్న ఆ జింకను తన తొండంతో ముందుకు ఒక్క తోపు తోసింది.ఆ జింక కొంత ముందుకు వెళ్లి నేలపై పడిపోయింది. ఆ పులి తన పరుగును అదుపులో పెట్టుకోలేక అడ్డుగా అక్కడ జింక లేకపోవడంతో దాని వెనుక ఉన్న గోతిలో అమాంతంగా పడిపోయింది. ఆ జింక కళ్ళు తెరిచి చూసి తన ప్రాణాలు దక్కాయని సంతోషించి తనకు సాయం చేసిన ఏనుగుకు ధన్యవాదాలు తెలిపి సంతోషంతో వెళ్ళిపోయింది ఆ గోతిలో పడిన పెద్దపులి ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నీవు అందరికీ సాయం చేస్తావే! మరి నన్ను కూడా కాపాడవా!’ అని అరిచింది.వెంటనే ఏనుగు ‘ఓ పులి రాజా! నేను ఆగమని చెబితే నీవు నా మాట వినలేదు. ఇక్కడ గొయ్యి ఉందని నాకు తెలిసే నేను నిన్ను ఆగమన్నాను. కానీ నీవు ఆగకుండా ఆ జింకపై దాడి చేయాలని చూశావు. అందుకే దాన్ని ముందుకు తోసి కాపాడాను. ఇప్పుడు నిన్ను కూడా కాపాడుతాను. నీవు భయపడకు’ అని కొన్ని కలప దుంగలను, ఆకులు అలములు తెచ్చి ఆ గోతిలో వేసి దానిని కూడా కాపాడింది. ఆ పులి కూడా ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది. తర్వాత ఆ ఏనుగు నడిచి పోతుండగా, దానికి ’కాపాడండీ! కాపాడండీ’ అని అరుపులు వినిపించాయి. ఆ ఏనుగు పరుగున వెళ్లి ఆ అరుపులు వచ్చిన వైపుకు వెళ్లింది.అక్కడ దానికి ఒక చిట్టి చిలుకను పట్టుకున్న ఒక నక్క కనిపించింది. ఆ చిట్టి చిలుక ఆ ఏనుగును చూసి, ‘ఓ ఐరావతమా! నన్ను ఈ నక్క నుండి కాపాడవా!’ అని దీనంగా అరచింది. ఆ ఏనుగు అది విని నక్కతో ఆ చిలుకను వదిలిపెట్టమని కోరింది. కానీ ఆ నక్క దాని మాటను వినలేదు. ‘ఓ ఐరావతమా! నేను దొరికిన ఆహారాన్ని వదలిపెట్టేంత మూర్ఖురాలిని కాదు. నీవు ఇక్కడి నుండి వెళ్లు’ అంది. అప్పుడు ఏనుగు ఒక కర్రను తన తొండంతో తీసి ఆ నక్క పైకి విసిరింది. ఆ నక్కకు ఆ కర్ర తాకి అది ‘కుయ్యో! మొర్రో!’ అని అరిచింది. వెంటనే దాని నోరు వదులై ఆ నోటిలోంచి ఊడిపడ్డ చిట్టి చిలుక రివ్వున ఎగురుకుంటూ ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. తనపై కర్రను విసరిన ఏనుగును చూడగానే నక్కకు చాలా కోపం వచ్చింది. అది ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నాకు ఆహారం లేకుండా చేస్తావా! నీ సంగతి మృగరాజు సింహానికి చెబుతాను’ అని సింహం వద్దకు వెళ్లి ఐరావతం తనపై కర్రతో దాడి చేసిందని ఫిర్యాదు చేసింది.సింహం నవ్వి ‘నీవు చిట్టి చిలుకను పట్టుకొన్నావన్న సంగతి చెప్పడం లేదెందుకు? నాకు ఒక కాకి అంతా చెప్పిందిలే! ఆ చిట్టి చిలుకను నీవు పట్టుకొంటావా! చిన్న పిల్లల్ని పట్టుకోవద్దని, వారికి హాని చేయవద్దని నేను నీకు చెప్పలేదా! నీకు తగినశాస్తి జరిగింది’ అని నక్కను మందలించింది. నక్క చేసేది లేక ఉస్సూరుమనుకొంటూ అక్కడి నుంచి కదిలింది. తర్వాత ఆ సింహం ఐరావతాన్ని పిలిపించి అది చేసిన సాయానికి మెచ్చి, దానిని జంతువుల ముందు ప్రశంసించి ఘనంగా సత్కరించింది. - సంగనభట్ల చిన్న రామకిష్టయ్య హిత వచనం..తనతో ఏ వైరం లేకుండా సుఖంగా ఉన్నవాడికి దుఃఖం కలిగించినవాడు జన్మజన్మాంతరాలలో దుఃఖం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. -
వానదేవుడి చిరునవ్వు
పులిచెర్ల పల్లెలో నెలరోజులుగా వాన జాడే లేదు. పొలాలు బీళ్లు వారాయి. రైతు రామయ్య తాత దిగులుగా గట్టు మీద కూర్చున్నాడు. ‘ఈ ఏడు విత్తనాలు మొలకెత్తేలా లేవు‘ అని నిట్టూర్చాడు. అది చూసిన చిన్నారి గౌరికీ, చిన్నోడుకు ఒక ఆలోచన వచ్చింది.‘వానదేవుడు మనల్ని మర్చిపోయాడేమో. మనమే పిలవాలి’ అంది గౌరి. పిల్లలందరూ కలిశారు. వానదేవుడికి ఉత్తరం రాశారు. ‘దేవుడా, మా తాతలు ఏడవొద్దు. నువ్వు నవ్వితే చాలు, మా పొలం పచ్చగా నవ్వుతుంది.’ ఆ ఉత్తరాన్ని అరటి ఆకులో పెట్టి, చెరువు గట్టున ఉన్న రావిచెట్టు తొర్రలో దాచారు. తర్వాత ఊరంతా తిరిగి వాన పాటలు పాడారు.‘ఎలుకమ్మ ఎలుకమ్మ ఎండలేలా... వానమ్మ వానమ్మ వచ్చెయ్యమ్మా...‘ పిల్లల పాటలు, వాళ్ల మంచి మనసు చూసి వానదేవుడికి ముచ్చటేసింది. ఆ రోజు సాయంత్రమే ఆకాశంలో మబ్బులు ముసిరాయి. మెరుపులు మెరిశాయి. టప్‌టప్‌మంటూ చినుకులు పడ్డాయి. రామయ్య తాత ఆనందంతో గెంతాడు. ‘చూడండి, పిల్లల మనసు వానదేవుడికి నచ్చింది!’ పొలాలన్నీ తడిశాయి. విత్తనాలు మొలకెత్తాయి. ఊరంతా పచ్చగా నవ్వింది.నీతి: చిన్నారుల స్వచ్ఛమైన ప్రేమకు, ఐక్యతకు దేవుళ్లు కూడా తలవంచుతారు. -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
సహనం ఒక వెలుగుబాట
ఉపకోసల కామలాయనుడు సత్యకామ జాబాలుని ఆశ్రమంలో శిష్యునిగా 12 సంవత్సరాల΄ాటు గురు శుశ్రూష చేస్తూ, యజ్ఞాగ్నులకు శ్రద్ధతో సేవచేసాడు. అతని వినయం, క్రమశిక్షణ, సేవాభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు గురువుగారు ఇతర శిష్యులకు విద్యను బోధించి వారిని యింటికి పంపించేశారు.ఉపకోసలునికి మాత్రం బ్రహ్మవిద్య బోధించకుండా ప్రయాణమై వెళ్ళిపోయారు. గురుపత్నికి ఇది బాధ కలిగించి గురువుగారితో అంది ‘‘ఉపకోసలుడు ఎన్నో సంవత్సరాలు నిష్ఠగా సేవచేశాడు. అతనికి కూడా జ్ఞానం బోధించండి’’ అంది. కానీ గురువుగారు పట్టించుకోలేదు. ఉపకోసలునికి నిరాశ కలిగినా గురువుగారిపై కోపంగాని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడంగాని, తన సేవను ఆపడం గాని చేయలేదు. తన మనసును పవిత్రంగా ఉంచుకుంటూ ఉపవాసం చేశాడు. అతని భక్తికి, సహనానికి ముగ్ధులై ఆశ్రమంలోని 3 యజ్ఞాగ్నులు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని) అతనితో మాట్లాడి అతనికి బ్రహ్మ తత్వంలోని అనేక రహస్యాలు బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాయి. (యజ్ఞాగ్నులు ఉపకోసలునితో మాట్లాడినట్టు చెప్పడం ఒక ప్రతీకాత్మక బోధన.)గురువు గారు తిరిగివచ్చిన తరువాత ఉపకోసలుని ముఖంలో అపూర్వమైన తేజస్సు చూసి ‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’ అని అడిగారు. ఉపకోసలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు గురువుగారు అగ్నులు బోధించిన జ్ఞానాన్ని సంపూర్ణం చేస్తూ బ్రహ్మస్వరూ΄ాన్ని పూర్తిగా ఉపదేశించాడు. ఉపకోసలుని సహనం ఫలించింది. గురుభక్తి వృథాకాలేదు. నిష్కామ సేవ మనసుని శుద్ధిచేసి జ్ఞాన΄ాత్రుని చేసింది. ఓర్పుతో, విశ్వాసంతో, నిష్ఠతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృథాకాదు. సమయమొచ్చినపుడు అది విజయాన్ని, జ్ఞానాన్ని, అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. బాహ్య దృష్టితో చూస్తే యజ్ఞాగ్నులు యజ్ఞకుండంలో వెలిగే అగ్నులు. అంతర్గతంగా అవి మనలోని జ్ఞానానికి, శ్రద్ధకు, భక్తికి, ఆత్మ జిజ్ఞాసకు ప్రతీకలు.– డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు
దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.బాలయేసు కార్టూన్ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.– జేతమ్ -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
గరుడతీర్థం..
ఆదిశేషుడి కొడుకు మణినాగుడు గరుత్మంతుడి భయం వల్ల కైలాసానికి వెళ్లి, పరమశివుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకోసాగాడు. కొన్నాళ్లకు పరమశివుడు అతడి భక్తిప్రపత్తులకు ప్రసన్నుడయ్యాడు. ‘మణినాగా! నీ భక్తికి మెచ్చాను. వరమేమి కావాలో కోరుకో!’ అడిగాడు.‘పరమేశ్వరా! గరుడుని వల్ల భయం కలగకుండా వరమివ్వు చాలు’ అన్నాడు మణినాగుడు.‘తథాస్తు’ అంటూ వరం అనుగ్రహించాడు పరమశివుడు.పరమశివుడి వరం కారణంగా భయం తొలగిన మణినాగుడు ఒకనాడు వ్యాహ్యాళిగా క్షీరసాగర తీరంలో స్వేచ్ఛగా సంచరించసాగాడు. ఇది చూసిన గరుడుడు అకస్మాత్తుగా వచ్చి, మణినాగుడిని ఎగరేసుకుపోయాడు. తన నివాసంలో అతడిని బంధించి ఉంచాడు.కైలాసంలో పరమశివుడి సన్నిధిలో అందరూ కొలువుతీరి ఉన్నారు. ‘పరమేశ్వరా! మన మణినాగుడు ఈరోజు ఎందుకో సభకు రాలేదు. అతడిని వైనతేయుడు భక్షించడమో, బంధించడమో చేసి ఉండవచ్చని సందేహంగా ఉంది’ అన్నాడు నందీశ్వరుడు.నందీశ్వరుడి మాటలతో శివుడికి తాను మణినాగుడికి ఇచ్చిన వరం జ్ఞప్తికి వచ్చింది.‘నందీశ్వరా! తక్షణమే నువ్వు క్షీరసాగరానికి వెళ్లు. శ్రీమహావిష్ణువును స్తుతించి, మణినాగుడిని విడిపించుకుని, నా వద్దకు తీసుకురా!’ అని ఆజ్ఞాపించాడు.పరమశివుడి ఆనతితో నందీశ్వరుడు హుటాహుటిన క్షీరసాగరానికి చేరుకున్నాడు. శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతుండగా, శేషశయ్యపై అర్ధనిమీలిత నయనాలతో పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించుకుని, ఆయనను వేనోళ్ల స్తుతించాడు. మణినాగుడికి పరమశివుడు వరమిచ్చిన సంగతిని, అతడిని తనతో పాటు కైలాసానికి కొనితెమ్మని ఆనతినిచ్చిన సంగతిని విన్నవించుకున్నాడు. మణినాగుడిని గరుడుడు బంధించి ఉండవచ్చని, అందువల్ల అతడిని గరుడుని చెర నుంచి విడిపించాలని అభ్యర్థించాడు.నందీశ్వరుడి మాటలను ఆలకించిన విష్ణువు వెంటనే గరుత్మంతుడిని పిలిపించాడు. గరుడుడు వెంటనే విష్ణుపాదాల ముందు వాలాడు.‘వినతానందనా! మణినాగుడిని విడిచిపెట్టి, ఈ నందీశ్వరుడికి అప్పగించు’ అని ఆజ్ఞాపించాడు.‘ప్రభూ! ఇది అన్యాయం. భృత్యులకు సంతోషకరమైన వస్తువులు ప్రభువు ఇవ్వడం లోకంలో ఉంది. నువ్వు ఏనాడూ నాకు ప్రీతిపాత్రమైన వస్తువులను ఇచ్చి ఉండలేదు సరికదా, నేను సంపాదించుకున్న వస్తువును ఇప్పడు ఇచ్చేయమంటున్నావు. నీకు వాహనాన్నై నిన్ను మోస్తూ ఉన్నాను. అందుకు నువ్వే నాకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోగా, నేను సంపాదించుకున్న నాకిష్టమైన ఆహారాన్ని ఇచ్చేయమంటున్నావు. ఇదేమి న్యాయం? నేను మణినాగుడిని ఇవ్వలేను’ అని నిష్ఠురంగా పలికాడు గరుత్మంతుడు.గరుడిని మాటలు విన్న శ్రీమహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ, ‘వైనతేయా! నువ్వు నన్ను మోస్తూ ఉన్నందునే కృశించిపోయినట్లున్నావు. అయినా, నువ్వు బలశాలివి సుమీ! ఏదీ కాస్త నా చేతి వేలిని నీ తలమీద కాసేపు మోయి’ అంటూ గరుడుని శిరస్సు మీద వేలు ఉంచాడు.గరుడుని తల అతడి ఉదరభాగం వరకు కుంగిపోయింది. గరుడు విలవిలలాడాడు. ‘దేవాదిదేవా! జగన్నాథా! పాహిమాం! పాహిమాం! నా అపరాధాన్ని మన్నించి, కాపాడు’ అని గగ్గోలు పెట్టాడు. ‘జగన్మాతా! నీవైనా దయతలచి నన్ను కాపాడు’ అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ‘నాథా! వైనతేయుడిని రక్షించండి’ అని అభ్యర్థించింది లక్ష్మీదేవి.అప్పుడు శ్రీమహావిష్ణువు నందీశ్వరుడి వైపు చూసి, ‘నందీశ్వరా, మణినాగుడితో పాటు ఈ గరుత్మంతుడిని కూడా పరమేశ్వరుని సన్నిధికి తీసుకుపో! దయామయుడైన పరమేశ్వరుని కటాక్షంతో ఇతడి శరీరం యథాస్థితికి రాగలదు’ అని పలికాడు. నందీశ్వరుడు తనతో పాటు మణినాగుడిని, గరుత్మంతుడిని తీసుకుని కైలాసంలో పరమశివుని సన్నిధానానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు సన్నిధానంలో జరిగినదంతా పరమశివుడికి విన్నవించాడు.పరమశివుడు ప్రసన్నంగా గరుత్మంతుడిని చూసి, ‘వైనతేయా! దిగులు పడకు. పవిత్ర గౌతమీ తీరానికి వెళ్లి, గౌతమీ జలాల్లో స్నానమాచరించు. నీ పూర్వశరీరాన్ని, దారుఢ్యాన్ని పొందగలవు’ అని పలికాడు.పరమశివుడి ఆనతిపై గౌతమీ జలాల్లో స్నానమాచరించాక గరుత్మంతుడికి పూర్వరూపం వచ్చింది. గరుత్మంతుడు స్నానమాచరించిన ఆ ప్రదేశమే గరుడ తీర్థంగా ప్రసిద్ధి పొందింది.- సాంఖ్యాయన -
మౌనం – అది అద్భుతం, వాస్తవికం!
‘రచయితలు తమకు తెలిసింది మాత్రమే రాయగలరు; అది కూడా, తమకు సహజమైన పద్ధతిలో మాత్రమే రాయగలర’న్నారు ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ రచయిత మో యాన్. అది ఆయన అసలు పేరు కాదు– పెట్టుకున్న కలంపేరు. దానికి ‘మాట్లాడ వద్దు!’ అని అర్థం. మో బతికి బట్టకట్టిన వ్యవస్థలో, పాలకులకు భజన చేసేవారికి తప్ప మరెవరికీ మాట్లాడే హక్కు లేదు. నిజానికి కొద్దిపాటి మినహాయింపులతో, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొని వుందిప్పుడు! చైనా ఆర్థిక– సామాజిక– సాంస్కృతిక వ్యవస్థలోనూ అదే పరిస్థితి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది.‘ప్రజా రిపబ్లిక్’ పేరుగొప్ప, ఊరుదిబ్బగా మిగిలింది. 1980 దశకంలో, ఇందులో కొద్దిపాటి మార్పులు రాకపోలేదు– కానీ, మానవ హక్కుల కోసం ఆజన్మాంతం పోరాడిన లియూ జియావ్బో లాంటి వాళ్ళు కన్నుమూయడానికి కొద్దికాలం ముందువరకూ కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఓ రచయిత పెట్టుకోదగిన కలంపేరునే, మో యాన్ ఎంచుకున్నాడు! అంతటి విచక్షణ ఉన్నందువల్లనే 2012లో మో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోగలిగాడు. అప్పటికే ఆయన స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సుప్రసిద్ధుడు!మనం నివసించే వ్యవస్థలో, చెప్పే మాటకూ చేసే పనికీ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిన నేపథ్యంలో రచయితలూ కళాకారులూ ఏం చెయ్యగలుగుతారు? అది రష్యాలోనైనా సరే, చైనాలోనైనా సరే, లాటిన్ అమెరికన్ దేశాల్లోనైనా సరే –మరే దేశంలోనైనా సరే– ఇలాంటి విరోధాభాస పాతుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెయ్యగలరు పాపం? అద్భుత వాస్తవికత అనే కాల్పనిక వటవృక్షం నీడలో రవంత ఊరట పొందగలుగుతారంతే! మిహయీల్ బుల్గాకఫ్ రచనల్లో చేసిందే ఆంద్రెయ్ తార్కఫ్సి్కయ్ సినిమాల్లో చేశాడు. గాబ్రియల్ గార్సియా మార్కెజ్ మెక్సికోలో చేసిందే జిగ్మండ్ స్కూజి¯Œ ‡్ష లాత్వియాలో చేశాడు. మో యాన్ అదే పని చైనాలో చేశాడు! నోరు తెరవని మౌనిగా ఉంటూనే, తను చెప్పదల్చుకున్న కథలన్నీ చెప్పేశాడు మో.చైనా చరిత్రను– ముఖ్యంగా మో యాన్ లాంటి రైతుబిడ్డల జీవితాలను– 1966 నాటి చైనా సాంస్కృతిక విప్లవం పెనుమలుపు తిప్పింది. మలుపులన్నీ మంచి వైపే తిరగాలన్న రూలేం లేదని చదువుకున్న పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చైనా చరిత్ర చదువుకున్న వాళ్ళెవరూ, సాంస్కృతిక విప్లవం తెచ్చిపెట్టిన మార్పులన్నీ మంచివేనని అనుకోరు, అనలేరు! ఆ సంవత్సరమే మో బడి వదిలిపెట్టి మడిలోకి దిగాల్సివచ్చింది. అప్పటికి ఆయన అయిదో తరగతి చదువుతూండేవాడు. తన కుటుంబానికి సొంతమైన ఓ మడిచెక్కలో, పశువులను మేపుకుంటూ ఆరేడేళ్ళపాటు అలాగే గడిపేశాడు మో. బళ్ళో ఒంటబట్టించుకున్న అక్షరమ్ముక్కల్ని మర్చిపోకుండా వుండేందుకు మో‘షిన్ హువా నిఘంటువు’ను రోజంతా తిరగేస్తూవుండేవాడు. ఒంటరితనం శాపమే అతని పాలిట వరమైంది. తనలోకి తాను తొంగిచూసుకోగల రచయితకు పురుడుపోసిన మంత్రసాని ఆ ఒంటరితనమే! పల్లెపదాలు వింటూ పల్లెప్రజలు ఆడే బొమ్మలాటలూ, బయలాటలూ చూస్తూ పెరగడం వల్లనే మో మాటకు ఆ మట్టివాసన అంత గట్టిగా అంటుకుంది. అద్భుత వాస్తవికతను కూడా చైనా వాసులకు సొంతంచేసింది ఈ మట్టివాసనే!తనలాగే అర్ధాంతరంగా చదువులు మానేసిన మరికొందరు రైతుబిడ్డలతో కలిసి, మో యాన్ 1973లో ఓ నూలుమిల్లులో కూలిపనికి చేరాడు. అప్పటికే వాళ్ళలో కొందరికి కళలూ, సాహిత్యంలో వైవిధ్యంతో పరిచయం ఉంది. వాళ్ళ సాహచర్యం మో జీవనాన్ని మరో మలుపు తిప్పింది. విలియం ఫాక్నర్, మార్కెజ్ లాంటి అద్భుత వాస్తవిక వాదులను చదువుకున్న తరమది. మో యాన్‌కు వాళ్ళను పరిచయం చేసింది ఈ చదువుకున్న అబ్బాయిలే! చైనా ఆర్థిక వ్యవస్థను ‘సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థ’గా మార్చిన పుణ్యం కూడా ఈ చదువుకున్న అబ్బాయిలకే దక్కుతుంది. సదరు సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థే, చైనా పారిశ్రామిక రంగంలో స్వెట్ షాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చరిత్ర చెప్తోంది. అది వేరే విషయం అనుకోండి!!మో యాన్ రచనల విషయానికి వస్తే, 1984లో ఆయన రాసిన ‘గాజు ముల్లంగి’, నవలిక అతనికి రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ యేడాదే, మో ‘చైనా ప్రజా విమోచన సైన్యం లలితకళాక్షేత్రం’లో చేరిన మాట నిజమే. అయితే, అతగాడు అంతకు ముందునుంచీ రాస్తూవున్న మాటా నిజమే! మరో రెండేళ్ళకు మో రాసిన ‘ఎర్రజొన్నలు’ నవల సంచలనాన్ని రేకెత్తించింది. కాలక్రమంలో నడవని ఈ కథను, ఓ గొర్రెల కాపరి కుర్రాడు చెప్తాడు. అది రచయితేనని విమర్శకుల నమ్మకం.ఈ నవలను మూలకథగా చేసుకుని జ్షాంగ్ యిమో దర్శకత్వంలో రూపొందిన సినిమాకు బర్లినాల్ (బర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో గోల్డెన్ బేర్ పురస్కారం దక్కింది. ఈ రెండు రచనలకూ మధ్యలో మో ‘ఆనందం’ అనే నవలిక రాశాడు కానీ, అది పాలకుల కన్నెర్రకు గురైంది. అలాగే, 1987లో చైనా మార్కెట్లను ముంచెత్తిన వెల్లుల్లి సంక్షోభాన్ని ఇతివృత్తంగా తీసుకుని మో ‘వెల్లుల్లి వీరగాథ’ అనే నవల రాశాడు. పాలకులు ఈ రచనను– మొదట్లో– చూసీ చూడనట్లు వదిలేశారు. తీరా 1989లో తియానాన్మెన్ స్క్వేర్ అణచివేత నేపథ్యంలో ‘వెల్లుల్లి వీరగాథ’ నవలను నిషేధించారు. ఈ నిషేధాన్ని చైనాకు మాత్రమే పరిమితం చెయ్యడం గమనార్హం!ఇలాంటి అనుభవాలు మో యాన్‌కు మంచి పాఠమే నేర్పించాయి. దాంతో మో కాస్తో కూస్తో లౌక్యం ఒంటబట్టించుకున్నారు. 2012 మే నెల్లో యానాన్ ప్రసంగానికి నూరు ప్రతులు తయారు చేసే బృందంలో చేరి తన ‘బుడతా భక్తి’ ప్రదర్శించాడు. అంతటి లౌక్యుడికి నోబెల్ సాహిత్య పురస్కారం ఏమిటి, దేశాధ్యక్ష పదవి దక్కినా ఆశ్చర్య పడనక్కర్లేదు!- మందలపర్తి కిషోర్ -
చదువులోనే కాదు.. జీవితాన్ని కూడా పరీక్షించాలి!
చదువులోనే పరీక్షలు కాదు. జీవితాన్ని కూడా పరీక్షించాలి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అంటాడు పరీక్షింపబడని జీవితం వ్యర్థ జీవితమని. దీన్ని సమర్థించే సందర్భం కఠోపనిషత్తులో నచికేతుని సత్యాన్వేషణ ప్రయత్నంలో చూస్తాం. నచికేతుడు తన తండ్రి చేస్తున్న యజ్ఞయాగాదులలో ముసలి, నిరుపయోగ ఆవులను దానంగా ఇవ్వడం ఆశ్చర్యమనిపిస్తుంది. తన మదిలో ఇవే ప్రశ్నలు ‘‘ఇది సరియైనదేనా? నిజాయితీ లేని చర్యలకు విలువుంటుందా?’’ అని.తన మదిలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం తన తండ్రి నుంచి రాబట్టాలనుకుని తండ్రి నడుగుతాడు ‘‘తండ్రీ నువ్వు నన్ను ఎవరికి అర్పిస్తావు?’’ అని. పదే పదే అడుగుతున్న ఈ ప్రశ్నకి తండ్రి కోపోద్రిక్తుడై ‘‘నిన్ను యమునికి (మృత్యువుకి)సమర్పిస్తాను’’ అంటాడు. దాంతో నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళి సంపద, ఆధిపత్యం, అమరత్వం కోరకుండా ‘‘మరణానంతరం ఏమవుతుంది? అసలు నిజమైన సత్యం ఏదీ...’’ అని అడుగుతాడు.యముడు నచికేతుని సంపదలు, రాజ్యం, భోగభాగ్యాలు కోరుకోమంటాడు. కానీ నచికేతుడు ఈ సంపదలు, సౌఖ్యాలు తాత్కాలికాలని...కాబట్టి ఎప్పటికీ చావులేని సత్యమే కావాలని పట్టుబడతాడు. అపుడు యముడు సంతసించి మోక్షసాధనమైన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇందులో గమనించాల్సింది సాధారణంగా మనుషులు అలవాట్లను, ఆచారాలను, కోరికలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. కానీ నచికేతుడు జీవితాన్ని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని తప్పొప్పులు, శాశ్వత–అశాశ్వతాలు, అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఈ శరీర పతనానంతరం నేను ఎవరిని... లాంటి ప్రశ్నలతో పయనించడం వలన సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగాడు. సుఖభోగాలతో వెంటాడే జీవితం అసంపూర్ణం, స్వ పరిశీలన, అనుభవం మాత్రమే అర్థవంత జీవితానికి మూలం. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
మార్గదర్శకమైన యాత్ర
ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే, ఈ సమాజానికి ఉన్నత విధానాలలో మేలు చేయాలంటే, ఏదో ఒకచోట ఎక్కడో ఒక సందర్భంలో యేసును అనుకరించి అనుసరించక తప్పదు అనేంతగా యేసు జీవితాన్ని అసాధారణరీతిలో స్ఫూర్తివంతంగా సర్వమానవాళి ముందుపెట్టాడు ఆ మహాదేవుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిరంతరం అనుక్షణం తండ్రియైన దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవించినందు వల్లే యేసు జీవితం యావత్తూ అంగీకరించబడి మానవాళికి గొప్ప మార్గదర్శకంగా ఉందన టంలో ఎలాంటి సందేహం లేదు.యేసు ఒక్క ఆధ్యాత్మికరంగానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అన్ని రంగాల వారికి యేసు ఒక గొప్ప అరుదైన స్ఫూర్తిదాయకం. ప్రజాసేవకు అంకితమై సమర్పణ జీవితంతో నిరంతరం ప్రజల గూర్చే ఆలోచిస్తూ ప్రజలకు మేలు చేయాలనే తెగింపుగల నాయకులకు, పోరాట యోధులకు యేసే గొప్ప దిక్సూచి. అబద్దపు వాగ్దానాలు చేయక, ఊసరవెల్లి వేషాలు వేయక, అసత్య ప్రచారాల జోలికిపోక నమ్మకమైన నీతివంతమైన రాజకీయాలు చేసే వారికి కూడా యేసే ఆదర్శం. రాజకీయ నాయకులు లేదా పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించితీరాలనే తపనతో అట్టి గురి కలిగి చేసే పాదయాత్రలను పర్యటనలను కూడా జైత్రయాత్రగా అభివర్ణిస్తారు.ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, దర్శకులు, జవానులు, కిసానులు, వ్యాపారవేత్తలు, భవిష్యద్దర్శకులు (విజనరీస్), వ్యక్తిత్వవికాస నిపుణులు, మార్గదర్శకులు, పరిశోధకులు, బోధకులు, జ్ఞానులు, వద్ధులు, చివరకు శత్రువులు ఇట్టి వారు ఎవరైనా ఎంతటి వారైనా యేసును, ఆయన జీవిత స్ఫూర్తిని ప్రత్యక్షంగా వెంటాడక తప్పదు. లేకుంటే వారికి మేలైన సారవంతమైన జీవితమే లేదు. వారి ఉనికే ప్రశ్నార్ధకం కూడా? తమకు తెలియకుండానే యేసును పరోక్షంగా అనుసరించేవారు ఎందరెందరో ఉన్నారనేది లెక్కేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే గొప్పదైన యేసు జైత్రయాత్ర సంబంధిత జయ జీవితం.– జేతమ్ -
విద్య, విజ్ఞానం మాత్రమే చాలదు! నిత్య జీవితానికి..
విద్య, విజ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు. నిత్య జీవితానికి లోకజ్ఞానం, ఇంగిత జ్ఞానం చాలా అవసరం. విద్యావంతులమని విర్రవీగరాదు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో వుంటాయని గుర్తించాలి. ఎంత విజ్ఞానికైనా ఒక్కొక్కసారి సామాన్య విషయం తెలియక పోవచ్చు, స్ఫురించక పోవచ్చు. ఎంతటి మేధావులైనా, కొన్నిసార్లు అతి సంక్లిష్టమైన విషయాల గురించి ఆలోచిస్తూ నిత్యజీవితంలోని చాలా సాధారణమైన విషయాలను గమనించలేకపోవచ్చు.న్యూటన్ గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త. భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు న్యూటన్. నిరంతరం తన పరిశోధనాంశానికి సంబంధించిన ఆలోచనలోనే నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం. ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు.న్యూటన్ ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు, అతను తలుపు వేసుకొని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గర చేరి ‘మ్యావ్ మ్యావ్ ’ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రంనుండి లోపలికి వచ్చి, పోతూ వుండేది. కొంత కాలానికి ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి.న్యూటన్ వడ్రంగిని పిలిపించి మరో రెండు రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి రెండు రంధ్రాలు ‘దేనికి’ అని అడిగాడు. అప్పుడు న్యూటన్ ‘ఇన్నాళ్ళు ఒకే పెద్ద పిల్లి వుండేది. ఇప్పుడు దానికి రెండు పిల్లలు పుట్టాయి. వాటికోసం మరో రెండు కన్నాలు కావాలి కదా!‘ అన్నాడు. ‘‘ఏమండీ! ఉన్న ఒక రంధ్రంలో నుండే ఆ రెండు పిల్లలు దూరవచ్చు. ఒకదాని తరువాత మరొకటి వెళ్తాయి కదా’ అన్నాడు. ‘‘వడ్రంగికి వున్న తెలివి నాకు లేకపోయిందే. నేనీవేళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను.’’ అని న్యూటన్ అనుకున్నాడు.విద్య, హోదాతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లల నుండి, సామాన్య వృత్తుల వారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరి నుండి మనం నేర్చుకోవడానికి ఏదోకటి ఉంటుంది. ఈ కథలో న్యూట¯Œ కు పిల్లి పట్ల ఉన్న జాలి, ప్రేమ కూడా మనకు కనిపిస్తాయి. పరిశోధనల్లో ఎంత మునిగిపోయినా, ఆ మూగజీవి ఇబ్బంది పడకూడదనే అతని ఆలోచన గొప్పది. ‘విద్య వినయాన్ని ఇస్తుంది’ అంటారు. ఈ కథ న్యూటన్ మేధస్సునే కాకుండా, అతనిలోని వినయాన్ని, నిరంతర అభ్యాసకుడిని మనకు పరిచయం చేస్తుంది.పుస్తక జ్ఞానం ఎంత ఉన్నా, లోకజ్ఞానం లేదా కామన్ సెన్స్ అనేది అంతే ముఖ్యం. తాను ప్రపంచం గర్వించదగ్గ మహా శాస్త్రవేత్తనని న్యూటన్ అహంకరించలేదు. ఒక సామాన్య వడ్రంగి చెప్పిన మాటలోని నిజాన్ని గ్రహించి, ‘ఈ రోజు ఒక గుణపాఠం నేర్చుకున్నాన’ని ఒప్పుకోవడం అతని గొప్పతనానికి, వినమ్రతకు నిదర్శనం. – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!
ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
సిమెంట్ సమాధులు..
ఆకాశహర్మ్యాల మధ్య ’స్వర్ణ విహార్’ అపార్ట్మెంట్ ఒక ఆధునిక కోటలా నిలబడి ఉంది. ‘బొయ్...’మంటూ సైరన్ మోగుతూ అపార్ట్మెంట్ గేటు ముందు ఆగింది అంబులెన్స్. స్ట్రెచర్ మీద డెబ్బై ఏళ్ల రామారావు నిర్జీవ శరీరం నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. తన కష్టం, సుఖం, బాధ, భయం, కోపం, దుఃఖం అన్నిటికీ వేదిక అయిన తన ఇంటిని కడసారి చూసుకోడానికా అన్నట్టు... పూర్తిగా మూసుకుపోకుండా అరమోడ్పులుగా ఉన్నాయి ఆయన కనులు.కన్నీళ్లు తుడుచుకుంటూ అంబులెన్స్ దిగాడు రవి– రామారావు గారి కొడుకు. అతనితో పాటు ప్రాణంలేని బొమ్మలా నీళ్ళింకిపోయిన కళ్ళతో రామారావు గారి భార్య, మరో ఇద్దరు బంధువులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి రామారావు దేహాన్ని అపార్ట్మెంట్ గేట్ లోపలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగానే, వీళ్ళ కోసమే కాచుకొని ఉన్నట్టు గబగబా ఎదురొచ్చాడు సెక్యూరిటీ గార్డు.‘‘సార్... అది... అయ్యగారి శవాన్ని లోపలకు తీసుకురానివ్వద్దని కమిటీ వాళ్ళు చెప్పారండి’’ నెమ్మదిగా అన్నాడు.మొదట అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రవికి. అర్థమైన తరువాత నోట మాట రాలేదు. అతని కూడా వచ్చిన బంధువులే తేరుకొని, ‘‘అదేంటయ్యా! ఇదెక్కడి విడ్డూరం! అతని బాడీని అతనింటికి తీసుకురాకుండా ఎక్కడకు తీసుకెళ్ళమంటారు?’’ అన్నారు.‘‘ఏమో సార్! ప్రెసిడెంట్ గారు చెప్పమన్నదే చెప్పాను...’’ అన్నాడు గార్డ్.ఇంతలోనే అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మరికొందరు సభ్యులు కలిసి వచ్చారు.‘‘చూడు రవి, మాకు విషయం తెలిసింది. బాడీని లోపలికి తీసుకురావడానికి వీల్లేదు.’’ కచ్చితంగా చెప్పారు.‘‘ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది నా ఇల్లు. నా తండ్రి పార్ధివ దేహాన్ని నా ఇంట్లోకి తీసుకురావడానికి మీరెందుకు అడ్డం పెడుతున్నారు?’’ బాధ, కోపం, ఉక్రోషం, నిస్సహాయత కలగలిసిన గొంతుతో అన్నాడు రవి.‘‘ఇది నీ ఒక్కడి ఇల్లు కాదు రవి. ఈ కాంపౌండ్ లో ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్న దగ్గర శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళందరికీ అపశకునంగా, ఆశుభంగా, సెంటిమెంట్‌గా భావిస్తారు’’ అన్నారు వాళ్ళు.అందేంటి సార్ అలా మాట్లాడతారు!? ఇన్నేళ్ళు మీతో కలిసి, మెలిసి తిరిగిన మనిషి. ఇప్పుడు ప్రాణం పోయేసరికి అతని శరీరం అంత భయంకరం, అపశకునం అయిపోయిందా? అన్నారు బంధువులు.‘‘ఏమోనండి! అవన్నీ మీరడక్కూడదు. మా అపార్ట్మెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోవలసిందే. సెంటిమెంట్లు పక్కన పెట్టినా, ఇళ్ళ మధ్యలో ఇలాంటివి జరిగితే ఇంటి విలువ పడిపోతుంది. అసలే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇళ్ళను అమ్ముకోడానికి బేరం పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇలాంటివి ఇక్కడ జరిగితే ఆశుభంగా భావించి ఆ ఇళ్ళు చెల్లుబాటు కావు. పైగా వచ్చే నెలలో ఇక్కడ ముగ్గురు పెళ్లిళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు కూడా అపశకునంగా ఉంటుంది...’’ మానవత్వం అన్నది ఏ కోశానా లేకుండా అన్నారు వాళ్ళు.‘‘మరీ అలా మాట్లాడకండి సార్. సెల్లార్లో ఒక పక్కన కాస్త టెంట్ అడ్డంగా కట్టేసి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాడీని పెట్టుకుంటే తప్పేంటి? ఇంత పెద్ద సెల్లార్లో ఇటు చివర బాడీని పెట్టుకుంటాం. జనమంతా అటు పక్కనుంచి తిరుగుతారు. దానివలన ఎవరికేం ఇబ్బంది కలుగుతుంది. అపశకునం కలుగుతుంది? వచ్చే బంధువులందరికీ చివరి చూపయినా దక్కాలి కదా. పోయినాయనకు కాస్త స్నానం, పూజలాంటి కార్యక్రమాలు, ఆచారాలు నిర్వహించాలి కదా!’’ వాదనకు దిగారు చనిపోయినాయన బంధువులు.‘‘ఏమో... అదంతా మాకు తెలీదండి. కావాలంటే గేట్ లోపలకు తీసుకురాకుండా ఈ బిల్డింగ్ ముందే రోడ్డు మీద టెంట్ వేసి పెట్టుకోండి. లేదంటే పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఉంది కదా అందులోనో లేదా శ్మశానం షెడ్డులోనో ఉంచండి. అంతేగాని గేట్ లోపలి తీసుకురావడానికి మాత్రం కుదరదు’’ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా అన్నారు కమిటీ వాళ్ళతో పాటు మరో ముగ్గురు నలుగురు.‘‘అన్యాయంగా మాట్లాడకండి. శవాన్ని గేట్ బయట పెట్టడమేంటి? ఉన్నప్పుడు సంబంధాలు కొనసాగించడమే కాదు. పోయిన తరువాత ఆ నిర్జీవ శరీరాన్ని కూడా అంతే గౌరవంగా పంపించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. పవిత్రత గురించి, శకునాల గురించి, ఆచారాల గురించి ఇంతలా చెబుతున్నారు. మీకు ఆ మాత్రం తెలీదా? ఒక శవానికి జరగవలసిన సంస్కారాలు, ఆచారాలు జరగనివ్వకపోతే ఆ పాపం కూడా చుట్టుకుంటుంది.’’ చివరి అస్త్రంగా అన్నారు బంధువులు. ఈ చివరి మాటతో కాస్త తగ్గారు బిల్డింగ్ పెద్దలు. కాని తాము పట్టిన పట్టు మాత్రం వదల్లేదు.ఇక్కడిలా వాదన జరుగుతుంటే, అప్పటికే తమకు ఆలస్యమవుతుందని విసుక్కుంటున్న అంబులెన్స్ వాళ్ళు,‘‘సార్! ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో... మేం వెళ్ళాలి సార్!’’ అని చెప్పి, ఒకప్పుడు ఆ పరిసరాలన్నీ యథేచ్ఛగా తిరిగి, గార్డెన్లో ఎక్కడ ఏ మొక్క వంగినా, వాలినా దానిని సరిచేసి; ఎక్కడ ఏ గోడకి, గచ్చుకి చిన్న పెచ్చూడినా వెంటనే సరిచేసి, తీర్చిదిద్దిన రామారావుగారి దేహాన్ని అక్కడే రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయారు.‘‘నాన్నా.. నన్ను క్షమించు నాన్నా... బ్రతికి ఉన్నంత కాలం,నువ్వు అద్దంలా తీర్చిదిద్దిన ఈ భూమ్మీద నీ చివరి స్పర్శ ఇవ్వలేకపోతున్నాను’’ అని రవి ఏడుస్తుంటే... అపార్ట్మెంట్ ఇళ్ళలోంచి వస్తున్న టీవీల శబ్దాలు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్న హడావిడిలో నిశ్శబ్దంగా కలిసిపోయింది రవి ఆక్రోశం.‘అయ్యో! బతికున్నంతకాలం హాయిగా అందరితో ఎంతో ఆత్మీయంగా బతికిన నీకు, ప్రాణం పోయిన తరువాత ఈ అవమానమేంటయ్యా! ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారంటూ నీ కాళ్ళంటి ఆశీర్వాదాలడిగిన వీళ్ళకు నీ నిర్జీవ శరీరం అపశకునం అయిపోయిందా!? భగవంతుడా... ఏంటీ ఘోరం!’ నిశ్శబ్దంగా కుమిలిపోతోంది రామారావు గారి భార్య.ఇంతలో... జరుగుతున్న ఘోరం చూడలేని ప్రకృతి విలపిస్తున్నట్టు భోరుమని వర్షం మొదలయింది. బంధువులు రామారావు శరీరాన్ని ఎలాగైనా లోపలకు తీసుకువెళ్లాలని పట్టుదలగా బిల్డింగ్ కమిటీవాళ్ళతో వాదిస్తూనే ఉన్నారు. జరుగుతున్న రగడతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టు నిర్జీవంగా, గేటు బయట, రోడ్డు మీద, ఒక బల్ల మీద పడి ఉంది రామారావు శరీరం. ఎవరో ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పారు శరీరం మీద వర్షానికి తడవకుండా ఉండడం కోసం. జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ, తండ్రి దేహాన్ని హత్తుకుని భోరున ఏడుస్తున్నాడు రవి.‘ఒరేయ్... మనుషుల్లా బతకడం నేర్చుకోండిరా! ఈ రోజు నా తండ్రిని బయట పెట్టారు. రేపు మీరు కూడా ఇదే గేటు దాటి బయటికి రావాలి. అప్పుడు మీ ఆత్మలకి శాంతి దొరుకుతుందా? సిమెంట్‌తో కట్టుకున్నది ఇల్లు కాదురా... ప్రేమని పంచుకునేది ఇల్లు. ఇంత పెద్ద స్థలంలో ఇంత పటిష్ఠంగా మీరు కట్టుకున్నది ఇళ్లను కాదు... శ్మశానాలను కట్టుకున్నారు! శ్మశానాలను...’ ఈ మాటలు బయటకు అనలేదతను. మౌనంగా మనసులోనే అనుకుంటూ ఆక్రోశిస్తోందతని హృదయం.జోరున వర్షం కురుస్తోంది. అపార్ట్మెంట్ గేటు బయట ఒకవైపు, శవం పక్కన విలపిస్తూ దిక్కుతోచని స్థితిలో అతని భార్యా, బిడ్డలు. మరోవైపు అపార్ట్మెంట్ వాసులు ‘లోపలికి రానివ్వం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. గొడవ పెద్దదవుతోంది. ఇక ఆగలేకపోయారు ఆ అపార్ట్మెంట్లోనే ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మూర్తిగారు. అంతవరకు సామరస్యంగా సమసిపోతుందని ఎదురుచూసిన గొడవ ఇంకా ముదురుతుండేసరికి, గంభీరంగా ముందుకు వచ్చారు. ఆయన మాటలకి ఆ ప్రాంతంలో ఒక గౌరవం ఉంది.‘‘చాలిక ఆపండి ఈ అమానుషాన్ని! ఏం చేస్తున్నారు మీరు? అందరూ చదువుకున్న వాళ్లేగా! లేక రాతి యుగంలో మనుషులా? బాధలో ఉన్నవారికి నీ కష్టంలో మేమూ తోడుంటాం అని భుజం తట్టి ఓదార్పునివ్వడం పోయి, వాళ్ళని మరింత బాధల్లోకి నెట్టేస్తారా!? ఇదేనా మానవత్వం?’’ అన్నారు గట్టిగా మూర్తిగారు.‘‘మూర్తిగారు, మీకు తెలియంది కాదు. ఈ బిల్డింగ్‌లో పెళ్లిళ్లు ఉన్నాయి, ఇప్పుడీ శవాన్ని లోపలకు తీసుకువస్తే బిల్డింగ్ మైల పడుతుంది. దోషం చుట్టుకుంటుంది. ఇది మా ఒక్కరి అభిప్రాయం కాదు. చాలామంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు. అందరి క్షేమం కోసమే కదా మేమూ వద్దంటున్నది.’’ తనూ తీవ్రంగానే అన్నాడు ప్రెసిడెంట్. డూడూ బసవన్నల్లా అతనికి వంత పాడారు మరికొందరు.‘‘దోషమా? ఏ శాస్త్రం చెప్పింది రాజశేఖర్ గారు. ఆపదలో ఉన్న పొరుగువాడికి సాయం చేయకపోవడం కంటే పెద్ద దోషం ఇంకోటి ఉంటుందా? మీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నాయి సరే, ఎప్పుడో నెల రోజుల తరువాత పెళ్లి ఉందని ఇప్పుడు ఆయన శరీరాన్ని లోపలికి తెస్తే బిల్డింగ్ మొత్తం మైల పడిపోతుందా? అయినా ఇక్కడ సెల్లార్లో బాడీని పెడితే మీ ఇంట్లో పెళ్ళికి మైల ఎలా అంటుకుపోతుందండీ? ఇది చాదస్తమనుకోవాలా? మూఢనమ్మకాలు అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇదంతా వదిలేయండి... ఆ మాట నేననకూడదు గాని, రేపు మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద పడేయమంటారా?’’ ఆవేశంగా అన్నారు మూర్తిగారు.ఆయన ఆవేశానికి, ఆ సమాధానంలేని ప్రశ్నలకు చుట్టూ ఉన్నవాళ్లు సమాధానం చెప్పలేక ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆయన మాటలకు వత్తాసుగా కొందరు తలలూపడం మొదలుపెట్టారు. అప్పటివరకు జరుగుతున్న తతంగం నచ్చకపోయినా, వాళ్ళ పెత్తనానికి మారు మాట్లాడలేక నోరుమూసుకు ఊరుకున్న మరి కొందరయితే,‘‘నిజమే కదా! ఈ ప్రెసిడెంట్, సెక్రెటరీలు మరీ మూర్ఖులు.’’‘‘అవును... అంతా వీళ్ళ ఇష్టమే అయిపోతోంది. వాళ్ళేం చెప్తే అదే రూల్... బిల్డింగ్ అంతా వీళ్ళదే అన్నట్టు చెలరేగిపోతున్నారు. అడిగేవాళ్ళు లేక...’’‘‘అదే కదా! పాపం ఆ కుటుంబాన్ని చూడండి వీళ్ళ ఆగడాలకు ఎలా కుమిలిపోతున్నారో... ఇంట్లో మనిషి పోయి వాళ్లేడుస్తుంటే, వీళ్ళిలా అవమానించి ఏడిపిస్తున్నారు’’ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు.‘‘రామారావుగారు ఈ అపార్ట్మెంట్లో పదేళ్ల నుంచి ఉన్నారు. మీ పిల్లలు కింద పడితే లేవనెత్తిన చేతులు ఆయనవి. ఎవరికే కష్టం వచ్చినా భుజం తట్టి తోడుగా నిలిచి, మానవత్వం చూపిన మనిషి. పండుగ వస్తే అందరికీ స్వీట్లు పంచి, అందరం కలిసిమెలిసి ఉందామన్న తియ్యటి మనసు ఆయనది. అలాంటి ఆయన ప్రాణం పోయాక ఒక ‘వస్తువు’ అయిపోయారా? ఆయన దేహం అపవిత్రం అయిపోయిందా? బాబాయ్ గారూ... మామయ్యగారూ... అన్నయ్యగారూ... తాతయ్యా... మీరు ఆశీర్వదిస్తే మాకు ‘శుభం’ అంటూ ఆయనతో ఎవరెవరు... ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అలాంటిది ఆయన ప్రాణం పోయేసరికి అశుభంగా మారిపోయారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి... మీరు చేస్తున్నదేంటో మీకే తెలుస్తుంది.చూడండి... మనం కట్టుకున్న ఈ గోడలు మనల్ని విడదీయకూడదు. ఈ రోజు మనం ఈ గేటు తీయకపోతే, రేపు ఈ అపార్ట్మెంట్ కేవలం ఒక ‘సిమెంట్ సమాధి’లా మిగిలిపోతుంది. ఇందులో మనుషులు ఉండరు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే సంస్కారం ఇదేనా? చనిపోయిన మనిషికి గౌరవం ఇవ్వలేని మనం, బతికున్న వారికి ఏం విలువ ఇస్తాం?’’ కొట్టినట్టే అన్నారు మూర్తిగారు.ఆయన మాటల్లోని నిజాయితీ, ఆవేదన అక్కడున్న వారి గుండెల్లో గుచ్చుకుంది. కొందరు తలలు దించుకున్నారు. ప్రెసిడెంట్, సెక్రెటరీ అండ్ గ్రూప్ మౌనంగా ఉండిపోయారు.స్థిర నిశ్చయంతో ముందుకు కదిలారు మూర్తిగారు. ‘‘నేను వెళ్తున్నాను. నేనే స్వయంగా నా చేతులతో రామారావు గారిని లోపలికి తీసుకొస్తాను. నాతో పాటు మానవత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే రండి. అడ్డుపడేవాళ్లు ఉంటే... రేపు మీరు కూడా ఒంటరిగా ఇలాగే రోడ్డు మీద నిలబడతారని గుర్తుంచుకోండి.’’ అంటూనే మూర్తిగారు ఒక్క అడుగు ముందుకు వేయగానే, మొదట ఒక యువకుడు, ఆ తర్వాత మరో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చారు. అలా మెల్లగా ఒక్కొక్కరుగా అందరూ రవి దగ్గరకు వెళ్లారు.‘‘క్షమించు రవి... భయం, మూఢనమ్మకాలు, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం మమ్మల్ని గుడ్డివాళ్లను చేసింది. రామారావుగారు మన పెద్దాయన. ఆయన్ని సగౌరవంగా లోపలికి తీసుకెళ్దాం. అన్నీ మేమే దగ్గరుండి జరిపిస్తాం.’’ అంటూ తనే ముందు రామారావుగారి పార్థివ శరీరాన్ని పైకెత్తడానికి కదిలాడు రాజశేఖరం.అందరూ కలిసి రోడ్డు మీద అనాథలాగా పడి ఉన్న రామారావుగారి శరీరాన్ని గౌరవంగా పైకెత్తారు. గేట్లు బార్లా తెరుచుకున్నాయి. వర్షం వెలిసింది. నిముషాల్లో సెల్లార్లో ఓ పక్కన అంతా ఖాళీ చేసి, రామారావుగారి దేహాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చకచకా చేసేశారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి పూలు తెచ్చారు, దీపాలు వెలిగించారు. రవి కుటుంబం ఒంటరిది కాదు అని నిరూపించారు అందరూ. రామారావుగారికి జరగాల్సిన ఆచారాలన్నీ సజావుగా, గౌరవప్రదంగా జరిగాయి. అందరూ కలిసి రామారావు గారిని చివరి ప్రయాణానికి సగౌరవంగా సాగనంపారు. బిల్డింగ్‌లో ‘దోషం’ పోయి ‘ప్రేమ’ వెల్లివిరిసింది. - మావూరు విజయలక్ష్మి -
ప్రేమ నిర్వచనం..
పూజలు–పునస్కారాలు, నోములు–వ్రతాలు, గుళ్ళు–గోపురాలు అన్నీ మనలో సంకుచిత స్వార్థాన్ని నిర్మూలించటానికీ, విశ్వప్రేమను విష్ణుప్రేమగా గ్రహించటానికీ నిర్దేశింపబడ్డాయి. ప్రేమే దైవమని మహర్షులు నొక్కి వక్కాణిస్తారు. ప్రేమ, ద్వేషం అంటూ రెండు ఉండటంవల్ల దేన్ని ఎంచుకొంటే మనకు శ్రేయస్సు కల్గుతుందో వివరించటానికి పెద్దలు నానా తంటాలు పడ్డారు. కేరళకు చెందిన స్వామి రామదాసు చేసిన చక్కటి విశ్లేషణను చూడండి:ప్రేమ హృదయాన్ని వికసింపజేస్తుంది – ద్వేషం దానిని ముకుళింపజేస్తుంది. ప్రేమ కంటే మధురం లేదు – ద్వేషం కంటే చేదు లేదు. ప్రేమ సహజం – ద్వేషం కృత్రిమం. ప్రేమ నిర్మాణం – ద్వేషం వినాశకము, విధ్వంసము. ప్రేమ మనోహరం– ద్వేషం అసహ్యకరం. ప్రేమ ఆహ్లాదకర ప్రకృతి దృశ్యం – ద్వేషం శుష్కమైన మరుభూమి.ప్రేమ లయబద్ధం – ద్వేషం చిందర వందర. ప్రేమ ప్రకాశం – ద్వేషం అంధకారం. ప్రేమ ఆనందం – ద్వేషం దుఃఖం. ప్రేమ జీవనం – ద్వేషం మరణం. ప్రేమ పవిత్రం – ద్వేషం అపవిత్రం. ప్రేమ జత చేస్తుంది – ద్వేషం విడదీస్తుంది. ప్రేమ సురూపం – ద్వేషం కురూపం. ప్రేమ ఆరోగ్యం – ద్వేషం అనారోగ్యం. ప్రేమ మధుర సంగీతం – ద్వేషం కర్కశ ధ్వని. ప్రేమ జ్ఞానం– ద్వేషం అజ్ఞానం. ప్రేమ చురుకుదనం – ద్వేషం మందత్వం. ప్రేమ స్వర్గం– ద్వేషం నరకం. ప్రేమే దైవం – ద్వేషమే దయ్యం – మాయ. (భగవదన్వేషణము– స్వామి రామదాసు; పుటలు 188, 189) ఇంత స్పష్టమైన విశ్లేషణను చదివిన తర్వాత ఎవరైనా ప్రేమను పెంపొందించుకోవటానికే కృషి చేస్తారు. చేయాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. దైవాశీస్సులు ఉండి తీరుతాయి. – రాచమడుగు శ్రీనివాసులు -
మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!
మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కునుక్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’భాస్కర శతకంలో ...‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో ‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు క్షమ లేని తపము వ్యర్థ తపంబు క్షమ లేని దానము కల్మష దానంబు క్షమ లేని మాన్యత కపట మాన్యత’..క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.కుమార శతకంలో ‘క్షమయే పరమధర్మము క్షమయే పరమ సుఖము క్షమయే పరమవిద్యయు క్షమయే పరమ గతి క్షమలేని యోగము, భోగము పనికిరాదు క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.నారాయణ శతకంలో ‘క్షమయే విష్ణురూపంబు క్షమయే పరబ్రహ్మము క్షమయే జగతికి ఆధారము క్షమయే నిజమైన భక్తి క్షమించేవాడు నరుడు మిగిలిన వారెల్ల పశువులు’...చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
ఆధ్యాత్మిక జ్వాల..
క్రీస్తు కంటే ముందు పుట్టి, ఈ నేలపై క్రీస్తు మార్గం సరాళం చేయడానికి శ్రమించినవాడు యోహాను. ఆనాటి ప్రజల్ని దేవునివైపు తిప్పుతూ, వస్తాడు నా దేవుడంటూ ప్రజలకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తూ, ఓ చైతన్య జ్వాలలా అరణ్య ప్రాంతాల్లో దైవ స్వరం వినిపించిన సంచార స్వరాల ప్రయోక్త, మహా భక్త బాప్తిస్మ యోహాను.‘స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు’– ఈ మాటలు మరియతో ఎలిజబెత్ అన్నది. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. అన్నది ఎలిజబెత్. విన్నది మరియ. అక్కడ ఉన్నది వీరిద్దరే. కానీ ఆ మాటల్ని మరియతో పాటు ఇంకా మరో ఇద్దరు విన్నారు. ఒకరు ఎలిజబెత్తమ్మ గర్భంలోని బాప్తిస్మ యోహాను, మరొకరు మరియ గర్భంలోని యేసు.యేసు గురించి గర్భస్థ శిశువుగా విన్నాడు కాబట్టే, ఆయన ఔన్నత్యాన్ని ఘంటాపథంగా లోకానికి చాటగలుగు తున్నాడు యోహాను! లోకంలో జరిగే మంచీ చేడుల్ని చూచినవి చూచినట్టుగా ప్రజలకి వివరిస్తూ, రాచరికంలోని వైనా ఘాటుగా విమర్శించేస్తున్నాడు. ప్రజలంతా ఆయన్ను ఓ అడవిలో అన్నగా గుర్తిస్తే, రాచరికం మాత్రం ఓ తిరుగు బాటుదారునిగా గుర్తించింది.ఫిలిప్పు భార్య హేరోదియ. ఆమె తన భర్త ఫిలిప్పును వదిలేసి, అతని తమ్ముడు హేరోదు అంతిపస్ని పెళ్లి చేసుకుంది. అంతిపసు ప్రస్తుతం ఆ గలిలయ రాజు. ఓసారి తన ప్రసంగంలో ‘నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు’ అని రాజును బహిరంగంగా ఖండించాడు. అగ్గిమీద గుగ్గిలమైంది రాజు కాడు, హేరోదియ.హేరోదియకు ఓ కూతురు. పేరు సలోమి. ఆరితేరిన నర్తకి. ఓ రోజు ఆడింది పాడింది, ఆ రాజును మెప్పించింది. ఏమి కావాలో కోరుకోమన్నాడు రాజు. తల్లిచేసిన దుర్బోధలచే సలోమి యోహాను శిరస్సు కోరుకొంది. సరే అన్నాడు రాజు. మరుక్షణంలోనే పళ్ళెరాన యోహాను శిరస్సు! కానీ మరణంనుంచే గలిలయలో కొత్త విప్లవం ఆవిర్భవించింది. యోహాను స్ఫూర్తి ఖండఖండాలకు పాకింది. – డా‘‘ దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 24న బాప్తిస్మ యోహాను జన్మదినం) -
వరం ఎలా కోరాలి?
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే ఎలాంటి వరం, ఎలా కోరుకోవాలో చాలామందికి తెలియదు. అతితెలివి వరాలడిగి ఆత్మనాశం కొనితెచ్చుకొన్న అసురులెందరో ఉన్నారు. ధర్మమైన వరం అడిగి, శుభపరంపరను సాధించిన ధర్మరాజులు అరుదు.వనవాసంలో యక్షుడడిగిన యక్షప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలిచ్చిన సందర్భంలో, ఆ యక్షుడు మెచ్చి, ‘ధర్మజా! ఇక్కడ చనిపోయి పడి ఉన్న నీ నలుగురు తమ్ముళ్ళలో ఒక్కరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘నా తల్లి సంతానంలో నేను బ్రతికి ఉన్నాను. నా సవతి తల్లి మాద్రిసంతానమైన నకులుడిని సజీవుడిని చేయటం ధర్మంగా ఉంటుంది’ అని కోరాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడి ధర్మబుద్ధికి అబ్బురపడి, యక్షుడు ఆయన నలుగురు సోదరులనూ బ్రతికించాడు. ‘ధర్మజా! నేను యక్షుడిని కాదు. నిన్ను పరీక్షించేందుకు వచ్చిన ధర్మదేవతను. వరం అడగటంలో నీ ధర్మబుద్ధిని మెచ్చాను. నీ కోసం మరో వరం కూడా ఏదయినా కోరుకో’ అన్నాడు. ‘అయ్యా, మాతో పాటు అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు అగ్నిని మథించుకొనేందుకు వాడే అరణి కొయ్యను, లేడి ఎత్తుకు పోవటం చేత మేం అయిదుగురమూ దానిని వెతుకుతూ వచ్చాం. దయతో దానిని ప్రసాదించు, చాలు’ అన్నాడు ధర్మజుడు.‘అదెంతపని? మిమ్మల్ని పరీక్షించేందుకు లేడి రూపంలో వచ్చి, ఆ అరణిని తెచ్చింది నేనే!’ అని, ధర్మదేవుడు అరణిని ధర్మజుడికి అందించాడు. ‘ఇప్పటికీ నీ కోసం నువ్వు వరం కోరుకోలేదు కనుక నేనే, అయాచితంగా, మీకొక వరమిస్తున్నాను. మీ పన్నేండేళ్ళ అరణ్యవాసం నేడో, రేపో ముగియబోతున్నది. అజ్ఞాతవాసం అనే అతి క్లిష్టమైన కాలం ఆరంభం కాబోతున్నది.మీరు మీకు అనువైన మారువేషాలు ధరించి, ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకుండా మీ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది నా వరం. ఇది కాక, నువ్వు కోరేదేమైనా ఉంటే అడుగు. అనుగ్రహిస్తాను!’ అన్నాడు ధర్మదేవత. ‘దేవా! ఇంతకంటె ఏం కావాలి? అయినా అడిగావు కనక, నా బుద్ధి ఎల్ల వేళలా ధర్మాన్నే అనుసరించి ఉండేట్టు అనుగ్రహించు’ అన్నాడు ధర్మజుడు. ధర్మనిష్ఠుడైన వాడికిక లోటేమిటి? ఎప్పుడు ఏ దేవతను ఏది కోరినా లభిస్తుంది! – ఎం. మారుతి శాస్త్రి -
గర్విష్టి గజరాజు
అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది. దానికి తన బలమన్నా, భారీ శరీరమన్నా చాలా గర్వం. ‘ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.అదే అడవిలో చింటూ అనే ఒక తెలివైన చిన్న కుందేలు ఉండేది. అది చాలా మంచిది. అందరితోనూ స్నేహంగా ఉండేది.ఒకరోజు గజరాజు అడవిలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుండగా, దారిలో ఉన్న చింటూను గమనించకుండా దాని కాలిని తొక్కింది. పాపం! చింటూ నొప్పితో ‘అమ్మా!’ అని అరుస్తూ పక్కకు పడిపోయింది. గజరాజు అది చూసి కూడా కనీసం క్షమాపణ చెప్పలేదు. పైగా, ‘నువ్వు చాలా చిన్నదానివి, నా కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో’ అని ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. చింటూ బాధతో కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వారు గజరాజును పట్టుకోవడానికి ఒక బలమైన ఉచ్చు పన్నారు. గజరాజు అజాగ్రత్తగా వెళ్తూ ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటకు రాలేకపోయింది. ఆ వల విడిపోలేదు, సరిగదా ఇంకా బిగుసుకుపోయింది. దానితో సహాయం కోసం గజరాజు బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విన్న మిగిలిన జంతువులు ‘గర్విష్టి గజరాజుకు తగిన శాస్తి జరిగింది’ అని అనుకున్నాయే తప్ప రక్షించడానికి రాలేదు. కానీ చింటూ ఆ అరుపులు విని ఆగలేకపోయింది. వెంటనే గజరాజు ఉన్న చోటికి పరుగెత్తింది. వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న గజరాజును చూసి చింటూ మనసు కరిగింది.‘భయపడకు గజరాజా! నేను ఇప్పుడే వస్తాను’ అని చెప్పి ఊరడించింది. తరువాత చింటూ వేగంగా వెళ్లి తన స్నేహితులైన ఎలుకల సైన్యాన్ని తీసుకువచ్చింది.చింటూ ఆజ్ఞతో ఎలుకలన్నీ కలిసి తమ పదునైన పళ్ళతో ఆ బలమైన వల తాళ్లను కొరకడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే వల ముక్కలైపోయింది. గజరాజు బంధవిముక్తురాలైంది! వల నుండి బయటకు వచ్చిన గజరాజు కళ్లలో నీళ్లు తిరిగాయి.అది మెల్లగా చింటూ దగ్గరకు వచ్చి, ‘చింటూ! నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నీలాంటి చిన్న ప్రాణియే. బలం శరీరంలో కాదు, చేసే సాయంలో ఉంటుందని తెలుసుకున్నాను’ అని వినయంగా చెప్పింది.చింటూ నవ్వుతూ, ‘అపకారికి కూడా ఉపకారం చేయాలన్నదే మా అమ్మ నేర్పిన పాఠం. ఇకపై మనమందరం స్నేహితులుగా ఉందాం’ అంది.ఆ రోజు నుండి గజరాజు తన గర్వాన్ని వదిలేసి, అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా మెలుగుతూ అందరికీ రక్షణగా నిలిచింది. ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.హితవచనం..అలముదకేన తృణైర్వా మనస్వినా ప్రాణధారణా కార్యానా సంస్కృతశ్చ పురుషః ప్రాకృతసత్త్వః ప్రణయతవ్యః- ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకులు అలములు తినిగాని, కేవలం మంచినీళ్లు తాగిగాని ప్రాణాలు నిలబెట్టుకుంటాడే తప్ప నీచులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడు. - అవ్యాన్ -
ఉదయ రాగం.. నాన్న యోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్‌తో పోరాడి, ఆఫీస్ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్ ఆప్షన్’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్మెంట్ టెర్రస్‌లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్‌పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన కార్పొరేట్ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. డాడ్– కిడ్ యోగా రీల్స్.. యోగా.. ఇక్కడ కేవలం ఫిట్నెస్ ట్రెండ్ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్ ఫాదర్‌హుడ్ స్టేట్మెంట్. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఈ మార్పు డాడ్–కిడ్ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్నెస్ చాలెంజ్లుగా ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెబుతున్నారు.కూతురుతో కలిసి యోగా ఆనందకరంఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్ కుమార్, సరూర్‌నగర్ -
సదారోగి..
అగ్నిలింగం నిక్ నేమ్ సదారోగి. ఆరోగ్య దృష్ట్యా ఆయన జాతకం మంచిది కాదు. చిన్నప్పుడే మలేరియా, టైఫాయిడ్, గవద బిళ్ళలు, కోరింత దగ్గు, ఇన్ ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, సన్నిపాత రోగం మొదలైన వాటి బారిన పడ్డాడు. పదహారో ఏటే అతనికి డయాబెటిస్ వచ్చింది. పెళ్ళయ్యాక చాలామందికి వచ్చే బ్లడ్ ప్రెషర్ కూడా పదిహేడో ఏటే వచ్చింది. బ్రహ్మచారిగా ఉండగా ఓరోజు స్టవ్ మీద వేడి గిన్నెలోని మరిగే చారుని పొట్ట మీద పోసుకున్నాడు. పొట్ట మీద కాబట్టి సరిపోయింది. అది మిగిల్చిన మచ్చ బయటికి కనిపించదు. అగ్నిలింగం తన రోగాల మీద తనే జోక్స్ వేసుకుంటాడు.‘‘ఉదయం నేను నా మందులన్నీ వేసుకున్నాక కడుపు నిండుతుంది. దాంతో మా ఆవిడ చేసే ఉప్మాని మాత్రలా మింగుతాను.’’‘‘రోగాల పేర్లు జర్మన్, గ్రీక్, లేటిన్ మొదలైన భాషల్లోంచి పుట్టాయి. ఏ రోగం పేరు ఏ భాషలోంచి వచ్చిందో నాకు తెలుసు. నాకు వచ్చిన ప్రతి రోగం స్పెల్లింగ్ నాకు వచ్చు. డాక్టర్లు నాకు ఫోన్ చేసి రోగాల స్పెల్లింగ్స్, ఏ రోగానికి ఏ మందు వాడాలో అడిగి తెలుసుకుంటుంటారు. నా మందుల వల్ల నాలో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందింది. ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలో నాకు జ్ఞాపకమే.’’అగ్నిలింగం పంతొమ్మిదో ఏట ఫుట్‌బాల్ ఆడుతూంటే కాలు విరిగింది. వయసులో ఉన్నాడు కాబట్టి అది అతుక్కుంది. ఇరవై ఒకటో ఏట వంశపారంపర్యంగా వచ్చిన మరో రోగం థైరాయిడ్. ముప్ఫైరెండో ఏట ఓ రొటీన్ కంటి పరీక్షలో గ్లకోమా కూడా బయటపడింది. మోకాళ్ళ నొప్పివల్ల అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో ఆర్థరైటిస్ బయటపడింది.అగ్నిలింగం ముప్ఫైరెండో ఏట రైల్లో పైబెర్త్ ఎక్కుతూంటే కుడి మోకాల్లోని నరం పట్టేసి గిలగిల్లాడిపోయాడు. అతనికి సయాటికా ఉందని డాక్టర్ చికిత్స ఆరంభించాడు. కామన్ కోల్డ్ ఐతే సరేసరి. లెక్కలేనన్ని సార్లు.‘‘జలుబు వెయ్యి రోగాలు పెట్టు అని ఎవరన్నారో కాని, అది నిజం కాదని వెయ్యి రోగాలున్న నేను తెలుసుకున్నాను.’’ చెప్పేవాడు.ఫారింజైటిస్, డెంగ్యూ ఫీవర్, మైగ్రేన్, అనేక ఎలర్జీలకి సంబంధించిన రేషెస్, గ్యాస్ట్రైటిస్, ఏసియాకి చెందిన దాదాపు అన్ని రకాల విష జ్వరాలు అతన్ని పలకరించాయి.అగ్నిలింగం క్షేమం కోరి తల్లిదండ్రులు బాల్యంలో అనేక యజ్ఞాలు చేశారు. మహా మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, అగ్నిహోత్రుడి హోమం, లక్ష గాయత్రి యజ్ఞం... అనేకసార్లు మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చినా, అగ్నిలింగం ఎన్నడూ ‘నాకే ఇన్ని రోగాలు ఎందుకు రావాలి?’ అనే నిరాశ మాటల్ని మాట్లాడలేదు. ఆశ్చర్యంగా అతను వ్యాధిగ్రస్తుడిగా కనపడడు. అతని మొహం ఆరోగ్యంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.ఆయనకి ఓరోజు భరించలేని గుండె నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అది గ్యాస్ వల్లని తెలిసింది. ఆయనకి చేసిన వైద్య పరీక్షల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. వాటిని సర్జరీ చేసి తీయడానికి కుదరక మందు రాసిచ్చారు.‘‘ఇది నాకు ఇంకో కలికితురాయి. వ్యాధులు నా అతిథులు. నిత్యం వాటికి ఆహారం, అంటే మందులు పెట్టి గౌరవిస్తుంటాను.’’ ఓ పెళ్ళిలో సరదాగా చెప్పాడు.ఆయన పక్షపాతం లేకుండా అన్ని రకాల మందుల్ని వాడుతూంటాడు. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యునాని, ఇంగ్లీష్ మందులు. ఆయనకి సరైన ఉద్యోగం మెడికల్ రెప్. కాని, బ్యాంక్‌లో చేరారు. నా అనుమానం, ఆయనకి జీతం కన్నా మెడికల్ ఇంబర్స్మెంట్కే ఎక్కువ చెల్లించి ఉంటుంది మా బ్యాంక్.మా స్టాఫ్‌లో ఎవరైనా నలతగా ఉంటే ఆయన సలహాలు తీసుకోవటం కద్దు.అలాంటి అగ్నిలింగం ఓ రోజు ఓ కస్టమర్‌తో మాట్లాడుతూండగా స్పృహతప్పి కింద పడబోయాడు. పక్కనే ఉన్న చీఫ్ కేషియర్, లేడీ క్లర్క్ ఆయన్ని పట్టుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి స్పృహలోలేని ఆయన్ని హాస్పిటల్‌కి చేర్చాం.అగ్నిలింగం ఆ డాక్టర్‌కి పాత ఖాతానే. వెంటనే ఎమర్జెన్సీ సెక్షన్ లోకి ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన హాస్పిటల్లోకి చేరేసరికి గుండె అతి బలహీనంగా కొట్టుకుంటోంది. హాస్పిటల్లో చేరిన నాలుగు గంటలకి డాక్టర్ విచారంగా చెప్పాడు.‘‘సారీ. గోల్డెన్ అవర్‌లో రాలేదు. అగ్నిలింగం ఈసారి హార్ట్ ఎటాక్ నించి సర్వైవ్ కాలేదు.’’ఆ రాత్రి ఏడుకి నా మొబైల్ మోగింది. అది అగ్నిలింగం మొబైల్ నించి! వాళ్ళ ఇంటి నించి ఏదో అవసరం వచ్చి నాకు ఫోన్ చేశారని అనుకుంటూ ఆన్సర్ చేశాను. అగ్నిలింగం కంఠం విని నేను నిర్ఘాంతపోయాను.‘‘అబ్బాయ్. నాకేం కాలేదని బేంక్‌లో అందరికీ చెప్పు.’’ఎవరైనా ఆయన కంఠాన్ని అనుకరించి నన్ను ఫూల్ చేస్తున్నారా అన్నది నాకు మొదట కలిగిన ఆలోచన.‘‘నేను చచ్చి బతికాను అబ్బాయ్.’’ నవ్వుతూ చెప్పాడు.‘‘ఎలా సర్?’’ ఆసక్తిగా అడిగాను.‘‘నా శవాన్ని, ఛ, నన్ను ఇంటికి తీసుకెళ్ళే అంబులెన్స్ రోడ్ మీద పెద్ద గుంటలో పడి లేచింది. దాంతో నా గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభమై నేను రివైవ్ అయ్యాను. వెంటనే మళ్ళీ నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు యాంజియోప్లాస్టీ చేసి, రికవరీ అయ్యాక డిశ్చార్జ్ చేస్తామన్నారు.’’‘‘అద్భుతం సర్! ఇది అద్భుతం!’’ చెప్పాను.‘‘అసలు అద్భుతం ఏమిటంటే, ఆ దెబ్బతో నా కిడ్నీ స్టోన్స్ కూడా ఆట్టే బాధ పెట్టకుండా యూరిన్ తో బయటికి వచ్చేశాయి.’’ ఆయన ఆనందంగా చెప్పాడు.కంకర తేలిన ఆ చెత్త రోడ్ కాంట్రాక్టర్ ఫొటోని అగ్నిలింగం భార్య వారి పూజా మందిరంలో ఉంచిందన్నది పోస్ట్ స్క్రిప్ట్. - మల్లాది వెంకట కృష్ణమూర్తి‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
రోకటిపాట కాదు రహస్య గీతం!
‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్ యోస్తా ట్రాన్స్‌ట్రామర్. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్.వై పతంజలి, వడ్డెర చండీదాస్ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్‌ట్రామర్) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి.ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్ట్రామర్లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ ఎక్స్ప్రెషనిస్టు కవి’ అన్నారు.గెయార్గ్ హైం, అగస్ట్ స్ట్రాం, గాట్ఫ్రైడ్ బెన్ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్‌ట్రామర్ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్‌ట్రామర్ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్‌ట్రామర్ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.ట్రాన్స్‌ట్రామర్ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్‌ట్రామర్. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్‌ట్రామర్ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్ట్రామర్కు నోబెల్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్ శాక్సఫోనిస్ట్ యాన్ గబారెక్, స్వీడిష్– అమెరికన్ సంగీతకర్త ఊల్ఫ్ గ్రాన్, స్వీడిష్–ఫ్రెంచ్ సంగీతకారిణి మెడిలిన్ ఇసాక్సన్ తదితరులెందరో ట్రాన్స్‌ట్రామర్ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్ట్రామర్తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.జర్మన్ కవయిత్రి లూయిజ్ గ్లూక్ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్‌ట్రామర్ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్‌ట్రామర్ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్ -
కప్ప బావ.. మ్యూజిక్ బ్యాండ్!
టపటప వాన మొదలవగానే చింతచెట్టు కింద కప్ప బావ గొంతు సవరించుకున్నాడు. ‘బెక బెక బేక్’ అని పాట అందుకున్నాడు. ఆ శబ్దానికి నిద్రపోతున్న చీమల దండు ఉలిక్కిపడి బయటకొచ్చింది.‘ఏంటి బావా ఈ గోల? అసలుకే మా పుట్టలోకి నీళ్లు ఎక్కడ వస్తాయోనని భయపడి చస్తుంటేను’ అని విసుక్కున్నాయి.కప్ప బావ సిగ్గుపడ్డాడు. ‘సారీ చీమ పిల్లలూ. వాన వస్తే నాకు పాడాలనిపిస్తుంది’ అన్నాడు.అప్పుడే నత్త గారు నెమ్మదిగా వచ్చారు. ‘బావా, నీ పాట బాగుంది కానీ ఒక్కడివే పాడితే ఎలా? మనమంతా కలిసి పాడుదాం’ అన్నారు.వాన జోరందుకుంది. కప్ప బావ ‘బెక బెక’ డ్రమ్స్ వాయించాడు. నత్తగారి షెల్ మీద టపటపా పడ్డ వాన చినుకులు రిథమ్ ఇచ్చాయి. చీమలు క్యూ కట్టి ‘టిక్ టిక్’ అని చప్పట్లు కొట్టాయి. మిణుగురు పురుగులు లైటింగ్ ఇచ్చాయి. ఆ మ్యూజిక్ విని ఊరి పిల్లలంతా కిటికీల్లోంచి తొంగి చూశారు.‘అరే, వానలో బ్యాండ్’ అని చప్పట్లు కొట్టారు. కాసేపటికి వాన తగ్గింది. చీమల పుట్ట సేఫ్. అందరూ హ్యాపీ. కప్ప బావ అన్నాడు, ‘చూశారా, ఒక్కడి గోల అందరికీ విసుగు. అందరూ కలిస్తేనే అది పండగ.’ఆ రోజు నుంచి చింతకుంట పల్లెలో వాన పడిందంటే చాలు కప్ప బావ బ్యాండ్ మొదలయ్యేది. పిల్లలంతా కిటికీ దగ్గర కూర్చుని వింటూ కబుర్లు చెప్పుకునేవారు.నీతి: కలిసి చేస్తే ఏ పనైనా పండగే, కష్టమైనా ఇష్టమవుతుంది. -
భారత విజ్ఞానం: జెండాపై కపిరాజు...
జెండాపై కపిరాజు అంటే ఆంజనేయుడు.... ఆయన చిరంజీవి కనుక త్రేతా యుగం నాటి రామాయణ కాలంలోనే కాదు.... ద్వాపర యుగంలో జరిగిన మహా భారత యుద్ధంలోనూ ఆంజనేయుడు కన బడతాడు. శ్రీకష్ణుడుని కోరిక మేరకు అర్జునిని రధం పై ఉండే జెండాలో కొలువై ఉంటాడు. ఇలా కొలువై ఉండేందుకు కారణం కూడా ఉంది. మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు. ఒకసారి భీముడికి గర్వభంగం జరిగిన సందర్భంలో... మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది.΄ాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. ఈ పూలు తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని భీముడు కోరతాడు. తాను ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లమని భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి, శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు.త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు? నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు.ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది.ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటివరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని చెబుతాడు. అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని, విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం, ఇలాంటి ఆంజనేయుని జెండా తమ కూడా ఉంటే విజయం తమనే వరిస్తుందన్న సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. - సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
సమ్యక్ దృష్టి.. మిధ్యా దృష్టి!
బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్! సమ్యక్ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’‘‘భగవాన్! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’ ‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు. ‘‘భగవాన్! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు. చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్ -
అపకారికి ఉపకారం: మర్యాదగా తలుపు తీస్తావా లేదా?
శేషాచలం అడవుల్లో ఒక ఋషి ఎంతోకాలంగా ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన ఆ అడవుల్లో వుండే ఆదివాసీలకు మూలికా వైద్యం చేస్తూ, వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పురాణాలు, నీతి కథలు చెబుతూ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. ఒక రోజు రాత్రి ఎవరో ఆశ్రమం తలుపు దబదబ బాదుతూ వుంటే నిద్రాభంగం అయింది ఋషికి.‘‘ఎవరు నాయనా వచ్చింది? ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!’’ అన్నాడు ఋషి లేచి కూర్చుంటూ. ‘‘ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!’’ అన్న భీకరమైన మాటలు వినబడ్డాయి.‘‘నువ్వు దొంగవైనా, జమీందారువైనా, ఈ సమయంలో ఆశ్రమంలోకి రాకూడదు నాయనా! అది ఆశ్రమ నియమం.’’ అని సౌమ్యంగా అన్నాడు ఋషి.‘‘నువ్వు తలుపు తీయకపోతే నేను తలుపు బద్దలు కొట్టి వస్తాను. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నువ్వు మంచి మాటలతో తలుపు తీసేలా లేవు!’’ అంటూ, తలుపు బద్దలు కొట్టడానికి పెద్ద రాయి కోసం వెతుకుతూ, దబ్బుమంటూ ఒక గోతిలో పడి పోయాడు గంగులు. గొయ్యి లోతుగా వుండటంతో వాడికి నడుం విరిగినంత పని అయింది. ‘‘చచ్చానురోయ్, దేవుడా!’’ అంటూ బాధగా అరిచాడు గంగులు.తక్షణం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఋషి. ఆయన గోతిలో మూలుగుతున్న గంగులును చూసి, ‘‘ఎంత పని జరిగింది నాయనా! ఆశ్రమం వెనక వైపు వున్న బావి ఎండిపోవడంతో, కొందరు చెంచులు ముందు వైపు బావి తవ్వుతున్నారు. చీకట్లో నువ్వు కాలు జారి, బావిలో పడి నట్లున్నావు!’’ అంటూ ఋషి ఆశ్రమంలోకి వెళ్లి ఒక పెద్ద తాడు తీసుకు వచ్చాడు. ఆ తాడు సహాయంతో గంగులుని అతి కష్టం మీద పైకి లాగాడు ఋషి.తరువాత నడవలేకపోతున్న గంగులుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆశ్రమంలోకి తీసుకు వెళ్ళాడు. గంగులు గాయాలకు పసరు మందు రాసి కట్టు కట్టాడు. ఒక లోటాలో ఆవు పాలు తీసుకు వచ్చి, గంగులు చేత తాగించాడు.అప్పటి దాకా ఋషి చేస్తున్న పనులన్నీ విభ్రాంతిగా చూస్తున్న గంగులు, ‘‘ఈరోజు నాకు మహోపకారం చేశారు. మునపటి నా ప్రవర్తన మీద మీకు కోపం లేదా స్వామి?’’ అని అడిగాడు గంగులు.ఋషి నవ్వి, ‘‘ఎవరి ధర్మానికి తగినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నువ్వు దొంగలా బెదిరించావు. నేనొక ఋషిలా నీకు సేవ చేశాను అంతే!’’ అన్నాడు.‘‘ఈ సమయంలో ఎవరికీ ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పారు కదా! మరి మీరు స్వయంగా నన్ను లోపలికి ఎలా తీసుకువచ్చారు?’’ అని అడిగాడు గంగులు.‘‘ఆపదలో వున్న తోటి మనిషిని కాపాడటానికి మించిన ధర్మం ఏం వుంది? అది సరే కానీ నువ్వు ఆశ్రమం అంతా వెతికినా వన మూలికలు తప్ప మరేమీ దొరకవు’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు సిగ్గు పడి, ‘‘నా అవివేకపు ప్రవర్తనకు క్షమించండి స్వామి’’ అన్నాడు చేతులు జోడించి.గంగులుకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుని, ‘‘నీ కాబోయే భార్య ఒక దొంగకు భార్యగా, పుట్టబోయే పిల్లలు దొంగకు పుట్టిన పిల్లలుగా వుండటం నీకు గాని, నీ కుటుంబానికి గాని గౌరవంగా వుంటుందా చెప్పు! దొంగ అని తెలిస్తే చాలు, దారిన పోయేవాడు కూడా నాలుగు పిడిగుద్దులు గుద్ది, మొహం మీద వుమ్మేసి పోతాడు! డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పని చేయాలా, ఆలోచించుకో!’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు తలదించుకుని మౌనంగా వుండి పోయాడు.‘‘చీకటి ఎంత గాఢంగా వున్నా చిరు దీపం తో దాన్ని పారదొలొచ్చు! అలాగే మనిషి మనసు ఎంత కలుషితమైపోయి వున్నా ఒక మంచి మాటతో ఆ మలినాన్ని కడిగి వేయవచ్చు! నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి దొంగగా ఈ ఆశ్రమానికి వచ్చిన నువ్వు, దొరలా ఇక్కడి నుంచి వెళతావో, లేక పాత దారిలోనే నడుస్తావో నీ ఇష్టం!’’ అన్నాడు ఋషి.‘‘లేదు స్వామి, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇక జన్మలో దొంగతనం అనేది మరచి పోయి, కష్టపడి గౌరవంగా బ్రతుకుతాను’’ అంటూ ఋషికి నమస్కరించి ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు గంగులు.హితవచనం.. అజ్ఞానికి, నమ్మకంలేనివాడికి, అనుమానించేవాడికి నాశనం తప్పదు వీళ్లలో అనుమానించేవాడికి ఇహపరాలలో సుఖం ఎక్కడా ఉండదు. - మాచిరాజు కామేశ్వర రావు -
దానవులకు శుక్రాచార్యుని శాపం!
దానవులకు శుక్రాచార్యుని శాపందేవ దానవ యుద్ధంలో దానవులు ఓటమి పాలయ్యారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం తిరిగి వచ్చింది. శుక్రాచార్యుడు దేవతల పక్షంలోకి చేరాడు. అది చూసి రాక్షసులు కలవరపడ్డారు. ‘ఆచార్యా! మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోతే, మేము దిక్కుకానని వాళ్లమవుతాము’ అని మొరపెట్టుకున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల మొరను ఆలకించి, ‘ఓషధులు, మంత్రాలు నా వద్దనే ఉంటాయి. వాటిలో నాలుగో వంతు దేవతలకు చెందితే చెందవచ్చుగాక. మిగిలిన సర్వస్వాన్నీ మీకు ఇస్తాను’ అని వారికి చెప్పాడు.దేవతలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, కనిపించిన రాక్షసులనల్లా తుదముట్టించడం ప్రారంభించారు. రాక్షసులు శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నారు. శుక్రుడు దేవతల వద్దకు వెళ్లి, ‘పన్నెండు సంగ్రామాలలో రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇకనైనా మీరు పగను విడిచిపెట్టి, మిగిలిన రాక్షసులను బతకనివ్వండి’ అని చెప్పాడు.తర్వాత రాక్షసులతో రహస్యంగా సమావేశమై, ‘నేను శంకరుడి గురించి తపస్సు చేసి, మంత్రశక్తులను సంపాదించుకుని వస్తాను. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పటి వరకు నా తండ్రి భృగు మహర్షి ఆశ్రమంలో మీరంతా తలదాచుకోండి’ అని చెప్పి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లాడు.శుక్రాచార్యుడు తపస్సు చేస్తుండగా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘శుక్రా! నువ్వు తలకిందులుగా తపస్సు చేయి. అప్పుడే నీకు మంత్రాలన్నీ వశమవుతాయి’ అని చెప్పాడు.శుక్రాచార్యుడు ఘోరనిష్ఠతో శంకరుడు చెప్పిన ప్రకారమే తలకిందులుగా ఒక చెట్టుకు వేలాడుతూ తపస్సు చేయడం ప్రారంభించాడు.శుక్రుడు తపస్సు చేస్తున్న సంగతి తెలుసుకున్న దేవతలు రాక్షసుల మీదకు దండయాత్రకు బయలుదేరారు. దిక్కుతోచని రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు కోరారు.‘భయపడకండి. మీరు నా వద్దనే ఉండండి. మీకు ఏ భయం ఉండదు’ అని ఆమె అభయమిచ్చింది.అయినా, దేవతలు రాక్షసులను తరుముతూ వారిని పీడించసాగారు.దేవతల దుశ్చర్యకు కుపితురాలైన శుక్రమాత ‘మూర్ఖులారా! ఇంద్రుడితో సహా మిమ్మల్నందరినీ మట్టుపెట్టగలను’ అని హెచ్చరించి, తన యోగశక్తితో ఇంద్రుడి కాళ్లు చేతులు పనిచేయకుండా స్తంభింపజేసింది. ఇంద్రుడి పరిస్థితి చూసి, దేవతలు పరుగులు తీశారు. విష్ణువు తనలో ప్రవేశించమని ఇంద్రుడికి చెప్పాడు. శుక్రమాత ‘నిన్ను కూడా దహించివేస్తాను’ అని విష్ణువును హెచ్చరించింది. ఆమె శక్తిని తట్టుకోవడం దుస్సాధ్యమని తలచిన విష్ణువు, స్త్రీవధ కూడదని తెలిసినా, కత్తి దూసి ఆమె శిరస్సును ఖండించాడు.ఇదంతా తెలిసిన భృగు మహర్షి, నువ్వు ఏడు జన్మలు మనిషిగా జన్మిస్తావు’ అని విష్ణువును శపించాడు. తన భార్య శిరస్సును మొండేనికి తగిలించి, తన తపశ్శక్తితో ఆమెను తిరిగి బతికించాడు. ఇంద్రుడు, విష్ణువు సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.శుక్రుడిని ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు తన కుమార్తె జయంతిని పిలిచి, ‘కుమారీ! శుక్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నాతో సహా దేవతలంతా అతడికి భయపడుతున్నారు. నువ్వు వెళ్లి, నీ సపర్యలతో అతడిని వశం చేసుకుంటే, నాకు అంతకంటే కావలసినది లేదు. నేను నిన్ను అతడికి ఇచ్చివేస్తున్నాను’ అని చెప్పాడు.తండ్రి ఆజ్ఞ మేరకు జయంతి శుక్రుడు తపస్సు సాగిస్తున్న చోటుకు చేరుకుంది. అతడికి సపర్యలు చేస్తూ, ఏళ్ల తరబడి ఓర్పుగా ఉంది. కొన్నాళ్లకు శుక్రుడి తపస్సు ఫలించి, శంకరుడు అతడికి ప్రత్యక్షమై మంత్ర శక్తులన్నీ అనుగ్రహించాడు.అన్ని రోజూలూ తనకు సపర్యలు చేస్తూ వచ్చిన జయంతిని చూసి, శుక్రుడు ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఆమె కోరిక మేరకు పాణిగ్రహణం చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, అదృశ్యరూపంలో ఆమెతో గడపసాగాడు. శుక్రుడు జయంతితో ఉన్న సంగతి తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ఇంద్రుడి ప్రోద్బలంతో తానే శుక్రుడి రూపం దాల్చి, రాక్షసుల వద్దకు వెళ్లాడు. ఆచార్యుడు తిరిగి వచ్చినట్లు భావించిన రాక్షసులు అతడిని పూజించసాగారు.జయంతితో అప్పటికే పదేళ్లు గడిపిన శుక్రాచారుడు తన శిష్యులైన రాక్షసులతో యజ్ఞం జరిపించాలని తలచి, తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన స్థానంలో తనలా ఉన్న బృహస్పతిని రాక్షసులు సేవిస్తుండటం చూసి, పట్టరాని ఆగ్రహంతో ‘మీరు మతిభ్రష్టులై సంచరించెదరుగాక’ అని శపించాడు.అసలు సంగతి గ్రహించిన రాక్షసులు శుక్రాచార్యుని పాదాలపై పడి పరిపరి విధాలుగా ప్రార్థించడంతో అతడు కొంత శాంతించాడు. ‘ఇప్పుడు దేవతలకు అనుకూలమైన కాలం. భవిష్యత్తులో ముల్లోకాలూ తిరిగి మీ వశం కాగలవు’ అని పలికాడు.పురావిశేషం..అసుర గురుడైన శుక్రాచార్యుడికి అరుదైన ఆలయం మహారాష్ట్రలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం బేట్ కోపర్‌గాంవ్ గ్రామంలో గోదావరి తీరానికి చేరువలో ఉంది. ఇక్కడ పూజలు జరిపితే శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇదేచోట శుక్రాచార్యుడు శివుడి గురించి తపస్సు చేసి, మృత సంజీవని విద్య పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో శుక్రాచార్యుడికి పాయసం, కోవా మిఠాయిలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. - సాంఖ్యాయన -
పరమ విశిష్టమైన ఏకాదశి..
అధికమాసంలో వచ్చే ఏకాదశిని ‘పరమ ఏకాదశి‘ అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ రోజున శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతీతి. యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. నేటి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.ఎందుకని అంతటి విశిష్టత?‘పరమ‘ అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం మూడేళ్లకోమారు అధికమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనది. విష్ణుప్రీతికరమైనది. ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.ఏం చేయాలి?విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః‘ మంత్రాన్ని జపించండి.దానాలు... పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థికసాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి మార్గం సుగమం అవుతంది. తామర గింజలు లేదా సగ్గుబియ్యంతో పాయసం చేసి లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత కర్పూర హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి, కుటుంబ సభ్యులకు పెట్టడం వల్ల లక్ష్మీవిష్ణువుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.తులసి కోట దగ్గర... ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీ నారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. -
మిమ్మల్ని మీరు తెలుసుకోండి..
నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా జన్మించాను ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి ఈ జన్మ అయిన తర్వాత నా పయనం ఎటువైపు. చాలామంది సత్యాన్వేషకులలో ఈ ప్రశ్నలు తరచూ వారి మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు ప్రసాదించడానికి పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ఈ సహజ యోగం ద్వారా మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరం ఉనికిని గుర్తించి అనుభూతిపరంగా తెలుసుకొనవచ్చు. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ముడు నీవు కేవలం ఆత్మవు ఈ శరీరం బుద్ధి అహంకారం కాదు అని సుస్పష్టంగా తెలియజేశాడు. ఆరవ శతాబ్దంలో వచ్చిన శంకరాచార్యులు కూడా నీవు ఆత్మవు అని సంపూర్ణంగా వివరించి తెలియజేశారు.బుద్ధుడు, మహావీరుడు కూడా పరమాత్ముని తెలుసుకొనుటకు ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అది గురు దత్తాత్రేయ పదిసార్లు ఈ భూమి మీద వివిధ ప్రదేశాలలో వివిధ సమయాలలో వచ్చి నీవు ఎవరవు అన్న విషయాన్ని తెలియజేయ ప్రయత్నించాడు. కబీర్ దాస్, భక్తవేమన, రమణ మహర్షి మొదలైన మరెందరో ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నీవు తెలుసుకో అని చెబుతూ వస్తూ ఉన్నారు. మనలో ఉన్న ఆత్మను తెలుసుకొనడానికి పరమాత్మునితో అనుసంధానం అవడం తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా బోధించారు మనల్ని ముందుకు నడిపించారు.అవతరించిన 10 మంది ఆది గురువులు..శ్రీ రాజా జనకుడుమిథిలా రాజు, శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి (భారతదేశం సుమారు క్రీస్తుపూర్వం 8000).శ్రీ అబ్రహాం ఇజ్రాయేలు, 12 గోత్రాల పూర్వికులు (ఇజ్రాయేలు సుమారు క్రీస్తుపూర్వం 2000).శ్రీ జరథుస్త్రుడుఏకేశ్వరవాదం, అగ్ని ఆరాధనను స్థాపించినవారు (పర్షియా సుమారు క్రీస్తుపూర్వం 1800).శ్రీ మోసెస్యూదుల ధర్మశాస్త్ర స్థాపకులు (ఈజిప్ట్ సుమారు క్రీస్తుపూర్వం 1250).శ్రీ లావో–త్సు ‘‘టావో టే చింగ్’’ రచయిత(చైనా జననం క్రీస్తుపూర్వం 604).శ్రీ కన్ఫ్యూషియస్ నైతిక విలువలను బోధించి ‘‘ఐ చింగ్’’ సంకలనం చేసినవారు (చైనా జననం క్రీస్తుపూర్వం 549).శ్రీ సోక్రటీస్ గ్రీకు తత్వశాస్త్ర స్థాపకుడు (గ్రీస్ జననం క్రీస్తుపూర్వం 431).శ్రీ మహమ్మద్ ఇస్లాం మత స్థాపకుడు (అరేబియా మరణం క్రీస్తుశకం 632).శ్రీ గురు నానక్ సిక్కు మత స్థాపకుడు (భారతదేశం జననం క్రీస్తుశకం 1469).షిర్డీ సాయినాథ్ శ్రీ మాతాజీ జననాన్ని ప్రవచించినవారు (భారతదేశం సుమారు 1840 – 1918 క్రీస్తుశకం).ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనలో ఉన్న శక్తులను మనం తెలుసుకుని మన జీవితాన్ని వివేకం,విచక్షణ,జ్ఞానం, వినమ్రత, ప్రశాంతతతో ఆనందంగా జీవించడానికి మనలో ఉన్న శారీరిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక సామాజిక, ఆధ్యాత్మిక సమస్యల నుంచి బయటపడడానికి, మతకల్లోలాల నుంచి యుద్ధాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మనలో ఉన్న కుండలిని శక్తిని ఆత్మసాక్షాత్కారం ద్వారా జాగృతపరచుటకు ఆత్మను ప్రకాశవంతం చేసుకొనుటకు స్వీయ అనుభవం ద్వారా మనలో ఉన్న సూక్ష్మ శరీర అవగాహన చేసుకొనుటకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యల నుంచి బయటపడడానికి సహజ యోగ ధ్యానం ద్వారా విముక్తులు అయి అత్మసాక్షాత్కారం పొందండి. – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
పునరుత్థానుడైన క్రీస్తు ఆరోహణ వాగ్దానం
యేసు పునరుత్థానుడైన తరువాత 40 రోజులు వరకు ఆయన సేవకులకు, శిష్యులకు, ప్రేమించిన వారికి దర్శనం ఇచ్చాడు. అనేక విషయాలు ప్రబోధించాడు, వాటిలో ప్రాముఖ్యంగా మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొనులాగున తండ్రిని వేడుకొనుచున్నాను, నేను వెళ్లుచున్నాను, నేను వెళ్లి మీ కొరకు ఆదరణ కర్తను పంపుతాను ఆ ఆదరణ కర్త మిమ్ములను సర్వసత్యంలోనూ, మంచి మార్గంలోనూ నడిపిస్తాడు. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ మార్గం ఏది? తండ్రి ఎవరని ప్రశ్నలు అడిగారు.అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరును దేవుని వద్దకు రాలేరన్నాడు. తండ్రి, నేను ఏకమై ఉన్నామన్నాడు. ఆదరణ కర్త ఎవరు సత్య స్వరూపి ఆయన ఆత్మయై ఉన్నాడు, కావున భయపడకండి అంటూ ధైర్యపరిచాడు.నా తండ్రి ఇంట అనేక నివాసాలు, స్థలము ఉన్నవి నేను మిమ్ములను నాతో ఉండు లాగున తీసుకొని వెళ్తాను. ఆదరణకర్తను పంపుతాను అనగా పరిశుద్ధాత్మ ఆయన కూడా వ్యక్తి, శక్తి అనగా త్రిత్వదైవత్వం. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడు వీరు ఒక్కరైనా ఏక దేవుడై ఉన్నారు. అని సందేశం ఇచ్చి వారిని బేతనీయ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్లి వారిపై చేతులుంచి ఆశీర్వదించి పరమునకు ఆరోహణమయ్యాడు (పరి. యోహాను 14:1–30) , (లూకా 24: 50–51) పరలోకం అనగా నిత్యజీవముండే స్థలము (హెవెన్) భౌతిక శరీరం విడిచి మన ఆత్మ చేరే శాశ్వత ఆధ్యాత్మిక స్థలం. ఆరోహణమనగా పైకి వెళ్లడం, అది ఒక క్రీస్తుకే సాధ్యం. ఎందుకనగా పరిశుద్ధాత్మ మహిమ కన్యగర్భంలో ఏ విధంగా జన్మించాడో అదే రీతిన దేవునితో ఆరోహణమయి దేవునిలో లీనమయ్యాడు. కుడిపార్శా్వన కూర్చుని ఉన్నాడు. అంటే ఇది ఏఐ లాగున కాదు ఆ ప్రణవ నాదమైన పవిత్ర వాక్యం (పరి. యోహాను 1:1–2).ఒకటి యేసు వారి ఆరోహణం, రెండు పరిశుద్ధాత్ముని పంపుతానన్న వాగ్దానాన్ని చూస్తున్నాం (పరి. యోహాను : 14:16). పరిశుద్ధాత్మ అనేది క్రైౖ స్తవ సంఘానికి ఊపిరి, ప్రాణం. పరిశుద్ధాత్మ తండ్రి (సృష్టికర్త), కుమారుడు (యేసుక్రీస్తుతో), సమానం. దీన్ని పరిశీలించగా ‘రువా’ హెబ్రూ పదం అనగా ఊపిరి, శ్వాస ఇది వీచే గాలిలోనూ, జీవించే మనుషుల్లోనూ ఉన్న దేవుని ఆత్మ, అందుకే ‘సామెతలు’ గ్రంథకర్త 20:27, ఈ విధంగా ప్రబోధించాడు. నరుని ఆత్మ యెహోవా (ప్రభువు) పెట్టిన దీపం. యెహోవా అనగా సర్వంతర్యామి, సర్వశక్తుడగు దేవుడు, పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉన్నది.దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అనగా మన శ్వాస, నిశ్వాసలలో ఉన్న ఊపిరి ఆయనదే (దేవునిదే). మనలో నుండి ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోతుంది అనగా మనం అబద్ధాలు, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం మొదలగు వాటికి బానిసలై స్పృహ కోల్పోయినప్పుడు మరణించుతాం. దానినే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతుంది, ఉదాహరణకు గొంగళి పురుగును చూడగా, దాన్ని మనుషులు అసహ్యించుకుంటారు కానీ అదే రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా అయినప్పుడు ఆనందించుతాము, అలాగే పరిశుద్ధాత్ముని మనలోనికి ఆహ్వానిస్తే దురాత్మ దూరమైపోతుంది, అలాగే దురలవాట్లు గల వ్యక్తిని చూసినప్పుడు అసహ్యించుకుంటారు. పరిశుద్ధాత్మ అట్టి వారిలో ప్రవేశించితే ఆ వ్యక్తికి గౌరవమర్యాదలు ఇస్తారు కదా!కావున పరిశుద్ధాత్మను కోరుకుందురు గాక, దేవుడిచ్చిన జీవాత్మను కాపాడుకుందాం ఇలాంటి సందేశం ఇచ్చి యేసు – మెస్సయ్యగా, ప్రభువుగా, క్రీస్తుగా చూస్తున్నారు.ఈ సందేశం ఇచ్చిన ప్రభువును మనుషులలో దీపాలు వెలిగించును గాక, ప్రభువును అంతరంగంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం, ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుచేత దేవుని అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశించక నిత్యజీవం పొందుతారు, అందుచేత నిత్యజీవాన్ని కోరుకుందుముగాక! (పరి. యోహాను 3:16). – బి.బి. చంద్రపాల్ కోట -
శతక నీతి: విద్యాప్రభావం..
విదురనీతిలో విద్యయే మనిషికి నిజమైన అందం, దాచి పెట్టిన ధనం, దొంగిలించడానికి వీలులేని సంపద అని చెప్తారు. భీష్ముడు ‘నాస్తి విద్యాసమం చక్షు:’ అంటాడు. అంటే విద్యతో సమానమైన కన్ను మరొకటి లేదని. అమరకోశ వాక్యం ప్రకారం పండితులు శ్రేష్తులు.. ‘విద్వాన్ సర్వత్రే పూజతే’ అన్నది సంస్కృత సుభాషితం.మన జీవితంలో అనునిత్యం ముడి పడే ప్రతి అంశానికి, సందర్భానికి సముచితంగా బోధించే శతకాలు చాలా ఉన్నాయి.. ఒక్కొక సందేశం విలువైన మాట, జీవితాన్ని శాసించే మాట, నిలబెట్టే మాట, సక్రమ మార్గంలో పెట్టే మాట... విద్య విషయంలో శతక నీతులు ఏమని అంటాయంటే..‘సకల కళా విభూషితులు.... విత్తము లేకయు వారు పూజ్యులే’ అంటారు భర్తృహరి. ‘ప్రభువులు పండితులగువారివలన గర్వకలన మా నుడు వారు మీ కలిమి తృణము లీల బోలింపలేమి మృణాళ గుణము భూరిమదవారణంబె’ అంటే పాండిత్యం ముందు రాజుల సంపద గడ్డిపోచ అని అంటాడు.‘కేయూరాణి న భూషయన్తి... వాగ్భూషణం భూషణమే’.. ఒకప్పుడు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఉదయం వార్తలు తరువాత వినేవాళ్ళం.. దీనర్థం విద్యయే అలంకారం అని.‘విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్విద్య యశస్సుభోగకరి విద్య గురుండు విదేశబంధుడన్విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే..'భావం: విద్యయే సర్వోత్తమం. విద్య ఉంటే అన్ని ఉన్నట్టే. విద్వాంసుల వలనే లోకం నిలుస్తుంది. మహా కవులు, పండితులు మరణించినా కీర్తితో బతికే ఉంటారు.భర్తృహరి సంస్కృత శతకానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదంలో బయటపడ్డ ఆణిముత్యాల సారాంశం ఇదంతా అయితే, వేమన శతకాల్లో .విద్య లేని వాడు వింత పశువులన్నారు. చదువు రాని వాని బ్రతుకంత శూన్యం అన్నాడు..‘చదివినంతనే పండితుండగునే మనుజుడు ‘ అని అన్నాడు..బద్దెన సుమతీ శతకం లో ‘విద్య నిగూఢగుప్త మగు విత్తం’ అని అన్నారు..భాస్కర శతకంలో భాస్కరుడు పేరుకు తగ్గట్టు నిత్యం ప్రకాశించే మాట చె΄్పారు..‘విద్యయే భూషణము నరునకు ‘... ఇది ‘కేయూరాణి’కి... దగ్గరలో ఉంది.‘విద్య లేని వాడు వింత మృగంబు రా’ అంటూ వేమన భావాన్నీ వెలిబుచ్చాడు.రామదాసు శతకంలో రామునే స్మరించినా రామదాసు ‘చదువు రాని వాడు జగములోనూ దద్దమ్మ అని తేల్చేశాడు.కాళీదాసు మూడు ముఖ్య విషయాలు చె΄్పాడు..‘విద్య వినయ సహితం’ అని,‘శైశమేభ్యస్త విద్యానం యువనే విషయైషిణామ్’ అంటేబాల్యంలోనే నేర్చుకోవాలని, ధర్మంగా బతకడం కోసం విద్య అని.విద్య ద్వారా ఉత్తమ గుణాలను వెలికితీయాలని సెలవిచ్చారు.విద్య విషయంలో తగిన శ్రద్ధ వహించి, కాలానికి తగ్గట్టుగా చదివి, విషయాలుని సంగ్రహించి, వినయంతో ఉండి, విజ్ఞానాన్ని సంపాదించి, నైతిక విలువలను, మానవ విలువలను పాటిస్తూ, రక్షిస్తూ ధార్మిక జీవితం గడపాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం. కానీ, ఎన్ని అపనిందలు ఎదురైనా అల్లాహ్ పై నమ్మకం కోల్పోకుండా, తప్పు చేసిన వారు కళ్లముందు నిలబడినా కక్ష సాధించకుండా క్షమించిన మహోన్నత చరిత్ర ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం)ది. ముళ్లబాటలను అధిగమించి, ఈజిప్ట్ దేశాన్ని కరవు బారి నుంచి రక్షించిన ఒక అద్భుత ప్రజా నాయకుడి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.యూసుఫ్ (అ) చిన్నతనం నుంచే ఎంతో అందమైనవాడు, అమాయకుడు. ఒకరోజు ఆయన కు ఒక వింత కల వచ్చింది. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు కల కన్నారు. ఈ విషయాన్ని తన తండ్రి యాఖూబ్ (అ) కు చెప్పగా.. ఆయన ఆ కలలోని దైవ సందేశాన్ని గ్రహించారు. ‘నాయనా! ఈ విషయాన్ని నీ సోదరులకు చెప్పకు, వారు అసూయపడతారు’ అని హెచ్చరించారు. కానీ, తండ్రికి యూసుఫ్‌పై ఉన్న మితిమీరిన ప్రేమే అన్నదమ్ముల మధ్య అసూయకు కారణమైంది.బావి నుంచి బానిసగా..అసూయతో రగిలిపోయిన సోదరులు యూసుఫ్‌ను అంతమొందించాలని పథకం వేశారు. ‘ఆడుకోవడానికి తీసుకెళ్తాం’ అని తండ్రిని ఒప్పించి, అడవిలోని ఒక పాడుబడ్డ బావిలోకి యూసుఫ్‌ను తోసేశారు. ఆయన బట్టలకు గొర్రె రక్తం పూసి, ‘తోడేలు తినేసింది’ అని తండ్రిని నమ్మించారు. ఆ కన్నతండ్రి ‘ఇది దైవ పరీక్ష, నేను ఓపిక పడతాను’ అని సహనం వహించారు. మరోవైపు, ఆ బావి మీదుగా వెళ్తున్న వర్తకులు యూసుఫ్‌ను రక్షించి, ఈజిప్ట్సంతలో ఒక అధికారికి బానిసగా అమ్మేశారు.జైలు జీవితం.. కలలోని సత్యంఅక్కడ అపనిందలు, ఆరోపణలు ఎదురైనా యూసుఫ్ తన శీలాన్ని, దైవభీతిని కాపాడుకున్నారు. ఫలితంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలులోనే ఆయనకు అల్లాహ్ ‘కలల అర్థాలను వివరించే’ అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించాడు.సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్ రాజుకు ఒక వింత కల వచ్చింది. 7 బలిసిన ఆవులను, 7 బక్కచిక్కిన ఆవులు మింగేయడం.. అలాగే 7 పచ్చటి పనసలు, 7 ఎండిన పనసలు కనిపించడం రాజును కలవరపెట్టింది. దేశంలోని పండితులెవరూ ఆ కలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు జైలు నుంచి యూసుఫ్‌కు పిలుపు వచ్చింది. ఆ కలకు యూసుఫ్ చెప్పిన పరిష్కారం ఇది: ‘రాబోయే 7 ఏళ్లు ఈజిప్ట్‌లో సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 ఏళ్లు ఘోరమైన కరవు వస్తుంది. కాబట్టి తొలి ఏడేళ్ల ధాన్యాన్ని వృథా చేయకుండా ఖజానాలో దాచండి’’యూసుఫ్ మేధస్సుకు ముగ్ధుడైన రాజు, ఆయనను సగౌరవంగా జైలు నుంచి విడుదల చేసి, ఖజానా అధిపతిగా నియమించాడు. బానిస గా వచ్చిన వ్యక్తి, తన మేధస్సుతో ఆ దేశ రక్షకుడి గా మారాడు! పగ కాదు.. ప్రతీకారం అంతకన్నా కాదు!రాజు కన్న కల నిజమైంది. దేశంలో కరవు తాండవించింది. ఆహారం కోసం పొరుగు దేశాల నుంచి జనం ఈజిప్టుకు రావడం ్రపారంభించారు. ఆ గుంపులో యూసుఫ్ సోదరులు కూడా ఉన్నారు. తమను బావిలో పడేసిన అన్నదమ్ములు తన ముందే నిలబడి యాచిస్తుంటే, యూసుఫ్ వారిని గుర్తుపట్టారు. కానీ పగ తీర్చుకోలేదు.చివరకు తన నిజమైన రూపాన్ని బయటపెడుతూ.. ‘నేనే మీ తమ్ముడు యూసుఫ్‌ను. మీ తప్పులను నేను క్షమించేశాను. నాపై మీకు ఎలాంటి నిందలు లేవు‘ అంటూ వారిని కౌగిలించుకున్నారు. తండ్రి యాఖూబ్ (అ) ను, మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు పిలిపించుకున్నారు. చిన్నప్పుడు కన్న కలకు నిజరూపంగా.. తల్లిదండ్రులు, సోదరులు అందరూ యూసుఫ్ ఉన్నత స్థానాన్ని చూసి గౌరవంతో తలవంచారు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఇతిహాసాలను మలుపు తిప్పిన శాపాలు..!
ప్రాచీన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు కేవలం కథల సమాహారం మాత్రమే కాదు... మానవ జీవన విలువలను, కర్మ సిద్ధాంతాన్ని బోధించే అద్భుత జ్ఞాన నిధులు. మన సంస్కృతి లో ‘వాక్కు’కు అత్యున్నత స్థానం ఉంది. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. అందుకే, పూర్వం మహర్షులు, తపస్సంపన్నులు ఆగ్రహంతోనో, అధర్మాన్ని సహించలేకో ఇచ్చిన శాపాలు... చరిత్ర గమనాన్నే మార్చేశాయి. తీవ్రమైన భావోద్వేగాలు, ద్రోహం, అహంకారం, క్రోధం నుంచి పుట్టిన 5 శక్తిమంతమైన శాపాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలు ఇవే...అశ్వత్థామకు శ్రీ కృష్ణుని శాపం...మహాభారత యుద్ధం ముగింపు దశలో, నిద్రిస్తున్న ఉపపాండవులను క్రూరంగా వధించిన అశ్వత్థామపై జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్వత్థామకు మరణశిక్ష విధించకుండా, అంతకంటే భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు పరమాత్ముడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తొలగించి, ఒళ్లంతా రక్తం, చీము కారుతున్న గాయాలతో, నిరంతర వేదనతో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా భూమిపై సంచరించాలని శపించాడు.పరిణామం... మరణం లేని అమరత్వం ఒక్కోసారి ఎంతటి నరకంగా మారుతుందో ఈ ఘటన నిరూపిస్తుంది. చేసిన కర్మల నుంచి, అధర్మం నుంచి ఎంతటి యోధుడైనా తప్పించుకోలేడని, ప్రకృతి నియమాలకు అందరూ లొంగాల్సిందేనని ఈ శాపం మనకు బోధిస్తుంది.నారద మహర్షి శాపం...ఒకానొక సందర్భంలో నారద మహర్షి మోహపాశంలో చిక్కుకున్న ప్పుడు, శ్రీమహావిష్ణువు ఆయనకు హితం చేయడం కోసం మాయా రూపంతో నారదుడిని పరీక్షించి విఫలుడిని చేస్తాడు. భంగపడిన నారదుడు తీవ్ర అవమాన భారంతో, విచక్షణ కోల్పోయి విష్ణుమూర్తినే శపిస్తాడు. తాను ఏ విధంగానైతే స్త్రీ విరహంతో బాధపడ్డాడో, అదే విధంగా విష్ణుమూర్తి కూడా భూలోకంలో మానవుడిగా జన్మించి, భార్యావియోగాన్ని అనుభవించాలని, కోతులే ఆయనకు సహాయం చేయాలని శపించాడు.పరిణామం... ఈ శాప ఫలితంగానే త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన పరమాత్ముడు... సీతాదేవిని కోల్పోయి, అరణ్యాలలో తీవ్ర విరహ వేదనను అనుభవించాడు. వానరుల సహాయంతో లంకపై దండెత్తాడు. దైవమైనా సరే, భక్తుని వాక్కును గౌరవించక తప్పదనే సత్యాన్ని ఈ కథ చాటిచెబుతుంది.గాంధారి శాపం...కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి దేవి దుఃఖం క్రోధంగా మారింది. ఈ సర్వనాశనానికి అంతటా ఉండి నడిపించిన శ్రీ కృష్ణు్ణడే కారణమని ఆమె భావించింది. భారతీయులందరినీ కాపాడగలిగే శక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపనందుకు... ఏ విధంగానైతే కౌరవ వంశం అంతమైందో, అదే విధంగా 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి కళ్లముందే యాదవ వంశం కూడా అంతర్గత కలహాలతో నశించిపోతుందని శపించింది.పరిణామం... గాంధారి శాపం వృథా పోలేదు. మౌసల పర్వం నాటికి యాదవులంతా ప్రభాస తీర్థంలో ఒకరినొకరు హింసించుకుని సర్వనాశనమయ్యారు. చివరికి శ్రీ కృష్ణుడు కూడా ఒక బోయవాడి బాణానికి చిక్కి, ఏకాకిగా అవతారాన్ని చాలించాల్సి వచ్చింది. ఒక తల్లి ఆక్రందన, దుఃఖం ఎంతటి శక్తిమంతమైనవో ఈ ఘట్టం వివరిస్తుంది.దుర్వాస మహర్షి శాపం...శకుంతల దుష్యంతుడి ప్రేమలో మునిగిపోయి, తన ఆశ్రమానికి వచ్చిన తపోధనుడైన దుర్వాస మహర్షిని గమనించకుండా అగౌరవపరుస్తుంది. తీవ్ర కోపిష్టిగా పేరొందిన దుర్వాసుడు ఆమె ప్రవర్తనకు ఆగ్రహించి శాపాన్ని ఇస్తాడు. ‘నువ్వు ఎవరి ధ్యానంలో మునిగిపోయి నన్ను నిర్లక్ష్యం చేశావో... ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోవు గాక!‘ అని శపించాడు.పరిణామం... దీనివల్ల దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మరచిపోతాడు. శకుంతల ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్షణ కాలపు చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎంతటి అగాధంలోకి నెడుతుందో, అలాగే అతిథి మర్యాద ఎంత ముఖ్యమో ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.వశిష్ఠుడి శాపం...దేవతలు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని పవిత్రమైన కామధేనువును అపహరించడానికి ప్రయత్నిస్తారు. త్రికాలజ్ఞాని అయిన వశిష్ఠుడు వారి తప్పును తెలుసుకుని తీవ్రంగా శపించాడు. దివ్యలోకంలో ఉండే అర్హతను కోల్పోయి, అష్టవసువులంతా భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించాడు.పరిణామం... ఈ శాపం వల్లే వసువులు గంగాదేవి గర్భాన జన్మించాల్సి వచ్చింది. వారిలో ఏడుగురిని గంగాదేవి పుట్టగానే నదిలో కలిపేసి శాపవిముక్తి కలిగించగా, ఎనిమిదో వసువు మాత్రం భూమిపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనే మహాభారతంలో అజేయ యోధుడిగా పేరొందిన ’భీష్మ పితామహుడు’. దేవతలైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ప్రాచీనగాథలలోని ఈ శాపాలు కేవలం శిక్షలు మాత్రమే కావు... అవి మనకు కొన్ని జీవితసత్యాలను బోధిస్తాయి. కోపం, అహంకారం, నిర్లక్ష్యం ఎంతటి వారినైనా పతనానికి నడిపిస్తాయని హెచ్చరిస్తాయి.మాట అనేది చాలా పదునైన ఆయుధం, దాన్ని ఉపయోగించేటప్పుడు వివేకం ఎంత అవసరమో ఈ కథలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. – పసుపులేటి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు -
సువార్త: జనసందోహం మధ్య యేసు..
యేసు ఎటు కదిలితే అటు జనం. జనం ఎక్కడో ఆయన అక్కడ కాదు. యేసు ఎక్కడో అక్కడే జనం. రాత్రి తప్పించి ఆయనకు ఏకాంతం అనేదే లేని పరిస్థితి. పగలంతా అవిశ్రాంత పరిచారకుడిగా దీనజనులు, రోగులు, వివిధ సమస్యల బాధితుల సేవలో తరించే యేసు సాయంసంధ్య, ప్రత్యూషం వేళల్లో ఎక్కువగాప్రార్థనలలో గడిపేవాడు.అధికసంఖ్యలో ప్రజలు తరలివస్తూ ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకొనుటలోను ఆయన్ను అనుసరించి వెంబడించుటలోనూ ఆనందించేవారు. సువార్త పాదయాత్రలలో ఆయన వెంట నడుస్తూ ఆయన నోటిమాటలు వినడానికి సామాన్య భక్త జనసమూహం ఎగబడడం వింతేమీ కాదు. ఎందుకంటే ఆయన అసాధారణ బోధలు, కార్యాలు అలాంటివి మరి.జనసందోహం ఆయన్ను చుట్టుముడుతూ కమ్మేస్తూ ఒక్కచోట వేలాదిగా, పదివేలకొలదిగా సమకూడడం చూస్తే ఆ రోజుల్లో అదే గొప్ప సంచలనం! దీంతో రాజులు, అధికారులు వణికేవారు. సామాన్యులు, పామరులు, సుంకరులు, పాపులు తదితరులు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరడంతో పాపుల స్నేహితుడు అనే ముద్ర ఆయనపై వేసారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు.ఎన్ని వెలివేతలు, కఠిన అంక్షలు విధించినా ఆయన్ను వెంబడించే ఈ విశేష బహు జనవాళిని చూస్తుంటే రోజురోజుకు పరిసయ్యుల కంటగింపు తారాస్థాయికి చేరుతుండేది. యేసుతో జనం లేకుండా చేయాలని వారు రోజూ అదే పనిగా అనేకనేక కుట్రాలోచనలు చేస్తుండేవారు. అయితే యేసు చేత లాజరు మృతులలో నుండి లేపబడుట ద్వారా పరిసయ్యుల నోళ్ళన్నీ ఒక్కసారిగా మూతలు పడ్డాయి. జనాన్ని కట్టుదిట్టం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వారు వెళ్లిపోయారు.‘ . . కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు – మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి’ – యోహాను 12 : 9,18,19.మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట ఆ దేవునికి అనుకోని యేసు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. సమాధిలో ఉన్న లాజరును పిలుస్తూ యేసు మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు కన్నులారా చూస్తూ ఆయనతో కూడా ఉన్న జనులు విస్తృతంగా ఈ సూచక క్రియను అంతటా ప్రచారం చేశారు. దీంతో యేసును పట్టుకొని చంపనాలోచించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పరిసయ్యులు.దేవుని ప్రణాళిక నిర్ణయం మేరకు యేసు మరణం, అట్టి సమయం ఇంకా రాలేదు. యూదులకు అప్పగించుటకు వారు దుష్టులచేత సిలువ వేయించుటకు అనగా దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి యేసు మొదట యూదులకు అప్పగించబడాలి. ఇక యేసు యూదులలో బహిరంగంగా సంచరింపక అరణ్య సమీపంలోని ఎఫ్రాయిము అను ఊరిలో కొన్నాళ్ళు ఉన్నాడు. అటు తరువాత మరల యేసు పస్కా పండుగకు ఆరురోజులు ముందుగానే బేతనియ గ్రామానికి వచ్చి మరియ మార్తల ఇంట బస చేశాడు.యూదులలో ఉన్న సామాన్యజనులు యేసు అక్కడ ఉన్నాడని తెలిసికొని యేసును చూచుటకు మాత్రమే కాక, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. అందుచేత ఆయన ఆ మహాత్కారం చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొనవచ్చారు. ఈ జనసందడిని చూస్తూ, మన ప్రయత్నాలన్నీ వ్యర్థం. మన ఆలోచనలు వృథా. ‘ఇదిగో లోకము ఆయన వెంటపోయింది’ అనుకుంటూ ఇలా పరిసయ్యులు తమ ఓటమి ఒప్పుకుంటూ వాపోయారు. జగమెరిగిన యేసు పాదయాత్రలలో దీనుల పాలిట దేవుని ప్రేమ అపారంగా కుమ్మరించబడింది. యేసు ప్రేమకు ఆ ప్రభావానికి లోనయి దాసోహం అయిన జన జీవితాలు ఆ రోజున ఆయన అడుగులో అడుగేస్తూ పులకించిపోయాయి. – జేతమ్ -
తల్లి పాదాల చెంతనే స్వర్గం..
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు ఒకరు వచ్చారు. ఎంతో ఆశగా, కాస్త గర్వంగా ప్రవక్తతో ఇలా అన్నాడు: ‘‘ప్రవక్తా! వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేయించాను. ఇంత కష్టపడ్డాను కదా, ఇప్పుడు మా అమ్మ రుణం తీర్చుకున్నట్లేనా?’’దానికి ప్రవక్త (స) ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆయన ఎంతో శాంతంగా, అంతే గంభీరంగా... ‘‘నువ్వు ఎంత చేసినా, మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు ఆ వేదన భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పారు.అదీ తల్లి స్థానం! మనల్ని నడిపించడానికి తన నడుము వంచి, మనల్ని పెంచడానికి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన మాతమూర్తి త్యాగానికి ఈ సృష్టిలో ఏదీ సాటిరాదు. ఏ భౌతిక సేవలు, ఏ సంపదలు ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేవు. పాలుపట్టిన తల్లికి... భుజంపై దుప్పటి పరిచిన ప్రవక్త! కన్నతల్లి ఎలాగూ ఆదరణీయురాలు, మరి పాలుపట్టి పెంచిన తల్లి స్థానమేమిటి? దానికి ప్రవక్త (స) తన జీవితం ద్వారానే ఒక అద్భుతమైన ఆదర్శాన్ని చూపారు.ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) తన సహచరులతో కలిసి ఏదో ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతలో అటుగా ఒక సామాన్య వృద్ధురాలు వచ్చింది. ఆమెను చూడగానే ప్రవక్త (స) ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారు. ఎంతో ఆ΄్యాయంగా ముందుకు వెళ్లారు. అంతటితో ఆగక, తన భుజంపై ఉన్న పవిత్రమైన దుప్పటిని తీసి నేలపై పరిచి, ఆమెను ఎంతో గౌరవంగా దానిపై కూర్చోబెట్టారు. వినయంతో, లాలిత్యంతో ఆమెతో మాట్లాడారు.ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఒక సహచరుడు... ‘ఈమె ఎవరు?‘ అని పక్కనున్న వారిని అడిగాడు. దానికి మరో సహచరుడు, ‘‘ఆమె ప్రవక్త (స)కు బాల్యంలో పాలుపట్టిన తల్లి దాయీ హలీమా’’ అని చెప్పారు. ప్రవక్త మాతృమూర్తి బాల్యంలోనే కన్నుమూయడంతో హలీమా ఆయన్ను సాకారు. కన్నతల్లి కాకపోయినా, కేవలం పాలుపట్టి పెంచినందుకే లోక గురువైన ప్రవక్త అంతగా తలవంచి గౌరవించడం... నేటి సమాజానికి ఒక కనువిప్పు.తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసే భారం ఒకెత్తయితే, ప్రసవ సమయం చావు అంచుల్లోకి వెళ్లి వచ్చే పునర్జన్మ. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్తాన్ని పాలుగా మార్చి పట్టే అమృతం... ఈ ముప్ఫై నెలల త్యాగమే ప్రతి మనిషి ఉనికికి పునాది. అందుకోసమే ఖుర్ ఆన్ ఒక చక్కని ్రపార్థనను మానవాళికి నేర్పింది. తల్లిదండ్రులను గౌరవించుకుందాం... వారి పాదాల చెంతే స్వర్గాన్ని వెతుక్కుందాం. – ముహమ్మద్ ముజాహిద్ -
వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా..
అది ఒక సరస్సు. ఆ సరస్సుకు రెండు వైపులా రెండు గ్రామాలు. ఆ సరస్సులో ఏడాది పొడవునా నీరు అతి వేగంగా పారుతుంటుంది. ఆ నీటి ప్రవాహవేగానికి ఎదురీది ముందుకు పోవడం అనేది చాలా కష్టం. అనా ఒకరిద్దరు ఆ నీటివేగం తమనేం చేస్తుందని చెప్పి సరస్సులో దిగి ప్రమాదంలో చిక్కుకుని బతుకుజీవుడా అంటూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి రెండు గ్రామాల ప్రజలెవరూ ఎదురీతకు సాహసించలేదు. అంతేకాదు, ఎవరికి వారు తామున్న గ్రామంలోనే సురక్షితంగా ఉండడానికి నిశ్చయించుకుని అలాగే ఉంటూ వచ్చారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య సంబంధాలూ ఉండేవి కావు. అలాగని శత్రుత్వమూ లేదు.ఒకరోజు, సరస్సుకు కుడివైపున ఉన్న పల్లెకు ఓ గురువు వచ్చారు. ఆయన సరస్సు ఒడ్డున నిల్చుని ఎడమవైపున ఉన్న పల్లె వంక చూశారు.‘‘నేను ఆ పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నారా గురువు.ఇంతలో ఓ పెద్దమనిషి ‘‘అది కష్టమండి’’ అని జవాబిస్తూ ‘‘నీటి ప్రవాహవేగం సామాన్యమైనది కాదు. అసలీ సరస్సులో ఈదాలనుకోవడమే చాలా కష్టం’’ అని అన్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. హెచ్చరిక చేశారు. అయినా ఆ గురువు వారి మాట పట్టించుకోలేదు.‘‘నీటి ప్రవాహవేగాన్ని ఓ కారణంగా చెప్పుకుని మీ రెండు గ్రామాల మధ్య సంబంధాలు పెట్టుకోకపోవడం సరికాదు. మీరందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దీనిపై ఓ వారధి నిర్మించుకోవచ్చు కదా?’’ అని జెన్ గురువు ఓ సలహా ఇచ్చారు.అయితే ఈసారి మరో ఇద్దరు ఒక్కసారిగా గొంతు కలిపి ఇలా చెప్పారు ‘‘బలే వారు స్వామీ, ఈ సరస్సులో ఈదడమే కష్టమనుకుంటుంటే దాని మీద వంతెన కట్టడమా...అది అసాధ్యం’’ అని అన్నారు.అయినా జెన్ గురువు ఆగలేదు. ‘‘అది సాధ్యమే’’ అని అన్నారు.‘‘నేను మీకందుకు సాయం చేస్తాను’’ అని ఆ గురువు వారికి హామీ ఇచ్చారు.ఏదో మాట చెప్పానని ఊరుకోకుండా ఆ జెన్ గురువు పల్లెలోని వంద మంది యువకులను ఎంపిక చేసారు. వంతెన నిర్మాణానికి పూనుకున్నారు.రాత్రీ పగలూ, ఎండా వానా అనేవేవీ లెక్కచేయకుండా ఆ వంద మంది యువకులతోపాటు జెన్ గురువూ శ్రమించారు. అనుకున్నట్టే ఆ సరస్సుపై ఓ వారధి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగాయి. రాకపోకలు పెరిగాయి. అంతేకాదు, ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఊరు అబ్బాయిని ఆ ఊరు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఇరు గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా కాలం గడుపుతున్నారు.ఓ ఏడాది గడిచింది. ఓ రోజు ఇరు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఊరు పొలిమేరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి తమ ఆనందానికి కారణమైన గురువును కలిశారు. నమస్కరించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం’’ అని ముక్తకంఠంతో చెప్పారు. కానీ గురువు తనకెలాంటి సన్మానమూ వద్దని సున్నితంగా తిరస్కరించారు.‘‘నాకు ఎలాంటి ఆడంబరాలూ వద్దు. పొగడ్తలూ వద్దు. ప్రచారమూ వద్దు. మీరందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ కలసి మెలసి ఉంటే అదే నాకు ఆనందం’’ అని చెప్పారాయన. – జగద్రేణు -
కన్నడ జానపద కథ: కెంకమ్మ దోసెలు
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అవ్వ ఉండేది. పేరు ‘కెంకమ్మ’. అవ్వ చాలా పేదది. కానీ దోసెలు మాత్రం అద్భుతంగా వేసేది. ఒక్క దోసె తింటే చాలు రెండు రోజులు ఆకలి వేయదు అనేవారు.అదే ఊరిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. దాని పేరు ‘బూతయ్య’. దానికి పని చేయడం చేతకాదు. కానీ దొంగతనంగా తినడం బాగా వచ్చు. రోజూ కెంకమ్మ ఇంటి దగ్గరికి వచ్చి ‘అవ్వా, ఆకలి’ అని అడిగేది. అవ్వ జాలితో ఒక దోసె పెట్టేది. నక్కకు ఆ రుచి నచ్చింది. ‘రోజూ ఒక్క దోసె ఏం సరిపోతుంది? అన్నీ కావాలి’ అనుకుంది.ఒకరోజు నక్క ఒక ప్లాన్ వేసింది. అవ్వ ఇంటి ముందు పడుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ‘అయ్యో! నా కాలు విరిగిపోయింది. నడవలేను‘ అని దొంగ డ్రామా చేసింది. కెంకమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘అయ్యో పాపం’ అని ఇంట్లోకి తీసుకెళ్లింది. కట్టు కట్టింది. వేడి వేడి దోసెలు, నెయ్యి, బెల్లం పెట్టింది. నక్కకు పండగే పండగ. మూడు రోజులు అక్కడే తిని పడుకుంది.నాలుగో రోజు అవ్వ చాపలు నేయడానికి బయటికి వెళ్లింది. ‘బూతయ్యా, తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండు’ అని చెప్పి వెళ్లింది. అంతే! నక్క లేచి ఒక్క గెంతు గెంతింది. వంటింట్లోకి వెళ్లి దోసె పిండి మూట, నెయ్యి డబ్బా, బెల్లం అన్నీ మూట కట్టుకుంది. పారిపోదాం అనుకుంది. కానీ కెంకమ్మ తెలివైనది. వెళ్లినట్టే వెళ్లి, కిటికీలోంచి చూస్తోంది. నక్క బయటికి రాగానే గబుక్కున దాని తోక పట్టుకుంది.‘ఎక్కడికి రా దొంగా? కాలు విరిగిందన్నావ్, ఇప్పుడు కుందేలులా గెంతుతున్నావ్?‘ అని నవ్వింది.నక్క సిగ్గుతో తల దించుకుంది. ‘అవ్వా, నన్ను క్షమించు. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను, దొంగతనం చెయ్యను’ అని బతిమిలాడింది. అవ్వ నవ్వి, ‘సరే, ఆకలితో ఉన్నావ్ కదా. పని చేస్తే దోసె పెడతా. నా పెరడులో బావి తవ్వు’ అంది. నక్క ఆ రోజు నుంచి పని చేసి, కష్టపడి తినడం నేర్చుకుంది. -
డాక్టర్ పట్టా అందుకున్న గిరిపుత్రిక!
చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు పొలంలో వ్యవసాయ పనులు చేసే లక్ష్మీ ప్రసన్న డాక్టరేట్ పట్టా అందుకుంది. పొలంలో చెమటలు చిందిస్తున్న ఆ చిన్నారిని చూసి భూదేవి... ‘చదువులో కూడా నువ్వు ఇలాగే కష్టపడాలి బిడ్డా’ అని ఆశీర్వదించిందేమో ఆదివాసి పల్లెలో పుట్టి పెరిగిన లక్ష్మీ ప్రసన్న ఎంతో కష్టపడి యూనివర్శిటీలో పీహెచ్డీ చేసింది. ఎంతోమంది ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిని ఇస్తోంది.తెలంగాణ రాష్ట్రం... మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో గట్టిగా వంద కుటుంబాలు కూడా ఉండని మారుమూల గ్రామం తాటివారివేంపల్లి. చుంచా పద్మ, లక్ష్మయ్యలకు ఇద్దరు కుమార్తెలు... లక్ష్మీప్రసన్న, మాధురి. ‘ఇద్దరూ కూతుళ్లే!’ అని ఎగతాళి చేసేవారు కొందరు. అలా హేళన చేసిన వారికి సమాధానం చెప్పాలని అనుకున్నారు పద్మ, లక్ష్మయ్య దంపతులు.లక్ష్మీప్రసన్న పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించింది. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ‘కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ’లో సీటు సాధించి ఇంటర్ చదివింది. 940 మార్కులు స్కోర్ చేసింది. అశ్వారావుపేట అగ్రికల్చర్ కళాశాలలో బీఎస్సీ చేసింది. అక్కడ 8.45 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిన లక్ష్మీప్రసన్న బెంగళూరులోని గాంధీక్రిష్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ సీటు సాధించింది.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా... లక్ష్యం సాధించాలి...'మారుమూల ఆదివాసీ గూడేలలో చదువుకున్నవారి సంఖ్య తక్కువ. పెద్ద చదువులు చదివిన వారు మరీ తక్కువ. చిన్ననాటి నుండి అమ్మానాన్నలు పెద్ద చదువులు చదవాలి అని చెప్పేవాళ్లు. వారిప్రోత్సాహమే నాకు బలాన్ని ఇచ్చింది. మా గ్రామం నుండి సమీప పట్టణాలకు వెళ్లాలంటే కాలినడకన కొంత దూరం నడిస్తే కానీ బస్సులు ఎక్కలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆడ బిడ్డలు చదవడం అంటే ఇబ్బందే. అయితే మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు మనకు అడ్డుగోడలు కావు. వ్యవసాయ శాస్త్రవేత్తగా చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు మాలాంటి గిరిజన, ఆదివాసీ గూడేల్లో ఉన్న ఆడపిల్లలు చదువులో రాణించడానికి, తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన సహకారం అందిస్తాను.' – చుంచ లక్ష్మీ ప్రసన్నతల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులువ్యవసాయ పనులలో అమ్మానాన్నలకు తోడు ఉండేది లక్ష్మీప్రసన్న. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, నాట్లు వేయడం, కలుపులు, కోతలు అన్ని పనులు చేసేది. ‘సాయిల్ సైన్స్ ఎన్విరాన్మెంట్’ అంశంపై సీనియర్ ఆచార్యులు డీవీ నవీన్ ఆధ్వర్యంలో పరిశోధన మొదలుపెట్టింది.భూసారం తగ్గడం, సేంద్రీయ ఎరువుల వినియోగం లేకపోవడం, రసాయన ఎరువులతో భూమి విషతుల్యం కావడం మొదలైన అంశాలపై పరిశోధన మొదలు పెట్టింది లక్ష్మి. పరిశోధనలో తన చిన్ననాటి అనుభవాలు బాగా ఉపయోగపడ్డాయి. లక్ష్మీప్రసన్న ప్రజెంట్ చేసిన పరిశోధన వ్యాసం చూసి శభాష్ అన్న ఆచార్యుల బృందం డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. కర్నాటక గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా తీసుకుంది లక్ష్మీప్రసన్న.– ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...!
నగరాల్లోని వీధుల్లో నడవడం అనేది కళాత్మక ప్రయాణం కూడా! షాపులపై రంగు రంగుల అందమైన బోర్డులు కనిపిస్తాయి. రంగు వెలిసిన బోర్డులు కూడా కొత్త అందంతో వెలిగిపోతుంటాయి. ఈ అందాలకు పుస్తక రూపం ఇచ్చింది పూజా సక్సేనా.దిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల్లోని మూడు వందల సైన్‌బోర్డ్‌లపై ఫొటోబుక్ తీసుకువచ్చింది పూజ.దిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల నుంచి పూజకు సైన్‌బోర్డ్‌లపై ఉన్న అందమైన అక్షరాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను డిజైన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేలా చేసింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో టైప్‌ఫేస్ డిజైన్‌ను స్టడీ చేసింది.ఈ ఫొటోబుక్లో దిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మండీ హౌజ్‌లోని శ్రీరామ్ సెంటర్ నుండి పహర్‌గంజ్‌లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ వరకు సైన్‌బోర్డ్‌లపై ఎన్నో భాషలలో అందమైన, అద్భుతమైన అక్షర శైలులు!దురదృష్టమేమిటంటే... దిల్లీలో కనువిందు చేసే అలనాటి సైన్‌బోర్డ్‌లు క్రమంగా మాయమవుతున్నాయి.సైన్బోర్ట్ల కోసం వీధులు చుట్టి రావడమే కాదు పాత ఆర్కైవ్స్ నుంచి ఫొటోలను సేకరించడం ప్రారంభించింది పూజ. ఆ ఫొటోలలో అలనాటి అందమైన సైన్బోర్ట్లు ఎన్నో కనిపిస్తాయి.ఫ్యూచర్ డాక్యుమెంటేషన్‌లో భాగంగా భువనేశ్వర్, సౌత్ గోవా, కోయంబత్తూరు, మీరట్... లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటోంది పూజా సక్సెనా. -
ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి?
ఎన్నో దేవతా స్తోత్రాలున్నాయి. ప్రతిదీ నిత్యం పారాయణ చేయాలని చె΄్తారు. కానీ రోజూ అన్ని పారాయణ చేయడం సాధ్యం కావడం లేదు. మరి వాటిని నిత్యపారాయణ చేయకపోవడం పాపం కదా? పైగా ఇన్నిన్ని స్తోత్రాలు ఎందుకు? – ఆర్. కౌసల్య, చిలకమర్రి, నల్గొండ జిల్లాజ: అన్ని స్తోత్రాలు పారాయణ చేయడం నిత్యమూ సాధ్యం కాదు. అలాగని అవి ఎందుకు? అని ప్రశ్నించరాదు. బజారులో బోలెడన్ని కూరగాయలుంటాయి. అన్నీ రోజూ తినలేం. అలాగని ఇన్నిన్ని ఎందుకు? అంటామా?ఎవరి అవకాశాన్ని, అభీష్టాన్నీ బట్టి నిత్యం సాధ్యమైన వాటినే అనుష్ఠించవచ్చు. రోజూ విందుభోజనం చేయలేం కదా! ఏ పండగకో పబ్బానికో విందునారగించినట్లు తీరిక దొరికిన వేళ సావకాశంగా స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఏదేమైనా – ఆనందంగా భక్తిగా వాటిని పఠించాలే తప్ప, తప్పనిసరి కృత్యంగా మొక్కుబడి వ్యవహారంగా తలచరాదు.నిత్యం మన అవకాశాన్ని బట్టి ఆహారం తిన్నట్లే, స్తోత్రమో, జపమో పరిమితమైన అనుష్ఠానం అవసరం. ఆయా దేవతలకి నిర్దేశించిన వారాలలో, తిథులలో, పర్వదినాలలో ఆయా స్తోత్రాలను నిదానంగా పఠించుకోవచ్చు. ఔషధశాలలో మందుల వలె వివిధ ప్రయోజనాలకోసం, వివిధ స్తోత్రాలుంటాయి. కొన్ని ఆరోగ్యం కోసం, కొన్ని దారిద్య్ర నివారణ కోసం...ఇలా! వాటిని ఆయా లక్ష్యాల సిద్ధికోసం వినియోగించుకోవచ్చు.ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి? – గుంటుక శకుంతల, హైదరాబాద్ఉదయం వేళ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది.హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. ‘‘ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా’’ విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః’’ – ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. -
యముడి అపరాధ ఫలమే విదురుడి జన్మ!
మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు.రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సు కొనసాగించారు.ఒకరోజు రాత్రి కొంతమంది మహాఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాండవ్యుని చూసి ‘‘మహానుభావుడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు?’’ అని ప్రశ్నించారు. అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని. అందుకు ఎవరినీ నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని కిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి ΄ోయింది. ఆ తరువాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో ‘మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు’ అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో ‘పద్నాలుగేళ్ళ వరకూ పిల్లలు ఏమి చేసినా తెలియక చేస్తారు.అందువల్ల ఇక మీదట పద్నాలుగేళ్ళలోపు బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు మానవ గర్భంలో జన్మించెదవు కాక’ అన్నాడు. ఆ శాప ఫలితమే వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టినట్లు మహాభారత గాథ ద్వారా తెలుస్తుంది. – డి.వి.ఆర్. -
లిటిల్స్ కు బుద్ధ స్టోరీస్
‘సకల సౌకర్యాలూ ఉన్నాయి. మనఃశాంతి లేదు’ ‘ఎంత ప్రయత్నించినా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను’ ‘చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటాను’‘ఆత్మన్యూనతతో ఏ పనీ చేయలేకపోతున్నాను’... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వినబడుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు వ్యక్తిత్వ వికాసనిపుణులు, మోటివేషనల్ స్పీకర్స్ మాటల్లోనే వెదుక్కుంటాం. అయితే బుద్ధుడి కథల్లో ఎన్నో సమస్యలకు, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పిల్లలతో చదివిస్తే... నైతిక విలువలతో కూడిన వారి భవిష్యత్‌కు ఆ కథలు పునాదిగా పనిచేస్తాయి. మచ్చుకు కొన్ని కథలు...సూత్రాలు కాదు... స్ఫూర్తి ముఖ్యంబుద్దుడు తన శిష్యుడితో కలిసి దట్టమైన అడవి గుండా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. వారికి ఎదురుగా ఒక నది వచ్చింది. వారు నదిలోకి అడుగుపెట్టబోతుండగా ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి నది దాటడానికి సహాయం చేయాల్సిందిగా వేడుకుంది. బుద్ధుడు క్షణం కూడా సంకోచించకుండా ఆ యువతిని తన వీపుపై ఎత్తుకొని నదిని దాటాడు. ఆ తరువాత... తనను వేధిస్తున్న ప్రశ్నను బుద్ధుడిని అడిగాడు శిష్యుడు....‘ఓ మహర్షి! మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం. అయినా మీరు ఆ స్త్రీని మీతోపాటు నదిలోకి తీసుకెళ్లారు. ఇది మన సూత్రాలకు విరుద్ధం కాదా?’బుద్దుడు నవ్వి ఇలా అన్నారు: ‘కుమారా! నేను అవసరంలో ఉన్న తోటి మనిషికి సహాయం చేయడానికి ఆ స్త్రీని ఒడ్డున వదిలి పెట్టాను. నువ్వే ఆమెను ఇంకా నీ మనసులో మోస్తున్నావు’ చివరకు శిష్యుడు గ్రహించాడు. దీక్షలోని పదాలు ముఖ్యం కాదు అందులోని స్ఫూర్తి ముఖ్యం అని. మనకు ఉండే భౌతిక భారం కన్నా మన ఆలోచనలే పెద్ద భారం అని.వజ్రాల కంటె విలువైన సందేశంఒక శిష్యుడు బుద్దుడి దగ్గరకు వచ్చి ‘పేదరికంతో విసిగివేసారి పోయాను. నాకు సంపద కావాలి’ అన్నాడు. అప్పుడు బుద్దుడు ‘ఈ చెట్ల వరుసను చూడు. ప్రతి చెట్టు కింద ఒక నిధి పెట్టె పాతిపెట్టి ఉంది. నువ్వు దానిని తీసుకొని ధనవంతుడివి కావచ్చు’ అన్నారు. ఆ శిష్యుడు చాలా సంతోషించి తవ్వడానికి సిద్ధమయ్యాడు. మొదటి చెట్టును తవ్వడం మొదలు పెట్టిన కొద్దిసేపటికి వెండి ఉన్న నిధి పెట్టె దొరికింది.అతను కాసేపు ఆలోచించి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండవ చెట్టు కింద తవ్వగా బంగారంతో నిండిన ఒక పెట్టె దొరికింది. అతడు కాసేపు ఆలోచించి ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టుకింద ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అతి పెద్ద పెట్టె ఉంది. తన జీవితంలో ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు అందులో ఉన్నాయి. అయినా, అతనికి ఇంకా కావాలనిపించింది.చివరి చెట్టు దగ్గరికి వెళ్లి తవ్వాడు. అతడికి ఆశ్చర్యం కలిగేలా ఒక చిన్నపెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఇలా రాసి ఉంది...‘అవకాశాలు నీ దారిలోకి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు అందిపుచ్చుకోవచ్చు. కానీ మితిమీరిన దురాశ ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది’ ఈ సందేశంతో శిష్యుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడూ దురాశకు లోనుకాలేదు.యానిమేటెడ్ కథలుబుద్ధుడి కథలు యానిమేటెడ్ వీడియోల రూపంలో యూట్యూబ్‌లో ఉన్నాయి. ‘మ్యాజిక్‌బాక్స్ ఇంగ్లీష్ స్టోరీస్, ‘గీతాంజలి–కార్టూన్ ఫర్ కిడ్స్’... మొదలైన యూట్యూబ్ చానల్స్‌లో బుద్ధ స్టోరీస్ ఫర్ కిడ్స్ విభాగాలు ఉన్నాయి. లిటిల్ బుద్ధ: ఏ పీస్ఫుల్ జర్నీ, బుద్దా’స్ లెస్సన్స్, 28–లైఫ్ చేంజింగ్ బుద్దిస్ట్ స్టోరీస్(దట్ విల్ రీషేప్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్), ది బుద్ధ అండ్ ది హోమ్‌లెస్ మ్యాన్ స్టోరీ, లెజెండ్ ఆఫ్ బుద్ద...ఇలా ఎన్నో యానిమేటెడ్ వీడియోలు (యూట్యూబ్)లో, బుద్ధ విజ్డమ్ స్టోరీస్, బుద్ధ మోటివేషన్ స్టోరీ... మొదలైనవి ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి.శంకర ‘మంచి కథలు’తెలుగులో రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే పుస్తకం...అమరావతి కథలు. సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు పెద్దలకే కాదు పిల్లలకూ బాగా నచ్చుతాయి. ఈ పుస్తకంలో ‘కానుక’ అనే అద్భుతమైన కథ ఉంది. రాకుమారుడు బుద్దుడై తిరిగి వచ్చిన నాటి కథ ఇది. ‘మంగళ వాద్యాలు మోగాయి. వీథుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అల్లడుగో బుద్దుడు! అల్లదే వెలుగు! వీథుల నిండా వెన్నెల!’ ‘రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట!’‘అంత సుకుమారుడు అడవుల ఏ ఎండకాసెనో, ఏ వాన తడిసెనో, ఏ ముళ్లబాట నడిచెనో, ఏ కసరుకాయ కొరికెనో...’ ‘రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్నకిరీటం లేదు. మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వుతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది’.. ఇలాంటి వాక్యాలెన్నో మనసుకు హత్తుకుపోతాయి. మనస్సుకు కొంత సమయం ఇవ్వు!ధ్యానం ముగిసిన తరువాత బుద్దుడి దగ్గరకు వచ్చిన ఒక శిష్యుడు ఆయనతో ఇలా అన్నాడు... ‘ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది. వృద్ధురాలైన మా తల్లిని చూసుకోవడానికి మా అన్న తిరస్కరిస్తున్నాడు. అతనికి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు’ శిష్యుడు చెప్పింది విన్న బుద్దుడు... ‘దయచేసి దగ్గరలో ఉన్న చెరువు నుండి నా కోసం గిన్నెడు నీళ్లు తీసుకురాగలవా?’ అని అడిగారు. అతడు వెంటనే చెరువు దగ్గరికి వెళ్లాడు. అక్కడ కొన్ని జంతువులు చెరువును దాటి వెళ్లడం వల్ల నీళ్లు మురికి అయ్యాయి. ఆ శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి ‘చెరువు నీరు తాగడానికి యోగ్యంగా లేవు’ అని చెప్పాడు. ‘మనం ధ్యానం చేద్దాం’ అన్నాడు బుద్దుడు. కొద్దిసేపటి తరువాత...శిష్యుడిని నీళ్లు తీసురమ్మని అడిగాడు బుద్దుడు. చెరువు దగ్గరికి వెళ్లాడు శిష్యుడు. నీళ్లు స్వచ్ఛంగా ఉండడంతో బుద్ధుడికి ఈసారి నీళ్లు తీసుకురాగలిగాడు. నీళ్లు తాగిన బుద్దుడు ఇలా అన్నాడు... ‘నీ మనసు ఒక చెరువులాంటిది. నీకు కోపపూరితమైన ఆలోచనలు వచ్చినప్పుడు బురద నీళ్లలాగే మనసు కూడా నిరూపయోగకరంగా మారుతుంది. మనస్సుకు కొంత సమయం ఇవ్వు. కోపం శాంతించనివ్వు. అప్పుడు నీ మనస్సే నీకు సమాధానం ఇస్తుంది’ -
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్‌లను సర్క్యూట్ రేసింగ్‌లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్‌లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్‌ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్‌లో మరింత స్కిల్‌ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్‌ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
పది కూడా పాసవ్వని వ్యక్తి పాఠాలు బోధించడం ఏంటని అనిపిస్తుంది కదూ. కానీ ఈ వ్యక్తి చెబుతున్న తీరు చూస్తే..ఆశ్చర్యంకలగక మానదు. ఆర్థిక పరిస్థితులు తనను ఆపేయొచ్చేమో కానీ..తనలోని ఆసక్తి, ప్రతిభని ఆపలేవని, అవి ఏదో రకంగా బయటకు ఉప్పొంగుతాయని చూపించాడు. చుట్టూ ఉన్నవాళ్లు పది పాస్సవ్వలేదని ఎగతాళి చేసినా..తగ్గలేదు, ఆగిపోలేదు. ఇవాళ ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటం విశేషం.అతడే బీహార్‌కు చెందిన కూరగాయల విక్రేత రోహిత్ కుమార్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. అయితే అతడు కళాకారుడుగా ఉండాలనేది ఆకాంక్ష..అయితే ఆర్థిక ఇబ్బందులు ఆ కలను దూరం చేశాయి. అతడి తల్లి ఆవు పిడకలు అమ్ముతూ..ఇంటిని నడిపించేది. ఇక రోహిత్ ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. అలా చేస్తున్నప్పుడూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించి నలుగురు విద్యార్థులతో ఓ చిన్న తరగతి గదిని ప్రారంభించాడు. ఆ గది ఇప్పుడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు నడుస్తోంది. ప్రస్తుతం అతడి వద్ద వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ. 125లు వసూలు చేస్తున్నాడు. అతడు పది కూడా పాసవ్వకుండా ఇలా ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నందకు అంతా ఎగతాళి చూస్తున్నా..కుమార్ మాత్రం దృఢ నిశ్చయంతో..సాధారణ సైన్స్ పాఠాలతో ఆ చిన్నారులను ఆకట్టుకున్నాడు, వారి మనసులను గెలుచుకున్నాడు. అయితే దీన్నంతటిని రికార్డు చేసి అతడి విద్యార్థులు ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన జోహో మాజీ సీఈవో శ్రీధర్ వెంబు ఇలా రాశారు పోస్ట్‌లో. దీన్ని చూస్తుంటే..భారత్ పట్ల గర్వం ఆశావాదం కనిపిస్తోంది. బీహార్‌లోని సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన ఈ పిల్లలందరూ, గణితం, సైన్స్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశ భవిష్యత్తును నిర్వచిస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా అతని ప్రయత్నానికి మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం అని రాశారు. నెటిజన్లు కూడా రోహిత్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ప్రతిభ ప్రతిచోటా ఉంటుందని, కానీ అవకాశం దాన్ని చేరుకోవడమే అత్యంత కీలకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు మార్కులు ఎప్పటికీ మన విజయాన్ని నిర్ణయించలేవు అని పోస్టలు పెట్టారు. He once struggled to pass Class 10. Today, 1,000 students climb to his rooftop classroom at 5 a.m. 💛 From charging ₹125 and teaching four children to building a movement that challenges rote learning, Rohit Kumar turned doubt into determination. His mother once sold cow dung… pic.twitter.com/HCHPbzzjOn— Comman Man (@CommanMan777589) February 14, 2026 (చదవండి: కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..) -
రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్‌స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ప్రేరణ నిచ్చిన సినిమా ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్‌పాత్‌పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్‌తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో భార్య అనిత తోడుగారాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు. -
ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి. వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది.‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్ల ఆర్డర్‌ను డెలివరీ చేయడం లేదు. ఇన్‌స్పిరేషన్‌ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
డిప్యూటీ కలెక్టర్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..
అతడి డ్రీమ్ ఆకాశమంత..కానీ కుటుంబ నేపథ్యం ప్రకారం అంత ఈజీ కాదు. అయినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆహర్నిశలు కష్టపడి అనుకున్నది సాధించి తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. నాడు డెలివరీ బాయ్ అనిపిలిచినవాళ్లే..గౌరవంతో లేచినిలబడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అతడి ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం.అతనే జార్ఖండ్(Jharkhand)కి చెందిన సూరజ్ యాదవ్(Suraj Yadav). అతడి తండ్రి సాధారణ మేస్త్రీ. అతడి కుటుంబం తరుచుగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతుండేది. కానీ ఈ పరిస్థితలు ఎలా ఉన్నా అతడి కల మాత్రం ఆకాశమంత పెద్దది పెట్టుకున్నాడు. అయితే అతడు జీవనోపాధి కోసం తన స్నేహితులు సాయంతో సెకండ్‌హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి ఫుడ్ డెలివరి ఏజెంట్‌గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇక అతడి సోదరి ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అతడి స్నేహితులు, భార్య భావోద్వేగ పరంగా మద్దతిస్తూ ప్రోత్సహించేవారు. పగలంతా ఈ ఉద్యోగాలతో తన శరీరం ఎంతలా అలిసిపోయి విశ్రాంతి కోరేదో తనకే తెలుసనని, అయితే తన డ్రీమ్ తనని బలంగా ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చాడు. అలా సూరజ్ ఎనిమిదేళ్ల కష్టానికి ఫలితంగా..జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో ఉత్తీర్ణుడై..110వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్(Deputy Collector)గా నియమాకం పొందాడు. ఇక ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్లకి తన డెలివరీ ఉద్యోగం సమయ నిర్వహణను, లాజిస్టిక్స్‌కి సంబంధించిన విలువైన పాఠాలు నేర్పించిందని వివరించి మెప్పించాడు. నిర్వాహకుడిగా తనకు సహాయపడ్డ ఈ నైపుణ్యాలే తన ఉద్యోగంలో తనకెంతగానో తోడ్పడతాయని కూడా ఆత్మవిశ్వాసంగా చెప్పాడు. ఇక సూరజ్ ఈ విజయం అందుకున్న వెంటనే చాలా భావోద్వేగంగా అనిపించిందని, ఈ విషయం తన భార్యతో ఫోన్లో చెప్పిన వెంటనే తనివితీర ఏడ్చేశామని ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. ఎనిమిదేళ్ల వివాహ అనంతరం తమ కలలన్నీ నిజమవుతున్న వేళ అని చాలా ఆనందంగా చెప్పుకొచ్చాడు సూరజ్. అంతేగాదు ఇంతకుముందు అందరూ స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy Delivery Boy) అనిపిలిచేవారు కానీ ఇప్పుడూ డిప్యూటీ కలెక్టర్‌గారు అని గౌరవంగా పిలుస్తారని సగౌర్వంగా చెప్పాడు. ఇక తాను చేసిన రెండు ఉద్యోగాలు చాలా అమూల్యమైన పాఠాలు నేర్పించాయని, ఒకటి మనగడ ఎలా అనేది, మరొకటి సేవ చేయడం ఎలాగో తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ సూరజ్ కథ దృఢ సంకల్పం గురించే కాదు ఏ పనైనా చులకనగా కాదు నిబద్ధతతో చేస్తే..సక్సెస్‌కి మార్గం ఏర్పడుతుందని చాటి చెప్పాడు.(చదవండి: ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..) -
స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..
స్వేచ్ఛా జీవితం అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం మాత్రమే కాదు తమ అభిరుచులను కూడా నైపుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం అంటోంది నేటి యువత. తమ భావి జీవన నిర్మాణాన్ని బాధ్యతగా మలుచుకోవడమూ దేశభక్తే అని చెబుతోంది. వివిధ రంగాలలో రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు. ముంబైలో ఉంటూ నటిగా, మోడల్‌గా నిరూపించుకుంటోంది దియా సీతేపల్లి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ, జెండర్ ఈక్వాలిటీకి కృషి చేస్తోంది ఢిల్లీ శ్రీరామ్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న శ్రీహిత. ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన కాకినాడ శ్రీదేవి సైకాలజీ చేస్తానంటోంది. డిగ్రీ చేస్తూ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంటున్న హరిణి, క్యారమ్స్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించి, యూకే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హుస్నా సమీర.. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతటి కష్టమైనా...జూనియర్ ఇంటర్ టైమ్‌లోనే మోడలింగ్ ఫ్రీలాన్స్ చేశాను. ఏజెన్సీతో కలిసి పనిచేశాను. హైదరాబాద్‌లోని లేడీస్ బ్రాండ్స్‌కి మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద బాగా ఇష్టం. లాక్డౌన్ టైమ్‌లో ‘ప్రేమకథ’ సినిమా చేశా. తమిళ సినిమాకు వర్క్ చేశాను. ముంబైలో ఉంటూ మోడలింగ్‌గా నా కెరియర్ను కొనసాగిస్తున్నాను. ఆడిషన్స్ చేస్తుంటాను. నా ఇష్టాన్ని అమ్మనాన్నలు కాదనలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముంబై వంటి మహానగరంలో మనవాళ్లు ఎలా నిలదొక్కుకుంటారు, అమ్మాయిలు కదా... లాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే. మన వర్క్‌ని ఎంత బెస్ట్‌గా ఇవ్వగలుగుతున్నాం అనే దానిపైన దృష్టి ఉండాలి. సక్సెస్ కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. – దియా సీతేపల్లి, నటి, మోడల్అభిరుచులకు మద్దతుక్యారమ్స్లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ రికార్డ్ సాధించాను. యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కాలీగ్రఫీ, మ్యాథమేటిక్స్‌లో అవార్డులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. వ్యాపారవేత్తగా రాణించాలని, క్యారమ్స్‌లోనూ మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తున్నాను. నా ఇష్టాలకు, అభిరుచులకు అమ్మనాన్నలు చాలా సపోర్ట్ నిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇలా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి వారిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. – హుస్నా సమీరజెండర్ ఈక్వాలిటీకి కృషినేను టెన్త్ క్లాస్‌లోనే శాస్త్రీయ నృత్యంలో సర్టిఫికెట్స్ తీసుకున్నాను. కూచిపూడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. మ్యాథ్స్, సైన్స్ వైపు కాకుండా పొలిటికల్ సైన్స్ వైపు వచ్చాను. యూపీఎస్సీలో ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. ఢిల్లీ శ్రీరామ్ కాలే జ్ ఫర్ ఉమెన్‌లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తున్నాను. కాలేజీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఎడిటోరియల్ టీమ్‌కు సబ్ హెడ్‌గా ఉంటూనే, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్‌లో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తున్నాను. ఒక లక్ష్యంతో పాటు అభిరుచికి తగిన స్కిల్‌ను నేర్చుకోవాలి. అంతేకాదు సమాజానికి మన వంతు భాగస్వామ్యాన్ని, సేవను అందించాలి. అందుకు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. – శ్రీహిత నీలి మల్టిపుల్ స్కిల్స్ మస్ట్స్కూల్ టైమ్‌లోనే హిందీ పండిట్ కోర్సు చేశాను. సంగీతం అంటే ఇష్టం ఉండటంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, సంగీత విశారద డిగ్రీ కోర్సు పూర్తిచేశాను. వాలీబాల్ స్టేట్‌లెవల్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఈమధ్య బీటెక్ అవుతూనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. కర్ణాటక సంగీతంలో కచేరీలు ఇస్తుంటాను. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో అక్కడ కచేరీలో పాల్గొన్నాను. మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటాను. జాబ్ చేస్తూనే సింగర్‌గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పడు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నాను. సాంకేతికపరంగా ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక చదువు మాత్రమే ఉంటే సరిపోదు. ఇలా విభిన్న రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచులను కూడా స్కిల్స్గా డెవలప్ చేసుకుంటే మన వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. లైఫ్ అంతా ఉపయుక్తంగా మార్చుకుంటూ వెళితే చాలా హ్యాపీగా ఉంటాం. – హరిణి ఆనంద్ చెరుకూరిసైకాలజీ స్టార్‘కోర్టు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ చేస్తున్నాను. జూనియర్ ఇంటర్ పూర్తయ్యింది. సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. జెన్ జి తరం చాలా ఆందోళన, డిప్రెషన్‌తో లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు. అందుకే, సైకాలజీ చేసి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్సను అందించాలనుకుంటున్నాను. డ్యాన్స్, కుకింగ్ నా ఫేవరేట్స్. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. రీల్స్ చేయడం ద్వారా పేరొచ్చింది. మూవీలో అవకాశం వచ్చింది. అమ్మ ఓకే అంది. అలా జాలీగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటాను. – కాకినాడ శ్రీదేవి, నటి (చదవండి: -
ఆదర్శం అంటే...
‘‘ఇది చేయాలనుకొంటున్నాను, అది చేయాలను కొంటున్నాను.’’ అని అంటూ ఉంటారు చాలా మంది. ఒక సారి చేసిన తరవాత చేయాలి అనుకోటానికి అవకాశం కానీ, అవసరం కాని ఏముంది? జీవితంలో ఫలానాది సాధించటం నా ఆదర్శం, ఎప్పటికైనా నేను ఆ విధంగా అవాలి అనుకుంటున్నాను – ఇటువంటి మాటలు యువత నుండి తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే, ఆ విధంగా ఉండటం వారికి ఇష్టం. కాని, ఉండే ప్రయత్నం మాత్రం చేయరు. వారికి ఏదైనా కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయాలి. దానికి శ్రమ పడేది తాము కాదు కదా! అమ్మనో, నాన్ననో సతాయించి సాధించుకుంటారు. తాము చేయవలసిన వాటిని ఆదర్శం పేరిట గోడ మీద రాస్తారు ‘‘రేపు’’ అని. ఆ రేపు ఎప్పటికీ రాదు. వెళ్ళిపోయింది నిన్న. వచ్చి మనకి అందుబాటులో ఉన్నది ఈ రోజు. ఆచరించాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా మొదలు పెట్టాలి అంటే – ఇప్పుడే, ఈ క్షణమే సరి అయింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు వీలైనప్పుడు అనుకుంటే కుదరదు. ఎందుకంటే బద్ధకించే వారికి వాయిదా వేయటానికి ఏదో ఒక వంక దొరుకుతుంది. అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అని ఒడ్డున కూర్చొన్నట్టు ఉంటుంది. అంటే ఆదర్శాలు ఉండకూడదా? అనే ప్రశ్న వస్తుంది. ఉండాలి. చిన్న పిల్లవాడికి ఐఏఎస్ అవాలన్నది ఆదర్శం. ఈ క్షణాన అవలేడు కదా! దానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా శిక్షణ తీసుకోవాలి. ఇప్పటినుండి ఎందుకు? డిగ్రీ అయినాక చూద్దాం, అనుకుంటే కుదరదు కదా! ఆదర్శం వాస్తవంగా మారటానికి తగిన కృషి చేయాలి. ఉన్నతమైన ఆదర్శాలు ఉండటం మంచిదే. నిజానికి ఉండాలి కూడా. ఆదర్శాలు వల్లెవేయటానికి బాగుంటాయి కాని, అవి ఆకాశ హర్మ్యాలు కాకూడదు. తన శక్తి సామర్థ్యాలకు తగినట్టు ఉండాలి. మృత్యువును జయించటం, బొందితో స్వర్గానికి వెళ్ళటం వంటి అసాధ్యమైనవి సాధించటం నా ఆదర్శం అనటం హాస్యాస్పదం. అవి సాధించటం కుదరదు కనుక ప్రయత్నం చేయటం వృథా అని మానేయటానికి ఒక వంక చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అద్దాన్ని ఆదర్శం అంటారు. ఆదర్శాలు అద్దం లాంటివి. దానిలో ప్రతి బింబాలు మాత్రమే కనపడతాయి. బింబం కాదు. అయితే, ప్రతిబింబం బింబాన్ని సరిచేయటానికి పనికి వస్తుంది. చెదిరిన బొట్టు దిద్దుకోటానికో, చెరిగిన జుట్టుని సద్దుకోటానికో అద్దంలోని ప్రతి బింబం సహాయం చేస్తుంది. అందులో చూసి ముఖాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతిబింబంలో సరి చేయటం కుదరదు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెడితే ముఖం మీదకి రాదు కదా! రాసి పెట్టుకున్న ఆదర్శాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ఆచరణ ముఖం లాంటిది. అక్కడ చూస్తూ ఇక్కడ తగిన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆదర్శాలని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆదర్శం వ్యక్తులు అయితే వారి వలె ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ స్థాయికి రావటానికి వారు ఏవిధంగా శ్రమించారో దానిని ఆదర్శంగా తీసుకోవాలి కాని, ఇప్పుడు వారు అనుభవిస్తున్న సుఖాన్ని, వైభవాన్ని కాదు. దురదృష్టవశాత్తు చాలామంది రెండవ దానినే ఆదర్శంగా తీసుకోవటం జరుగుతోంది. ఆదర్శం ఆచరణగా పరిణమించాలి. ఆదర్శాలను వాస్తవాలుగా పరిణమింప చేసుకోటానికి శక్తి మేరకు కృషి చేయాలి. ఒకవేళ అది ఫలించక పోయినా పరవాలేదు. ప్రయత్నం ప్రధానం. తన ఆదర్శాన్ని సాకారం చేయటానికి జీవిత మంతా వెచ్చించారనే ఖ్యాతి మిగులుతుంది. – డా.ఎన్. అనంతలక్ష్మి -
విద్య.. వైద్యం.. 22 సూత్రాలు
కరీంనగర్: ఆమె ఆలోచనలు వినూత్నం.. కార్యాచరణ విభిన్నం.. విద్యార్థులకు గురువులా.. అనాథలను అమ్మలా ఆదరిస్తున్నారు. కలెక్టర్‌గా కరీంనగర్ జిల్లా అభివృద్ధితోపాటు భవిష్యత్ తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని 22 రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు కలెక్టర్ పమేలా సత్పతి. బాలికల సాధికారత.. సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్‌గా జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిని సారించారు. కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి (Pamela Satpathy) చేస్తున్న పనులపై ప్రత్యేక కథనం. ఏబీసీ ఆఫ్లైఫ్ రైమ్ పిల్లలకు ఏ నుంచి జెడ్ వరకు 26 విలువలను సరదాగా, సంగీతం ద్వారా అవగాహన కల్పించే వినూత్న విద్యాసాధనం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో దృశ్యరూపకం రూపొందించి ప్రదర్శిస్తున్నారు. 2025 మే 6న లక్నోలో జరిగిన 10 రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఇచి్చన నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో ఈ రైమ్ ప్రదర్శించారు. » స్నేహిత అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల్లో విద్య, నైపుణ్యత, సాధికారత గురించి వివరిస్తున్నారు. సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడమే స్నేహిత లక్ష్యం. » బ్రిక్స్ టు బుక్స్.. దీని ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన 500 మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించారు. ఈ పిల్లలకు ఇటుక బట్టీల యజమానులను గార్డియన్లుగా ఉంచి.. వారి ద్వారానే విద్యార్థులకు రెండు జతల ట్రాక్ సూట్లు, బ్లేజర్, రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి విద్యార్థికి 3 జతల చొప్పున మొత్తం 22,033 జతల షూలు, 66,099 జతల సాక్స్ పంపిణీ చేశారు. » గత నాలుగైదేళ్లుగా ఎస్ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థుల పరీక్ష రుసుం చెల్లించారు. వ్యక్తిగతంగా మార్గనిర్దేశనం చేయగా 483 మందిలో 432 మంది 2024 జూన్‌లో జరిగిన అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరై 418 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారిలో 2025 మార్చిలో 13 మంది పాస్ అయ్యారు. » విద్యావాహిని–బడి బాట.. ద్వారా కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో విద్యావాహిని ద్వారా వేసవి సెలవులలో బడిబాట నిర్వహించారు. దీని ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 7,642 (58.18శాతం) మంది విద్యార్థులు పెరిగారు. ‘విద్యావాహిని కరీంనగర్’ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యాసంబంధిత, ప్రేరణ, సృజనాత్మక అంశాలను అప్లోడ్ చేస్తున్నారు. » వాయిస్ ఫర్ గరల్స్.. బాలికల సామాజిక జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. చిన్న వయసులో పెళ్లి, చదువు మానేయడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం. » కాన్షియస్నెస్ క్లబ్స్.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగించడం దీని ఉద్దేశం. ఈ క్లబ్లో ఇద్దరు టీచర్లు, తల్లి లేదా తండ్రి, విద్యారి్థ, ఎక్సైజ్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. » టెడ్ ఎడ్ టాక్స్... రాష్ట్రంలో మొదటిసారిగా గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాధికారత కోసం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పారమిత విద్యాసంస్థల సహకారంతో టెడ్ టాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన 300పైగా విద్యార్థులు మండల స్థాయిలో పోటీపడి.. జిల్లా స్ధాయికి చేరిన 40 మంది నుంచి 20 మందిని ఎంపికచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థుల టెడ్ ఎడ్ ప్రసంగాలు రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. న్యూయార్క్‌లోని టెడ్ ఎడ్ ప్రధాన కార్యాలయం ప్రచురించింది. జూన్ 25న మరో నలుగురు విద్యార్థులు వారి టెడ్ ఎడ్ ప్రసంగాలు చేశారు. ఈ టెడ్ ఎడ్ టాక్స్ లైసెన్స్‌ను జంగపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్ పొందాయి. ఈ కార్యక్రమం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందుతూ 2024–25 విద్యాసంవత్సరంలో 4,831 ఉన్న విద్యార్థుల నమోదు కాగా 2025–26లో 6,393కు చేరింది. గణిత ఒలింపియాడ్స్ » జిల్లాలోని 175 పాఠశాలల నుంచి మండల, జిల్లా స్థాయిలకు రెసిడెన్షియల్ పద్ధతిలో 350 మంది విద్యార్థులను గణిత, సైన్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు నామినేట్ చేశారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం కింద అల్ఫోర్స్ పాఠశాలతో చేసుకున్న ఒప్పంద సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 40 మంది టాపర్లు వేసవి సెలవుల్లో ప్రత్యేక కోచింగ్ తీసుకొని మోడల్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. » సైన్స్ టీచర్లకు, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ సొసైటీ వారిచే శిక్షణ ఇప్పిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వీరితో ఎంవోయూ చేసుకొని 2024 నవంబర్ 5 నుంచి 8 వరకు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఉచిత సమ్మర్ క్యాంపులు » 27 విభాగాల్లో అల్ఫోర్స్, సెయింట్‌జార్జ్, పారమిత, వివేకానంద, సాధన ప్రైవేట్ పాఠశాలల సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. దాదాపు 1,500 మంది విద్యార్థులు ఈత, కంప్యూటర్ శిక్షణ, యాంకరింగ్, ఇంగ్లిష్ భాషనైపుణ్యాలు నేర్చుకున్నారు. » విటమిన్ గార్డెన్స్ (స్కూల్ లైఫ్ స్కిల్స్ చాలెంజ్).. విటమిన్ గార్డెన్లలో పెంచుతున్న వివిధ కూరగాయలను, జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత, కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌లలో మధ్యాహ్న భోజన వంటల్లో ఉప యోగిస్తున్నారు. ప్రకృతితో అనుసంధానంగా గణిత, సైన్స్ ప్రయోగాలు చేస్తూ గార్డెన్స్ పెంచుతున్నారు. » 30 ప్రేరణాత్మక దృశ్య చిత్రాలను ఎంపిక చేసి ప్రతీ మొదటి, మూడో శనివారం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు ఈ సినిమాలు చూసిన తర్వాత వీటిపై సమీక్షలు రాయిస్తున్నారు. తద్వారా భాషాభివృద్ధి, భావవ్యక్తీకరణ, చదవడం, కుదిరించి రాయడం నేర్చుకునే అవకాశం కలుగుతుంది. » ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి 2024 నవంబర్ 10న ప్రారంభించి 14 ఆదివారాలపాటు నటన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి వారితో కరీంనగర్ కళాభారతిలో థియేటర్ ఫెస్టివల్ నిర్వహించారు. » విద్యార్థుల చదువు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతీ బుధవారం ఒక పాఠం శబ్ధపూర్వకంగా చదవడాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు, పెద్దవారిముందు గట్టిగా చదివి వినిపించడం ద్వారా వారు అవసరాన్ని బట్టి సరిచేసి చదివించే అవకాశం ఉంటుంది. » రోజూ ఒక పేజీ రాత వలన విద్యార్థులు రాతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులు రాత నైపుణ్యాలను పరిశీలిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. » వీధుల్లో ఉన్న జంతువులను చూస్తే ఎలా స్పందించాలనే అంశాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. రేబిస్ వంటి వ్యాధులు, టీకాలు చికిత్స విషయాలు తెలుసుకుంటారు. జిల్లా స్థాయిలో 630 మంది హెచ్ఎంలు, 900 ఎకో క్లబ్ సభ్యులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. » 2005లో ప్రారంభమైన సైన్స్ మ్యూజియంను 2024లో పునర్నిర్మించారు. 56 వర్కింగ్ మోడల్స్, 80 నమూనాలు, సైన్స్ మోడల్స్, డైనోసార్ మోడల్, ప్లానెటోరియం ఉన్నాయి. » సారథి ట్రాఫిక్ పార్క్.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ సంకేతాలు, రోడ్డు గుర్తుల అవగాహన కల్పిస్తున్నారు. తిమ్మాపూర్ మండలానికి చెందిన విద్యార్థులు 2024 డిసెంబర్ 21 నుంచి 2025 ఏప్రిల్ 4 వరకు కరీంనగర్ ఆర్టీవో ఉన్న సారథి ట్రాఫిక్ పార్క్‌ను సందర్శించి రోడ్ సేఫ్టీపై అవగాహన పొందారు. ఇప్పటివరకు 450 మంది విద్యార్థులు, 44 మంది ఉపాధ్యాయులు సందర్శించారు. » కెరీర్ గైడెన్స్ చార్ట్.. జిల్లాలోని ఉన్నత, కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌లో చదివి పాస్ అయిన విద్యార్థులకు (5,595 మంది) పదో తరగతి తరువాత ఏం చదవాలో తెలిపే డిటైల్డ్ చార్ట్‌ను, కౌన్సెలింగ్ బుక్‌లెట్స్‌ను పదోతరగతి ఫలితాలు రాగానే అందజేశారు. -
పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్‌టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు. అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్‌కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు. అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్‌లు మిస్సవ్వడం, మాక్‌టెస్ట్‌ల్లో వెనకబడటం జరిగింది. ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్‌తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్‌లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. అయితే హర్షకి ఎన్ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.నేర్చుకున్న జీవిత పాఠాలు..చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తాఅనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్‌చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు. అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా. (చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!) -
ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది
‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్’కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో 5వ ర్యాంక్ సాధించింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.ఫరిదాబాద్‌కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్ గోల్స్‌గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్ అనేది నా మేజర్ గోల్. మైనర్ గోల్...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం’ అంటుంది అవిక. (చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!) -
62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..
సమాజం మనకు ఏమి ఇచ్చింది అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ సమాజానికి నేను ఏమిచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కడే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ. పదో, ఇరవైయ్యో కాదు.. ఏకంగా 136 సార్లు రక్తదానం చేసి పరోక్షంగా అనేక మంది ప్రణాలను కాపాడారు. 62 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఆరు నెలలకూ ఓసారి ఇప్పటికీ రక్తదానం చేస్తూనే ఉన్నారు. కేవలం రక్తదానమే కాదు తాను మృతి చెందిన అనంతరం తన శరీరంలో పనికొచ్చే అన్ని అవయవాలు ఇండియన్ ఆర్మీకి దానం చేశారు. నగరంలోని డీడీ కాలనీలో నివాసం ఉండే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ 1983లో వివేకవరి్ధని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అక్టోబర్ 2, మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొదటి సారి రక్తదానం చేశారు. ఇక అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికీ తన రక్తాన్ని దానం చేస్తున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీకి, నగరంలో ఏ ఆస్పత్రి నుండి ఫోన్ వచ్చినా వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. యోగేష్‌ది ఓ నెగెటివ్ కావడంతో రక్తదానం చేసిన ప్రతిసారీ మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు అని వైద్యులు అంటుంటే అందులో కలిగే ఆనందం ఎక్కడా దొరకదని ఆయన అంటున్నారు. ఈయన రక్తదానం చెయ్యడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నిపుతుంటారు. ప్రముఖుల నుంచి అభినందనలు.. ఇన్నిసార్లు రక్తదానం చేసిన యోగేష్‌ను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సీని ప్రముఖులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఒక వేదికపై ప్రముఖ హీరో రాంచరణ్ మేము సినిమాల్లో హీరోలమైతే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ్ నిజ జీవితంలో హీరో అని అందరిముందూ పొగడడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు. పలు అవార్డులు, రికార్డులు.. యోగేష్‌కు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 16వ ఫిలిప్స్ గాడ్ఫ్రే బ్రేవరీ అవార్డు, క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫిలాసఫీ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్, 17 బంగారు, వెండి, 14 మెరిట్ సర్టిఫికెట్స్, రాజీవ్‌గాంధీ సమైక్యతా అవార్డు, లయన్ ఇంటర్నేషనల్ అవార్డు, స్వేచ్ఛా భారత్ పురస్కార్‌తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. (చదవండి: Plane Crash Victims : ఆ భయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదట..!) -
Vishwanath Karthikey అమ్మమాటతో శిఖరాలకు, అరుదైన రికార్డు
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), కోసియస్కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్అమ్మ మాటే ప్రేరణ..ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాఈ తరానికి స్పూర్తి.. ఈ పయనంలో విశ్వనాథ్‌కు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు భరత్, లెఫ్టినెంట్ రోమిల్ బారాథ్వల్ (ఇండియన్ ఆర్మీ రిటైర్డ్) పాత్ర కీలకం. రోమిల్ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్‌కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం. -
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతోంది. గ్రామం నుంచి ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్ఎస్పీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాలతో పాటు ఉపాధ్యాయులు 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ జవాన్‌గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ.. కంబాలపల్లి గ్రామం (Kambalapally Village) ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. సేవలందిస్తున్న 79 మందిలో...కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేస్తున్నారు. ఇందులో 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు టీఎస్ఎస్పీ, ఇద్దరు నేవీ, ముగ్గురు ఎయిర్ ఫోర్సు, ఐదుగురు గన్మన్లు, ఇద్దరు ఎస్పీఎఫ్ (SPF) విభాగాల్లో పనిచేస్తున్నారు.తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌లో..కంబాలపల్లి గ్రామం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ (Air Force) ఉద్యోగిగా నూకల నరేందర్ రెడ్డి పేరుపొందారు. ఎయిర్‌ఫోర్స్ విమాన కమాండర్ (ఆర్మీలో బ్రిగేడియర్ హోదా)గా 36 ఏళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలట్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణ, ఇతర విభాగాల్లో యువకులు పనిచేస్తూ ఆదర్శంగా నిలవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. – నూకల నరేందర్‌రెడ్డి, మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగ్రేడ్ హవల్దార్‌గా విధులు..గ్రామానికి చెందిన కొలిశెట్టి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ హోదాలో కొనసాగుతున్నారు. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో 2001లో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత లాంచ్ నాయక్, నాయక్, హవల్దార్ హోదాల అనంతరం ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్‌గా పనిచేస్తున్నారు. – కొలిశెట్టి సుధాకర్, ఆర్మీ గ్రేడ్ హవల్దార్ 22 ఏళ్లుగా ఆర్మీలో .. గ్రామానికి చెందిన సంద భాస్కర్ 22 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య ఆర్మీలో చేరిన మొ దటి వ్యక్తి కాగా.. భాస్కర్ రెండోవారు. ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. – సంద భాస్కర్, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్తండ్రిని ఆదర్శంగా తీసుకొని.. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య, సైదమ్మ దంపతుల చిన్న కుమారుడు అవినాశ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆర్మీలో చేరాడు. ఆయన ప్రస్తుతం జమ్మూలో ఆర్టిలరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.– మల్లికంటి అవినాశ్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగిప్రభుత్వ ఉపాధ్యాయునిగా..గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. – మల్లికంటి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుచదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి -
Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి -
ఆదర్శం అంటే..!
ఆదర్శం అంటే దర్శనం చేయించేది: ‘చూపించేది’ అని అర్థం. మహనీయుల జీవితం మనకు సరైన నడవడిక ఎలా ఉండాలో చూపుతుంది కనుక అది మనకు ‘ఆదర్శం’. దస్తూరీ మెరుగు పరుచుకునేందుకు రాసే ‘కాపీ’ పుస్తకంలో, పేజీలో పైన ముద్రితమై ఉండే నమూనా పంక్తి– ‘మేలు బంతి’–ని చూసుకుంటూ, దాన్ని అనుకరిస్తూ కింద పదిసార్లు రాస్తే చేతి రాత బాగవుతుంది. ఆ నమూనా పంక్తిని కూడా ఆదర్శం అంటారు.ఏదయినా జటిలమైన శాస్త్ర విషయానికి, ఆ శాస్త్రం బాగా నేర్చిన పండితుడు విపులంగా, సరళంగా వ్యాఖ్య రాసి పెడితే; అది ఆ శాస్త్రం తాలూకూ కిటుకులకూ, మర్మాలకూ అద్దం పట్టి మనకు చూపుతుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఆదర్శాలే. ఉదాహరణకు కావ్య లక్షణాల గురించి దండి రంన గ్రంథం పేరు ‘కావ్యాదర్శం’.వేదాంతవేత్తలు వివిధ సందర్భాలలో మనసునూ, బుద్ధినీ, చైతన్యాన్నీ అద్దంతో పోలుస్తారు. రజోగుణ సముద్భవమైన కామ– క్రోధాలు అనే లక్షణాలు... శుద్ధమైన మనిషి బుద్ధిని, స్వచ్ఛమైన అద్దాన్ని; మాలిన్యమూ, మసీ కప్పివేసినట్టు ఒక్కొక్కప్పుడు కప్పి వేస్తాయి. అప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. అలాంటప్పుడే మనిషి పాపకర్మల ఫలాలు దారుణంగా ఉంటాయని తెలిసి కూడా పాత కాలు చేస్తాడు. నవ్వుతూ చేసిన పాపాల కర్మలను తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడని భగవద్గీత బోధిస్తుంది.మనం చూసే విశ్వమంతా ‘దర్పణ దృశ్యమాన నగరి’ (అద్దంలో కనిపించే నగరపు ప్రతిబింబం) లాంటిది అన్నారు ఆదిశంకరులు. బాహ్య ప్రపంచంలో విశేషాలన్నీ మన అంతఃకరణలో ప్రతిబింబించడం వల్లనే మనకు గోచరిస్తున్నాయి. మన చేతోదర్ప ణంలో బాహ్య ప్రపంచపు విశేషాలు ప్రతిబింబించకపోతే వాటి రపురేఖల, లక్షణాలూ మనం గ్రహించలేం. ఈ అద్దం లేకపోతే ఆ విశ్వం మనకు గోచరించదు. అద్దం మీద మోహమూ, భ్రాంతీ, అజ్ఞానమూ అనే మురికి పేరుకుపోతే కూడా మనకు మన కట్టెదుట ఉన్న సత్యం యథాతథంగా కనిపించదు. ఉన్నది కప్పబడి, లేనట్టుతోస్తుంది. అద్దం మీది మాలిన్యం వల్ల లేనిదేదో ఉన్నట్టు కనిపిస్తుంది. బుద్ధి అద్దానికి మకిలి పడితే మనం భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం. ‘చేతో దర్పణ మార్జనమ్’ (బుద్ధిని శుద్ధి చేసే సాధనం) శ్రీకృష్ణ నామ సంకీర్తనం’ అని చైతన్య మహాప్రభువుల ‘శిక్షాష్టకం’ అంటుంది. దానివల్లనే ‘సమ్యక్ దృష్టి’ కలుగుతుంది.– ఎం. మారుతి శాస్త్రి -
సివిల్స్‌లో సక్సస్ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!
ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు.అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్‌లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్‌నే ఛేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్ తథ్యం అంటున్నాడు. తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్‌తో వచ్చాను. మట్టికప్పుల్లో టీ సర్వ్ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్‌ని విస్తరించేలా చేసింది. 300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్ చైన్‌గా విస్తరించింది. అదోకా బ్రాండ్లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్‌ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్‌కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్‌లన్నింటికి హెడ్‌గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. "తాను చదువులో బ్యాక్బెంచర్ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్‌ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్‌ని ముగించారు అనుభవ్ దూబే.This is for those who haven’t received any award or recognition in their life.Till the age of 25, I hadn’t received a single award. I was a backbencher. Awards, certificates se mera door door tak koi lena dena nahi tha.When I started feeling that I might not clear my UPSC… pic.twitter.com/CxX8sCVObR— Anubhav Dubey (@tbhAnubhav) March 18, 2025 (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
ఉమెన్స్ డే స్పెషల్.. తల్లి, చెల్లితో సాయిపల్లవి (ఫోటోలు)
-
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
నాకు స్ఫూర్తి మా నానమ్మ
ఎందుకంటే.. ‘ఒక పొజిషన్ అచీవ్ చేయమనెప్పుడూ చెప్పలేదు మా నానమ్మ. అయితే ఒక పొజిషన్లో ఉంటే చేయగలమో చెప్పింది. మన పనులతో ఎంతమందిని ప్రభావితం చేయగలమో చెప్పింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ ఎప్పుడూ మమ్మల్ని అబ్బాయిలకు డిఫరెంట్ అని పెంచలేదు. అందుకే మేం వాళ్లతో ఈక్వల్ కాదనే భావన మాకెప్పుడూ రాలేదు. అమ్మ కానీ, నానమ్మ కానీ మాకు ఎక్కడ తగ్గాలో నేర్పారు. అది మహిళలకున్న సహజగుణమని మేం గ్రహించేలా చేశారు. నిజానికి మనకు ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. కానీ ఎక్కడ తగ్గాలో తెలియదు. అది తెలుసుకోవాలి. సహనం మనకున్న సహజమైన లక్షణం. దాన్నెందుకు కోల్పోవాలి మనం! అది మనకున్న ఆరా! దాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ నేను మా నానమ్మ, అమ్మ ద్వారే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో నాకు వాళ్లే స్ఫూర్తి!’ -
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
జగత్తంతా ఈశ్వరమయం!
ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగానేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు -
బౌద్ధవాణి: మణి–దీపం!
వేసవి ఎండ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మామిడి తోటలో చల్లగానే ఉంది. ఆ మామిడితోట వేణువనానికి ఒక మూలన ఉంది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశాలమైన అరుగు. ఆ అరుగు దగ్గరకు నెమ్మదిగా, మందహాసంతో నడిచి వచ్చాడు బుద్ధుడు. ఆయన రాకను గమనించాయి తోటలో ఉడతలు. మనిషి అలికిడి తగిలితే ΄ారి΄ోయే ఉడతలు, బుద్ధుణ్ణి చూస్తే దగ్గరకు వచ్చేస్తాయి.అది ఎప్పటినుండో వాటికి అలవాటు. భిక్షా΄ాత్రలోంచి కొన్ని పళ్ళు తీసి అరుగు పైన ఒక పక్కన చల్లాడు. అవి కుచ్చుతోకలు విప్పుకుని, పైకెత్తుకుని వచ్చి, పండ్లు ఏరుకుని తినసాగాయి. కొంత సమయం గడిచింది.సకుల ఉదాయి అనే పరివ్రాజకుడు వచ్చాడు. బుద్ధునికి నమస్కరించి కూర్చున్నాడు. అతను రాగానే కొన్ని ఉడతలు చెట్లెక్కాయి. వాటిని చూసి– ‘‘భగవాన్! మీ కరుణ అమోఘం. ఉడతలు కూడా మిమ్మల్ని మిత్రునిగా భావిస్తాయి. ఇది విచిత్రం. మీ జీవ కారుణ్యానికి మచ్చుతునక. మీకు మరోమారు ప్రణమిల్లుతాను’’ అని వంగి నమస్కరించాడు. ‘‘సకుల ఉదాయీ! వచ్చిన విషయం?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘మా గురువుగారు నిగంఠ నాధుల వారు నిన్న ‘పరమ సత్యం, పరమ వర్ణం’’ అంటూ ‘‘పరమం’’ గురించి చె΄్పారు. మీ దృష్టిలో పరమ వర్ణం ఏది? అని అడిగాడు. ‘‘ఉదాయీ! పరమం అంటే?’’‘‘మీకు తెలియంది కాదు. దేని కంటే ఉన్నతమైంది మరొకటి ఉండదో... అదే పరమం’’ ‘‘నీకు ఈ లోకం ఎంత తెలుసు. అందులో ఇదే పరమం అని ఎలా నిర్ణయిస్తావు? నూతిలోని కప్పకి నుయ్యే ప్రపంచం. చెరువులోని చేపకి చెరువే ప్రపంచం. ఈ అనంతమైన విశ్వానికి హద్దులు ఎలా గీస్తావు?’’ అని అడిగాడు భగవానుడు. సకుల ఉదాయి మౌనం వహించాడు.‘‘ఉదాయీ! ఒక చీకటి గదిలో ఒక పసుపురంగు కంబళిలో ఒక సానబెట్టిన మణి ఉంది. అది ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అంతలో ఆ గదిలోకి ఒక మిణుగురు పురుగు వచ్చింది. అప్పుడు ఆ మణి వెలుగు ఎక్కువ ప్రకాశంగా ఉంటుందా? మిణుగురు వెలుగా?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! మిణుగురు వెలుగే మిగుల ప్రకాశం’’ అన్నాడు ఉదాయి.‘‘ఇందులో ఒక వ్యక్తి నూనె దీపం తెచ్చాడు. అప్పుడు ఏ వెలుగు ప్రకాశం?’’‘‘దీపం వెలుగే భగవాన్!’’ ‘అలా ఉదాయీ! దీపం వెలుగు కంటే నెగడు వెలుగు ప్రకాశం. దాని కంటే వేగుచుక్క వెలుగు, దానికంటే చంద్రుని వెలుగు, దానికంటే సూర్యుని వెలుగు ప్రకాశం.... ఉదాయీ! సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగులు కూడా ఉంటాయి.’’ అన్నాడు. ఉదాయి మనస్సు తేటబడింది. ఆ తేటదనం అతని ముఖంలోంచి తొంగి చూస్తోంది! ఉడతలు కిచకిచ మంటూ బుద్ధుని దగ్గరకు వచ్చాయి. ఆయన ΄ాత్రలో నుంచి మరికొన్ని పళ్ళను వాటిముందు ΄ోశాడు. అవి వాటి పనిలో మునిగి ΄ోయాయి. ‘‘ఉదాయీ! మిణుగురు పురుగు కంటే తక్కువ ప్రకాశించే మణి వెలుగునే ‘పరమం’ అనుకుంటున్నావు? అన్నాడు.‘విజ్ఞానం, విశ్వం, అన్నీ అనంతాలే’ అని గ్రహించాడు. సకుల ఉదాయీ! బుద్ధునికి ప్రణమిల్లాడు! అతని ముఖంలో అనుమాన ఛాయలు తొలిగాయి. సంతోష కాంతులు వెలిగాయి! దోసిలి చాచాడు. బుద్ధుడు కొన్ని పండ్లను అతని దోసిట్లో ΄ోశాడు. ఉదాయి, కొద్దిగా ముందుకు వంగి ఉడతలకు దోసిలి చూ΄ాడు. అవి అతని ముఖం కేసి చూశాయి. ధైర్యంగా దోసిలి లోని పండ్లు అందుకున్నాయి. – డా. బొర్రా గోవర్ధన్ -
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్‌ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది! -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
Renuka Jagtiani: 'ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో' తన ల్యాండ్ మార్క్..
సంపన్న కుటుంబ నేపథ్యం లేని మిక్కీ జగ్తియాని ‘ల్యాండ్‌మార్క్’తో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడు. భర్త అడుగు జాడల్లో నడిచి వ్యాపార నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని ‘ల్యాండ్ మార్క్’కు తనదైన మార్క్ జోడించి ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజాగా.. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు సాధించింది. రేణుకా జగ్తియాని నేతృత్వంలోని దుబాయ్ చెందిన రిటైలింగ్ దిగ్గజం ‘ల్యాండ్‌మార్క్’ 21 దేశాలలో పాదరక్షల నుంచి గృహోపకరణ వస్తువుల వరకు వివిధ బ్రాండ్లతో విజయపథంలో దూసుకుపోతుంది. హాస్పిటాలిటీ బిజినెస్‌లో కూడా గెలుపు జెండా ఎగరేసింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లే రేణుక మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆగ్నేయాసియాలోని కీలక మార్కెట్లలో రాబోయే కాలంలో వందలాది స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇది సాధ్యమా!’ అనుకునే వాళ్లు సందేహాల దగ్గరే తచ్చాడుతారు. ‘కచిత్చంగా సాధ్యమే’ అనుకునే వాళ్లు ముందుకు దూసుకుపోతారు. రేణుక రెండోకోవకు చెందిన మహిళ. వేగంగా వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే కాదు ఫాస్ట్–ఫ్యాషన్ బిజినెస్ ‘స్ప్లాష్’తో తనదైన ముద్ర వేసింది. ‘స్ప్లాష్’ పదకొండు దేశాలలో 200 స్టోర్స్ వరకు విస్తరించింది. మన దేశంలో 1999లో లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్ అండ్ మాక్స్‌లాంటి అయిదు ఫార్మట్స్‌లో ప్రస్థానం ప్రారంభించి 900 స్టోర్స్‌లో విస్తరించింది ల్యాండ్‌మార్క్. 2017లో రేణుక ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీయీవోగా బాధ్యతలు స్వీకరించింది. రేణుక భర్త మిక్కీ జగ్తియాని సౌత్ ఆఫ్రికా ఇమిగ్రెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్‌లో బేబీ ్ర΄÷డక్ట్స్ స్టోర్‌ను మొదలుపెట్టాడు. అక్కడినుంచిప్రారంభమైన బుడి బుడి అడుగుల వ్యాపారం ‘ల్యాండ్‌మార్క్’ రూపంలోఎక్కడికో వెళ్లింది. భర్త నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టడం అంత సులువు కాదు. కాని ఎక్కడా రేణుక వెనకడుగు వేయలేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో కంపెనీలపై పడినట్లే కోవిడ్ సంక్షోభ ప్రభావం ‘ల్యాండ్‌మార్క్’ పై పడింది. రెండు నెలలకు పైగా స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తరువాత మెల్లమెల్లగా కొత్త గైడ్‌లైన్స్‌తో తెరుచుకోవడం మొదలైంది. ‘విపత్కరమైన పరిస్థితుల్లో ఆపరేషనల్ప్రాసెస్లో ర్యాపిడ్ చేంజెస్ చేశాము. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాం, వారిలో ధైర్యం నింపాం. ఆఫీస్, స్టోర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాం. ఉద్యోగుల కోసమే కాదు కోవిడ్ బాధితుల కోసం మా ఫౌండేషన్ తరపున ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేపట్టాం’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంది రేణుక. చిన్న వ్యాపారంగా మొదలైన ‘ల్యాండ్‌మార్క్’ గల్ఫ్‌కు సంబంధించి ‘కింగ్ ఆఫ్ రిటైల్’గా పేరు తెచ్చుకుంది. విజయపథంలో దూసుకుపోతున్న ‘ల్యాండ్‌మార్కు’ ముందున్న కర్తవ్యం.. సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలి. పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యత ఇస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ చెన్నై, ముంబై మురికివాడల్లో రకరకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది. రేణుక జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని 71 సంవత్సరాల వయసులో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ ఆయనను ‘మీ నెక్ట్స్ ΄్లాన్ ఏమిటి?’ అని అడిగాడు. దీనికి మిక్కీ జగ్తియాని చెప్పిన జవాబు.. ‘నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. వ్యాపార సంబంధిత విషయాల గురించి కాకుండా నేనెవరిని? జీవితపరమార్థం ఏమిటి? లాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాను. వ్యాపార లాభాలే కాదు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలలో ఆనందం దొరుకుతుంది’ భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపార నైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలకు కూడాప్రాధాన్యత ఇస్తోంది. భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపారనైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతోపాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇవి చదవండి: Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్‌గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్‌లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్‌లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్‌తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్‌గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్‌లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్‌తో కలిసిన అండర్సన్ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్‌తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్‌పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్‌బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్‌లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్‌ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్‌గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్‌లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్‌గా నిలిచింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్‌తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్‌టౌన్‌లో 5 వికెట్లు, అడిలైడ్‌లో 5 వికెట్లు, 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్‌కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్‌లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్‌గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్‌కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్‌లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్‌వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!
'చేసే పని పట్ల నిబద్ధత.. నిజాయితీ ఉంటే చాలు.. ఫలితం ఏదైనా గ్రాఫ్ స్టడీగానే ఉంటుంది. సిద్ధి ఇద్నానీ విషయంలో అదే జరిగింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా ఆమె మాత్రం ఫెయిల్ అవలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది కానీ ఆమె తెరమరుగు కాలేదు. ఆమె నటించిన ఇటీవలి ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం. జయాపజయాలతో సంబంధంలేని పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్ధి వివరాలు కొన్ని..' సిద్ధి.. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి.. సింధీ, తల్లి.. గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ.. హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్న బిజినెస్ మేన్. చిన్నతనంలో అమ్మతో కలసి సీరియల్ సెట్స్‌కి వెళ్లేది. ఆ ప్రభావంతోనే తనూ నటి కావాలనుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. దాంతో ‘గ్రాండ్ హాలీ’ అనే గుజరాతీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అనుకొని మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. సీరియల్స్, కమర్షియల్స్ చేస్తున్నప్పుడే ఒకసారి.. ఓ ఏజెన్సీ వాళ్లు సిద్ధికి ఫోన్ చేసి సినిమా ఆడిషన్‌కి పిలిచారు. అలా ఆమె తెలుగులో ‘జంబలకిడి పంబ’తో హీరోయిన్గా మారింది. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘వెందు తనిందది కాడు’ చిత్రంతో తమిళ్లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుసగా కొన్ని చాన్స్లైతే వచ్చాయి కానీ.. విజయం ఇంకా ఎదురుచూపుల్లోనే చిక్కుకుపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని.. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. అందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి సక్సెస్ ‘గ్రాండ్’ అనే విశేషణాన్ని జత చేర్చుకుని తన పాత బాకీలనూ తీర్చేసుకుంది. ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్‌లో ఉంది. 'నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భావమే దాని భాష. అందుకే భాష కన్నా కథ.. నా పాత్రే నాకు ముఖ్యం.' – సిద్ధి ఇద్నానీ ఇవి చదవండి: అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు! -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
ఉన్నత చదువులు చదువుతూనే..ఒగ్గు కథలు చెబుతున్న యువత!
అవును.. వాళ్లు కథలు చెబుతున్నారు. ఊ కొట్టే కథలు కావు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన కథలు. పల్లెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపే ఒగ్గుకథలు. దశాబ్దం క్రితం కులవృత్తి అంటే చిన్నచూపు చూడడంతో జానపదుల కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే నేటి యువత ఇటు చదువుతోపాటు అటు కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకుంటుంది. బీటెక్, బీఈడీ, డిగ్రీలు, పీజీలు చదువుతూనే ఒగ్గుకథలు, మల్లన్నపట్నాల కథలు చెబుతున్నారు. కులవృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒకప్పుడు మల్లన్నపట్నాలు అంటేనే కథకులు పెద్ద వయసు వారు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. పాతికేళ్లు కూడా నిండని యువత మల్లన్నపట్నాల బాధ్యతలు తమ బుజాలపై వేసుకుంటున్నారు. కథలు చెబుతూ పల్లెప్రజల మన్ననలు అందుకుంటున్నారు. మూడు నెలలు కథలు చెబుతూ.. తాతలు.. తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకున్న నేటి యువత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కథలు చెబుతున్నారు. ఈ మూడునెలల్లో ప్రతీ ఆదివారం మల్లన్నపట్నాల పూజలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకరి ఇంట్లో మల్లన్నపట్నాల పూజలకు ముగ్గురు యువకులు వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మల్లన్న పట్నాలలో ఆడ వేషధారణలో కథలు చెబుతున్న యువ కళాకారుడు కులవృత్తిపై మమకారంతో.. కులవృత్తిపై మమకారంతో ఇటీవల యువత మల్లన్నపట్నాలు, భీరప్ప కథలు చెప్పేందుకు ముందుకొస్తున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో దాదాపు 50 మంది ఒగ్గుకథ కళాకారులు ఉన్నారు. ఇందులో 20 మంది వరకు పాతికేళ్లు కూడా నిండని యువతే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో ప్రతీ ఆదివారం, సోమవారం మల్లన్న పట్నాల పూజలకు వెళ్తుంటారు. కులవృత్తిని గౌరవిస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బోయినపల్లి మండలానికి చెందిన కళాకారులు వేములవాడ, బావుపేట, కందికట్కూర్, వాసంపల్లి, అయ్యోరుపల్లి గ్రామల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతంలో మల్లన్నపట్నాల పూజలు చేస్తుంటారు. వివిధ దేవుళ్లు, జానపదల కథలు చెబుతుంటారు. ఇవి చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో.. -
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని'
స్కూలు, కాలేజి రోజుల నుంచి రోజుల తరబడి పాటలు వినేది ధ్వని భానుశాలి. అందరూ తనను సరదాగా ‘సాంగ్ ఈటర్’ అని పిలిచేవారు. రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ ‘వాస్తే’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ధ్వని సింగర్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. మంత్రముగ్ధులను చేసే అందమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో గొప్ప సంగీతదర్శకులతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ధ్వని పాడిన ‘దిల్బార్’ పాట బిల్బోర్డ్ యూట్యూబ్‌లో మ్యూజిక్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన తొలి భారతీయ సింగిల్‌గా చరిత్ర సృష్టించింది. ‘ఒక ఆర్టిస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. కానీ వారి శైలిని కాపీ కొట్టకూడదు’ అంటున్న ధ్వని సంగీతప్రపంచంలో తనదైన అందమైన సంతకాన్ని సృష్టించుకుంది. ధ్వని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రోత్సాహకంగా మాట్లాడిన వారు తక్కువే. దీని గురించి ఇలా స్పందిస్తుంది ధ్వని... ‘ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు వినడం వల్ల మనం ఎంచుకున్న దారి సరిౖయెనదేనా అనే డౌటు వచ్చి అయోమయంలోకి వెళతాం. ఇలాంటి సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నా ప్రయాణంలో నేను అది కోల్పోలేదు’ అంటుంది ధ్వని భానుశాలి. ఇవి కూడా చదవండి: 'దీపెన్' దారి దీపం.. -
ఎవరీ ఉమ్ముల్ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు..
కటిక దారిద్య్రానికి తోడు నయం కానీ వ్యాధితో సహవాసం చేసింది ఆమె. అడగడుగున కఠినతరమైన కష్టాలు. అయినా వెరవక లక్ష్యం కోసం ఆహర్నిశలు పోరాటమే చేసింది. చివరికి అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్‌కి చెందిన ఉమ్ముల్ ఖేర్ బాల్యం డిల్లీలోని నిజాముద్దీన్‌లో మురికివాడలో సాగింది. పైగా ఖేర్ పుట్టుకతో ఎముకలకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడుతోంది. అయినప్పటికి చదువును కొనసాగించింది. అలా ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత జేఎన్‌యూ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేసింది. అక్కడితో ఆగకుండా ఎంఫిల్ చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యింది. ఈక్రమంలో 2012లో చిన్న ప్రమాదానికి గురయ్యింది. అయితే ఆమెకు ఉన్న బోన్ డిజార్డర్ కారణంగా శరీరంలో ఏకంగా 16 ఫ్రాక్చర్లు అయ్యాయి. దీంతో ఖేర్ దాదాపు ఎనిమిది సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్ని కష్టాల ఐఏఎస్ అవ్వాలనే అతి పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోగలనా? అన్న సందేహానికి తావివ్వకుండా తన లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో సాగిపోయింది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ఏవీ ఆమె గమ్యానికి సహకరించకపోయినా.. నిరాశ చెందలేదు. పైగా అవే తనకు 'ఓర్చుకోవడం' అంటే ఏంటో నేర్పే పాఠాలుగా భావించింది. ప్రతి అడ్డంకిని తన లక్ష్యాన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా చేసే సాధనాలుగా మలుచుకుంది. చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి తలవంచాయేమో! అన్నట్లుగా ఉమ్ముల్ ఖేర్ సివిల్స్‌లో 420వ ర్యాంకు సాధించింది. తాను కోరుకున్నట్లుగానే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ద టీజ్ ఉమ్ముల్ ఖేర్ అని ప్రూవ్ చేసింది. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
స్వావలంబనకు చుక్కాని... రుబీనా!
'అది హైదరాబాద్, దారుల్షిఫా, మలక్‌పేట్, నూర్ఖాన్ బజార్‌లోని బాల్షెట్టీ ఖేత్ గ్రౌండ్. పది నుంచి పదిహేనేళ్ల వయసు బాలికలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి మధ్యలో ఓ అరవై ఏళ్ల మహిళ. ఆ మహిళకు హైఫైవ్ ఇస్తూ, ఫిస్ట్ పంచ్‌లతో ఆడుకుంటున్నారు. ఆ బాలికలు సంతోషంగా రెక్కలు విచ్చుకోవడానికి కారణం ఆ మహిళ. ఆమె పేరు రుబీనా నఫీస్ ఫాతిమా. అమ్మాయిలు గడపదాటి బయటకు రావడానికి ఆంక్షలున్న కుటుంబాల ఆడపిల్లలకు ఆకాంక్షల రెక్కలు తొడిగారామె. ఆశయాల లక్ష్యాలను వారి మెడలో హారంగా వేశారు. ఇందుకోసం సఫా అనే సంస్థను స్థాపించారు. బాలికలు తమ కలలను సాధించుకోవడానికి తగిన సాధన కోసం గ్రౌండ్‌ను వారి కోసం కేటాయిచేలా చేశారు. ఇస్లాం సంప్రదాయాల గౌరవానికి విఘాతం కలగని విధంగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తారు. పదిహేనేళ్లుగా వ్యవస్థీకృతంగా సేవలందిస్తున్న రుబీనా నఫీస్ ఫాతిమా తన స్వచ్ఛంద సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.' తాతగారి స్ఫూర్తితో.. ‘‘మా నాన్న లెఫ్టినెంట్ కల్నల్ ఖాన్. అమ్మ మిలటరీ స్కూల్లో టీచర్. మా కుటుంబం అభ్యుదయ భావాలతో ఎదగడానికి కారణం మా తాతగారు సులేమాన్ ఆఫ్తాబ్ అలీ (అమ్మవాళ్ల నాన్న). మహిళలు చదువుకోవాలని, ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదని, అప్పుడే సమాజంలో మహిళకు గౌరవం దక్కుతుందని చెప్పేవారు. ఆయన అమ్మను అలాగే పెంచారు. ఇక పేరెంట్స్ ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగాను. సెక్యులర్ వాతావరణంలో పెరగడంతో పాటు అన్ని రకాల సంస్కృతులను గౌరవించడం నేర్చుకున్నాను. ఆడపిల్ల అనే కారణంగా ఇంట్లో నాకు ఎటువంటి ఆంక్షలూ లేవు. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయస్థాయిలో ఆడాను కూడా. ఇరవై ఏళ్లకే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేశాను. పెళ్లి తర్వాత భర్తతో΄ాటు సౌదీ అరేబియాకు వెళ్లాను. అక్కడ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసిన భారతీయ మహిళను. కొంతకాలానికి ఇండియాకి వచ్చేశాం. ఇక్కడకు వచ్చిన తర్వాత సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి దారుణమైన నష్టాలను చూశాను. ఆ తర్వాత నాకు బాగా తెలిసిన పర్యాటక రంగంలో శిక్షణ, ప్లేస్‌మెంట్స్ నన్ను విజేతగా నిలిపింది. నాకు సర్వీస్ మీదున్న ఆసక్తికొద్దీ కొంత సమయం మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టాను. సేవలను మరింత సమగ్రంగా చేయడం కోసం సీఎస్ఐఎమ్ నుంచి సర్టిఫికేట్ కోర్సులు చేశాను. మా తాత, నాన్నగారి పేర్లు కూడా వచ్చేటట్లు నా సేవా సంస్థకు సఫా అనే పేరు ఖాయం చేసుకున్నాను. సఫా ద్వారా 2008 నుంచి ముస్లిమ్ మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని మొదలుపెట్టాను. అప్పటినుంచి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఈ గ్రౌండ్లో క్రీడాకారులు పుట్టారు! సాధారణంగా మగపిల్లలను స్వేచ్ఛగా పెరగనిస్తారు. బాలికలకు కూడా ఆడుకోవాలని ఉంటుంది. వాళ్లు ఆడుకోవడానికి నేను అండగా నిలిచాను. ఒకరోజు ఓ వ్యక్తి బైక్‌తో నేరుగా గ్రౌండ్ మధ్యకు వచ్చేసి బాలికలు ఆడుకోవడాన్ని ప్రశ్నించారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆడపిల్లల మీద మగపిల్లలు రాళ్లు రువ్వారు. జీహెచ్ఎమ్సీ అధికారులతో మాట్లాడి ఈ గ్రౌండ్‌ను రోజూ రెండు గంటలపాటు బాలికల కోసం రిజర్వ్ చేయించాను. ఆ సమయంలో మగవాళ్లు గ్రౌండ్లో అడుగుపెట్టడానికి వీల్లేకుండా అడ్డుకోగలిగాం. ఇప్పుడు రోజూ బాలికలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆడుకుంటున్నారు. ఈ గ్రౌండ్ నుంచి ఇద్దరు బాలికలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుట్‌బాల్ ప్లేయర్లుగా ఎదిగారు. నగరంలో 542 గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి గ్రౌండ్ లోనూ బాలికల కోసం రెండు గంటలు కేటాయించి ఆటలను ప్రోత్సహించాలి. క్రీడాకారులుగా ఎదుగుతారు. కనీసం సూర్యరశ్మి తగిలేలా మెలిగితే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ‘గోల్స్ ఫర్ గాళ్స్’ సంస్థ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి శిక్షణనిస్తుంది. ఆ శిక్షణ కోసం పాత బస్తీ నుంచి బాలికలు వెళ్లడం గొప్ప విజయం అనే చెప్పాలి. పేదమహిళల ఆర్థిక స్వావలంబన సాధన మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కరణ చేయగలిగానని గర్వంగా చెప్పగలను. – రుబీనా నఫీస్ ఫాతిమా, సంఘ సేవకురాలు ఇంటింటికీ వెళ్లాను! మహిళలను చైతన్యవంతం చేయడానికి గడపగడపకూ వెళ్లాను. వాళ్ల ఇళ్లలో కూర్చుని బయట ప్రపంచం గురించి చెప్పాను. మహిళ ఎలా ఎదగవచ్చో వివరించాను. వాళ్లతో మాట్లాడిన తరవాత నాకు తెలిసినదేమిటంటే... మహిళలకు ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి, ఆకాంక్షలున్నాయి. వాటన్నింటినీ మొగ్గలోనే తుంచి వేస్తున్న ఆంక్షలు కూడా ఉన్నాయి. పెద్దల గౌరవానికి భంగం కలిగించకుండా, మనోభావాలకు విఘాతం కలగకుండా ఎదగడం నేర్పించాను. బోలా నగర్లో చిన్నగదిలో రెండు సెకండ్ హ్యాండ్ టైలరింగ్ మెషీన్లతో మొదలైన నా సర్వీస్ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్, లైవ్లీహుడ్, క్లౌడ్ కిచెన్, ధనక్బజార్ వంటి పదిహేను ప్రాజెక్టులకు విస్తరించింది. ఆరువందల మందికి వండగలిగిన ఇండస్ట్రియల్ కిచెన్ ఉంది. లుక్మా బ్రాండ్ తో మా మహిళలు తయారు చేసే ఆహార ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ‘ఆర్టిజానియా’ పేరుతో టైలరింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఉద్యోగం కోసం బయటకు వెళ్లడానికి ఇష్టపడని వాతావరణం ఇంకా ఉంది. అలాంటి కొంతమంది ఇళ్లలోనే హ్యాండీక్రాఫ్ట్సŠ, ఇతర వస్తువులు తయారు చేసి వారానికొకసారి మేము ఏర్పాటు చేసే ధనక్ బజార్లో స్టాల్ పెట్టుకుని విక్రయిస్తారు. చదువుకు నోచుకోక ఇంతవరకూ పెన్ను వాడని వాళ్లు కూడా పెన్ హోల్డర్లు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడం ఒక ఎత్తయితే బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడం మాత్రం కత్తిమీద సాములా మారింది. శిక్షణనిచ్చాను... పని చూపించాను! నేను ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. పని నేర్పిస్తాను, పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తాను. వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. ఒకరు సంపాదించి, ఐదుగురు తినాలంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదిగేది ఎప్పటికి? ఇద్దరు సంపాదిస్తుంటే... పిల్లలకు మంచి చదువు సాధ్యమవుతుంది. అందుకే మహిళల ఆర్థిక వృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాను. స్వయం ఉపాధి మార్గాల కోసం జీహెచ్ఎంసీతో అనుసంధానమయ్యాం. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు సాధికారత సాధిస్తున్నారు. సఫా సేవలు హైదరాబాద్ నగరంలో 48 స్లమ్ ఏరియాలకు విస్తరించాయి. మొత్తానికి పాతబస్తీలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలిగాను. బాలికలు చదువుకుంటున్నారు, మహిళలు సొంతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. పిల్లల, పోషణ, పెంపకం గురించి బాధ్యతగా ఉంటున్నారు. తల్లి సంపాదిస్తున్నప్పుడే పిల్లలు ఆమెను గౌరవిస్తారు అని తాతగారు చెప్పిన మాటను ఆచరణలో చూస్తున్నాను’’ అన్నారు రుబీనా నఫీజ్ ఫాతిమా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ ఇవి చదవండి: ఖైదీల రూటు జ్యూట్ వైపు -
'2023 – తెలంగాణ మహిళ!' ఈ ఏడాది స్ఫూర్తి వీరే..
"తమను తాము బాగు చేసుకోవడంతోపాటు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ యేడాది తెలుగు మహిళ నిరూపించింది. విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మహిళను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం. రాబోయే సంవత్సరానికి ప్రేరణగా వీరితో కలిసి మరెన్నో అడుగులు వేద్దాం.!" ఊరంతా బాగు! మూడేళ్లక్రితం వరకు ఒక మామూలు పల్లె అది. కానీ, నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. ఇంటర్మీడియెట్ వరకు చదివిన మీనాక్షి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నియ్యింది. మరుగుదొడ్లు కట్టించడం, తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వాన నీరు ఆ గుంటలో పోయేలా చేసిందామె. వాగుపైన వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలవల శుభ్రత, స్కూల్‌కు కొత్త భవనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ఏర్పాటు చేయించింది. ఊళ్లో సంపూర్ణ మద్య నిషేధం అమలుతో΄ాటు హరిత హారంలో భాగంగా పదివేల మొక్కలు నాటించి, వాటి బాధ్యతను గ్రామస్తులే తీసుకునేలా చేసింది. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి, పంచాయితీకి లాభం చేస్తోంది. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఊళ్లోనే నర్సరీ ఉంది. ఊళ్లో జరిగే అంగడిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు, తడిచెత్త– ΄÷డి చెత్త విభజనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ΄ాటిస్తున్నారు. ఇన్ని మార్పులు తీసుకు వచ్చిన మీనాక్షిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ యేడాది స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. - మీనాక్షి గాడ్గె (సర్పంచ్) భారతజట్టులో స్థానం! భద్రాచల వాసి త్రిష అండర్–19 మహిళల వరల్డ్ కప్ –2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరి, క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. చదువు, ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పే త్రిష నవతరపు అమ్మాయిలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. - గొంగడి త్రిష (యువ క్రికెటర్) సాహసమే ఊపిరి.. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అన్వితారెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎవరెస్టు శిఖరాన్ని ఐదురోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. పడమటి అన్వితారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లావాసి. ప్రస్తుతం భువనగరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసింది. పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ కోచ్‌గానూ గుర్తింపు పొందింది. గతంలో సిక్కింలోని రీనాక్, బీసీరాయ్, కిలిమంజారో, లదాక్‌లోని కడే, ఎబ్బ్రూస్ పర్వతాలు అధిరోహించింది. పర్వతారోహణలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, సవాళ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి, సాధన అవసరం. అన్విత ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - అన్వితారెడ్డి (పర్వతారోహకురాలు) అవగాహనే ప్రధానం జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం నుంచి రేగట్టె వెంకటరమణ ఎంపికయ్యింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డును అందుకొని వార్తల్లో నిలిచింది వెంకటరమణ. ఇంటింటికీ వెళ్లి మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కోవడం, జాగ్రత్తలు సూచించడం, కౌన్సెలింగ్స్ ఇవ్వడం దినచర్యగా చెబుతుంది. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడంలో ముందుండే వెంకట రమణ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. -రేగట్టె వెంకటరమణ (అంగన్వాడీ టీచర్) ప్రైవేటుకు దీటుగా మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నూగూరి అర్చన ఈ యేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో΄ాటు ఆమె సొంత ఖర్చులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటే అందరూ మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. గిరిజన చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్‌కి ఆటోలు ఏర్పాటు చేసి, మరీ చదువుకు ఊతమిస్తున్నారు. అర్చన విద్యాసేవకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న అర్చన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. - నూగూరి అర్చన (ప్రధానోపాధ్యాయురాలు) ఇవి చదవండి: మనీమంత్ర కవితాగానం -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
విభిన్న రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలి
చేబ్రోలు: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది భారతదేశమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో సోమవారం 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్ కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్లను, 1,820 మందికి డిగ్రీలు, మరికొంతమందికి గోల్డ్ మెడల్స్, అవార్డులను అందజేశారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్ మినరల్స్, మెటీరియల్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఇస్రో చంద్రయాన్–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవ రహిత ప్రయోగానికి పూనుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 2035 లోపు ‘భారత స్పేస్ స్టేషన్’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఇస్రోకు ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. చంద్రయాన్–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చంద్రయాన్ నమూనాను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది చిరస్మరణీయ వేదిక అని అన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణ్ పాల్గొన్నారు. -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంతర్జాలంలో అలనాటి సినిమా ‘దోస్తి’ (1964) తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. సత్యన్‌బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. ‘బెస్ట్ ఫిల్మ్’ తో సహా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయిన రాము, కంటిచూపు లేని మోహన్ అనే ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహానికి అద్దం పట్టే చిత్రం ఇది. ఈ ఇద్దరు స్నేహితులకు పాట స్నేహితురాలు. అన్నదాత. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారి స్నేహ ప్రపంచం చెక్కు చెదరదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన సినిమాలలో ఇదొకటి. అలాగే 'స్నేహంలో విభేదాలు ఉండవు’ అని అనుకోవడానికి లేదు. ఎన్నో కారణాల వల్ల ఫ్రెండ్షిప్ బ్రేక్‌డౌన్ కావచ్చు. మళ్లీ కలుసుకోవాలని, మునపటిలా హాయిగా మాట్లాడుకోవాలని ఉన్నా ఏవో ఇగోలు అడ్డుపడుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్విజిబిలియా: థెరపీ విత్ ఫ్రెండ్స్’ అనే ట్రెండ్ మొదలైంది. అనగా ఒక సైకాలజిస్ట్ విడిపోయిన ఇద్దరు స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి లేదా రెండు మూడు రోజుల సెషన్లతో వారి స్నేహాన్ని తిరిగి పట్టాలకెక్కిస్తారు. ‘ఇదంతా ఎందుకు?’ అనుకునేవారు దూరం అయిన ఫ్రెండ్‌కు ‘సారీ రా’ అని మెసేజ్ పెట్టి చూడండి చాలు...‘సారీ’కి ఉండే పవర్ ఏమిటో మీకే తెలుస్తుంది! ఆ నలుగురు స్నేహితులు ఇంగ్లీష్ సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్, పీస్ యాక్టివిస్ట్ జాన్ లెనన్ తన ‘ఇమేజిన్’ పాటలో ఏం అంటాడు? నీ తల మీద ఆకాశం తప్ప, స్వర్గనరకాలు, మతాలు, కులాలు, సరిహద్దు ద్వేషాలు లేని ఒక కొత్త ప్రపంచం, ఆస్తులు, అంతస్తుల తేడా లేని సరికొత్త సమాజాన్ని ఊహించుకో అంటాడు. ‘ఐయామ్ ఏ డ్రీమర్ బట్ ఐయామ్ నాట్ ది వోన్లీ వన్’ అని కూడా అంటాడు. ప్రపంచంలో ఎంతోమందిలాగే ఈ పాటతో ప్రభావితమైన వాళ్లలో బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. మెలిషా, వినోద్ లోబో, నితిన్ కుమార్, విగ్నేష్‌లు ‘ఇమేజిన్’ సాంగ్ స్ఫూర్తితో ‘ఇమేజిన్ ట్రస్ట్’ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి తొలి దశలో భాగంగా ‘క్లాత్ బ్యాంక్’కు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి సేకరించిన ఈ దుస్తులను పేదలు రూపాయి ఇచ్చి కొనవచ్చు. వన్స్‌మోర్ ఫ్రెండ్షిప్ డైలాగ్‌లు నిజమైన స్నేహితులు కన్నీటి చుక్కల్లాంటి వారు. మనసు బాధగా ఉన్నప్పుడు చప్పున బయటికి వస్తారు’ ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పని ఎందుకు!’ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా నిజమైన స్నేహితుడు, స్నేహితుడి తప్పులను తన తప్పులుగా భావించి క్షమిస్తాడు. – ఏ రస్తే ప్యార్ కే స్నేహితుడు చనిపోవచ్చు. స్నేహం చనిపోదు. – ఎల్వోసీ కార్గిల్ స్నేహం అనేది ఎలా బతకాలో మాత్రమే కాదు ఎలా చావకూడదో నేర్పుతుంది. – ఏబీసీడి–ఎనీబడి కెన్ డ్యాన్స్ స్నేహితులు ఉన్న వారే అసలైన సంపన్నులు – రంగ్ దే బసంతీ స్నేహంలోని ఒక నియమం...నో సారీ...నో థ్యాంక్! – కుచ్ కుచ్ హోతా హై (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో 22న మోదీ ప్రసంగం వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు. -
రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్ ఆషాఢం ఆశ.. ఎలా అంటే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు. ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్మెంట్లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్మేట్స్ వేధించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా. ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం విజయగాథలతో స్ఫూర్తి పొంది.. కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్పాల్ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది. తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. చిన్నచూపు పోవాలి.. నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి. – నక్కా సింధు -
నాటి పేపర్ బాయ్.. నేడు అమెరికాలో సైంటిస్టు
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్ బాయ్‌గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన ఆయన పేరు డాక్టర్ రావూరి సుదీర్‌కుమార్. బాల్యం గడిచిందిలా! పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది. సైన్స్ పట్ల జిజ్ఞాస గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది. ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు. వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్‌ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్–ఐఏఆర్‌టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి. అమెరికాలో పరిశోధనలు సుదీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌పై వెళ్లారు. మెంటార్‌గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్ఐవీ వైరస్‌లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్‌ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు. కొలరాడోలోని స్టెడ్మన్ ఫిలిప్పన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎస్‌పీఆర్‌ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్ థెరఫి, స్టెమ్‌సెల్ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేశారు. గ్రాంట్ అవార్డ్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ప్లాస్టిక్ సర్జరీ ఫౌండేషన్ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్‌గా ఎన్ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్ లభించాయి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్, గెస్ట్ ఎడిటర్, సైంటిఫిక్ రివ్యూవర్‌గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్‌లో పనిచేశారు. పలు సైంటిఫిక్ సమ్మిట్స్‌కు చైర్ పర్సన్, కో చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో అఫిలియేట్ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జానీ హువర్డ్‌తో కలిసి ప్రస్తుతం సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్ (సీఆర్‌ఎస్‌ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్ (సీఆర్వీ ప్రసాద్), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం. – -డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప -
Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది
‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘ప్రవాహ్’లో పని చేస్తున్న భావి బరాద్ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది. కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక. ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్’గా ఫస్ట్ బ్యాచ్‌కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్ ఒకరు. ‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్. సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్. స్కూల్, కాలేజీలలో జెండర్ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్ కెరీర్‌కు సంబంధించి ప్యానల్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. ‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..) -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే అందరూ పని చేయాలి : భట్టి విక్రమార్క
-
మహిళలూ... పరిశ్రమించండి!
‘ఇంజినీరింగ్ సీట్ అమ్మాయిలకెందుకు?’ ఇది నలభై ఏళ్ల నాటి మాట. విద్యావంతులు కూడా కనుబొమలు ముడివేస్తున్న రోజులవి. ‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను’ సంధ్య అనే ఓ అమ్మాయి పట్టుదల అది. ‘మెకానికల్లోనా అసలే కుదరదు... కావాలంటే ఎలక్ట్రానిక్స్‌లో చేరు’ కొద్దిగా రాజీపడుతూ ఆ అమ్మాయికి సీటిచ్చారు. ఇప్పుడామె దేశ రక్షణ రంగానికి పరికరాలు సమకూరుస్తున్నారు. ఆమే కోవె డైరెక్టర్ సంధ్యారెడ్డి. చేత వచ్చిన పనులతో కుటీర పరిశ్రమ లేదా చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించా లనుకుంటూ గ్రామాల్లో ఉన్న కారణంగా ఏ మార్గమూ లేదని నిరుత్సాహ పడుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమా లను, మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఔత్సాహిక గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణనిస్తున్నారామె. హైదరాబాద్ బోరబండలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలామెకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలేమిటో వివరించారు. అవి ఆమె మాటల్లోనే... ‘‘మాది చాలా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. నాన్న హైదరాబాద్, ఎల్ఐసీలో చేసేవారు, అమ్మ గృహిణి. అమ్మ పూర్తిగా గ్రామీణ నేపథ్యం, చదువుకోలేదు. కానీ ఆమె ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలనే పట్టుదలతో ఉండేది. నాన్న కూడా ఆడపిల్లలు అనే ఆంక్షలు లేకుండా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. దాంతో నాకు అమ్మాయి అనే కారణంగా పరిమితులు తెలియదు. సమాజం చిన్న చట్రంలో ఇమిడి ఉందనే విషయం కూడా ఇంజినీరింగ్‌లో సీటు దగ్గరే మొదటిసారిగా తెలిసింది. ఇంజినీరింగ్ సీటు ఆడపిల్లలకు ఇస్తే ఆ సీటు వేస్టవుతుందనే అపోహ ఉండేదప్పట్లో. బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చి 1989లో సొంత ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత యూఎస్‌కి వెళ్లి ఎనిమిదేళ్లు ఐటీ ఇండస్ట్రీ నడిపించాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమ స్థాపించాను. మా కెన్రా టెక్నాలజీస్ ఇప్పుడు రక్షణ రంగానికి హై క్వాలిటీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, లాండ్ బేస్డ్, ఎయిర్ బోర్న్, నావల్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన పరికరాలను అందిస్తోంది. ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించానో నాకు తెలుసు. అందుకే పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం ఒక వేదిక ఉంటే బావుంటుందని భావసారూప్యం కలిగిన అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనతో 2004లో మొదలైంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (కోవె). విస్తరించిన ‘పౌష్టిక్’ కోవె దేశవ్యాప్తంగా 13 వందలకు పైగా సభ్యులతో 11 చాప్టర్స్తో పని చేస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలకే పరిమితమై పని చేసింది. గ్రామీణ, పట్టణాల్లో ఉండే మహిళలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాలకు విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘పౌష్టిక్’ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే వండి, పోటీలు జరిగే ప్రదేశానికి తెచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌లో నిర్వహించాం. ఆహారంతో మొదలుపెట్టడంలో మా ఉద్దేశం మహిళలకు పోషకాహారం ఆవశ్యకతను గుర్తు చేయడం, అందరికీ తెలిసిన ఆహారం నుంచి ఉపాధికి మార్గం వేసుకోవడం ఎలాగో నేర్పించడం అన్నమాట. మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమం రేపు ఉంది. ప్రతిచోటా వంద మంది వరకు పాల్గొంటున్నారు. పోటీల్లో గెలిచిన వాళ్లకు పోషకవిలువల గురించి వివరించగలగడం, ప్యాకేజింగ్, షెల్ఫ్‌లైఫ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లంతా అక్టోబర్ లో జరిగే లైవ్ కిచెన్ పోటీలో పాల్గొనాలి. ఈ పోటీల్లో గెలిచిన మహిళల్లో దాదాపుగా అందరూ సొంత పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారని నమ్మకం. అందిపుచ్చుకోండి కోవెని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, శ్రీలంక, ఈజిప్టు వంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్లతో అనుసంధానం చేశాం. సాధారణంగా పరిశ్రమ అనగానే మధ్యతరగతి మహిళలను అనేక రకాల భయాలు వెంటాడుతుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియల దగ్గరే వెనక్కిపోయేవాళ్లూ ఉంటారు. మహిళలకు తోడుగా ఈ పనులకు తిరగడానికి ఇంట్లో మగవాళ్లు మొదట విసిగిపోతారు. అలాంటప్పుడు ఆడవాళ్లలో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోవెలో పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఐటీ ఫైలింగ్, మార్కెటింగ్ సర్వీస్‌లన్నీ అందిస్తున్నాం. యంత్ర పరికరాలు అవసరమయ్యే పరిశ్రమల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంతో ఇన్క్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. పరిశ్రమ పెట్టాలనుకునే మహిళ తొలిదశలోనే పెట్టుబడి కోసం ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు, మేము ఏర్పాటు చేసిన ఇన్ క్యుబేషన్ సెంటర్లో పని మొదలుపెట్టి, తన మీద తనకు నమ్మకం కుదిరిన తర్వాత యంత్రాలు కొనుక్కుని సొంత పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోండి’’ అని ఔత్సాహిక మహిళలకు పిలుపునిచ్చారు సంధ్యారెడ్డి. – వాకా మంజులారెడ్డి, ఫొటో: గడిగె బాలస్వామి అవకాశాలు విస్తరించాలి! పౌష్టిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహిళల్లో రాజమండ్రి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ‘ఫుడ్ ఇండస్ట్రీ లైసెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలి’ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వాళ్ల సందేహాలను తీరుస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే... మా తరంలో ఇన్ని అవకాశాల్లేవు. ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. అనేకమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎదురీదలేక ఆగిపోయిన వాళ్లూ ఉన్నారు. నగరాల్లోనే ఇలా ఉంటే ఇక గ్రామాలు, పట్టణాల మహిళలకు ప్రయత్నం చేసే అవకాశం కూడా తక్కువే. అందుకే వాళ్ల చేత ఒక అడుగు ముందుకు వేయించాలనేదే కోవె సంకల్పం. – సంధ్యారెడ్డి కేశవరం -
పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!
‘వయసు అనేది అంకె మాత్రమే’ అనడం చాలా తేలిక. వయసును సవాలు చేయడం మాత్రం కష్టం! ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది పుష్ప భట్. 66 సంవత్సరాల వయసులో వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రామారథాన్లో పాల్గొనబోతుంది... మరో రెండురోజుల్లో ‘వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజి’లో పాల్గొనబోతోంది 66 సంవత్సరాల పుష్పభట్. ముంబైకి చెందిన పుష్ప 63 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ సాహసోపేత మారథాన్‌లో పాల్గొంది. ‘ఇలాంటి మారథాన్‌లో పాల్గొనడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. సంకల్పబలం కూడా ఉండాలి’ అంటుంది పుష్ప. తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువు కొనసాగించడానికి పదిహేడేళ్ల వయసు నుంచి చిన్నాచితకా పనులు చేస్తుండేది. ‘బీఏ పూర్తి చేయగలనా?’ అనుకుంది. చేయడమే కాదు ఆ తరువాత ఎంబీయే కూడా చేసింది. ఒక కంపెనీలో సెక్రెటరీగా చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక షిప్పింగ్ కంపెనీలో ఎక్కువ జీతంతో చేరింది. ఆ తరువాత... ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరికతో యాభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో... స్టాండర్డ్ చార్టెడ్ ముంబై మారథాన్‌లో పాల్గొనడానికి సహా ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్న సమయంలో తాను కూడా చూపింది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అనుకుంటూ నలభైఏడు సంవత్సరాల వయసులో తొలిసారిగా మారథాన్‌లో పాల్గొంది. ‘మనవల్ల ఎక్కడవుతుంది. మహా అంటే పదిహేను నిమిషాలసేపు పరుగెత్తగలనేమో’ అనుకుంది. కష్టం అనిపించినా సరే, పట్టుదలగా పరుగెత్తి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలోనే పరుగెత్తడంలో ఉన్న కష్టం ఏమిటో పుష్పభట్కు తెలిసింది. అయితే ‘మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాను’ అనే ఉత్సాహం ఆ కష్టాన్ని వెనక్కి నెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఎనిమిది ఆల్ట్రా మారథాన్స్, పదకొండు ఫుల్ మారథాన్లలో పాల్గొంది. న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనడం తనకు మరచిపోలేని అనుభవం. బ్రిడ్జీలు, జనసమూహాలను దాటుకుంటూ 4 గంటల 58 నిమిషాలు పరుగెత్తింది. ప్రయాణాలు చేయడం, ప్రయాణంలో స్ఫూర్తిదాయకమై పుస్తకాలు చదవడం, తన భావాలను కవిత్వంగా రాయడం పుష్పకు ఇష్టం. ఒకానొక సంవత్సరం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లడఖ్‌లోని ఖార్దుంగ్ లా పాస్‌కు వెళ్లింది. అప్పుడే ‘ఖార్దుంగ్ లా ఛాలెంజ్’పై ఆసక్తి కలిగింది. ‘ఇక్కడ శ్వాసించడానికే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రఫ్ అండ్ టఫ్ మార్గంలో పరుగెత్తగలనా’ అనుకుంది. శిక్షణ తీసుకున్న తరువాత బరిలోకి దిగింది. మసక మసకగా కనిపించేదారి, జారుతున్న కాళ్లు... చాలా కష్టపడాల్సి వచ్చింది. తాను గతంలో పాల్గొన్న మారథాన్లకు, సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో జరిగే మారథాన్‌కు మధ్య ఉన్న భారీ తేడాను గమనించింది. అమెరికన్ కాలేజి ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి 65 సంవత్సరాల వయసులో ‘క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్’ అనిపించుకుంది. మరింత ఉత్సాహంతో రెండోసారి ‘ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజ్’లో పాల్గొనబోతుంది. పుష్పభట్ మరోసారి అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుందాం. సుఖంగా అనిపించే పనుల్లో కంటే, కష్టంగా అనిపించే పనుల ద్వారానే మనకు క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. – పుష్ప భట్ -
నా పేరు జోన్ జండాయ్; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..
నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్‌లాండ్‌లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్‌లాండ్‌లోని యాసోథార్న్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్ జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు బ్యాంకాక్‌లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు. నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్‌లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా. ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి. ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్‌కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్‌కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది. మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్. ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా! కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు. ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను. జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అక్కడ రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి) మధ్యాహ్న భోజనానంతర నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా! మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు. చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్లో అమ్మడం వల్ల కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్‌లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం. ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు. కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్‌లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు. ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది. ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని ఫ్యాషన్‌ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం. ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు! నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పటి జీవితపు మనస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి. జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక ఇంటి కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా ఈ భూమి మీద వసించే చాలామంది వ్యక్తులకు తమ జీవితంలో ఒక ఇంటిని కలిగి ఉంటారని నమ్మలేము. కాబట్టి ఇదంతా తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు, కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) -
సౌమిత బసు.. వీల్‌చైర్ నుంచి సీఈవో వరకు
జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న ప్రయాణంలో కొన్నిసార్లు తగిలే దెబ్బలు మనిషిని పాతాళంలోకి నెట్టేస్తాయి. నాట్యమయూరిలా నాట్యం చేస్తోన్న సౌమిత బసుని కూడా అనుకోని ఉపద్రవం అథఃపాతాళంలోకి తోసేసింది. అయినా ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. తనకెదురైన చేదు అనుభవాలకు ఏమాత్రం కృంగిపోకుండా, వాటిని ప్రేరణగా తీసుకుని ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. కోల్‌కతాకు చెందిన చెందిన సౌమిత బసు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేది. భరతనాట్యం నేర్చుకుని అనేక స్టేజి ప్రదర్శనలతోపాటు, మంచి క్రియేటివ్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న 32 ఏళ్ల సౌమితను 2014లో సోరియాటిక్ ఆర్థరైటిస్ కబళించేసింది. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఎనభై శాతం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైంది. రెండేళ్లపాటు అన్నింటికి దూరంగా అలా పడుకుని ఉండాల్సి వచ్చింది. బట్టలు వేసుకోవాలన్న మరొకరి సాయం తీసుకోవాలి. ఏ పనీ సొంతంగా చేసుకోలే ని పరిస్థితిలో.. అప్పటివరకు తనలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా కోల్పోసాగింది. ఒకరోజు అనుకోకుండా ‘‘నాకు ఈ ఆర్థరైటిస్ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ పుట్టుకతోనో, ప్రమాదాల వల్లనో అవయవాలు కోల్పోయినవారు సైతం ఇటువంటి ఇబ్బందులే పడుతున్నారు. అలాంటి వారు ఎలా బట్టలు వేసుకుంటున్నారా..’’ అనిపించింది సౌమితకు. అప్పటినుంచి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలని ఆలోచించసాగింది. వీల్‌చైర్ నుంచి సీఈవోగా.. ఒకపక్క తన బట్టలు తను వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మరొకరి సాయం తీసుకోకుండా వేసుకునేలా బట్టలు ఉండాలి. తనలాంటి వాళ్లు సులభంగా వేసుకునే బట్టలు మార్కెట్లో ఏమేం ఉన్నాయా అని వెతకడం ప్రారంభించింది. ఈ వెతుకులాటలో ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లకు బట్టలు అందించే బ్రాండ్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవికూడా అంత సౌకర్యంగా లేవు అని గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో వికలాంగుల జనాభా శాతం అంత తక్కువేమి కాదు. వీరికి నప్పే బట్టలను డిజైన్ చేయగలిగితే ..వారికి సాయం చేయడంతోపాటు ఆదాయం వస్తుందని గ్రహించి తనకు తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని 2020 జనవరిలో తల్లితో కలిసి ‘జైనిక’ బ్రాండ్‌ను ప్రారంభించి స్టార్టప్‌కు సీఈవో అయ్యింది. తన కోసం చేసుకున్నవి.. ప్రారంభంలో సౌమిత తను వేసుకోవడానికి వీలుగా ఉండే వస్త్రాన్ని ఎంపికచేసి, దానితో డ్రెస్‌లు డిజైన్ చేసుకుంది. ఆ డిజైన్లు కస్టమర్లకు నచ్చి తమకూ కావాలని అడగడంతో..వారి కోరిక మేరకు డ్రెస్‌లు రూపొందించి విక్రయించేది. తరువాత ‘‘పూర్తిగా ఒకరిమీద ఆధారపడడం, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోని వారు, పాక్షికంగా ఇతరుల మీద ఆధారపడే వారు’’ ఇలా కస్టమర్లను మూడు కేటగిరీలుగా తీసుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా దుస్తులను డిజైన్ చేస్తోంది. వృద్ధులు, ఆర్థరైటిస్, పార్కిన్సన్స్, ఫైబ్రోమైలాగి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆటిజం, మస్తిష్క పక్షవాతం, క్యాన్సర్, ఫ్రోజెన్ షోల్డర్స్ వంటి అనేకరకాల సమస్యలతో బాధపడుతోన్న వారికి జైనిక డ్రెస్‌లను అందిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్లదాక.. ప్రత్యేక అవసరాలు కలిగిన స్త్రీ పురుషులకేగాక, పిల్లలకు కూడా జైనిక డ్రెస్‌లను రూపొందిస్తోంది. క్యాజువల్సే కాకుండా, వృత్తిపరమైన డ్రెస్‌లు, కొంచెం కూడా వంగకుండా వేసుకోగల ట్రౌజర్లు, డ్రెస్‌లా కట్టుకునే చీరలు, టాప్‌లు, స్త్రీలు, పురుషులు ధరించే లోదుస్తులు కూడా అందిస్తోంది. జైనిక డ్రెస్‌లు వాడుతోన్న ఎంతోమంది వికలాంగులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని చెబుతుండడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులు సైతం టాయిలెట్స్ వాడుకునే విధంగా డ్రెస్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేవలం ఇరవై ఒక్కవేల పెట్టుబడితో ప్రారంభించిన జైనిక నేడు లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో వీల్ చెయిర్లో తిరుగుతూ సౌమిత .. కోల్‌కతాలో ఉన్న తయారీ యూనిట్‌ను మిగతా ప్రాంతాలకు విస్తరించి మహిళలు, వికలాంగులకు ఉపాధి కల్పిచడం, నాణ్యతతోపాటు, పర్యావరణ హితంగా ఉండే డ్రెస్‌లు రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సెకన్లలో ధరించవచ్చు ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఒక షర్ట్ వేసుకోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది. ఇది నా స్వానుభవమేగాక నాలాంటి వారు ఎంతోమంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు. నేను డిజైన్ చేసిన షర్ట్ కేవలం తొంబైసెకన్లలో వేసుకోవచ్చు. చీర అయితే ముఫ్పై సెకన్లలోనే కట్టుకోవచ్చు. ఇప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా శరీర తత్వాన్ని బట్టి సౌకర్యవంతంగా... ఫ్యాషన్‌బుల్‌గా ఉండే డిౖజñ న్లను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నాను. నా ఆరోగ్యం బాగోనప్పుడు అమ్మే అన్నీ తానై చూసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. – సౌమిత బసు, సీఈవో జైనిక -
ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత
స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు. మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు. దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే. భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్’ చేయాల్సిందే. అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది.. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది. పలమనేరు: ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న(టీసీ) రాజన్ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను. గ్రామాల్లో తిరిగాను గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్ పోస్టులుండేవి. ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. ఊరూరా పండగే జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు. శాకాహారిని నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు. ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను. ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. – టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లోనే పరిచయాలు టెలిగ్రాఫ్లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు టెలిఫోన్ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం. - నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ -
చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ
ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. గూడూరు(తిరుపతి జిల్లా): ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్‌రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్ కళాశాలలో పూర్తయింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్‌లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ మాస్‌కమ్యూనికేషన్ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు డిప్లొమో ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమో ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్ కమ్యూనికేషన్ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. పది మందికి సహాయపడాలని.. చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో.. ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. – శివకుమార్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు రోడ్డు దాటేందుకే గంట.. నేను 2001లో హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్‌కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. .. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్ దిక్సూచి ఆయన చలువతోనే.. శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. – బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో.. నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. – యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం భుజం తట్టండి.. చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం. – ఎస్.తరుణ్, కొణిదెల, కర్నూల్ జిల్లా -
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
వయసు 9.. మొక్కలు నాటడంలో సు'ప్రసిద్ధి'
తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్‌కి ‘డయానా అవార్డ్ 2022’ దక్కింది. ఆ అమ్మాయిని అంతా ‘ఎకో వారియర్’ అంటారు. ‘క్లయిమేట్ ఛాంపియన్’ అని కూడా. ఎందుకు? మొక్కలు నాటుతుంది. చెట్లను పెంచుతుంది. అడవులను నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికి 28 పండ్లతోటలు ప్రసిద్ధి ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్నాయి. పచ్చగా లేని ప్రపంచంలో జీవించలేము అంటుంది ప్రసిద్ధి. ఈ వానాకాలంలో ప్రసిద్ధిలా ఆలోచిస్తే నాలుగు మొక్కలు కనీసం కుండీల్లో అయినా పడతాయి. మూడేళ్ల పిల్లలు మట్టితో ఆడుకుంటారు. కాని ప్రసిద్ధి సింగ్ మొక్కలతో ఆడుకుంది. వాళ్ల నాన్న ప్రవీణ్ సింగ్ ఆ పాపను మూడేళ్ల వయసు నుంచే మొక్కలతో పరిచయం చేయించాడు. పాప చేత మొదటగా పెరట్లో నాటించింది ‘మిరప గింజల’ని. అవి మొక్కలుగా ఎదగడం చూసి ఆశ్చర్యపోయింది ప్రసిద్ధి. తండ్రి, కూతురు కలిసి దక్షిణ చెన్నై శివార్లలో ఉండే ‘మహేంద్ర వరల్డ్ సిటీ’లో ఉంటారు. దానికదే ఒక ప్రపంచం. పచ్చగా ఉండేది. అయితే 2016లో అంటే ప్రసిద్ధికి మూడేళ్ల వయసులో వచ్చిన వర్ధా తుఫాను ఆ పచ్చదనాన్ని ధ్వంసం చేసింది. చిన్నారి ప్రసిద్ధి మీద ఆ విధ్వంసం ముద్ర వేసింది. ‘నువ్వు మొక్కలు పెంచాలి. చూడు ఎలా నాశనం అయ్యాయో’ అని తండ్రి చెప్పిన మాట పని చేసింది. అంత చిన్న వయసులో అందరు పిల్లలూ ఆడుకుంటుంటే తనకు చేతనైన మొక్కలు నాటడం మొదలెట్టింది ప్రసిద్ధి. అది మొదలు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రసిద్ధి ఫౌండేషన్ ‘నాకు చెట్లన్నా, తేనెటీగలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకు అని చెప్తాయి చెట్లు. నలుగురిని కలుపుకుని పని చెయ్ అంటాయి తేనెటీగలు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెబుతుంది సముద్రం. అందుకే అవి నాకు స్ఫూర్తి’ అంటుంది ప్రసిద్ధి. చెట్లమీద ప్రేమతో 6 ఏళ్ల వయసులోనే ‘ప్రసిద్ధి ఫౌండేషన్’ను స్థాపించింది. ‘నా చేతుల మీదుగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించాను’ అంటుంది ప్రసిద్ధి. ఇప్పటికి ఎన్ని నాటిందో తెలుసా? 46,000. అవును... అన్ని వేల మొక్కలు ప్రసిద్ధి పూనిక వల్లే పచ్చగా తలలు ఎత్తాయి. అందుకే అందరూ ప్రసిద్ధి క్లయిమేట్ ఛాంపియన్ అంటున్నారు. పండ్ల మొక్కలే లక్ష్యం జపాన్‌కు చెందిన ‘అకిర మియావకి’ గొప్ప పర్యావరణవేత్త. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ అడవులను తలపించే ‘మియావకి ఫారెస్ట్’ను అతడు వృద్ధి చేశాడు. అంటే ఇందులో అన్నిరకాల చెట్లు, మొక్కలు, తీగలు ఉండి దానికదే ఒక అడవిగా మారుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘ఫూట్ ఫారెస్ట్’లను చెన్నై చుట్టుపక్కల వృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అయితే తాను పెంచదలుచుకున్నవన్నీ స్థానిక (భారతీయ) పండ్ల మొక్కలే. ‘నాకు ఫ్రూట్ ఫారెస్ట్లు పెంచాలని ఎందుకు అనిపించిందంటే పండ్లు జనానికి అందుతాయి, తింటారు అని. ఇవాళ అన్ని రసాయనాల పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రసాయనాలు లేని పండ్లు అందించాలి’ అంటుంది ప్రసిద్ధి. మామిడి, జామ, సపోట, నారింజ, నిమ్మ, రేగు, తాటి, సీమచింత ఇలా దేశీయంగా ఉండే పండ్ల మొక్కలు, చెట్లను పెంచడం ప్రసిద్ధి లక్ష్యం. 28 పండ్ల తోటలు ప్రసిద్ధి పెంచుతున్న ఫ్రూట్ ఫారెస్ట్‌లను మనం పండ్ల తోటలు అనవచ్చు. ఈ తోటలు ఎలా పెంచుతుంది? ‘భాగస్వామ్యం వల్ల’ అంటుంది ప్రసిద్ధి. స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పారిశ్రామిక సంస్థలకు ఉన్న ఖాళీ స్థలాలు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలు వీటిని పండ్లతోటలకు ఇమ్మని అభ్యర్థిస్తుంది. ఫౌండేషన్‌లో స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ స్థలాలను గుర్తిస్తారు. ప్రసిద్ధి ఆ యాజమాన్యాలకు లేఖలు రాస్తుంది. ‘వారిని ఒప్పించడం కష్టమే గాని పరిస్థితి వివరిస్తే ఒప్పుకుంటారు’ అంటుంది నవ్వుతూ. అంతెందుకు? ప్రసిద్ధి తాను చదువుతున్న మహేంద్ర వరల్డ్ స్కూల్లో వంద పండ్ల మొక్కలు నాటింది. అవి ఎదుగుతున్నాయి. ఒకసారి స్థలం దొరికాక తన కార్యకర్తలు వెళ్లి ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొక్కల్ని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలోని మొక్కల్ని తీసుకెళ్లి ప్రసిద్ధి ఆధ్వర్యంలో నాటుతారు. ‘మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను’ అంటుంది ప్రసిద్ధి. ప్రసిద్ధి చేస్తున్న పనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. సహకరిస్తున్నారు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రసిద్ధి అనేక నగరాలకు తిరుగుతూ పర్యావరణ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి ప్రకృతిని ఏదో ఒక స్థాయిలో కాపాడాలని చూస్తోంది. ఇది చదివాక మన వంతు. మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను. – ప్రసిద్ధి సింగ్ -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది
కన్నీటి సముద్రంలో మునిగిపోతే... కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. పనే దైవం అనుకుంటే... ఆ దైవమే దారి చూపుతుంది. ఇది ఇంద్రావతి నిజజీవిత కథ... ఇంద్రావతికి బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నయ్య మనోజ్ తనకు బైక్‌రైడింగ్ నేర్పించాడు. ఇంద్రావతి బైక్‌పై రాజసంగా వెళుతుంటే చూసి మురిసిపోయేవాడు. అలాంటి అన్నయ్య ఒక దురదృష్టకరమైన రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే...ఆ కుటుంబంపై పిడుగు పడింది. మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు చిన్నాచితక పనులు చేస్తారు. మనోజ్ చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతమే వారికి ప్రధాన ఆధారం. ఇంటికి నిట్టాడిలాంటి కొడుకు చనిపోవడంతో ఇంద్రావతి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుమిలేపోయేవారు తల్లిదండ్రులు. అయితే ఇంద్రావతి ప్రస్తుతం వారికి భవిష్యత్‌గా మారింది. అన్నయ్య జ్ఞాపకాలు అనంతమైన దుఃఖాన్ని మోసుకొస్తూ తనను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో...ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఇంద్రావతి. ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఆ ఆలోచన మానుకుంది. ‘ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఏదైనా పనిలో పడితే మంచిది’ అని పెద్దలు సలహా ఇచ్చారు. ‘ఏంచేయాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ గురించి విన్నది. ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (ప్రధాన్) సంస్థ సహాయంతో బైక్ రిపేరింగ్ నేర్చుకుంది. ఆతరువాత...మెకానిక్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జబల్పూర్లోని టూ–వీలర్ సర్వీస్ సెంటర్లో ఇంద్రావతికి ఉద్యోగం వచ్చింది. ఒకవైపు బైక్‌లు రిపేర్ చేస్తూనే, మరోవైపు చదువు కొనసాగించింది. ‘ఆడపిల్లలకు బైక్ రిపేర్ చేయడం ఏం వస్తుంది!’ అంటూ మొదట్లో ఆమె దగ్గరికి రావడానికి సంశయించేవారు. అయితే రోజులు గడిచేకొద్దీ∙ఇంద్రావతి ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా, బైక్‌లను వేగంగా రిపేర్ చేయడంలో మరింత ప్రావీణ్యం సంపాదించింది. సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఇంద్రావతి నారాయణ్‌గంజ్‌లో ఒక వర్క్‌షాప్ మొదలు పెట్టి, పేదింటి అమ్మాయిలకు బైక్ రిపేరింగ్ నేర్పించి వారికి ఉపాధి మార్గాలు చూపించాలనుకుంటుంది. ‘బైక్ రిపేరింగ్ అనేది నాకు ఆత్మసై్థర్యాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్నీ ఇచ్చింది. ఏ దారిలో వెళ్లాలో తెలియక ఒకప్పుడు నేను అయోమయానికి గురయ్యాను. నాలాంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారికి ధైర్యం చెప్పి, పని నేర్పితే సొంతకాళ్ల మీద నిలబడతారు’ అంటుంది ఇంద్రావతి. ‘నెల నెలా ఠంచనుగా వచ్చే జీతాన్ని వదులుకొని రిస్క్ తీసుకోవడం ఎందుకు?’ అంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇంద్రావతికి వారి మాటలు వినిపించడం లేదు. లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది! -
ఒకసారి టర్నోవర్ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..!
ఏమీ లేని చోట కూడా వనరుల కల్పనకు కృషి చేయవచ్చు అని నిరూపించారు సాకా శైలజ. బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దారు. వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి లేని రోజుల నుంచి కోటి రూపాయల టర్నోవర్ చేరేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో రోజాస్ ఇండస్ట్రీ పేరుతో సినోవ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్న సాకా శైలజ జీవన ప్రయాణం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేసే సంస్థను నడుపుతున్నారు శైలజ. ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్ హౌస్ క్లీనర్స్‌ను తయారుచేసే కంపెనీయే కాదు, బ్యూటిషియన్ కోర్సులనూ ఇస్తున్నారు. ఇరవై ఏళ్లలో 30 వేల మంది మగువలను బ్యూటీషియన్లుగా తీర్చిద్దారు. పాతికేళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యాపారం గురించి శైలజ వివరిస్తూ.. అడవిలో ఇంగ్లిషు పాఠాలు ‘‘నాకు పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారికి టీచర్‌గా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోస్టింగ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, డిగ్రీ చేసిన నేను పెళ్లవగానే ఓ అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ టైమ్‌లో అక్కడి పిల్లలను చేరదీసి, ఇంగ్లిష్ నేర్పించేదాన్ని. దానినే ట్యూషన్‌గా మార్చుకున్నాను. అలా ఆర్నెళ్లు తిరిగేసరికి మా వారికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో హైదరాబాద్ వచ్చినప్పుడు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నాను. మా వారికి సిరిసిల్ల ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ బ్యూటీపార్లర్ ఏర్పాటుకు ప్రయత్నించా. చాలా మంది విమర్శించారు ఊళ్లో బ్యూటీపార్లరా అని. ఇల్లు కూడా ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. దళిత్ అనే వివక్ష కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నాను. చివరకు అద్దె వరకు ఆదాయం వచ్చినా చాలని ఒక రూమ్‌లో పార్లర్ ప్రారంభించాను. ఉచితంగా శిక్షణ పార్లర్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలు ఇంటి వద్ద బీడీలు చుడతామని చెప్పారు. అలా వచ్చే ఆదాయం వారికేం సరిపోతుందని, బ్యూటిషియన్ పని నేర్పించాను. అలా మరికొంత మంది అమ్మాయిలు చేరారు. వారికీ ఉచితంగా శిక్షణ ఇచ్చాను. హైదరాబాద్‌లోని బ్యూటీ సెలూన్ వారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్. ఇక్కడా మరో బ్రాంచ్ ప్రారంభించి, బ్యూటీపార్లర్ నడుపుతూ, మహిళలకు శిక్షణ ఇస్తూ వచ్చాను. అలా బ్యూటీ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తుల తయారీ ఒక డాక్టర్ని కలిసినప్పుడు, ‘మీ వర్క్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరమో మీకు బాగా తెలుసు కాబట్టి వాటిని మీరే తయారుచేయవచ్చు కదా’ అన్నారు. అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, బ్యాంక్‌కు వెళ్లాను. అది కోటి రూపాయల ప్రాజెక్ట్. నేనెప్పుడూ చూడని అంకె అది. కానీ, ప్రయత్నించాను. నెల రోజులకు బ్యాంక్ లోన్ వచ్చింది. అప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించాను. మార్కెట్ పెద్ద టాస్క్ ఉత్పత్తుల తయారీ చాలా బాగుంది. మా పార్లర్స్‌లోనే వాటిని ఉపయోగిస్తున్నాం. బయట కూడా మార్కెట్ చేయాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్లో స్లాట్ ఓకే అయ్యింది. అక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు, ఫారినర్స్ చూసి ఆర్డర్ ఇచ్చారు. మా యూనిట్‌కి వచ్చి, చూసి, ప్రతీది తెలుసుకున్నారు. ప్రతి యేడాది కోటి రూపాయల మార్కెట్ చేస్తున్నాను. కరోనా వేసిన వేటు ఈ యేడాది మార్చ్ వరకు 70 లక్షల టర్నోవర్ చేశాను. మార్కెట్ పెరగడానికి కరోనా ఓ అడ్డంకి అయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసి వేశారు. కానీ, నేను ఆగకుండా నడిపించాను. కరోనా టైమ్‌లోనే చైనా బార్డర్లో ఉన్న ప్రాంతానికి ఆరు రోజుల ఆలశ్యంగా ప్రొడక్ట్ డెలివరీ అయ్యింది. లేట్ అయ్యిందనే కారణంతో ప్రొడక్ట్‌ని రిజక్ట్ చేశారు. దానిని వెళ్లి తీసుకురాలేక వదిలేయాల్సి వచ్చింది. కరోనా సీజన్లో నా దగ్గర డబ్బు లేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టాను. అదే సమయంలో రా మెటీరియల్ సప్లయ్ చేసే అతని ఆరోగ్యం బాగోలేక, డబ్బు వెంటనే కావాలన్నారు. ఆ సమయంలో వేరే దారిలేదు. నా మెడలో పుస్తెలతాడు, గాజులు, చెవి కమ్మలు తీసి మా అబ్బాయితో బ్యాంక్‌కు పంపించాను. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. బ్యాలెన్స్ ఒక సవాల్ ఇటీవల మా వారికి గుండెపోటు వచ్చింది. ఇదే సమయంలో కంపెనీ స్థలం ఓనర్ ఆ భూమిని వేరొకరికి అమ్మారు. దీంతో ఎటూ తేల్చుకోలేక, లాయర్ సలహా తీసుకున్నాను. మా వారి ఆరోగ్యం, పిల్లలు, కంపెనీ.. దేనినీ వదులుకోలేను. అలాగే, సమస్య అంటూ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కౌన్సెలింగ్, సాయం ఎలాగూ ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమిస్తేనే విజయం. వర్కింగ్ క్యాపిటల్ పెరిగితే ఐదు కోట్ల బిజినెస్ చేయాలన్నది ఈ యేడాది ప్లానింగ్. బ్యూటిషియన్ స్కూల్‌తో పాటు, ప్రొడక్ట్స్ తయారీలోనూ అంతా మహిళలే. ఒక్కోసారి ఇంతమందికి ఉపాధి కల్పించాం కదా అని గర్వంగా ఉంటుంది. నా దగ్గర పనిచేసే మహిళలు కూడా సొంతంగా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాను’’ అని వివరించారు శైలజ. – నిర్మలారెడ్డి -
బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా?
మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువస్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సాధించాడు. మరి బ్రూస్ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్ భక్ష్ భట్.. అలియాస్ గ్రేట్ గామా ఫహిల్వాన్. గామా ఫహిల్వాన్ ఫిజిక్కు ముచ్చటపడిన బ్రూస్ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్ ఎక్సర్సైజ్ ఫుటేజీలు, రెజ్లింగ్ టెక్నిక్స్‌ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్‌ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్ దారి చూపాడని బ్రూస్ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాగా గామా ఫహిల్వాన్ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ అతని ఫోటోను డూడుల్‌గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్ గూగూల్‌కు గామా ఫహిల్వాన్ కార్టూన్‌ను గీసిచ్చాడు. భారత రెజ్లర్‌గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్ భక్ష్ భట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్‌లో ఓటమి ఎరుగని రెజ్లర్‌గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్ రాసుకొచ్చింది. మహ్మద్ భక్ష్ భట్ తన అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో 1910లో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్, 1927లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత టైగర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు. Gama Pehelwan's 124th Birthday pic.twitter.com/8j5kQrDXbV — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం
19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్ అనే ఫౌండేషన్ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ. సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు. వెలుగు రేఖ వెతకాలి జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం. – రవి వర్మ ఇటువంటి యాత్రలంటే ఇష్టం రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం. రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది. – తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత. సాహసయాత్ర ప్రారంభం వీలుచైర్ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!) -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
ఫ్యాబ్రిక్ ఇంజినీర్!
‘‘జీవితంలో అది అవ్వాలనుకుని ఇదయ్యాం! కాలం కలిసి రాక నేను అనుకున్నది జరగలేదు అందుకే చివరికి ఇలా స్థిరపడ్డాను’’ అని వాపోతుంటారు చాలామంది. అయితే, మనలో నైపుణ్యం, సాధించాలన్న పట్టుదల, అడుగు ముందుకేసే ధైర్యం ఉంటే.. కాస్త ఆలస్యం అయినా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు సంజుక్తా దత్త. అసోంలోని నాగౌన్ జిల్లాలో పుట్టిన సంజుక్తా దత్తాకు చిన్నప్పటినుంచి చీరలంటే మక్కువ. అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్ (రెండు రకాల బట్ట, రంగులలో తయారయ్యే చీర) అంటే బాగా ఇష్టం. ఈ చీరలను మరింత అందంగా ఎలా తీర్చిదిద్దవచ్చో ఆలోచించి, వివిధ రకాల డిజైన్లతో చీరలు రూపొందించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొన్ని తనకోసం తయారు చేసేది. అవి అందర్నీ ఆకర్షిస్తుండడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ల ఇష్టం మేరకు ఇంజినీరింగ్ చదివింది. ఇంజినీరింగ్ అయిన వెంటనే ఉద్యోగం రావడంతో ‘అసోం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్’లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన మనసు మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఉంది. పదేళ్ల ఉద్యోగం వదిలేసి... ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తనకిష్టమైన ఫ్యాబ్రిక్ డిజైన్ ను చేస్తుండేది. తన డిజైన్లు నచ్చిన వారంతా ‘చాలా బావున్నాయి’ అని పదేపదే పొగుడుతుండడంతో... ఫ్యాషన్ డిజైనింగ్‌కు పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంది. పదేళ్లుగా చేస్తోన్న ఇంజినీర్ ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి, గువహటీలో మేఖల ఛాడర్ల చేనేత యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో స్వయంగా డిజైన్ చేసిన వస్త్రాలను ఏడాదిన్నరలోనే మూడు వేల వరకు విక్రయించింది సంజుక్తా. ఒక్క యూనిట్‌తో ప్రారంభమైన సంజుక్తా చేనేత యూనిట్ రెండేళ్లలోనే వందల యూనిట్లుగా విస్తరించింది. దాంతో కమర్షియల్ బోటిక్‌ను కూడా ప్రారంభించింది. ఈ బోటిక్‌ను కొనుగోలుదారులు కూడా సందర్శించే వీలు కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోత్సాహంతో అస్సామీ సాంప్రదాయ జ్యూవెల్లరి దగ్ దుగి, కెరు మోనీ, జున్ బైరీలను సరికొత్తగా తీర్చిదిద్ది విక్రయించింది. ఒకపక్క అస్సామీ పట్టు, మరోపక్క సాంప్రదాయ జ్యూవెల్లరీలను తనదైన డిజైన్లతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేసింది. అస్సామీ పట్టు ఎంతో నైపుణ్యం కలిగిన ఛాడర్ కళాకారులతోనే మేఖల ఛాడర్ను తయారు చేయించడం సంజుక్తా డిజైన్ల ప్రత్యేకత. స్థానికంగా దొరికే పట్టు దారాలు, ఛాడర్లను అనుభవజ్ఞులైన చేనేత కళాకారులతో రూపొందిస్తోంది. ప్రస్తుతం సంజుక్తా స్టూడియో, యూనిట్లలో వందలసంఖ్యలో కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్క గువహటీలోనేగాక ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ధరించే ఈ ఛాడర్లకు మంచి డిమాండ్ ఉండడంతో సంజుక్తా డిజైన్లు త్వరగానే పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కూడా మరిన్ని ఆర్డర్లు తీసుకుంటూ తన డిజైన్ లను దేశం నలుమూలలకు విస్తరించి, ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఆల్ఫూల్.. కరిష్మాకపూర్, బిపాషా బసు, హేమమాలిని, జహీర్‌ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్‌లను పలు ఈవెంట్లలో ధరించారు. బ్రిటిష్ రాజవంశానికి చెందిన కేట్ మిడిల్టన్ 2015లో ‘కాజీరంగా జాతీయ పార్క్’ సందర్శించినప్పుడు సంజుక్త రూపొందించిన డ్రెస్‌ను ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోన్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ – 2022లో ‘ఆల్ఫూల్’ పేరిట తన కొత్త డిజైను ప్రదర్శించింది. అసోం పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్ స్కర్ట్స్ ఇండో వెస్ట్రన్ లెహంగాలను రూపొందించి, 25 రోజులపాటు సమయం కేటాయించి తుదిమెరుగులు దిద్దారు. దీంతో ధగధగ మెరుస్తోన్న పట్టు డ్రెస్‌లు చూపరులనే గాక అంతర్జాతీయ డిజైనర్లనూ ఆకట్టుకుంటున్నాయి. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
ఈ అక్కచెల్లెళ్లు సూపర్..
సాక్షి, కామారెడ్డి: వాళ్లిద్దరు అక్కా చెల్లెళ్లు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నరు. సొంత ఇళ్లు లేదు. సొంతంగా పంట భూమి కూడా లేదు. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరిలా కాకుండా పద్దతిగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మగవారికి ధీటుగా మంచి పంటలు పండిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వలు చేస్తున్న పంటల సాగు నలుగురికి మెచ్చేలా, నచ్చేలా ఉంటోంది. పొద్దున నిద్రలేచి ఇద్దరూ కలిసి వంట పని చేసుకుని సద్దిమూటతో కాలినడకన పొలం బాటపడతారు. సాయంత్రానికి గానీ ఇంటికి రారు. మగవారికి ధీటుగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెద్ద మల్లవ్వకు కూతురు జమున ఏడాదిన్నర వయసులో ఉన్నపుడు భర్త గంగారెడ్డి చనిపోయాడు. దీంతో తల్లిగారి ఊరయిన కుప్రియాల్‌కు వచ్చి ఉంటోంది. కూలీనాలీ చేసి బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. చిన్న మల్లవ్వ భర్తకు దూరమై అక్కతో కలిసి ఉంటోంది. పదేళ్లుగా అక్కా చెల్లెల్లిద్దరూ అద్దె ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వెంకటరెడ్డికిక చెందిన నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూమి యజమాని సహకారంతో ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆధునిక పద్దతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రెండెకరాల్లో చెరకు పంట, ఎకరంనర భూమిలో వరి సాగు చేస్తున్నారు. మిగతా స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు. చెరకు సాగులో అధిక దిగుబడులు.... ఈ అక్కాచెల్లెల్లు సాగు చేస్తున్న చెరకు పంట అధిక దిగుబడులు వస్తోంది. నాటడం నుంచి అన్ని పనులూ వీళ్లిద్దరే చేసుకుంటారు. చెరకు నరకడానికి మాత్రమే కూలీలు వస్తారు. మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. చెరకు నాటడం, కలుపు తీయడం నుంచి ప్రతీ పని వాళ్లే చేసుకుంటారు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. గత ఏడాది ఎకరాకు 55 టన్నుల దిగుబడి సాధించారు. ప్రతీ సంవత్సరం చెరకు సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పంటకు కోడి ఎరువు, పశువుల పేడ వాడుతారు. చాలా మంది వీళ్ల సాగు విధానాన్ని చూసి వెళుతుంటారు. గాయత్రీ షుగర్స్ అధికారులు కూడా మల్లవ్వలు సాగు చేస్తున్న పంటను చూడమని ఇతర గ్రామాల రైతులకు చెబుతుంటారు. కూలీకి వెళ్లరు..కూలీలను పిలవరు... ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాము సాగు చేస్తున్న పంట చేనుదగ్గరకు ప్రతీ రోజూ వెళ్లి పనులు చూసుకుంటారు. గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలం దగ్గరికి కాలినడకన వస్తారు. సాయంత్రం తిరిగి కలిసి వెళతారు. ఏ ఒక్కనాడూ కూలీ పనులకు వెళ్లరు. తమ పొలానికి కూలీలను పిలవరు. పంటకు రసాయన ఎరువులను కూడా వీళ్లే పిచికారీ చేస్తారు. భుజానికి స్ప్రే పంప్ తగిలించుకుని దర్జాగా పొలంలో తిరుగుతూ పంటకు పిచికారీ చేస్తారు. ప్రతీ పనిని తామే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే కూరగాయల సాగు ద్వారా చేతి ఖర్చులన్నీ వెల్లదీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంది.... మాకు సొంత భూమి లేకున్నా వెంకటరెడ్డి సారు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నం. మాకు సారు అన్ని విధాల సహకారం అందిస్తారు. పొలం పని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలే వస్తాయి. ఎప్పుడో ఒక సారి నష్టం రావచ్చు. రెక్కల కష్టం నమ్ముకుని బతుకుతున్న మాకైతే మంచిగనే ఉన్నది. ఎవల మీద ఆధారపడకుండా మా పని మేము చేసుకుని బతుకుతున్నం. మాకు సొంత ఇళ్లు లేదు. జాగ లేదు. అదొక్కటే బాధ ఉంది. వంగి కష్టం చేస్తే మంచి పంటలు తీయవచ్చు. –పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వ -
నెలల వయసున్న చిన్నారికి.. ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు. చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు.. కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్ కర్నేవాలోకీ హార్ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది. మంచంపైన కొన్ని దిండులు, బెడ్షీట్లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్షిట్ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్షిట్ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది. ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. -
‘ఇది చూస్తే చాలు భయాలన్నీ పోతాయ్’- ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: వ్యక్తిగత జీవితమైనా వ్యాపారమైనా ఎత్తు పల్లాలు సహాజం. కానీ కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు.. ఆ విపత్కర పరిస్థితులను ఎలా అధిగమించామన్నది ఎంతో కీలకం. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపార రంగంలో ఉన్న వారు నిరంతరం ఒడిదుడుకుల మార్గంలో పయణిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తనకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే ఓ వీడియోను మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఓ చిన్నారి గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతీ కదలిక కష్టంగా ఉంటుంది. అయినా సరే చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ చిన్నారి.. చివరకు గోడను ఎక్కేస్తుంది. This video is from a couple of years ago, but I don’t think it will ever be ‘dated.’ I like to put it on every now & then, especially when some personal or business goal is looking intimidating or impossible! All my fears vanish instantly… pic.twitter.com/9XtuyBVxwJ — anand mahindra (@anandmahindra) November 8, 2021 ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా ‘ ఈ వీడియో రెండేళ్ల కిందటిది. కానీ ఇది అవుట్డేడెట్ అనుకోవడం లేదు. చాలా తరచుగా ఈ వీడియోను నేను చూస్తుంటాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా, బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు.. ఈ పని చేయలేం.. అసాధ్యం అనిపించినప్పుడు తప్పకుండా చూస్తాను. వెంటనే నా భయాలన్నీ మాయం అవుతాయి’ అంటు చెప్పుకొచ్చారు. చదవండి:మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్ మహీంద్రా -
ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం
సాక్షి, వెబ్‌డెస్క్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపితం చేశాడు.. ప్రమోద్ భగత్. 1988 జూన్ 4న ఒడిశాలో జన్మించాడు. చిన్న వయసులోనే ప్రమోద్ భగత్ పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు. అలా బ్యాడ్మింటన్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్‌వన్ పారా షట్లర్‌గా ఎదిగాడు. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3 కేటగిరీలో ప్రపంచనెంబర్‌వన్‌గా ఎదిగిన ప్రమోద్ భగత్ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం. చదవండి: చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రమోద్ భగత్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్‌ను ఆడుతుండగా చూసిన ప్రమోద్ దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్ కొల్లగొట్టాడు. అనంతరం పారా బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసిన ప్రమోద్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్ వేదికగా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీ పడిన ప్రమోద్ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారిలో ప్రమోద్ భగత్ ముందు వరుసలో ఉండగా.. తాజా విజయంతో దానిని సాకారం చేశాడు. చదవండి: అంధ అథ్లెట్‌కు ట్రాక్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన గైడ్ ప్రమోద్ భగత్ సాధించిన పతకాలు.. రికార్డులు ►SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రమోద్ భగత్ రికార్డు ►ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్, డబుల్స్ ,మిక్సడ్ డబుల్స్ ఈవెంట్లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం. ►ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు. ►ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్, కాంస్య పతకాలు ►2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు. ►RYLA ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు Meet World No. 1 Para-Shuttler @PramodBhagat83 who has 4 BWF World Championships titles under his name. With hard work & determination, he is now ready to win a medal for 🇮🇳 at @Tokyo2020 #Paralympics Let us #Cheer4India #Praise4Para @PMOIndia @ianuragthakur @NisithPramanik pic.twitter.com/OPzP3SQa6n — SAI Media (@Media_SAI) August 17, 2021 #RaiseARacket 🏸 for Team India's 🇮🇳 medal contender at the @Paralympics in the SL3 category, Pramod Bhagat.#Tokyo2020 Qualifiers 👉 https://t.co/qPz99LGlUs#BadmintonUnlimited pic.twitter.com/B3eRnfa8gD — BWF (@bwfmedia) August 12, 2021 India continues to impress at #Tokyoparalympics2020. History created by #PramodBhagat. Congrats to him for winning #gold medal in Men’s Badminton SL3 category. This is a special moment for all Indians.#ParaBadminton pic.twitter.com/aafvzUmEqv — Y. Satya Kumar (@satyakumar_y) September 4, 2021 -
Two Years YS Jagan Ane Nenu: టార్చ్ బేరర్
వెబ్‌డెస్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన అనుభవం రెండేళ్లు. కానీ పథకాలు ప్రవేశ పెట్టడంలో.. ప్రజా రంజక పాలన సాగించడంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజల మధ్య గడిపిన అనుభవంతో ప్రజల నాడి పట్టుకున్నారు, వాళ్ల అవసరాలేంటో తెలుసుకున్నారు. వారి అక్కర తీర్చడంలో ఓ అన్నలా అలోచించి.. ఓ సీఎంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశానికే టార్చ్ బేరర్‌గా మారారు. అందుకు ఉదాహరణ కరోనా సంక్షోభ సమయంలో ఆనాథ పిల్లల సమస్యలను గుర్తించడంలో ఆయన ముందు చూపు, వారిని ఆదుకోవడంలో ఆయన చూపిన ఆతృత ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మేనమామగా కోవిడ్ మహమ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు చిద్రమైపోయాయి. ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. కానీ వీరందరి కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులు. ఆ చిన్నారుల సమస్యను అందరి కంటే ముందుగా పసిగట్టి దానికో పరిష్కారమార్గం చూపి తనలోని మానవీయ కోణం చాటుకున్నారు సీఎం జగన్. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి భరోసా కల్పించారు. వారికి ఉచితంగా చదువు చెప్పించి.. 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతీ సభలో అక్కా చెల్లెమ్మలంటూ నోరారా మహిళలను పిలిచే ముఖ్యమంత్రి జగన్... కోవిడ్ రక్కసికి బలైన అక్కా చెల్లెమ్మల పిల్లలకు మేనమామగా అసరా ఇచ్చారు.. తల్లిదండ్రులు లేని లోటు కొంతైనా పూడ్చేందుకు ప్రయత్నించారు. జగన్ బాటలో ఇతర సీఎంలు జగన్ సర్కారు నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. సీఎం జగన్ నిర్ణయం ప్రకటించిన కొద్ది కాలానికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అదే బాట పట్టారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు , లేదా వారిలో ఒక్కరిని కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రతీ విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా వారికి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,500 నగదు సాయం చేస్తామని ప్రకటించారు. మిగిలిన దేశం కంటే ఒక రోజు ముందుండే కేరళ కూడా ఈ విషయంలో ఏపీ కంటే వెనుకే ఉండి పోయింది. సీఎం జగన్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే పినరయి విజయన్ కూడా ముందుకు వచ్చారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు తక్షణ సాయంగా మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు వారికి ఉచితంగా విద్య అందిస్తామని హమీ ఇచ్చారు. అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇక తమిళనాడు సీఎంగా ఇటీవలే పదవి పగ్గాలు చేపట్టిన ఎంకే స్టాలిన్ రూ. 5,00,000 లక్షల సాయం ప్రకటించారు. ఏపీ బాటలో కేంద్రం ఆఖరికి కేంద్రం కూడా ఏపీ సీఎం జగన్‌ను అనుసరించక తప్పలేదు. కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే స్కాలర్షిప్ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారి పేరిట రూ. 10 లక్షల కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తామంది. వారికి 23 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము అందిస్తామంది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
కోహ్లితో సంభాషణ.. ఆటతీరు మొత్తం మారిపోయింది
జమైకా: గతేడాది జూన్ 2020లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టెస్టు సిరీస్ తర్వాత పర్యటన రద్దైంది. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ సిరీస్‌లో మొదటి టెస్టును విండీస్ జట్టు గెలిచి అప్పట్లో సంచలనానికి తెరదీసింది. దీనికి ప్రధాన కారణం.. విండీస్ వైస్ కెప్టెన్ జెర్మైన్ బ్లాక్‌వుడ్. మొదటి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను బ్లాక్‌వుడ్ తన బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో 154 బంతుల్లో 95 పరుగులు చేసిన బ్లాక్‌వుడ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్ క్రికెటర్లలో దాదాపు అందరూ పొడుగ్గా ఉంటే .. బ్లాక్‌వుడ్ మాత్రం చాలా పొట్టిగా ఉంటాడు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు గెలిచిన తర్వాత బ్లాక్‌వుడ్‌ను అందరూ పొట్టోడు చాలా గట్టోడు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌వుడ్ మొత్తం రెండు హాఫ్ సెంచరీల సాయంతో 211 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడంపై ఒక వ్యక్తి కారణమంటూ జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇన్నాళ్ల తర్వాత స్పందించాడు. ఇంతకీ బ్లాక్‌వుడ్‌ను ఇన్స్పైర్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు 2019లో టీమిండియా విండీస్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడింది. అయితే బ్లాక్‌వుడ్ ఒక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లితో కాసేపు మాట్లాడాడు. సుధీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా బంతులను ఎదుర్కోవాలని కోహ్లి సూచించినట్లు బ్లాక్‌వుడ్ తెలిపాడు.చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు? '2019లో టీమిండియా మా దేశంలో పర్యటించినప్పుడు కోహ్లితో మాట్లాడేందుకు ప్రయతించా. అంతకముందు సోషల్ మీడియా వేదికగా కోహ్లితో పలుసార్లు చాట్ చేశాను. జమైకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాను. ఆట ముగిసిన తర్వాత కోహ్లితో చిన్న సంభాషణ జరిగింది. నేను సెంచరీలు, అర్థసెంచరీలు చేయాలంటే ఎలా ఆడాలో చెప్పాలంటూ కోహ్లిని అడిగాను.. దానికి టెస్టులో సెంచరీ చేయాలంటే ఎన్ని బంతులు ఎదుర్కోవాలో చెప్పగలవా.. అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను సుమారు 212 బంతులు ఎదుర్కొంటే సెంచరీ చేసే అవకాశం ఉంటుంది అని సమాధానమిచ్చాను. నువ్వు చెప్పిన జవాబులో అర్థం ఉంది.. అంటే ఎన్ని బంతులు సమర్థంగా ఆడగలిగితే అన్ని సెంచరీలు చేయొచ్చు అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లితో సంభాషణ తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే కనీసం 200- 300 బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా... దాని ఫలితమే నాకు ఇంగ్లండ్ పర్యటనలో కనిపించింది.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ తరపున బ్లాక్‌వుడ్ ఇప్పటివరకు 33 టెస్టులాడి 1789 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి' -
ఆ గుండె ఆగిపోలేదు
రెండేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదులతో ముఖాముఖి పోరాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తున్న క్షణాల్లోనూ చివరి వరకు మేజర్ కౌస్తుభ్ రాణే గుండె.. దేశం కోసమే కొట్టుకుంది. ఆ గుండె ఆగిపోదని, భార్యగా తను బతికున్నంత వరకు దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనికా రాణే. అందుకే ఆర్మీలో చేరారు. శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడిక కమాండెంట్‌గా విధులకు సిద్ధమౌతున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణను ముగించుకుని శనివారం నాడు క్యాంపస్ బయటికి వచ్చిన 230 మంది ఆర్మీ ఆఫీసర్లలో 29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే కూడా ఒకరు. నిజానికైతే ఆమె ఇప్పుడు ఏ మల్టీనేషనల్ కంపెనీలోనో ప్రాజెక్టు మేనేజరుగా లేదా అంతకంటే పైస్థాయిలో కొనసాగుతూ ఉండవలసినవారు. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేసి, ఎంబీఏలో పట్టభద్రురాలై ఉన్న కనికకు తను ఎంచుకున్న కెరియర్లో కొన్ని లక్ష్యాలు ఉండేవి. కొన్ని ధ్యేయాలు ఉండేవి. కొన్ని కలలు ఉండేవి. అవన్నీ పక్కనపెట్టి.. భర్త లక్ష్యాలు, భర్త ధ్యేయాలు, భర్త కలల్ని కనురెప్పల మధ్య ఒత్తుల్లా వెలిగించుకుని గత ఏడాది వార్ విడోస్ విభాగంలో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, ర్యాంకు సంపాదించి ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా కమాండెంట్ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. ఆ బాధ్యతలు ఆమె భర్త కౌస్తుభ్ రాణే మిగిల్చి వెళ్లినవి! రాణే భారత సైన్యంలో మేజర్. దేశమే ఆయన సర్వస్వం. దేశ రక్షణ, దేశ భద్రత, దేశ గౌరవం కోసమే ప్రతిక్షణం ఆలోచించాడు. అనుక్షణం కార్మోన్ముఖుడు అయి ఉన్నాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి కశ్మీర్లో ఉగ్రవాదులతో తలపడుతూ ఆ భీకర పోరులో నేల కొరుగుతున్న క్షణంలోనూ ఆయన గుండె దేశం కోసమే కొట్టుకుంది. అయితే భార్యగా తను బతికి ఉన్నంత కాలం అతడి గుండె తన దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనిక. అందుకే ఆర్మీలో చేరారు. 2018 ఆగస్టులో.. శ్రీనగర్‌కు 125 కి.మీ. దూరంలోని బందీపురా జిల్లా గురెజ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను దాటి దేశం లోపలికి వస్తున్న ఉగ్రవాద చొరబాటు దారులతో పోరాడుతూ మేజర్ కౌస్తుభ్ రాణే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు హమీర్సింగ్, మన్‌దీప్‌సింగ్, విక్రమ్‌జీత్‌సింగ్ అనే ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మేజర్ రాణేకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆయన భార్య కనిక ముంబై నుంచి ఉధంపూర్ వెళ్లి ఆ అవార్డును ఎంత అపురూపంగా అందుకుని వచ్చారో.. శనివారం చెన్నై పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆర్మీ యోగ్యత పత్రాలను అంతే అపురూపంగా, దీక్షగా అందుకున్నారు. ‘‘నా భర్త కలల్ని నిజం చేయడానికి ఆయన స్థానంలో నేను ఆర్మీలోకి వచ్చాను’’ అని ఆమె చెబుతున్న వీడియోను రక్షణశాఖ పీఆర్వో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘నా భర్త ఎప్పుడూ నా కలల్ని నిజం చేసుకోడానికి ప్రోత్సహించేవారు. ఆయన మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి’’ అని కనిక అన్నారు. ‘‘మా పాత్రలు మారాయంతే. లక్ష్యం, ధ్యేయం ఒక్కటే. దేశ భద్రత, దేశ రక్షణ’’ అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె మాటలో పట్టుదల ప్రస్ఫుటమయింది. ఆర్మీ శిక్షణను కూడా ఆమె అంతే పట్టుదలతో పూర్తి చేశారు. ‘‘శిక్షణలో శారీరకబలం కంటే కూడా మానసిక బలం ఎక్కువ అవసరం. నేనెప్పుడూ వంద మీటర్ల దూరానికి మించి పరుగు తీయలేదు. ఇప్పుడు 40 కి.మీ. వరకు పరుగెత్తగలను! మనసు గట్టిగా ఉంటే మనిషికి గట్టితనం వస్తుంది’’ అన్నారు కనిక. ఆమెకొక కొడుకు. అగస్త్య (4). భర్త తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉంటున్నారు. వారి బాధ్యతను తీసుకున్నట్లే, దేశ రక్షణ విధులనూ నిర్వర్తించేందుకు సిద్ధం అయ్యారు ఆర్మీ లెఫ్టినెంట్ కనిక. -
పడవ మీద తిరిగే ప్రాణదాత
మహారాష్ట్ర నందున్‌బర్ జిల్లాలోని చిమల్‌ఖడీ అనే అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తుంది రేణు వాసావె. నర్మదా నది పరీవాహం చుట్టుపక్కల పల్లెల నుంచి గర్భిణులు, నవజాత శిశువులు ఆమె దగ్గరకు పరీక్షకు, ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారానికి వచ్చేవారు. కాని లాక్డౌన్ తర్వాత గత ఆరు నెలల నుంచి గర్భిణులు కరోనా భయంతో రావడం లేదు. అయితే వారిని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు రేణు. నర్మదా నదిలో తానే పడవ మీద తిరుగుతూ వారి వద్దకే వెళ్లి వస్తోంది. గత ఆరు నెలలు ఆమే వారి ఇంటికి వచ్చే ప్రాణదాతగా నిలిచింది. ‘సాయంత్రమైతే నా చేతులు లాగేస్తాయి. కాని పట్టించుకోను. గిరిజన మహిళల కోసం సేవ చేస్తున్నాన్న తృప్తి ఉంది నాకు’ అంటుంది రేణు వాసవె. ఆమె ఒక సాదా సీదా అంగన్వాడీ వర్కర్. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ తను చేయవలసిన పనులేవో చేస్తే ఆమెకు వచ్చే ఢోకా ఏమీ లేదు. ఆమెకు వీలు లేని పని చేయకపోతే ఎవరూ ఏమీ అనరు కూడా. కాని ఆమె అలా ఊరికే ఉండలేదు. తన డ్యూటీ తాను సక్రమంగా చేయాలనుకుంది. నది మీద తిరిగే ప్రాణదాతగా మారింది. అడవి స్త్రీల కోసం రేణు పని చేస్తున్నది చిమల్‌ఖడి అనే ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడి అంగన్వాడి కేంద్రానికి గతంలో అయితే చుట్టుపక్కల గర్భిణులు, బాలింతలు వచ్చి తమకు కావలిసిన పరీక్షలు చేయించుకుని ఇచ్చే రేషన్‌ను తీసుకెళ్లేవారు. కాని కోవిడ్ వల్ల వారి రాకపోకలు హటాత్తుగా ఆగిపోయాయి. కొత్తగా గర్భం దాల్చినవారు, పిల్లల్ని కన్నవారు అంగన్వాడి కేంద్రాలకు రావడం మానుకున్నారు. కాని వారి ఆరోగ్యాన్ని పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి అందే ఆహారం, సౌకర్యాలు అందించడం అంగన్వాడి వర్కర్‌గా రేణు విధి. అందుకే ఆమె తానే వారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అయితే ఆ గిరిజన పల్లెలకు రోడ్లు సరిగా ఉండవు. కాని వాటన్నింటి గుండా నర్మదా నది ప్రయాణిస్తుంది. అందుకే రేణు తన ప్రాంత బెస్తవాళ్ల దగ్గర పడవను అద్దెకు తీసుకుంది. ఆ పడవలో తెడ్డు వేసుకుంటూ పల్లెలకు తిరగసాగింది. 18 కిలోమీటర్లురోజూ ఉదయం ఏడున్నరకే రేణు వాసవె తన అంగన్ వాడీ కేంద్రానికి వెళుతుంది. అక్కడి రోజువారీ పనులు ముగించుకుని మధ్యాహ్నం భోజనం చేసి పడవ మీద నర్మదా నదికి బయలుదేరుతుంది. నదిలో దాదాపు 9 కిలోమీటర్లు వెళ్లి 9 కిలోమీటర్లు వచ్చి, అంటే 18 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆమె తిరిగేది మర పడవ కాదు. తెడ్లు వేయాల్సింది. ఒక్కోసారి ఆమె బంధువు, మరో అంగన్వాడి కార్యకర్త సంగీత తోడు వస్తుంది. పడవలో ఆమె రోజు గర్భిణులకు, చంటి పిల్లలకు ఇవ్వాల్సి ఆహారం, బరువు తూచే మిషన్ తీసుకువెళుతుంది. ‘ప్రస్తుతం నేను 25 మంది చంటిపిల్లలను, 7 మంది గర్భిణులను పర్యవేక్షిస్తున్నాను’ అంటోంది రేణు. ఈత వచ్చు రేణుకు నర్మద నదిపై ఒక్కతే పడవ నడపడం అంటే భయం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఈత వచ్చు. నది పై పడవ నడపడం కూడా వచ్చు. ‘మా ఆయనకు ఈత రాదు. కొంచెం భయపడుతుంటాడు నా గురించి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు నన్ను మెచ్చుకుంటారు’ అంటుంది రేణు. గత ఆరు నెలలుగా వారంలో ఐదు రోజులు పడవ మీద తిరుగుతున్న రేణుని చూసి గిరిజన మహిళలు చాలా సంతోషపడతారు. ఆమెను తమ ఆత్మీయురాలిగా భావిస్తారు. చంటి పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ‘అత్త వచ్చింది చూడు’ అని రేణును చూపిస్తారు.అందరు ఉద్యోగులు ఇలా ఉండరు. ఇలాంటి వారే ఉద్యోగాలకు గొప్పతనాన్ని తెస్తారు. రేణు ఒక ఆత్మీయ బంధువు. – సాక్షి ఫ్యామిలీ -
కాలు లేదని కుంగిపోకుండా.. ఆత్మస్థైర్యంతో
సాక్షి, పాల్వంచ : శరీర అవయవాలన్నీ బాగున్నా..పనికి ఒళ్లొంచాలంటే సాకులు చెప్పేవారు ఇతడిని చూస్తే తమ తీరు మార్చుకుంటారు. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామానికి చెందిన బోగి ఉపేందర్ ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోగా..అంతే కుంగిపోతూ ఉండకుండా కోలుకుని ధైర్యంగా జీవిస్తున్నాడు. వంటి కాలుతో ఆటోనడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలుకు చేరుస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఇతను పాల వ్యాపారం చేసేవాడు. 2010 మార్చి28న పాల్వంచలో పాలుపోసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లక్ష్మీదేవిపల్లిలోని పెట్రోల్ బంక్ సమీపంలో భద్రాచలం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు నుజ్జునుజ్జవడంతో వైద్యులు మోకాలి వరకు తొలగించారు. కోలుకున్నాక..బాగా దిగాలు చెందాడు. అయితే..తనే ఆలోచించి ఇలా ఖాళీగా ఉండొద్దని భావించి ఆటో నడపాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో క్లచ్ ఉండడంతో డ్రైవింగ్ ఇబ్బందిగా మారలేదు. ఎవరి సహాయం తీసుకోకుండానే ప్రతిరోజూ అన్ని పనులూ తానే చేసుకుంటూ..ఆటో నడుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లి..సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. భద్రంగా డ్రైవింగ్ చేస్తానని, అతివేగంగా అస్సలే వెళ్లనని, ఆటోలో కూర్చున్న వారిని సురక్షితంగా చేరవేస్తానని అంటున్నాడు. భార్య సౌజన్య, ముగ్గురు పిల్లలను ప్రేమగా చూసుకుంటానని, వారే తన బలమని ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. -
స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..
న్యూఢిల్లీ: దేశంలోనే ప్రముఖ వైవిద్య రాజకీయ నాయకులలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. సామాజిక సమస్యలపై నిత్యం స్పందిస్తు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా తన అభిప్రాయాలను చెబుతుంటారు. తన జీవితంలో జరిగిన ప్రేరణ కలిగించే సంఘటనలను నిరంతరం పోస్ట్ చేస్తు అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. తాజాగా స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఇతరులకు మంచి చేయడానికి ప్రజలందరు ప్రయత్నించాలని.. మీరు చేసే మంచి పని వల్ల ఉహించని విధంగా లబ్ది చేకురుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు’. ఒకవేళ మంచి చేసే అవకాశం రాకపోతే కనీసం మంచి ఆలోచనలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు ప్రేరణ కలిగించేందుకు స్మృతి ఇరానీ ప్రయత్నించారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 17,000మంది నెటిజన్లు స్మృతి ఇరానీ పోస్ట్‌కు లైక్ చేశారు. స్మృతి ఇరానీ పోస్ట్‌పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చదవండి: మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?' View this post on Instagram ..... even if it doesn’t do good anyways .Good thoughts , Good words , Good deeds #zarathustra 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 6, 2020 at 12:59pm PDT -
మహాత్ముడు మహమ్మారిని జయించాడు
‘గాంధీ ప్రాణాలపై ఆయనకు కాదు, దేశానికి హక్కు ఉంది.. ఎందుకంటే ఆయన దేశం ఆస్తి’1918లో దేశం నలుమూలలా వినిపించిన మాట. అప్పటికి ఆయన ‘జాతిపిత’అనిపించుకోలేదు. ఆయన గురించి ఇంకా అంత గొప్ప ప్రచారం జరగలేదు. అయినా జనం ఇలా కోరుకున్నారు. ఆంగ్లేయులను తరిమే ఆశాకిరణంగా ఆయనను అప్పటికే భావించారు. వారి ఆవేదనకు అసలు కారణం.. దేశాన్ని శవాల దిబ్బగా మార్చిన స్పానిష్ ఫ్లూ బారిన ఆయన పడటమే. నీతులు చెప్పే ముందు ఆచరించి చూపే తత్వం ఉన్న గాంధీ, ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. మరి దాని ప్రభావమేనేమో.. ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ వైరస్‌ను జయించి ఆంగ్లేయుల పాలన అంతు చూసేందుకు అడుగు ముందుకేశారు.. సాక్షి, హైదరాబాద్: ఆంగ్లేయులను ఓడించటానికి ముందే మహాత్మా గాంధీ మహమ్మారిని జయించారు. రక్తం చిందించకుండా శాంతి మంత్రాన్నే ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులను జయిస్తే.. ఆరోగ్య సూత్రాలను నిరంతరం పాటించే అలవాటున్న ఆయన ప్రాణాంతక స్పానిష్ ఫ్లూ మహమ్మారిపై విజయం సాధించారు. నాడు మహాత్ముడు చెప్పిన ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించి ఉంటే ఇప్పుడు కరోనా విషయంలో మన దేశం ఇంతగా భయపడి ఉండేది కాదేమో.. కనీసం ఇప్పటికైనా జాతిపిత ఆరోగ్య సందేశాన్ని మననం చేసుకుని ఆచరించే మనసుపెడితే భవిష్యత్తులో మహమ్మారుల వ్యాక్సిన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా మన ఇమ్యూనిటీతోనే తరిమికొట్టొచ్చు..!!! దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి సరిగ్గా నాలుగేళ్లయింది.. 48 ఏళ్ల మహాత్మాగాంధీ సబ ర్మతి ఆశ్రమంలో నిరంతరం దీర్ఘాలోచనతో ఉంటున్నారు. అప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకున్నాయి. కాలం కలసిరాక అన్నదాత చెమట చుక్క బీళ్లు తేలి న భూముల్లో ఆవిరైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పన్నుల కోసం వేధిస్తోంది. ‘కరువు తీవ్రం గా ఉన్న సమయంలో పన్ను లు చెల్లించం’నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే గాంధీ దీర్ఘాలోచనకు కారణం. అందుకు ఆయన సత్యాగ్రహాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యాగ్రహం ఎలా ఉండాల న్న విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలసి సమాలోచనలు చేస్తూ దానికి తుది రూపం ఇస్తున్నారు. కానీ కరువును మించిన ప్రమాదకారి అప్పటికే దేశంలోకి చొరబడిందన్న సంగతి మహాత్ముడికి తెలియదు. అదే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందికిపైగా పొట్టనపెట్టుకున్న స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా. ఆ ప్రమాదకర వైరస్ తొలి దాడి సాధారణంగా ఉన్నా, రెండో విడత విరుచుకుపడింది. చూస్తుండగానే దేశం అల్లకల్లోలమైంది. కోటిన్నర మంది (కచ్చితమైన అంచనా లేదు) మన దేశంలో దానికి బలయ్యారు. అంతటి ప్రమాదకర వైరస్ దాడి ప్రారంభమైన సమయం. సబర్మతి ఆశ్రమంలో తన అనుచరులతో కలసి ఉన్న మహాత్ముడిని కూడా అది వదల్లేదు. తీవ్ర జ్వరం, అలసట, నీరసం, ప్రాణం ఉంటుందో లేదోనన్న బాధ.. స్పానిష్ ఫ్లూ ఆవహించిందని మహాత్ముడు సులభంగానే గ్రహించారు. సత్యాగ్రహాన్ని విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యం.. దాన్ని సాధించాలంటే ముందుగా వైరస్ చెర నుంచి విడిపించుకోవాలి. వెరసి బాపూ ముందు రెండు టార్గెట్లు.. ఆరోగ్య సూత్రాలే కాపాడి ఉంటాయి.. ప్రపంచం మొత్తాన్ని కబళించాలన్న కసితో పంజా విసిరిందా అన్నట్టు నాటి స్పానిష్ వైరస్ ఉగ్రరూపాన్ని చూసి మానవజాతే వణికిపోయిం ది. అంతటి భయంకరమైన వైరస్ బారిన పడ్డ వృద్ధుల్లో చాలామంది చనిపోయా రు. అలా అని మధ్య వయస్కులంతా బయటపడలేకపోయారు. కానీ శరీరం లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారిలో చాలామంది వైరస్ సోకినా కూడా ప్రాణా లు దక్కించుకోగలిగారు. 48 ఏళ్ల వయసు కావటం వల్లనేమో గాంధీ కూడా దాన్ని తరిమేయగలిగారు. అయితే, అది అంత సులువుగా జరిగింది కాదు. గాంధీ జీవితంలో ఎక్కువ రోజు లు అనారోగ్యంతో గడిపిన సందర్భం అదేనట. కొన్ని నెలల పాటు ఆయన అనారోగ్యంతో పోరాడి గెలిచా రు. క్రమశిక్షణకు మారుపేరైన కరంచంద్ గాంధీ.. ఆరోగ్యం విషయంలోనూ అలాగే ఉండేవారు. ముఖ్యంగా ఆయన భోజన అలవాట్లు చాలా ఆరోగ్యకరం గా ఉండేవి. రాత్రి తొందరగా పడుకోవటం, ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవడం, ధ్యానం, యోగా, వేళకు భోజనం, అదీ మితంగా, అందులోనూ సాత్వికాహారం.. వెరసి ఆయన శరీరం తన చేతుల్లో ఉండేది. కఠోర కాలాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించదగ్గ మానసిక స్థితి గాంధీని కాపాడిందని చరిత్రకా రులు చెబుతారు. ‘వందేళ్ల నాడు దాదాపు భారతీయులందరూ ఈ వైరస్ బారినపడ్డవారే.. కొందరిలో దాని తీవ్రత ఎక్కువ, కొందరిలో తక్కువ. చాలామందికి అసలు వైరస్ సోకిందన్న సంగతే తెలియదు. రోగ నిరోధక శక్తి ఉన్నవారు మామూలు జలుబు జ్వరంగానే భావించి దాని నుంచి బయటపడ్డారు. గాంధీ శరీరంలోకి చేరిన వైరస్ తీవ్రత గురించి తెలియదు. కానీ, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఆహార అలవాట్లున్న వారు కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైరస్ నుంచి తేరుకోగలరు. గాంధీ అలా బయటపడి ఉండొచ్చు’ అని చరిత్రకారుడు డాక్టర్ రాజారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయమే పోరాటపటిమను పెంచింది.. దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న కసితో ఉన్న గాంధీకి ఆ వైరస్ సోకిన సమయం గొప్ప పోరా ట పటిమను పెంచిందంటారు. దేశంలో కోటిన్నర మంది చనిపోయేంత అతి తీవ్ర పరిస్థితులు నెలకొన్నా బ్రిటిష్ పాలకులు సరిగా వ్యవహరించకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వారిని తరిమికొట్టే వరకు పోరు ఆపొద్దని గట్టిగా సంకల్పించుకున్నారు. ‘ఆరోగ్య’ నినాదానికి పదునప్పుడే.. స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను సమాయత్తం చేసేందుకు దేశం నలుమూలలా తిరిగిన గాంధీ, వారిలో ఉత్తేజం నింపే ఉద్యమ మాటలే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే గొప్ప నినాదాన్నీ వారికి నూరిపోశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ఊరూరుకు తీసుకెళ్లగలిగారు. ఇందుకు నాటి వైరస్ రోజుల్లో అనుభవించిన కష్టాలే కారణం. అప్పటికే ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చే గాంధీ, స్పాని ష్ ఫ్లూ లాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండాలని పిలుపిచ్చారు. మహాత్ముడు.. మేక పాలు: ఆవు, గేదె పాలు తాగొ ద్దని నిర్ణయించుకుని చివరకు మేక పాలు తాగటాన్ని అలవాటు చేసుకున్న గాంధీ.. ఆ నిర్ణయాన్ని కడవరకూ ఎలా అమలు చేశారో ఆయన చరిత్రలో కథలు కథలుగా చెప్పుకొంటారు. మేకలు అన్ని చోట్లా ఉన్నా, వాటి పాలు అందుబాటులో ఉండవు. వాటిని తాగే వారి సంఖ్య అతి తక్కువగా ఉండటమే కారణం. గాంధీ వేరే ప్రాంతానికి వెళ్తే మేక పాలు దొరికేవి కావు. ఒకసారి ఆవు, గేదె పాలు తాగొద్దని నిర్ణయించుకున్నాక వాటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకపోవటం ఆయన నియమం. అందుకోసం ఆయన ఎక్కడికెళ్లినా వెంట మేకను తీసుకెళ్లే వారు, విదేశాలకు వెళ్లినా ఆయన వెంట రెండు మేకలు కూడా ఉండేవి. ఆ మాటలు ఆచరించి ఉంటే కరోనా కష్టాల తీవ్రత తగ్గేది ఆరోగ్యం విషయంలో మహాత్ముడు చెప్పిన అంశాలను నాటి జనం విన్నా, నేటి తరం పెడచెవిన పెడుతోంది. ఆరోగ్యం బాగుంటేనే ఉద్యమం చేయగలుగుతామని నాటి స్వాతంత్య్ర సమర సమయంలో గాంధీ తేల్చుకున్నారు. వైరస్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవటాన్ని కళ్లారా చూసిన ఆయన, తొలుత ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే బ్రిటిష్ వారిని తరమగలరని భావించారు. అందుకే తన ఉద్యమ ఉపన్యాసంలో ‘ఆరోగ్య మంత్రాన్నీ’చేర్చారు. తాను ఆచరించి చూపితేనే ప్రజలు అమలు చేస్తారని భావించి వారికి అదర్శంగా నిలిచారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ మాటను ఆయన నిజం చేసుకున్నారు ‘గాంధీలోని గొప్ప లక్షణం ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుగా తను ఆచరించే జనాన్ని అనుసరిం చాలని కోరేవారు. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంద ని బలంగా నమ్మిన ఆయన, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జనానికి చేసిన హిత బోధ మామూలుది కాదు. ఈ విషయంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్య సూత్రాలు పాటించే తత్వం అయినందునే ఆయన అత్యంత ప్రమాదకరంగా చరిత్రలో నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డారని భావిస్తాను. నేను పాఠశాల విద్యార్థిగా ఉండగా, ఆయన ఫ్లూ బారిన పడి మళ్లీ పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదిగిన తీరుపై మాట్లాడుకోవడం విన్నాను...’ – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
చదివింది ఐదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్
న్యూఢిల్లీ: కష్టపడితే విద్యార్హతలతో సంబంధం లేకుండా మెరుగైన ఉద్యోగం సాధించవచ్చని బెంగుళూరుకు చెందిన మహ్మద్ తన్వీర్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ తన్వీర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. ఆ తర్వాత వెల్డర్‌గా కొంత కాలం పని చేశాడు. కానీ అతనికి జరిగిన ఓ ప్రమాదం తన్వీర్ జీవితాన్నే మార్చేసింది. అప్పుడే అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీలు లేకపోయినా సరే, పెద్ద ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రమాదం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో..మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు చేస్తున్న తన్వీర్ సోదరి అతడిని ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె సహాయంతో అతను ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తరువాత టైపింగ్ కోర్సు చేసి డాటా ఎంట్రీ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన్వీర్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. దీంతో తొలుత అతను డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో స్పెషలిస్ట్ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించాలని ఉన్నా డిగ్రీ అర్హతలు లేకపోవడంతో అతని మనసులో ఏదో మూలన నిరాశ తొంగిచూసేది. సరిగ్గా అదే సమయంలో మాసై స్కూల్ ఆఫ్ బిజినెస్ అతని లక్ష్యానికి దారి చూపింది. ఏ అర్హతలు లేకున్నా అతనికి 6నెలల కోడింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కల్పించింది. కేవలం 6నెలల్లోనే తనకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందించింది. దీంతో నేడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నానని తన్వీర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని..వారి విద్యార్హతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాసై సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ శుక్లా పేర్కొన్నారు. -
సెరెనా, మేరీలే స్ఫూర్తి!
విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది. ‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది. ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లను, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది. -
ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు
సాక్షి, హుస్నాబాద్(సిద్దిపేట) : మారుమూల గ్రామాలకు సైతం కాన్వెంట్ బస్సులు వచ్చేస్తున్నాయి. సర్కాడు బడులంటే సమస్యల చిరునామాగా మారాయి. ప్రైవేటు పాఠశాలలో ఉన్న వసతులు ప్రభుత్వ బడుల్లో లేవు. చిన్న సంపాదన పరుడైనా పిల్లలకు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రైవేటు బడులకు పంపుతున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను తను పని చేస్తున్న పాఠశాలలోనే పిల్లలను చేర్పించి చదివిస్తున్నాడు. ప్రైవేటు బడుల్లో ఎన్ని హంగులు ఉన్నా.. సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందుతుందని పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను పని చేసే బడిలోనే చేర్పించాడు.. మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోగిటి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి 1998లో డీఎస్సీ ద్వారా టీచర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇదే మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాను బోధిస్తున్నారు. తను నడిచిన మార్గంలోనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ బడికే పంపడం ప్రైవేట్ పాఠశాలల్లో రూ. వేలు ఖర్చు చేసి పిల్లలను చదివించే తల్లదండ్రులు సైతం ప్రభుత్వ బడి గురించి ఆలోచించేలా చేస్తుంది. సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్య విమల, గ్రామస్తులు అభినందిస్తున్నారు. పలువురు ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. బోధనలోనూ ప్రత్యేక శైలీ మండలంలోని తంగళ్లపల్లి పాఠశాలలో పనిచేసే సమయంలో సత్యనారాయణ విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేవారు. ప్రత్యేక్షంగా వాటిని చూపించి పాఠం అర్థమయ్యేలా చేస్తారు. బరువులు కోలతల గురించి చౌకదారుల దుకాణం తీసుకెళ్లి అవగాహన కల్పించడం, లీటర్లు, కిలో గ్రాముల గురించి వివరించారు. వివిధ వస్తువుల వినియోగాన్ని ప్రత్యేక్షంగా చూపించి ఆ పరిసరాలను వారికి తెలియజేసి భోదించేవారు. అక్షయ ఫౌండేషన ద్వారా సేవ.. తన మిత్రులలో కలసి సత్యనారాయణ అక్షయ ఫౌండేషన్ ద్వారా గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో రెండు నెలల పాటు 200 మందికి ఉచిత మజ్జిక పంపిణీ అందిస్తారు. పేద ప్రజలకు దుస్తులలతోపాటు దుప్పట్లు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు చదువుకు అవసరమైన వస్తువులు అందజేసి వారిని చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటారు. పలు విషయాల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పారుచుకున్న తోగిటి సత్యనారాయణ జిల్లా విద్యాధికారి అభినందించారు. -
మనతో మనం కనెక్ట్ అవ్వాలి
‘ఆర్టిస్టులను ప్రేక్షకులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్‌ని కావచ్చు. కానీ నాకు కాదు’’ అంటారు నిత్యా మీనన్. షూటింగ్ లేని రోజు లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ బ్యూటీ ఏం చేస్తారో తెలుసా? ఆ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘నటిగా నా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయట నుంచి చూస్తూ ఏర్పరుచుకున్నవి. నా వరకూ నేను నటి నిత్యను కాదు. నార్మల్‌గా నాలాగే ఉండాలనుకుంటాను. నాతో నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాను. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్‌ఫోన్ బ్యాటరీలు రీచార్జ్ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్ అయితేనే నేచర్‌తో కనెక్ట్ అవగలం. నా శక్తినంతా నేచర్ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్స్పిరేషన్ కూడా నేచరే’’ అన్నారు. -
ఇన్స్పిరేషన్ #తనూటూ..!
‘మీటూ’తో పెద్దపెద్ద హీరోల నిజస్వరూపాలనుబయటపెట్టేందుకు ప్రేరణగా నిలిచిన తనుశ్రీ..అకస్మాత్తుగా కామ్ అయిపోయారెందుకు?ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఇన్స్పిరేషన్గా నిలిచి, ‘ఇన్స్పిరేషన్’ అనే లఘుచిత్రాన్ని కూడా తీసిన తనుశ్రీ దత్తా ఆఖరి నిముషంలో చిత్రంలోని కథను ఎందుకు మార్చేశారు? ‘మీటూ’ పోరాటాన్ని మధ్యలోనే వదిలివెళ్లేలా ఆమెపై ఒత్తిడి తెచ్చినశక్తులే, ఆమె ‘ఇన్స్పిరేషన్’నూ దెబ్బతీశాయా?! తనుశ్రీ దత్తా తీసిన షార్ట్ ఫిల్మ్.. ‘ఇన్స్పిరేషన్’ ఈ నెల 8న మహిళా దినోత్సవానికి విడుదల కావలసి ఉంది. కానీ కాలేదు! మార్చి 19 తనుశ్రీ బర్త్ డే. ఆ రోజు కూడా ‘ఇన్స్పిరేషన్’ విడుదల అవలేదు! విడుదలై ఉంటే ఈసరికి బాలీవుడ్‌లోని పురుష పుంగవులు గగ్గోలు పెడుతూ ఉండేవారు. ‘ఇన్స్పిరేషన్’.. బాలీవుడ్ ‘మీటూ’ చీకటి కథల లఘుచిత్రం. అతుల్ భల్లా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ తనుశ్రీవే. భల్లా మునుపెన్నడూ సినిమాల్ని డైరెక్ట్ చెయ్యలేదు. కానీ స్త్రీపక్షపాతి. జర్నలిస్టు. గత ఏడాది ‘వధాయాన్ జీ వధాయాన్’ (శుభాకాంక్షలండీ శుభాకాంక్షలు) అనే పంజాబీ సినిమాకు మాత్రం డబ్బులు పెట్టాడు. రొమాంటిక్ కామెడీ అది. కామెడీకి డబ్బులు పెట్టిన మనిషిని, ‘సెక్సువల్ హెరాస్మెంట్’ థీమ్‌కి మనసు పెట్టమని అడిగారు తనుశ్రీ. ఓకే అన్నాడు ఆయన. తీశాడు కూడా. కానీ రిలీజ్ కాలేదు!! మాఫియా ఎంటర్ అయిందా?! ‘ఇన్స్పిరేషన్’ని రిలీజ్ చెయ్యొద్దని ఎవరైనా తనుశ్రీని బెదరించారా? బాలీవుడ్ మాఫియా రంగంలోకి దిగిందా? లేకా తనుశ్రీనే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా? తలనొప్పి ఎలా ఉంటుందో తనుశ్రీకి బాగా తెలుసు. ఆరు నెలలు ఇండియాలో ఉండి, ఇటీవలే ఆమె తిరిగి యు.ఎస్.వెళ్లిపోయారు. ఉండడం అక్కడి న్యూజెర్సీలో. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చిపోతున్నారు. ఈ ట్రిప్పులో మాత్రం ఊరికే వెళ్లలేదు తనుశ్రీ. ‘మీటూ’కు ఆజ్యం పోసి వెళ్లారు. ఆజ్యం అనే మాట కరెక్ట్ కాదు. ‘మీటూ’ను రాజేసి వెళ్లారు.అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత గత ఏడాది జూలైలో ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం పెద్ద విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీని విమానాశ్రయంలో కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రం గుర్తుపట్టారు. అంతేతప్ప ఆమె కారణంగా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఊపిరి అందుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె వచ్చేటప్పటికే మన దేశంలో మీటూ గురించి అక్కడో మాట ఇక్కడో మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం.. ఈ మూడు చిత్రపరిశ్రమల నుంచి కొంతమంది నటీమణులు బయటికి వచ్చి.. ‘ఒకవేళ లైంగిక వేధింపులు ఉంటే వాటిని ఖండించవలసిందే’ అన్నంత వరకు మాట్లాడగలిగారు. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, రీమా ఛద్ధా, రాధికా ఆప్టే కూడా.. ‘మీటూ’ అన్నది సపోర్ట్ చేయవలసిన మూవ్మెంట్ అన్నంత వరకే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఒక బాధితురాలిగా తొలిసారి బయటికి వచ్చి మీటూ ఫిర్యాదు చేసింది మాత్రం తనుశ్రీ దత్తానే. ఆమె ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్‌లోని అజ్ఞాత బాధిత మహిళలు, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోని మహిళా నటులు తామెలా లైంగిక వేధింపులకు గురైందీ రివీల్ చేశారు. సాజిద్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, అనూ మాలిక్, కైలాష్ ఖేర్, సుభాష్ కపూర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్.. ఇలా ఆరోపణలు వచ్చినవాళ్లంతా పరువు కోసం పరుగులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. వారిలో నానా పటేకర్ ముఖ్యుడు. మనసుకు సర్దిచెప్పుకోలేకే..! నానా పటేకర్ జెంటిల్మన్. రైతు జన బాంధవుడు. ముంబై చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఒక్కొక్కరికీ లక్ష చొప్పున నగదు చెక్కులను ఇస్తూ కాస్త మంచి పేరును కూడపెట్టుకున్నాడు. తనుశ్రీ వచ్చి ఆ పేరును కూలగొట్టేశారు. పేరును కూలగొట్టడం ఆమె ఉద్దేశం కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగా పదేళ్లుగా ఆమె రగిలిపోతున్నారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో ఒక సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నప్పుడు నానా పటేకర్ ఆమెను వేధించాడు. అప్పటికి ఆయన స్టార్ యాక్టర్. అప్పటికి ఆమె మిస్ ఇండియా. కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. వచ్చీ రాగానే చేదు అనుభవం. ఆ దెబ్బతో ఆమె సినిమాలు వద్దనుకుని వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు. నానా పటేకర్ వయసు అప్పటికి 58 ఏళ్లు. అప్పుడు ఏమీ చేయలేక వెళ్లిపోయిన తనుశ్రీ, తిరిగొచ్చాక అతడి ముసుగు తొలగించారు. అయితే ఇదంతా కూడా తనుశ్రీ కల్పించినదే తప్ప నిజం కాదని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు నానా పటేకర్. కానీ ఆయన కరెక్ట్ మనిషా కదా అనే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. తనుశ్రీని మాత్రం ఇండస్త్రీలోని అమ్మాయిలు, సీనియర్ మహిళా ఆర్టిస్టులు నమ్మారు. ఎక్కడో యు.ఎస్.లో ఉన్న మనిషి, ఇండియా వచ్చి, లేనిపోని తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటుంది అనే అనుకున్నారు. ఆ మాట నిజమే. తనుశ్రీకి మంచి లైఫ్ ఉంది. కానీ ఆ లైఫ్‌ని పశ్చాత్తాపం లేకుండా లీడ్ చెయ్యడానికి పాతవి తుడిచేసుకోవాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది. యు.ఎస్.లో మొదలైన మీటూ ఆమెలోని ఆనాటి నిస్సహాయతకు శక్తినిచ్చి, నిద్రాణంగా ఉన్న నిస్సత్తువను పోగొట్టింది. ‘వెళ్లి ఫైట్ చెయ్యి’ అని ప్రేరేపించింది. కథ ఎందుకు మారింది?! ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చి.. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లో.. ఎందరో బాధితుల్ని బయటికి రప్పించి, మర్యాదస్తుల అసలు రంగును బట్టబయలు చేసిన తనుశ్రీ తిరిగి తన ప్రశాంత జీవనంలోకి.. న్యూజెర్సీకి వెళ్లిపోయారు. అయితే అది నిజమైన ప్రశాంతతేనా?! కాదు అన్నదే సమాధానం. అందుకే ఆమె అర్థంతరంగా ముగించిన వెళ్లిన పోరాటాన్ని షార్ట్ ఫిల్మ్‌తో కొనసాగించాలనుకున్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైందీ సమాచారం సేకరించారు. స్క్రిప్టు రాసుకున్నారు. డైరెక్టర్నీ పెట్టుకున్నారు. ఫిల్మ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ కాలేదు. ఉద్యమంలోంచి వెనక్కు తగ్గినట్లే ఫిల్మ్ లోంచీ వెనక్కు తగ్గారా తనుశ్రీ. బాలీవుడ్ మాఫియా ఆమెను ఏమైనా హెచ్చరించిందా? అందుకే ఫిల్మ్‌ని చెత్తబుట్టలో వేసేశారా? అలాంటిదేమీ లేదంటున్నారు తనుశ్రీ. మొన్న బర్త్‌డే రోజు కూడా ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోందని చెప్పారు. అయితే కథ మాత్రం అది కాదు అన్నారు!! అందులో బాలీవుడ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎపిసోడ్స్ ఏమీ లేవని చెప్పారు. మరి ఏం ఉంటుంది? ఇన్స్పిరేషనల్ టాక్ ఉంటుందట తనది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకే ఉండబోతోంది! అదీ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను ఉద్దేశించి ‘డూస్ అండ్ డోంట్స్’ ఉంటాయట. హార్వర్డ్ కి వెళ్లొచ్చాక ‘బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అతిథి వక్తగా ప్రసంగించడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా ఎక్సయిటెడ్గా ఉన్నాను’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. పోస్ట్‌కి తగిలించిన తన ఫొటోలో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో అచ్చు హార్వర్డ్ స్కూల్ విద్యార్థినిలాగే ఉన్నారు. హార్వర్డ్ స్కూల్లో స్పీచ్ ఇవ్వడం అంటే మామూలు సంగతేం కాదు. ప్రపంచ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల భిన్న రంగాలలోని సుప్రసిద్ధులకు మాత్రమే ఆ ఆహ్వానం దక్కుతుంది. స్పీచ్ ఫిబ్రవరి 16న. వెళ్లొచ్చారు. చక్కగా మాట్లాడారు. తక్కిన వక్తల నుంచి, తన ప్రసంగానికి హాజరైన విద్యార్థుల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. మీడియా, మూవీస్, హ్యూమన్ ట్రెండ్స్.. ఇలా చాలావాటి గురించి తనుశ్రీ మాట్లాడారు. సమాజంలోని ‘మిసాజిని’ (స్త్రీద్వేషం) పైన ఆమె అభిప్రాయాలకు మాత్రం మంచి అటెన్షన్ లభించింది. ప్యానల్ డిస్కషన్లో కూడా తనుశ్రీ కూర్చున్నారు. ఒకరిద్దరు.. ఇండియాలో మీటూ పయనీర్‌గా ఆమెను గుర్తించారు. తనుశ్రీ నవ్వారు. ‘‘ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా పయనీరే’’ అన్నారు. చొరవ, నాయకత్వ గుణం మాత్రమే స్త్రీలను వారు ఎదుర్కొనే ఇబ్బందులనుంచి బయటపడేస్తాయని చెప్పారు. స్త్రీ నుంచి పురుషుడికి లభించే సపోర్ట్ కన్నా, స్త్రీ నుంచి స్త్రీకి లభించే సపోర్టే ఎక్కువగా ఉంటుందనీ, అది మాత్రమే నమ్మకమైనది’’ అని తనుశ్రీ అన్నారు. హార్వర్డ్ స్పీచ్ ఇచ్చి వచ్చాక తనను కలిసిన ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ సుభాష్ కె. ఝాతో మాట్లాడినప్పుడు ఆమెలో అతడికి మునుపటి తనుశ్రీ కన్నా భిన్నమైన వ్యక్తి సాక్షాత్కరించారు. ముఖ్యంగా ఆమె తీస్తున్న ‘ఇన్స్పిరేషన్’ ఫిల్మ్ గురించే ఆయన తరచి తరచి అడిగారు. 20 నిముషాల నిడివి ఉండే ఆ చిత్రం ఇన్‌సైట్‌తో (లోతైన దృష్టి), క్రిస్ప్‌గా (సంక్షిప్తంగా) డైరెక్టుగా (నీళ్లు నమలకుండా) ఉంటుందని ఆమె చెప్పారు. అంటే.. చిత్రం ఎలా ఉంటుందన్నది మాత్రమే తనుశ్రీ చెప్పారు. ఏం ఉండబోతోందన్న చెప్పలేదు. ఇప్పుడు అదీ క్లియర్ చేసేశారు. అదొక ఆసక్తికరమైన హార్వర్డ్ స్పీచ్‌లా మాత్రమే ఉండబోతోంది. -
స్ఫూర్తిని నింపిన ‘సమరశంఖారావం’
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సోమవారం కాకినాడలో జరిగిన ‘సమరశంఖారావం’ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులకు ఓ వైపు ధైర్యం నూరిపోస్తూ, టీడీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం పార్టీ కేడర్‌కు ఇతోధిక స్ఫూర్తిని కలిగించింది. నాలుగున్నరేళ్ళుగా ప్రతి కార్యకర్తా ఆర్థికంగా, కేసుల పరంగా ఎంతగానో నష్టపోయారని, వీరందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయంటూ జగన్ ధైర్యం నూరిపోశారు. రానున్న నెలరోజులు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్తా బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరిగిన తొలి సభ కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు తరలి రావడంతో సభాప్రాంగణం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మంచిరోజులు రానున్నాయన్న ఆనందం పార్టీ శ్రేణుల్లో కనిపించింది. సైనికుల్లా పనిచేయాలి రానున్న నెలరోజులూ ఎంతో కీలకం. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలి. బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను ప్రజలకు చేరవేయాలి. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ పచ్చి అవకాశవాది చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీతో ఇంతకాలం కొనసాగి ఇప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మేస్థితిలో లేరు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
ఫియర్లెస్ జర్నలిస్ట్
పేరు ఫే డిసూజా.. ఫియర్లెస్ జర్నలిస్ట్. మిర్రర్ నౌ ఎడిటర్. ఆశారాం బాపూ దగ్గర్నుంచి శానిటరీ నాప్కిన్స్ దాకా అన్ని విషయాల మీద నిష్పక్షపాతంగా చర్చను కొనసాగిస్తుంది. జర్నలిస్ట్‌గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడ్డానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలో చాలాసార్లు ట్రోలింగ్కి గురైంది. అయినా వెరవలేదు. తన పంథా మార్చుకోలేదు. ఫే డిసూజా నిర్వహించే ప్యానెల్ డిస్కషన్‌కి రావడానికి చాలామంది పెద్దలు ఇష్టపడ్తారు. అరవడాలు, వచ్చిన వాళ్ల నోరు మూయించే ప్రయత్నాలు లేకుండా.. చర్చ చక్కగా.. ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని. జెండర్ ఈక్వాలిటీ గురించి కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ కనపడ్డా.. గుర్తుపట్టి పరిగెత్తుకొస్తారు.. ‘‘మీరంటే నాకు ఇష్టం’’ అని.. ‘‘మీరంటే మాకు అడ్మిరేషన్’’ అని, ‘‘మీరు మాకు ఇన్స్పిరేషన్’’ అని అభిమానం కురిపిస్తారు. ఆమె స్వస్థలం బెంగుళూరు. అక్కడి మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో జర్నలిజం చదివింది. అప్పుడే బెంగళూరు ఆల్ ఇండియా రేడియోలో న్యూస్‌రీడర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. సీఎన్‌బీసీ టీవీ18తో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత బిజినెస్ రిపోర్టింగ్ వైపు మళ్లింది. 2008లో ఈటీ(ఎకనమిక్ టైమ్స్)లో పర్సనల్ ఫైనాన్స్ ఎడిటర్‌గా చేరింది ఫే డిసూజా. -
ముందడుగు
ద ఇయర్ ఫర్ విమెన్.. 2018 సంవత్సరపు ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్. నిజంగా.. నిస్సందేహంగా అది మహిళల సంవత్సరమే. చరిత్ర ఎప్పుడూ బలవంతుల చెప్పుచేతల్లోనే ఉంటుంది. కాని 2018.. దీనికి భిన్నం. అణగారిన జెండర్ వైపు నిలబడింది. ఇన్నాళ్లూ ఏ ఎవరికివారే నిశ్శబ్దంగా భరించిన అవమానాలను తోటి స్త్రీకి చెప్పుకోవడం మొదలైంది. ఆమె విన్నది. రోజూ తనకు జరుగుతున్నవే. తోడు ఉండాల్సిన అవసరాన్ని గ్రహించింది. చేయి పట్టుకుంది. ఆ సఖ్యత ప్రపంచమంతా నిండింది. పురుషాధిపత్యంపై మహిళలు చేస్తున్న ఈ పోరుకు మద్దతునిచ్చింది 2018.. ఓ చెలిలా! విజయాన్ని కాంక్షిస్తూ చరిత్రలో ఓ కొత్త పుటలా మెరవనుంది! 1. చట్టబద్ధత కోసం ఐర్లాండ్‌లో అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలని ఆ దేశ స్త్రీలు చేసిన న్యాయపోరాటం గెలిచింది. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలంటే ఆ దేశ రాజ్యంగాన్ని సవరించాలి. దాని కోసం ఓటింగ్ జరిగింది. అలా గతేడాది మేలో ఐర్లాండ్ రాజ్యాంగం ఎనిమిదవ సవరణ ద్వారా అబార్షన్ చటబద్ధమైంది. ఇదీ అక్కడి మహిళలు సాధించుకున్న హక్కే. 2. హయ్యస్ట్ ఫిమేల్ కేబినేట్ జూన్‌లో స్పెయిన్ ప్రధానమంత్రి.. తన మంత్రివర్గంలో పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలకు చోటిచ్చాడు. కేబినేట్లో మొత్తం పదిహేడు మంది మంత్రులుంటే అందులో పదకొండు మంది మహిళలను మంత్రులుగా నియమించి స్పెయిన్ పాలనలో కొత్త మార్పుకు నేతృత్వం వహించాడు. దీంతో యూరప్‌లోనే హయ్యస్ట్ ఫిమేల్ కేబినేట్ కంట్రీగా స్థానం దక్కించుకుంది స్పెయిన్. 3. చేతికి డ్రైవింగ్ వీల్ గత యేడాది జూన్.. సౌది అరేబియా స్త్రీలకు రెక్కలు తొడిగింది. చేతికి డ్రైవింగ్ వీల్ అప్పగించింది. యెస్.. అప్పటిదాకా ఆ దేశంలో మహిళలు డ్రైవింగ్ చేయకూడదు అని ఉన్న నియమాన్ని డాష్‌బోర్డ్‌లో దాచి.. ఆడవాళ్ల చేతులకు వెహికిల్స్ తాళాలు అప్పగించింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇప్పించింది. ఆడవాళ్ల డ్రైవింగ్ మీదున్న బ్యాన్‌ను తొలగించింది. 4. మీ టూ.. టైమ్స్ అప్.. విమెన్ ఆఫ్ కలర్ స్త్రీలను గౌరవించే విషయంలో అగ్రరాజ్యం అమెరికాకూ చాలా అవలక్షణాలున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళల మీద చేసే వాఖ్యలే ఇందుకు ప్రధాన నిదర్శనాలు. మీ టూ మూవ్‌మెంట్‌కు పుట్టిల్లు కావడమూ మరో సాక్ష్యం. మీ టూ తర్వాత టైమ్స్ అప్ కూడా అక్కడే రాజుకోవడమూ తదుపరి ఉదాహరణ. అంతే చైతన్యమూ ఉందని రుజువు చేశాయి నవంబర్‌లో ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలు. రికార్డ్ సంఖ్యలో మహిళా ప్రతినిధులను ఎన్నికొని. ముఖ్యంగా బ్లాక్ విమెన్ ఎక్కువ మంది ఎన్నికయ్యారు. వాళ్లలో ఆఫ్రికన్ ముస్లిం ఇల్హా ఒమర్ ఒకరు. 5. ఇరాన్ స్త్రీల సాహసం.. ఇరాన్లో పురుషులతో కలిసి మైదానంలో ఆటలను చూడ్డం స్త్రీలకు నిషేధం. అయినా లెక్కచేయకుండా గత యేడాది జూన్ 25న టెహరాన్‌లోని ఆజాది స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ గ్రూప్ బి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూశారు ఇరానీ ఆడపడుచులు.‘‘ పురుషులతో కలిసి’’. 6. మరిన్ని మంచి సంగతులు.. 2018 నోబెల్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది... ఆ యేడు నోబెల్ శాంతి బహుమతిని ఇద్దరు కలిసి తీసుకున్నారు. వాళ్లలో ఒకరు డాక్టర్. రేప్ బాధితులకు వైద్యసేవలందించే సర్జన్.. డెనిస్ ముక్వేజ్. ఇంకొకరు రేప్ విక్టిమ్. నాదియా మురాద్. ఇరాక్‌లోని యజిది అనే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన యువతి. ఐఎస్ఐఎస్ చెరకు చిక్కి.. కొన్నేళ్లు లైంగిక హింస భరించి చివరకు తప్పించుకుని యాక్టివిస్ట్‌గా మారి.. తనలాంటి ఎందరో రేప్విక్టిమ్స్కు సేవలందిస్తున్న సాహసి. వీళ్లద్దరూ కలిసి ఆ యేటి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. – సరస్వతి రమ ప్రపంచంలో... మహిళల హక్కుల సాధనలో 2018 ప్రపంచానికి అద్భుతమైన ప్రేరణను.. తర్వాత సంవత్సరాలకు గొప్ప స్ఫూర్తినీ పంచింది. ఉదాహరణలు చాలా... కొన్నిటిని ప్రస్తావన.. ఆస్కార్స్‌తో శుభారంభం... ఆస్కార్‌లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగాల్లో మహిళలే ఆస్కార్స్ గెలుచుకొని ఈ యేటికి శుభారంభం పలికారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘షాలో’ (ఎ స్టార్ ఈజ్ బార్న్)కి లేడీగాగా, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కిగాను (బ్లాక్‌పాంథర్ సినిమా) రుత్ కార్టర్, బెస్ట్ ప్రొడక్షన్‌కు (బ్లాక్ ఫాం«థర్) హాన్నా బీచ్లర్ ఆస్కార్ పురస్కారం పొందారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్)కోసం ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కు దర్శకత్వం వహించిన రేయ్‌కా జెహతాబ్చీ ఆస్కార్ అందుకున్నారు. 2018 .. అమెరికా రాజకీయ చరిత్రలో వర్ణ వివక్ష (మహిళ విషయంలో)ను బ్యాలెట్ బాక్స్‌ల్లో కుక్కేస్తే.. 2019.. ఆస్కార్ స్టేజ్ మీద ఓడించింది.. నల్ల కలువలను గెలిపించి. ఈ యేడాదంతా ఈ ఒరవడే సాగుతుందని.. తర్వాత సంవత్సరాలకూ బదిలీ చేస్తుందని విశ్వసిద్దాం. -
స్పూర్తి కథలు
క్రిస్మస్ ప్రత్యేకం పవిత్ర గ్రంథం మనకు చెప్పేది కరుణలో, క్షమాగుణంలో, ప్రేమలో, ఆదరణలో, త్యాగంలో, సేవలో పవిత్రత ఉంటుందని. మన జీవితాలను నలుగురికి పనికి వచ్చేలా కొందరికి ఉదాహరణగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు అందిస్తున్న కొన్ని స్ఫూర్తికథలు... పంచదార మానేశాడు! కలకత్తాలో ఒకసారి పంచదారకు కొరత ఏర్పడింది. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో, నాలుగేళ్ల పసివాడు తన తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లం ఉంది. మదర్ థెరిసాకు ఆశ్చర్యమేసింది.‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు’’అని వాళ్లను అడిగారు మదర్.‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’.. చెప్పింది తల్లి.‘‘తన కోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్‌లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి.పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప,ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది.‘‘భగవంతుడు మనిషి మనసును ఎంత అందంగా సృష్టించాడు!’’ అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు మదర్.ఆ పిల్లవాడు అలా చేశాడంటే నమ్మాలని అనిపించకపోవచ్చు.దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పదనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. ‘‘గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అన్నది మదర్ చెప్పిన మాటే. ఎన్నో గుండెల తడి నారాయణరావుది శ్రీకాకుళం. చాలా రోజుల నుంచి గుండెనొప్పి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చి పెద్ద డాక్టర్‌కు చూపించుకోవాలనుకున్నాడు. మంచి పేరున్న ఓ డాక్టర్ గారి క్లినిక్‌కు కొడుకుతో పాటు వచ్చాడు. సరిగ్గా క్లినిక్ ముందు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్ వాళ్లు నారాయణరావును దగ్గర్లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.. ఉచితంగానే! పెద్దాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స మొదలుపెట్టాక గుండె స్పందనలు కాస్త బలహీనంగానే మొదలైనట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే స్పృహతప్పి ఉండటంతో మెదడు చేతనంగా ఉందో లేదో తెలియదు. కానీ తన తండ్రిని ఎలాగైనా బతికించమని కోరిన కొడుకు కన్సెంట్ మేరకు నారాయణరావుకు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన పేదరికం గమనించిన ఆసుపత్రివర్గాలు అత్యవసరమైన కొన్ని ఖర్చులకు తప్ప దాదాపుగా ఫీజు మాఫీ చేశాయి. ఇంతలో మరో కాంప్లికేషన్. అతడి కిడ్నీ ఫెయిలయ్యింది. నెఫ్రాలజిస్ట్ వచ్చారు. ఆయనా తన సేవల్ని చాలావరకు ఉచితంగానే అందించారు. మిగతా చికిత్సకోసం ఉస్మానియాకు తీసుకెళ్లమని, అక్కడ చికిత్సలన్నీ ఉచితంగానే జరిగేలా చూస్తామంటూ డాక్టర్లు సూచించారు. కానీ ఒకసారి చూపించుకొని వెళ్దామనుకున్న తాము ఇప్పటికే చాలా రోజులు హైదరాబాద్‌లో ఉండిపోవాల్సి వచ్చిందనీ, విశాఖపట్నానికి వెళ్తే తమకు ఒకింత సౌకర్యంగా ఉంటుందంటూ రోగి బంధువులు ఆయన్ని విశాఖకు తీసుకెళ్లారు. మొట్టమొదట చికిత్స అందించిన డాక్టర్ అతడి గురించి మరచిపోయారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒకరోజు నారాయణరావు తన కొడుకుతో కలిసి డాక్టర్గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నారాయణరావు కొడుకు డాక్టర్‌కు పాదాభివందనం చేశాడు. దాదాపు మృత్యువు ఒడిలో ఉండి, కిడ్నీలు దాదాపుగా పూర్తిగా విఫలమైన అతడు బతుకుతాడని అప్పుడెవరూ అనుకోలేదు. కానీ నారాయణరావు బతికి అలా నడిచివస్తుండటం చూసి డాక్టర్గారికి చాలా సంతోషంగా అనిపించింది. మొదట తాను, తర్వాత అంబులెన్స్‌వారు, పిమ్మట ఆసుపత్రి యాజమాన్యం, ఆ తర్వాత నెఫ్రాలజిస్ట్ చేయగలిగినంతా చేసి, రోగికి ఖర్చులు తగ్గించారు. విశాఖలోనూ అతడికి సేవల్ని చాలామంది దయతో అందించారని తెలిసింది. ఆ కొడుకు కూడా తనకు ఉన్నదంతా తండ్రి వైద్యం కోసం తెగనమ్మేశాడు. విలువలు లుప్తమైపోయాయని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ.. మనిషిలో మానవత్వం,కళ్లలో దయ, గుండె కింద తడి, మనసులో ఆర్ద్రత ఇంకా ఉన్నాయనీ ఈ సంఘటనతో మరోమారు రుజువైంది. తరాలుగా కృతజ్ఞత 1955 –1960ల నాటి రోజులు. ఒక పెద్దాయన తన కొడుకును చూడటానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి వస్తున్నాడు. గమ్యం మరో 50 కి.మీ. ఉందనగా బస్సు ఫెయిలయ్యింది. అప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. మరో రెండు గంటల్లో చీకటి పడితే బస్సులుండవు. పైగా చుట్టూ అడవి. చేసేదేమీ లేక ఆ పెద్దాయన తన తలపాగా బిగించికట్టి గమ్యం వైపునకు నడవడం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఒక మోటారు కారు ఆయన పక్కనే ఆగింది. అడవిలో అపరిచితులను నమ్మని ఆ రోజుల్లో కారులోని వారు కిందికి దిగి, ఈ టైమ్‌లో మీరెక్కడికి వెళ్తున్నారంటూ వాకబు చేశారు. పెద్దాయన జరిగింది చెప్పాడు.వాళ్లు నవ్వి.. ‘50 కి.మీ. నడుస్తూ వెళ్లగలరా? అందునా ఈ వయసులో’ అన్నారు. తామూ ఆ ఊరిమీదుగానే నగరానికి వెళ్తున్నామనీ, ఊళ్లో దింపేస్తామంటూ కార్లో ఎక్కించుకుని, కొడుకు దగ్గర దింపేసి వెళ్లారు. ఇప్పుడా పెద్దాయన తాలూకు నాలుగో తరం నడుస్తోంది. అప్పుడు ఆ పెద్దాయనకు సహాయం చేసిన ఆ మోటారు కార్లోని వ్యక్తులు బాగుండాలని, వాళ్ల కుటుంబాల్లోని వాళ్లు చల్లగా ఉండాలని, వాళ్ల తరతరాలూ తరగని వృద్ధిపొందాలంటూ ఈ నాల్గో తరం వారు ఇప్పటికీ ప్రార్థిస్తుంటారు. అలా తమ కృతజ్ఞతను వెల్లడిస్తూనే ఉన్నారు. అవును... మానవత్వం తరతరాలూ సాగితేనే కదా రాబోయే తరాలూ ఆ స్ఫూర్తిని తమ ముందుతరాలకు అందిస్తాయి. ఎవ్వరూ నో చెప్పలేదు! – జయసుధ, సినీ నటి అరుళ్ అనే అబ్బాయి గురించి చెప్పాలి మీకు. ఎప్పటిలాగే చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా ఓ ఐదు వేల రూపాయలు సహాయం చేద్దామనుకున్నాను. ఎవరికి అవసరమో తెలియదు కాబట్టి ‘‘నేనొక ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా సాయం అవసరమైన వాళ్లు ఎవరో కొంచెం చెప్పండి’’ అని అక్కడ ఉన్నవాళ్లను అడిగాను. వాళ్లు తలా ఓ పేరు చెప్పారు.సరే అని అనుకొనేలోపు నా వెనకనుంచి ఎవరో ఒకతను సడెన్‌గా వచ్చి ‘‘ 12 ఏళ్ల ఓ బాబు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. వీలైతే మీరు ఆ అబ్బాయికి సహాయం చేయండి’’ అని ఆ అబ్బాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పి వెళ్లిపోయాడు. నేనెప్పుడూ అతనిని అక్కడ చూడలేదు. ఎవరికైనా ఇద్దామనుకున్నా డబ్బే కదా అని, స్వయంగా ఆ అబ్బాయి వాళ్లింటికి బయలుదేరాను. చూసేసరికి చర్చిలో అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగానే బాబు పరిస్థితి దయనీయంగా ఉంది. నా చేతిలో ఉన్న ఐదు వేలు ఎందుకు ఉపయోగపడతాయి అనిపించింది. హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయి అని వాళ్లమ్మని అడిగాను. ఆమె చెప్పిన నంబర్ (నాలుగు లక్షలు) విని ఏం చేయలో అర్థంకాని నేను కష్టమైనా సరే... నా బడ్జెట్లో లేకపోయినా ఓ 25 వేలు సహాయం చేస్తాను అని చెప్పి ఇంటికొచ్చేశాను. దారి పొడవునా అరుళ్ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాడు. నాలుగు లక్షలే కదా, మీరే ఇవ్వలేరా అని మీరు అనుకోవచ్చు. కాని సడెన్‌గా అంత పెద్ద మొత్తం అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఎవరినన్నా అడుగుదామా అనిపించింది, కానీ నాలో నాకే నువ్వు.. ఇంత పెద్ద ఆర్టిస్టువి, నువ్వు ఎవరికోసమో డబ్బు సాయం చేయమని అడగటమేంటి అని నా మనసుకు అనిపించింది. మళ్లీ అంతలోనే దేవుని మాటలు గుర్తుకొచ్చాయి. ‘నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న మాటలు మళ్లీ మళ్లీ నాకు వినపడ్డాయి. నీకు అంతలేదు, నిన్ను నువ్వు తగ్గించుకొని చూడు, నువ్వు కేవలం జయసుధ అనే మనిషివి మాత్రమే అని దేవుడు అన్నట్లు అనిపించింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. ఏమయితే అది అయిందని మొదట నటుడు ప్రకాశ్‌రాజ్‌కి ఫోన్ చేశాను. ఆయన వెంటనే పాజిటివ్‌గా స్పందించి 25వేల రూపాయలు ఇస్తానన్నారు నిండు మనసుతో.అప్పటికి నాకు ఆయనతో అంత పరిచయం కూడా లేదు. హమ్మయ్యా ఇక ఎవరినైనా అడగొచ్చు అనే ధైర్యం వచ్చింది. వెంటనే హీరో అర్జున్‌కు ఫోన్ చేశాను. తర్వాత రాధిక, సుహాసిని, సీత, విజయశాంతిలతో పాటు లత, వాళ్ల తమ్ముడు రాజ్‌కుమార్ , తమిళ దర్శకుడు కె.యస్ రవికుమార్ ఇలా అందరూ ఎవ్వరూ నో చెప్పలేదు, వీళ్లతో పాటు ఇంకా చాలామంది. ఆ పిల్లాడి ట్రీట్మెంట్కి కావాల్సిన మొత్తం డబ్బు అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు గంటలో సమకూరాయి. నా జీవితంలో ఈ సంఘటను ఎన్నటికీ మరువలేను. కారణం ఏంటంటే ఆ రోజు క్రిస్మస్, దేవుడు నన్ను చూస్తున్నాడేమో అనే ఫీలింగ్.. మనల్ని మనం తగ్గించుకొని (అహం), మనకు చేతనైన సాయం చేయడం కంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఒక్కోసారి మాట సాయం కూడా ఓ జీవితాన్ని నిలబెడుతుంది. మంచినీళ్లమ్మ సత్యవతమ్మ అవకాశం వచ్చినప్పుడల్లా తనకు తోచిన మానవ సేవ చేస్తూండేవారు. ఆవిడకు ఆరు పదులు నిండేటప్పటికే చాలా జబ్బు పడ్డారు. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ‘నేను జబ్బు మనిషిని’ అని అనుకోకుండా, ఓపిక ఉన్నంత వరకు ఇతరులకు సేవ చేయాలి’ అనే భావనతో ఉన్నారు సత్యవతమ్మ. పిల్లలకు వివాహాలు అయిపోయి ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. భర్త కాలం చేయడంతో, ఒంటరి అయిపోయారు. నిత్యం సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా బావురుమంది. ఆత్మస్థైర్యంతో, ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డారు. ఇరుగుపొరుగు వారితోనే కాకుండా, ఆ వీధిలో సంచరించేవారితో సైతం ప్రేమగా ఉంటూ, ఒంటరితనాన్ని మరచిపోయారు. విజయవాడ అంటే ఎండలకు కొదవ ఉండదు. ఎన్ని చలివేంద్రం కేంద్రాలు పెట్టినా మధ్యాహ్నానికి నీళ్లు ఖాళీ అయిపోతాయి. ఒక చిన్న కాలనీలో చిన్న సందులో ఉండే సత్యవతమ్మ, ఆ రోడ్డులో తిరిగే రిక్షావారికి, కూరలు పళ్లు అమ్ముకోవడానికి వచ్చేవారికి మంచినీళ్లు అందించాలనుకున్నారు. నీళ్లు మోయడానికి పనివారి ఆసరా లేదు. మంచి చేయాలనే సంకల్పమే ఆవిడకు బలం చేకూర్చింది. ఒక మట్టి కుండ తీసుకువచ్చి, ఇంటి ముందు గేటు దగ్గర ఉంచారు. ఇంట్లో ఉన్న చిన్న గిన్నెతో పది సార్లు నీళ్లు తీసుకువచ్చి ఆ కుండలో పోశారు. పైన మూత, ఒక స్టీలు గ్లాసు ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకు కుండ నింపేవారు. మధ్యాహ్నం ఓ గంట కునుకు తీసి లేచి వచ్చి కుండ చూసేవారు. అప్పటికి కుండ ఖాళీ అయిపోయేది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయేది. అంతే మళ్లీ కుండ నింపేవారు. సాయంత్రానికి ఖాళీ అయిపోయేది. ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది. అలా మార్చి నెల నుంచి జూన్ వరకు నీళ్లు పెట్టేవారు. ఇలా సుమారు పది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి వేసవి కాలం ఆ ఇంటి ముందర మంచినీళ్లు దొరుకుతాయన్న భరోసా కలిగింది అందరికీ. ఒక రోజు కుండ చిన్నబోయింది. అదేమిటా అని ఆ వీధిలో నిత్యం సంచరించే రిక్షా వాళ్లు, çపండ్ల అమ్మకాల వాళ్లు ఇంట్లోకి తొంగి చూశారు. సత్యవతమ్మగారు ఆ రోజు తెల్లవారు ఝామున తీవ్రమైన గుండెపోటుతో కాలం చేశారని తెలుసుకున్నారు. ‘అయ్యో! నిన్న రాత్రి కూడా ఆ తల్లిని పలకరించి, మంచినీళ్లు తాగాం’ అనుకుంటూ అందరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చేతి నీళ్లు తాగిన వారి కళ్లు వర్షించసాగాయి. బరువెక్కిన గుండెలతో ఆ తల్లిని వేనోళ్ల పొగిడారు. పెద్ద కర్మనాడు వారంతా వచ్చి ‘అమ్మగారి ప్రసాదం’ అని స్వచ్ఛందంగా వచ్చి తిని, ‘మా తల్లి బతికున్నన్నాళ్లు కడుపు నిండా పలకరించే ది, మా దాహం తీర్చింది’ అనుకున్నారు. నెత్తుటి బంధం అప్పుడు జేమ్స్ హారిసన్‌కు పద్నాలుగేళ్లు. అతడిది ఆస్ట్రేలియా. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఛాతీకి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది. దానికిగానూ పదమూడు లీటర్ల రక్తం అవసరమైంది. ఎవరెవరో ఆయనకు రక్తదానం చేశారు. మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.కోలుకున్నాక, హారిసన్ తనకు తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎవరో తనకు పేరు కూడా తెలియనివాళ్లు ఇచ్చిన రక్తం వల్ల తాను బతికినప్పుడు, తాను కూడా మరొకరు బతకడానికి కారణం కావాలని అనుకున్నాడు. అట్లా ఆయన రక్తదానాలు చేయడం మొదలుపెట్టాడు.1936లో జన్మించిన హారిసన్ 1954లో తన తొలి రక్తదానం చేశాడు. కుదిరినప్పుడల్లా ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని దానాల తర్వాత వైద్యులు ఆయన రక్తపు ప్లాస్మాలో ఒక అరుదైన విశేషం ఉందని కనుగొన్నారు.సృష్టిలో కొన్ని ఎందుకు జరుగుతాయో అంతు పట్టదు. ఒక గర్భిణి రక్తంలోని యాంటీ బాడీస్ ఒక్కోసారి గర్భంలో ఉన్న శిశువు రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. దాంతో శిశువుకు రక్తహీనత కలుగుతుంది, కామెర్లు వస్తాయి. దీనికి విరుగుడు ఇవ్వకపోతే ప్రాణాపాయం. ఈ స్థితిని రీసస్ డిసీజ్ అంటారు. అయితే, దీనికి విరుగుడుగా పనికొచ్చే యాంటీ–డీ మెడిసిన్ అందరి రక్తంలో లభించదు. అది హారిసన్ రక్తంలో ఉందని కనుగొన్నారు. అరుదుగా తప్ప దొరకని యాంటీ–డీ హారిసన్ రక్తంలో ఉండటం ఒక విచిత్రమైతే, ఆయన ఎన్నో దానాలు చేయడానికి సంకల్పించుకుని ఉండటం మరో విశేషం. దీనివల్ల లభ్యత శాతం అత్యధికమైంది. 60 ఏళ్ల కాలంలో హారిసన్ అక్షరాలా 1,172 సార్లు రక్తదానం చేశాడు. అయితే, తన 81వ ఏట ఇంకా రక్తం ఇవ్వడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరించిన పిమ్మట, పైగా ఎనభై ఏళ్లు పైబడినవాళ్లు రక్తదానం చేయకూడదని ప్రభుత్వ నిబంధన కూడా ఉండటంతో మొన్న మే 11న తన చివరిదైన 1,173వ రక్తదానం చేసి తన పని నుంచి విరమణ తీసుకున్నాడు.హారిసన్ రక్తం నుంచి సేకరించిన యాంటీ–డీ మెడిసిన్ వల్ల సుమారు 24 లక్షల మంది పసివాళ్లకు ప్రాణాపాయం తప్పిందని అంచనా. ‘మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్’( బంగారం చేయి కలవాడు)గా ఆయన్ని ఆస్ట్రేలియన్లు ముద్దుగా పిలుచుకుంటారు. విడువని చెయ్యి లక్ష్మి గుర్తుందా? యాసిడ్ దాడి జరిగిన లక్ష్మి.. వెంట పడుతున్న ప్రేమకు ‘నో’ అని చెప్పినందుకు ఒంటి మీద యాసిడ్ కుమ్మరించారు. ఆమెతో పాటు దేశాన్నీ భయోత్పతంలోకి నెట్టిన సంఘటన అది.జరిగిన దారుణానికి భీతిల్లినా కుంగిపోలేదు. న్యాయపోరాటం చేసింది లక్ష్మి. ఆ పోరాటంలో ఆమెకు అండగా నిలబడ్డాడు యాక్టివిస్ట్ అలోక్ దీక్షిత్. ఆమెను చూసిన లోకం జడుసుకుని పక్కకు తప్పుకుంటుంటే ఆమె చేయి పట్టుకుని వెన్నంటి ఉన్నాడు. జీవన సహచరుడిగా మారాడు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. సామాజిక అడ్డంకులు ఎదురైనా ఆమె చేయి విడువలేదు. అలోక్ ఇచ్చిన సపోర్ట్‌తో న్యాయపోరాటంలో విజేతగా నిలిచింది. పోయిన సంతోషం తిరిగి ఆమె మొహంలో నవ్వై మెరిసింది. లక్ష్మి.. ఇప్పుడొక బిడ్డకు తల్లి! బాధను పంచుకుని.. ధైర్యాన్నిచ్చి నిజమైన స్నేహితుడిగా.. అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు అలోక్ దీక్షిత్. కైండెస్ట్ బాస్ అలు భత్రానియా... జేఆర్డీ (జహంగీర్ రతన్జీ దాదాభాయి)కి పదిహేనేళ్లుగా సెక్రటరీగా పనిచేశారు. కింది ఉద్యోగుల పట్ల ఆయన ఉండే తీరు, ఇచ్చే గౌరవం, చూపించే ఆపేక్ష గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజ్‌లో ఆమె ఇలా షేర్ చేసుకున్నారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పనిచేయడం నేర్పారు మా వాళ్లు. కాలేజ్‌లో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ నాన్నకు హెల్ప్ చేసేదాన్ని. 1961లో గ్యాడ్యుయేషన్ పూర్తయ్యాక టాటా స్టీల్‌లో చేరాను టెంపరరీ ఎంప్లాయ్‌గా. తర్వాత పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఈలోపే ఉద్యోగం చేస్తూనే లా కూడా కంప్లీట్ చేశాను. 1970ల చివర్లో ‘బాంబే హౌజ్’ ఫోర్త్ ఫ్లోర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. జేఆర్డీ టాటాకు సెక్రటరీగా రిక్రూట్ చేస్తున్నట్టు. నమ్మలేకపోయా. అప్పటి దాకా ఆయన గురించి వినడమే.. ఫొటోల్లో చూడ్డమే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన దగ్గర పనిచేయడం. ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.. ఆయన దగ్గర ఫస్ట్ డిక్టేషన్ తీసుకుంటున్నా.. చెమటతో అరచేతులు తడిసి ముద్దయిపోయాయి. అది ఆయన గ్రహించి వెంటనే చాలా క్యాజువల్‌గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. నా పట్లే కాదు కింది ఉద్యోగుల అందరిపట్లా ఆయనలాగే ఉండేవారు. అంతే కేరింగ్ చూపించేవారు. కైండెస్ట్ బాస్. ఫారిన్‌కి వెళ్లినప్పుడల్లా తోటమాలి పిల్లల కోసం చాక్లెట్స్ తెచ్చేవాళ్లు. లెక్కలేనంత మందికి ఆయన సహాయం చేయడం కళ్లతో చూశా. సాఫ్ట్ అండ్ హంబుల్ పర్సన్. బిజినెస్ పనులతో ఊపిరిసల్పనంత బిజీగా ఉన్నా.. చుట్టూ ఉన్న మనుషులతో గడిపేవాళ్లు. తనను నమ్ముకున్న వాళ్ల క్షేమాన్ని కాంక్షించేవాళ్లు. ఆయనతో కలిసి పనిచేయడమంటే ప్రతి రోజూ ఇన్స్పైర్ అవడమే. నిజాయితీ, హార్డ్‌వర్క్, పరులకు హెల్ప్ చేయడం.. ఆయనను చూసి.. తెలుసుకుని అలవర్చుకోవాల్సిన క్వాలిటీస్. ప్రపంచానికి ఆయన బిజినెస్‌మన్.. బట్ ది పర్సన్ హి వజ్ ట్రూలీ ఎ జెమ్. ఈ రోజుల్లో అలాంటి వాళ్లు కనిపించరు. ఆయనలో హాస్య చతురత కూడా అంతే.ఒకసారి నా బర్త్‌డేకి మా ఫ్యామిలీని ఒబేరాయ్లోని ఫ్రెంచ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. భోజనం అయిపోయాక బిల్ తెమ్మని అడిగారు. హోటల్ మేనేజర్ పరుగుపరుగున వచ్చి.. ‘‘మీరు బిల్ పే చేయడం ఏంటీ సర్’’ వద్దు అన్నాడు. ‘‘అయ్యో.. ఆ ముక్క ముందే చెబితే ఇంకొన్ని ఆర్డర్ చేసేవాళ్లం కదా’’ అన్నారు టాటా ఇన్నోసెంట్‌గా. ఆయనకు సెక్రటరీగా పదిహేనేళ్లు ఆయనకు సెక్రటరీగా పనిచేయడం నిజంగా నా బిగ్గెస్ట్ ప్రివిలేజ్. జేఆర్డీ టాటా సర్.. యూ ఆర్ స్పెషల్ బియాండ్ వర్డ్స్!’’ అని రాసుకున్నారు అలు భత్రానియా. శిబి, కర్ణుడు చిన్నబోయారు – ఆర్. నారాయణమూర్తి, నటుడు మానవత్వం అనగానే నలభై ఏళ్ల క్రితం నేను ఆమె పాదాలకు దణ్ణం పెట్టడం మాత్రమే గుర్తుకు వస్తుంది. అది 1970 ల ప్రాంతం. నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజి ప్రెసిడెంట్‌గా, సోషల్ సర్వీస్ సెక్రటరీగా చాలా యాక్టివ్‌గా తిరుగుతుండేవాడిని. ఆ టైమ్‌లో బీహార్‌లో బీభత్సమైన వరదలు వచ్చాయి. భారత ప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా పరిగణించింది. అప్పుడు మా కాలేజికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా కాలేజ్ పెద్దాపురంలో ఉండేది. కాలేజీ తరపున విద్యార్థులందరం వీధి వీధికి వెళ్లి అందరినీ బియ్యం, బట్టలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలా అన్ని వీధులు తిరిగిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ కొంతమందిమి కళావంతుల వీధికి వెళ్లాం. అక్కడ ఉన్న ఓ మహిళ దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని అడిగారు. మేము జరిగిన విషయం చెప్పాం. అయ్యో! అవునా పాపం, ఆగండి అని చెప్పి ఇంట్లోకి వెళ్లి , ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు తెచ్చి ఇచ్చింది. తర్వాత అందరిలో ఉన్న నన్ను కొద్దిగా పక్కకు పిలిచి ‘‘నేను దేవదాసి పనిచేస్తాను. రాత్రి బేరాలు ఏమీ రాలేదు.అందుకే డబ్బులు ఇవ్వలేక పోయాను. మీరు ఓ పని చెయ్యండి, రేపు ఉదయం వచ్చి నన్ను కలవండి. ఈ రోజు మంచి బేరాలు చూసుకుని వచ్చిన డబ్బంతా మీకే ఇస్తాను’’ అని అన్నది. సరే అనుకుని మా దారిన మేము వెళ్లిపోయాం. తర్వాత రోజు మేము సేకరించినవన్నీ తీసుకుని కాలేజీకి వెళ్లాం. అక్కడ నా స్నేహితుడు ఒకడు ‘‘మూర్తీ నిన్న మనం కళావంతుల వీధీలో ఒకామె డబ్బులు ఇస్తాను అన్నది కదా. ఓసారి వెళ్లి అడుగుదామా’’ అన్నాడు. అలాగే అంటూ ఇద్దరం కలిసి వెళ్లాం. ఆమె మాకు ఎదురొచ్చి ‘‘మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వస్తారా, రారా అనుకుంటున్నాను. రాత్రి బాగా బేరం జరిగింది. ఇవిగో తీసుకోండి’’ అంటూ ఆమె దగ్గరున్న మొత్తం డబ్బు నా చేతిలో పెట్టింది. అంతే నా కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా ఆమె కాళ్లమీద పడి దణ్ణం పెట్టాను. ‘‘ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవటం కంటే మంచి పని ఏదీ ఉండదు బాబూ. అదే మనల్ని కాపాడుతుంది’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆవిడలో ఉన్న దయ, కరుణ, మానవత్వం ముందు శిబి చక్రవర్తి, కర్ణుడు చిన్నగా కనిపించారు. నలభై ఏళ్లుగా ఈ విషయం గుర్తొస్తూనే ఉంటుంది. అయ్యో.. ఆమె పేరు అడగడం మర్చిపోయానే అని బాధతోపాటు. ఆమెలో కరుణ, దయ, మానవత్వం చూశాను. ఇద్దరు అతిథులు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే కేరళ రాజ్‌భవన్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రపతికున్న అధికారానుసారం ఆయన ఓ ఇద్దరిని తన అతిథులుగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలి. ఆ సమయంలో కలాం ఆహ్వానించిన అతిథులు ఎవరో తెలుసా.. తిరువనంతపురంలోని ఓ రోడ్డు పేవ్మెంట్ మీద చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ చిన్న హోటల్ ఓనర్. ఈ ఇద్దరూ అబ్దుల్‌కలాం మిత్రులు. తిరువనంతపురంలో ఆయన సైంటిస్ట్‌గా పనిచేసినప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరే చెప్పులు రిపేర్చేయించుకునేవారు. ఆ హోటల్లో తినేవారు. ఆ స్నేహమే ఆ ఇద్దరినీ రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి అతిథులను చేసింది. ఇంకొక సందర్భం. ఒకసారి వారణాసిలోని ఐఐటిలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు అబ్దుల్‌కలాం. వేదిక మీద అయిదు కుర్చీలు వేశారు. మధ్యలో పెద్దగా.. ప్రత్యేకంగా ఉన్న కుర్చీని కలాంకు కేటాయించారు. మిగిలిన నాలుగు యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ల కోసం. ఆ ప్రత్యేకతను గమనించిన కలాం ఆ కుర్చీలో కూర్చోడానికి తిరస్కరించి.. మిగిలిన నాలుగింటిని పోలిన కుర్చీనే తెప్పించి అందులోనే ఆసీనులయ్యారు. ఈ రెండు సంఘటనలు.. ఎదిగినకొద్దీ ఒదగమనే విషయాన్ని చెప్తున్నాయి. వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చారు ‘‘ఒకపక్కనేమో చీకటి పడుతోంది... ఇంటికెళదామంటే కారు టైర్ పంక్చర్. వయసా 80 దాటుతోంది పక్కనే 75 ఏళ్ల శ్రీమతి. పోనీలే ఎవరికైనా ఫోన్ చేసి రమ్మందామా అంటే సిగ్నల్ అస్సలు లేదు. ఐదేళ్ల క్రితం ధార్వాడ శివార్లలో ఉండే కెల్గేరి సరస్సు వద్ద ఇదీ నా పరిస్థితి. సాయంకాలం అలా కాసేపు తిరిగి వద్దామని సరస్సు వద్దకు వెళ్లామా.. కారు పార్క్ చేసి ఇల్లాలితో మాట కలిపి నాలుగు అడుగులేశామో లేదో.. టైమ్ అస్సలు తెలియలేదు. తిరిగి కారు దగ్గరకొచ్చి చూస్తే టైర్ పంక్చర్. ఏం చేయాలబ్బా అనుకుంటూ తలగోక్కున్నా.. ఏదైతే అది అయిందనుకున్నాం. కారు హెడ్లైట్లు వేసిపెట్టాలని తీర్మానించుకున్నాం. కాసేపటికే ఓ ట్రక్కు రయ్యి మంటూ దూసుకెళ్లిందిగానీ.. మా కేకలు వినిపించాయో లేదో... ఆగలేదు. బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న టైమ్ వచ్చారు వాళ్లునలుగురు ఉన్నారు. రెండు బైక్‌లపై మమ్మల్ని దాటుకుంటూ కాస్త దూరం వెళ్లిన వాళ్లు కాస్తా వెనుదిరిగారు. దగ్గరికి వచ్చారు. ‘‘తాతా ఏమైనా ఇబ్బందా?’’ అని అడిగారు. ప్రాణం లేచొచ్చినట్లు అయింది నాకు. విషయం చెప్పా. ‘‘కార్లో కిట్ ఉందేమో చూడండ్రా’’ అని వాళ్లల్లో ఒకరు బైక్ దిగాడు. డిక్కీ ఓపెన్ చేస్తూంటే వాళ్లు తమని అనిల్, సునిల్, ప్రతీక్, వికాస్‌లుగా పరిచయం చేసుకున్నారు. దగ్గరలోని ఊళ్లో మంచానపడ్డ తాతను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారంట. అనిల్, సునీల్‌లు బైక్ హెడ్‌లైట్ ఆన్ చేసి కారుపై ఫోకస్ చేస్తే.. ప్రతీక్, వికాస్‌లు డిక్కీలోని కారు బయటకు తీయడం.. పంక్చరైన టైర్ స్థానంలో బిగించడం టకటకా జరిగిపోయాయి. సమయానికి దేవుళ్లలా వచ్చారయ్యా అంటూ కాసిన్ని డబ్బులు వాళ్ల చేతుల్లో పెట్టబోయో... ‘‘మా తాతతోనైతే డబ్బులు తీసుకుంటామా?. ఒద్దు పెద్దాయన’’ అనేశారు. వాళ్లదారిన వాళ్లు.. నా దారిన నేను వచ్చేశాం. ఐదేళ్లు అవుతున్నా.. ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా... మనసంతా హాయిగా అనిపిస్తుంది’’ – అమృత్ రావు కాలే, బెంగళూరు గాజు పెంకులు డిఆర్డివో ప్రాజెక్ట్ బిల్డింగ్ పూర్తయ్యాక అబ్దుల్‌కలామ్ దాని ప్రారంభోత్సవానికి వచ్చాడు. ప్రహరీ గోడ మీదుగా చూసిన ఆయన ఆశ్చర్యపోతూ అక్కడే ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్‌తో ‘ఆ గోడ మీదుగా గాజు పెంకులన్నీ ఎందుకలా అమర్చి పెట్టారు చుట్టూతా అన్నాడు.’ రక్షణ కోసం అలా గాజు పెంకులను అమర్చాం’ అన్నాడు అతను మరింత నైపుణ్యాన్ని చూపామని గర్వంగా! ‘మన రక్షణ అనుకున్నది మరొకరి పాలిట శిక్ష అవుతుంది. ఆ గాజు పెంకుల మీద పక్షులు వాలితే ..’ అని ఆగిపోయాడు అబ్దుల్‌కలామ్. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ వెంటనే ఆ గాజు పెంకులను తొలగించడానికి మనుషులను పురమాయించాడు. డబ్బులే తీసివ్వాలా? రెడ్ సిగ్నల్ కనిపించడంతో ఫుట్‌పాత్ సపోర్ట్ తీసుకుంటూ బండిని ఆపా. సరిగ్గా సిగ్నల్‌కు ఎదురుగా.. ఫుట్‌పాత్ ఎండింగ్లో ఏదో గొడవ జరుగుతోంది. ఏంటా గొడవ? ముందున్న వ్యక్తిని అడిగా.. ఏమో తెలియదన్నాడు. బండి మీదే కాస్త పైకి లేచి చూశా... ముసలాయన, ఓ యువకుణ్ని పట్టుకొని తిడుతున్నాడు.. రేయ్.. నీకు సిగ్గులేదా? చూడ్డానికి ఆంబోతులా ఉన్నావ్..! తల్లిని రోడ్డు మీద అడుక్కోమని కూర్చోబెడుతున్నావ్! అసలు నువ్వు మనిషివేనా? అని. దానికి ఆ యువకుడు సమాధానమేదీ చెప్పకుండానే నవ్వుతూ వెళ్లిపోయాడు. ముసలాయన తిట్లు మాత్రం ఆగడం లేదు. అలా తిట్టుకుంటూ నావైపే వచ్చాడా ముసలాయన. ఏం తాతా.. ఎందుకు తిడుతున్నావని అడిగా. ‘లుచ్చాగాడు’.. కాళ్లు లేని తల్లిని తీసుకొచ్చి, అడుక్కోమని ఇక్కడ కూర్చుండబెట్టి వెళ్తున్నాడు. మళ్లీ వస్తాడు.. డబ్బులన్నీ తీసుకొని పోతాడు. లుచ్చాగాడు.. లుచ్చాగాడు. తిట్టుకుంటూ వెళ్లిపోయాడు తాత. ముసలాయన అంతగా తిట్టినా.. ఆ యువకుడు మాత్రం నవ్వుకుంటూ వెళ్లడం నాకెందుకో ఆశ్చర్యం కలిగించింది. తిరిగి చూశా.. ఆ యువకుడి ఎక్కి వెళ్లిపోతున్న ఆటో ఎంతో దూరం పోలేదు. వెంటనే బండి యూటర్న్చేసి ఆటో వద్దకు వెళ్లా. అరేయ్.. బాబు, ఆ పెద్దాయన అంతగా ఎందుకు తిట్టాడు నిన్ను? అని అడిగా.సమాధానం చెప్పలేదు. మీ అమ్మను అడుక్కోవడానికి రోజూ ఇక్కడ కూర్చోబెతావట.. నిజమేనా? అని అడిగా. సమాధానం చెప్పలేదు! నేనెవరో తెలుసా? రిపోర్టర్‌ను.. పోలీసులకు చెప్పి, లోపలికి పంపించమంటావా? అని బెదిరించా. అప్పుడు ఆ యువకుడు చెప్పిన మాట విని.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా!‘ఆమె మా అమ్మకాదు.. మా అపార్ట్మెంట్ పక్కన రేకుల ఇంట్లో ఉంటది. రెండు కాళ్లు లేవు.. ఏ పనీ చేయలేదు. మొన్నటిదాకా అమెతోపాటు ఓ పిల్లగాడుంటుండే. రోజూ వాడే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి, తీసుకెళ్లెటోడు. వారం కిందట.. ఇంట్లో పైసలన్నీ తీసుకొని పరారైండట. ముసల్ది.. లబోదిబోమంటూ ఏడుస్తుంటే.. వారం రోజులుగా నేనే ఇక్కడికి తీసుకొచ్చి దించుతున్నా. ఆమెకు ఇయ్యడానికి నా దగ్గర పైసల్లేవ్..! నేనే.. పైసల కోసం స్విగ్గీల పనిచేస్తున్నా. కమ్ సె కమ్ ఇడదాక దించుతేనైనా ఆమెకు బతకనీకి కొన్ని పైసలొస్తయ్’ అని చెప్పడంతో నా నోట మాట రాలేదు. మరి ఆ ముసలాయన అంతగా తిడుతుంటే.. చెప్పొచ్చుగా? అని అడిగితే.. ‘ఆ పెద్దాయన తిట్టి ఎళ్లిపోయిండు. నిన్న ఒకోడైతే చెంపమీదనే కొట్టిండ’ని చెబుతుండగానే ఆటో కదిలింది. ఆ యువకుడు వెళ్లిపోయాడు. జర్నలిస్టును కదా.. వాడు చెప్పిన దాంట్లో నిజమెంతో? అబద్ధమెంతో? తెలుసుకుందామని.. సిగ్నల్దగ్గర అడుక్కుంటున్న ఆమె దగ్గరకు వెళ్లి అడిగా.. ఆ యువకుడు చెప్పింది అక్షరాలా నిజమే! చెంపదెబ్బతో సహా. సాయం చేయాలంటే జేబులో నుంచి డబ్బులే తీసియ్యాలా? మనసులోని దయా, కరుణను కాస్త ఖర్చుచేసినా చాలనిపించింది! – సుధాకర్, హైదరాబాద్ పిట్టలకు ప్రాణమిచ్చాడు అసలే ఆయన ఓ రైతు.. పేరు అశోక్ సోనులే. ఉండేదేమో మహారాష్ట్రలో. అది కూడా కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో! ఉన్నదేదో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మరీ ఖర్చుపెడతాడని అనుకునేందుకు ఇంతకంటే పెద్ద వివరాలు అక్కరలేదు. కానీ.. నిజం ఇది కాదు. అరకొర వర్షాలతో పంటలు పండని దుస్థితి ఉన్నా... చేసిన అప్పులు తీరక తోటిరైతులు అంత విషం తీసుకుని నేలకు ఒరుగుతున్నా...తనకున్న పిసరంత ఆసరాను కూడా పాలపిట్టలకు, పిచ్చుకలకు వదిలేసిన గొప్పమనసు అశోక్ సోనులేది. కొల్హాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని గడ్మడ్షింగీలో ఇద్దరు సంతానంతో కలిసి పొలం పనులకెళ్లే అశోక్‌కు తండ్రుల నుంచి వచ్చిన భూమి ఓ పావు ఎకరం మాత్రం ఉంది. ఎప్పట్లానే ఆ ఏడాది కూడా జొన్నలైతే విత్తాడు కానీ.. వర్షాభావంతో పంటపై ఆశమాత్రం పెట్టుకోలేదు. చిత్రమో.. మహత్యమో తెలియదుగానీ.. ఆ ఏడాది అశోక్ పంట విరగకాసింది. హమ్మయ్యా.. ఏళ్ల తరువాతైనా ఒక్క పంట చిక్కింది కదా అనుకున్నాడు. కోతలకు సిద్ధమయ్యాడు. పొలం మధ్యలో ఉన్న బాబూల్ చెట్టును కూడా కొట్టేస్తే నాలుగు గింజలు ఎక్కువ దొరుకుతాయి కదా అని గొడ్డలితో బయలుదేరాడు. తొలి వేటు వేసేలోపు... చెట్టుపైనే గూడు కట్టుకున్న పిట్టలు కువకువలు మొదలుపెట్టాయి. వాల్మీకికి పక్షుల శోకం నుంచి శ్లోకం పుట్టుకొచ్చినట్లు.. బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్లు అశోక్ మదిలో చెట్టు కొట్టేస్తే.. పిట్టల పరిస్థితి ఏమిటన్న ఆలోచన మొదలైంది. గొడ్డలి పక్కకు ఒరిగిపోయింది.తన కష్టాలు తనకెలాగూ ఉన్నాయి. చెట్టు కొట్టేస్తే పిట్టల గూళ్లు చెదరిపోతాయి. పంట తీసేస్తే కాసిన్ని గింజలూ దొరకవు కదా? అనుకున్నాడు. కోతలకు స్వస్తి చెప్పేశాడు. కుటుంబంతో కలిసి ఆ పక్షులకు కాసిన్ని నీళ్లు అందేలా ఏర్పాట్లు చేసేశాడు. అమ్మకు అన్నం పెట్టాలన్నా లక్ష లెక్కలేసుకునే ఈ రోజుల్లో అశోక్ వంటి వారు అరుదే! చిట్టి చేతులు అది పెంపుడు కుక్క కాదు. చెత్త కుప్ప దగ్గర కడుపు నింపుకునే వాటిలో అదీ ఒకటి. చలాకీగా ఉండేది. ఊరంతా తనదే అయినట్టు తిరిగేది. అలాంటిది అది తల నేలకేసి పదే పదే బాదుకుంది. ముందరి కాళ్లతో టపీ టపీమని ముఖాన్ని కొట్టుకుంది. కానీ, ముఖానికి పట్టుకున్న భూతాన్ని వదిలించుకోవడం దాని వల్ల కావడంలేదు. పొడవాటి తెల్లటి డబ్బా అది. మెడ నుంచి మూతిని దాటి నాలుగు అంగుళాల ముందుకు పొడుచుకువచ్చింది. దాని శక్తి కొలదీ బాదుతూ ఉండటం వల్ల డబ్బా అడుగు భాగం అయితే పూర్తిగా పగిలింది కానీ, ఆ డబ్బా ఊడిరాలేదు. బహుశా చెత్త కుప్ప దగ్గర పడి ఉన్న డబ్బాలోని ఆహారం తినడానికి అందులో మూతి పెట్టి ఉంటుంది. వీలుకాక మూతి బయటకు తీసేటప్పుడు దానికి తెలియలేదు ఆ డబ్బా తన తలను మింగేసిందని. తను విశ్వ ప్రయత్నం చేసింది. డబ్బా ఊడిరాలేదు.వాడవాడలా తిరిగింది. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని రోజులయ్యిందో గుక్కెడు నీళ్లు తాగి. ఒంట్లో శక్తి లేక ముందరి కాళ్లతో మాత్రమే అతి కష్టంగా అడుగులు వేస్తూ వెనక కాళ్లను ఈడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. చివరాఖరకు తన చావు ఖాయం అనుకుంది. ఓ పాడుబడిన గోడ కనిపిస్తే ఎలాగోలా దేహాన్ని ఈడ్చుకుంటూ దాని దాపుకు చేరింది. తల నిలబెట్టే శక్తిలేక నేలకు వాల్చింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ తలను ఓ రెండు చేతులు ఎత్తిపట్టుకున్నాయి. దాని కళ్లు మెరిశాయి. ఒంట్లోకి ఏదో శక్తి వచ్చినట్టు తల పైకెత్తింది. తన తలను పట్టుకున్న చేతులు డబ్బాను చీల్చుతున్నాయి. తనకు పట్టిన భూతంతో ఏ దేవుడో యుద్ధం చేస్తున్నాడు. అపురూపంగా చూస్తోంది అది. డబ్బా ముందు భాగమంతా తీసేసిన ఆ చేతులు మెడకు పట్టిన మిగతా భాగాన్ని కూడా జాగ్రత్తగా విరగ్గొట్టాయి. పోయిందనుకున్న ప్రాణం లేచొచ్చింది. ప్రాణం పోసిన ఆ చిట్టి చేతులను భక్తిగా నాలుకతో స్పర్శించింది అది. తోటి పిల్లలతో ఆడుకుంటూ, పడిపోయిన బాల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ ఐదేళ్ల పిల్లాడి ముఖం విప్పారింది. జానే కహా గయే వో దిన్ పాటలో భావం, రాగం మాత్రమే కాదు కనికరం కూడా ఉంటుంది. ముఖేశ్ పాటలు దయగా, వాత్సల్యంగా, వేదనలో సహబాటసారుల్లా ఉంటాయి. ‘కిసీకా దర్ద్ మిల్ సకేతో లే ఉధార్’ అన్నాడాయన ఒక పాటలో. అంటే ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని అప్పుగా అయినా అడిగి తీసుకో అని అర్థం. అలా తీసుకోవడాన్నే జీవితం అంటారనీ ‘జీనా ఇసీకా నామ్ హై’ అని కూడా అన్నాడు.ముఖేశ్ అప్పట్లో స్టార్డమ్లో ఉన్నాడు. ఆయనకు శివుడంటే ప్రీతి. ఆయన పేరు కూడా శివునిదే కదా. ఒకసారి ఆయన అభిమానులను కలుస్తూ నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించాలని అనుకున్నాడు. ఆయన వస్తున్న కబురు ముందే అందింది. కాని ఆయన రాక మాత్రం ఆలస్యమైంది. దాదాపు రాత్రి పది గంటలు దాటేశాయి. అప్పటికే ఆలయం మూసేయాల్సిన సమయం కానీ ముఖేశ్ వస్తున్నాడని అధికారులు తెరిచిపెట్టారు. అప్పటికి అది చలికాలం. డిసెంబర్ నెలలో ఆ ప్రాంతంలో చలి గడ్డ కట్టించేలా ఉంటుంది. ముఖేశ్ ఆలయానికి చేరుకున్నాడు. అందరూ ఎదురొచ్చి స్వాగతం చెపుతూ లోపలికి తీసుకెళ్లబోయారు. ఆయన మెట్లెక్కుతూ ఆ మెట్ల మీద ఉన్న బిచ్చగాళ్లను చూసి ఆగిపోయాడు. వాళ్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేక చలికి వొణుకుతున్నారు. ‘వీళ్లంతా ఇలా పడుకున్నారేమిటి? దుప్పట్లు లేవా?’ అని అడిగాడు ముఖేశ్. ‘వాళ్లకది మామూలే. మీరు పదండి’ అన్నారు నిర్వాహకులు.‘లేదు.. లేదు.. వీళ్లిలా వణుకుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా. ముందు దుప్పట్లు, కంబళ్లు తీసుకురండి. డబ్బిస్తాను’ అని డబ్బులు తీశాడు.నిర్వాహకులు ఇరకాటంలో పడ్డారు.‘సార్... ఇప్పుడు దుకాణాలు ఉండవు. రేపు ఉదయం తెచ్చి ఇస్తాం. ముందు మీరు పదండి. దర్శనానికి ఆలస్యం అవుతుంది’ అన్నారు.‘ముందు మానవ సహాయం... తర్వాతే దైవ సేవ’ అన్నాడు ముఖేశ్.నిర్వాహకులు పడుతూ లేస్తూ ఊళ్లో తెరిచిన వారి దుకాణం తెరిపించి దుప్పట్లు, కంబళ్లు ముఖేశ్ డబ్బుతో కొని తెచ్చారు. ముఖేశ్ వాటిని ఆ బిచ్చగాళ్లందరికీ పంచాడు. వాళ్లు వాటిని తీసుకుని కప్పుకోవడం చూసే తృప్తిగా గుడిలోకి అడుగు పెట్టాడు. ఇలా చేసిన వాడి పాట దేవుడు వినకుండా ఉంటాడా? పెద్ద మచ్చ 1961లో రాజ్‌కపూర్ తాష్కెంట్ టూర్ చేశాడు. అప్పటికే అతడు సోవియెట్ రష్యాలో కూడా సూపర్‌స్టార్. తాష్కెంట్ సోవియెట్‌లో భాగం. అక్కడ తన ట్రూప్‌తో షోలు చేయడానికి వెళ్లాడు. తనతో పాటు అప్పుడప్పుడే గుర్తింపు పొందుతున్న గాయకుడు మహేంద్ర కపూర్‌ను కూడా తీసుకెళ్లాడు. రాజ్ కపూర్ ప్రతి షోలో ‘మేరా జూతా హై జపానీ’ పాడితే జనం వెర్రెత్తి పోయేవారు. కాని మహేంద్ర కపూర్ అప్పటికే తనకు హిట్‌గా నిలిచిన ‘హే... నీలే గగన్ కే తలే’ పాటను రష్యన్ భాషలో అనువదించి తమ స్లాట్ వచ్చినప్పుడు హిందీ వెర్షన్ కాకుండా ఆ రష్యన్ వెర్షన్ పాడటం మొదలెట్టాడు. ఆ దెబ్బకు అక్కడి జనం మహేంద్ర కపూర్‌కు జేజేలు పలకడం మొదలెట్టారు. రాజ్‌కపూర్‌కు ఒకటి అర్థమైంది. షోస్ తన వల్ల హిట్టేగానీ మహేంద్ర కపూర్ వల్ల ఇంకా హిట్ అయ్యాయని. ఆ రోజు రాత్రి హోటల్‌ను మహేంద్ర కపూర్ కలిసినప్పుడు ‘నువ్వు రావడం మంచిదయ్యింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి ఏదైనా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను. కాని నిన్ను నా గాయకుడిగా పెట్టుకోలేను. ఎందుకంటే ముకేశే నా పాటలన్నీ పాడతాడు. కాని నేను వెంటనే తీయబోయే సినిమాలో సెకండ్ హీరోకి మాత్రం నీచే ఒక పాటైనా పాడిస్తాను’ అన్నాడు. రాజ్ కపూర్ సినిమాలో పాట అవకాశం అంటే చాలా పెద్ద లాటరీ కిందే లెక్క.మహేంద్ర కపూర్ నవ్వి ‘సార్.. మీరు చాలా పెద్దవారు. ఇప్పుడు ఈ ఉద్వేగంలో ఇలా అంటారు. కాని ఇండియా వెళ్లాక మీ పనుల్లో పడి ఇచ్చిన మాటను మర్చిపోతారు’ అన్నాడు.రాజ్ కపూర్ ఒక నిమిషం ఆగి మహేంద్ర కపూర్‌ని చూశాడు. ఆ క్షణంలో తను తాగుతున్న సిగరెట్‌ను నోట్లో నుంచి బయటకు తీసి వెంటనే మణికట్టు మీద చిన్నగా కాల్చుకున్నాడు.మహేంద్ర కపూర్ ఉలిక్కి పడ్డాడు.‘చూడు... ఇక్కడ మచ్చ పడింది. ఈ మచ్చ నీకిచ్చిన మాట నాకు గుర్తు చేస్తుంది. ఈ మచ్చ కంటే కూడా పెద్ద మచ్చ ఏమిటో తెలుసా? ఇచ్చిన మాటను మర్చిపోవడం. మాట నిలబెట్టుకోవడం కూడా ఒక రకమైన దైవారాధనే’ అన్నాడు.ఇండియాకు తిరిగి వచ్చాక రాజ్ కపూర్ తీసిన సినిమా ‘సంగమ్’.అందులో మహేంద్ర కపూర్ ఏ పాట పాడాడో మీరే గుర్తించండి. ‘మీరే వీఐపీలు’ అది 1990 ఎండాకాలం. లీనాశర్మది అస్సాం. ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తున్న లీనా తన స్నేహితురాలితో కలిసి లక్నోలో ఢిల్లీ వెళ్తున్న ట్రెయిన్ ఎక్కారు. వీళ్ల బోగీలో ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ఎంపీలతో పాటు రిజర్వేషన్లేని మరో పన్నెండు మంది మగవాళ్లు ఉన్నారు. వాళ్లు అతిగా అరవడం, దుర్భాషలాడటం, వీళ్ల సీట్లలో వీళ్లను కూర్చోలేకుండా చేయడం, ఇంత జరుగుతున్నా ఆ ఎంపీలు నోరు మెదపకపోవడం జరిగింది. ఆ రాత్రి దుర్భరంగా గడిచాక తెల్లారి వీళ్లు ఢిల్లీలో దిగారు.అక్కడినుంచి అహ్మదాబాద్ ట్రెయిన్ పట్టుకున్నారు. కానీ రిజర్వేషన్ చేయించే వీలు లేదు. వీళ్లు టీటీఈని కలిసి తమ పరిస్థితి చెప్పుకున్నారు. ఆయన ఒక కూపె దగ్గరికి తీసుకెళ్లి, ‘ప్రస్తుతానికి ఇందులో కూర్చోండి’ అన్నాడు. ఆ కూపెలో ఇద్దరు కూర్చున్నారు. వాళ్ల ఖాదీ బట్టలను చూస్తే రాజకీయ నాయకులని అర్థమవుతోంది. పెద్దాయనేమో నలభైల్లో ఉన్నాడు. చిన్నాయన ముప్పైల్లో ఉన్నాడు. రాత్రే మరో అనుభవం జరిగివున్న దృష్ట్యా ఈ యువతులు తటపటాయిస్తుంటే టీటీఈ, ‘ఏం ఫర్లేదు, వీళ్లు ఈ రూట్లో రెగ్యులర్ ప్యాసెంజర్లే’ అని భరోసా ఇచ్చాడు.ఆ నాయకులిద్దరూ తాము మూలకు సర్దుకుని బెరుగ్గా ఉన్న యువతులను వీలైనంత సౌకర్యంగా కూర్చునేలా చూశారు. నెమ్మదిగా మాటలు కలిశాయి. వాళ్లు గుజరాత్ బీజేపీ నాయకులని తెలిసింది. చరిత్ర, రాజకీయాలు, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ దాకా చర్చ సాగింది. ఇంతలో నాలుగు ప్లేట్ల భోజనం వచ్చింది. బిల్లు వీళ్లను కట్టనీయకుండా ఆ యువనాయకుడు చెల్లించాడు.ఈలోపు టీటీఈ తిరిగొచ్చి, ‘ఎక్కడా బెర్తులు లేవు, ఏమీ చేయలేను’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఆ యువతులు ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటే, ఆ ఇద్దరు నాయకులు ‘మరేం ఫర్లేదు, మేము సర్దుకుంటాం’ అని చెప్పి, ఈ ఆడవాళ్లకు బెర్తులు ఇచ్చేసి వాళ్లు కింద బట్టలు పరుచుకుని పడుకున్నారు. తెల్లారి వీళ్లు దిగేముందు, అహ్మదాబాద్‌లో ఎక్కడ బస చేశారనీ, అవసరమైతే తమ ఇంటికి రావొచ్చనీ పెద్దాయన వీళ్లను ఆహ్వానించాడు. తాను దిమ్మరిని కాబట్టి తనకో ప్రదేశమంటూ లేదనీ, కానీ పెద్దాయన ఆహ్వానాన్ని మీరు అంగీకరించవచ్చనీ చిన్నాయన వత్తాసు పలికాడు. వసతికి తమకే ఇబ్బంది లేదని చెప్పి, దిగేముందు మరిచిపోకుండా రాసుకుందామని వాళ్లపేర్లు అడిగారు లీనాశర్మ. అప్పుడు వాళ్లు చెప్పిన పేర్లు: శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ. శుద్ధమైన కోరిక గాయకుడు రఫీ భారతదేశంలో చాలా గొప్పవాడు అయి ఉండవచ్చు. గొప్ప గాయకుడు అయి ఉండవచ్చు. లక్షలాది మంది అభిమానులు అతడికి ఉండవచ్చు. కాని దైవం ముందు అతడొక మామూలు భక్తుడు. మక్కాలో కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శతకోటి మంది భక్తులలో అతనూ ఒక్కడు. అందరికంటే ఎక్కువ మంది అభిమానులను సకల చరాచర సృష్టి ఆరాధనను కలిగి ఉన్నది ఒకే ఒక్కడు– ఈశ్వరుడు. అతని ముందు విమన్రంగా ఉండక తప్పదు. 1969లో రఫీ హజ్ యాత్ర చేశాడు. ఆయనతో పాటు నాటి పాకిస్తాన్ స్టార్ సింగర్ మసూద్ రాణా కూడా ఉన్నాడు. హజ్‌కు వెళితే ఆ నియమాలను పాటించి తిరిగి రావాలి ఎవరైనా. కాని రఫీకి కాబా గృహం దగ్గర నమాజు వేళకు అధికారికంగా ఇచ్చే అజాన్‌ను తనకు ఇవ్వాలనిపించింది. ఇంత మధురమైన గాయకుణ్ణి, పెద్ద గాయకుణ్ణి నేను అజాన్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా అని వెళ్లి హజ్ నిర్వాహక కమిటీని అడిగాడు. కమిటీ ఒక్క నిమిషంలో అతడి కోరికను కొట్టిపడేసింది. ఇక్కడి పద్ధతుల అనుసారం బయటి వాళ్లు అజాన్ ఇచ్చే ఆనవాయితీ లేదని చెప్పేసింది. రఫీ నిరాశగా తిరిగి వచ్చాడు. ఈసారి తన గాయక హోదాతో మరెవరినో తీసుకుని కమిటీ దగ్గరకు వెళ్లాడు. మళ్లీ అనుమతి నిరాకరించబడింది. మళ్లీ ఇంకేదో రికమండేషన్‌తో వెళ్లాడు. అదీ నడవ లేదు. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి. ఒకరోజు తెల్లవారుజామున రఫీ కాబా చుట్టూ ప్రదిక్షిణం చేస్తూ– ప్రభూ... నేను గాయకుణ్ణి కాదు.. ఒత్త నీ విశ్వాసిని... నీ జీవుడిని... నీ పట్ల అపారమైన ఆరాధన కలవాడిని... ఒక మామూలు భక్తుడిగా అడుగుతున్నాను... నీ పుణ్యక్షేత్రంలో నాకు అజాన్ ఇచ్చే అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. అలా అనుకుని మళ్లీ కమిటీ దగ్గరకు వెళ్లాడు. కమిటీ వాళ్ల ఎదురుగా నిలుచుని ఉన్నది గాయకుడు కాదు సెలబ్రిటీ కాదు ఒక మామూలు ముసల్మాన్. వాళ్లు అనుమతి ఇచ్చారు. ఆ తెల్లవారుజాము నమాజు కోసం రఫీ ఇచ్చిన అజాన్ అక్కడ ఉన్నవాళ్లందరినీ ఎంత కరుణలో ముంచెత్తిందంటే దైవస్పృహలో వారందరి కళ్లు ధారాపాతం అయ్యాయి. అలాంటి అజాన్‌ను వారు ఇంతకు ముందు వినలేదు. వాళ్లు రఫీని ఆలింగనం చేసుకున్నారు.అంతేనా? రఫీ అక్కడ ఉన్నన్నాళ్లు ప్రతిరోజూ తెల్లవారుజాము అజాన్ ఇచ్చే అనుమతి అతనికి లభించింది. అహం వదులుకుంటే కరుణ దొరికే తీరుతుంది. ఒక్క చిరునవ్వు 19వ శతాబ్దిలో అమెరికన్ నవలా రచయితలలో పేరెన్నికగన్నవాడు మార్క్‌ట్వెయిన్. మార్క్ చదివే స్కూల్లో విద్యార్థులకు టీచర్ జనరల్ నాలెడ్జికి సంబంధించిన పరీక్ష పెట్టారు. ఆ ప్రశ్నాపత్రంలోని చివరి ప్రశ్న ‘రోజూ ఈ స్కూల్‌ని శుభ్రపరిచి, ఆయాగా పనులు చేసే ఆమె పేరు ఏమిటి?’ అని ఉంది. పిల్లలందరికీ ఆమె రూపం జ్ఞప్తికి వచ్చింది. రోజూ ఆమెను తమందరూ చూస్తారు. ఆమె పొడుగ్గా ఉంటుంది, నల్లటి జుట్టు ఉంటుంది, యాభై ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. కానీ, పిల్లలెవెరికీ ఆమె పేరు తెలియదు. టీచర్ తమను ఆటపట్టించడానికే ఆ ప్రశ్న ఇచ్చారని, ఇదెందుకు పనికివస్తుందని విద్యార్థులందరూ అనుకున్నారు. క్లాస్ చివరలో ఒక విద్యార్థి లేచి ‘సర్ ఈ ప్రశ్నకు సమాధానం రాయకపోయినా మా ర్యాంకు తగ్గదు కదా’ అన్నాడు. టీచర్ ‘కచ్చితంగా తగ్గదు’ అంటూనే ‘మీ జీవితంలో ఎంతో మంది మీకు తారసపడుతూ ఉంటారు. మరెంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎంతోమంది మీకు ఏదో రూపంలో సేవలు చేస్తూనే ఉంటారు. వారిలో నిరుపేదలే ఎక్కువ. వారందరూ గుర్తించదగినవారే! వారు మీ నుంచి కోరుకునేది ఒక్క చిరునవ్వు, చిన్న పలకరింపు. అదే మిమ్మల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది’ అని చెప్పాడు. ‘ఆ రోజే ఆ ఆయా పేరు డోరతి అని తెలుసుకున్నానని, ఈ పాఠం జీవితంలో తనెప్పుడూ మర్చిపోలేద’ని డైరీలో రాసుకున్నాడు మార్క్. నాన్నకు ప్రేమతో.. క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. అతను ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే, అతన్ని అడ్డుకట్ట వేస్తూ, ‘మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు. రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం.అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా. వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు. కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి. – బండారు శ్రీనివాసరావు, పాత్రికేయుడు గ్లాసెడు పాలు ఒక రోజు ఒక నిరుపేద పిల్లవాడు తల్లి అమ్ముకురమ్మన్ని ఇచ్చిన కొన్ని బొమ్మలున్న బుట్టను తల మీద పెట్టుకొని దారుల్లో తిరుగుతున్నాడు ఎవరైనా ఒక్క బొమ్మనైనా కొనకపోతారా అని. ఒక్క బొమ్మా అమ్ముడుపోలేదు. ఆకలికి కళ్లు తిరుగుతున్నాయి. శోష వచ్చేలా ఉంది. ‘ఈసారి వెళ్లే ఇంట్లో వాళ్లని కొంచెం భోజనం పెట్టమని అడుగుదాం’ అనుకొని ఓ ఇంటి తలుపు తట్టాడు. ఒక యువతి తలుపు తీసింది.భోజనం అడుగుదామనుకున్న ఆ పిల్లవాడు అడగలేక ‘తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలరా..’ అన్నాడు. ఆ పిల్లవాడు ఆకలిగా ఉన్నాడేమో అనిపించిన ఆమె పొడవాటి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ గ్లాసు అందుకొని నెమ్మదిగా ఆ పాలు తాగి ‘మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’ అన్నాడు. ఆమె సన్నగా నవ్వుతూ ‘దయ చూపడంలో తల్లి ధరను కోరుకోదు’ అంది. ‘మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఆ పిల్లవాడు అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒక నడి ఈడు స్త్రీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చింది. ఆ నగరంలోనే ప్రముఖుడైన డాక్టర్ హావర్డ్ కెల్లీనే ఈ జబ్బును నయం చేయగలడని అతని వద్దకు పంపించారు స్థానిక డాక్టర్. డాక్టర్ హావర్డ్ కెల్లీ ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశాడు. ఆమెకు జబ్బు పూర్తిగా నయమయ్యేదాక ఆసుపత్రిలోనే ఉంచి, ఆమె ఆసుపత్రి బిల్లును ఆ డాక్టరే చెల్లించాడు. ఆమె ఆశ్చర్యపోతూ డాక్టర్ చెల్లించిన ఆ బిల్లును చూసింది. ఆ బిల్లు అడుగున ‘గ్లాసెడు పాల రుణం ఇప్పుడు తీర్చుకున్నాను’ ఇట్లు డాక్టర్హావర్డ్ కెల్లీ అని రాసుంది. ఆమె కళ్లు సంతోషంతో వర్షించాయి. -
ఇదీ క్రీడా స్ఫూర్తి..!
ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్ చివర్లో జపాన్ జట్టు ఆశలు గల్లంతు కావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రం చేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగు మ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతిక విలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత నీలం రంగు ‘సమురాయ్ డ్రెస్’ ధరించిన అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఏరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియంలోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్ రూమ్‌లోని కుర్చీలు, సామగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం జపనీస్ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ స్కాట్ మ్యాక్ఇన్టైర్ చెబుతున్నారు. జపాన్ దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనెగల్ అభిమానులు కూడా గతంలో స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. -
లేమితో చెలిమి
సివిల్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరిచిన వారంతా పెట్టి పుట్టిన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్‌వాలా నుంచి, రోజుకూలీ వరకు కష్టజీవుల కుటుంబాల్లోంచి పుట్టుకొచ్చిన వారే! చదువుకు కలిమితో పని లేదనీ.. కష్టపడే తత్వం, సాధించగలనన్న నమ్మకం ఉంటే చాలుననీ నిరూపించిన వాళ్లే వీళ్లంతా. ఆ కోవలోకే వస్తారు 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్‌గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. పశువుల్ని మేపుకుంటూ కలెక్టరుగా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ స్వాప్నికులకు ఆదర్శం.మహారాష్ట్ర నందర్బార్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వన్మతిని ఎవరైనా ‘మీ హాబీస్ ఏంటి?’ అనడిగితే.. ‘తనకు పశువులను మేపడమంటే చాలా ఇష్టం’ అని చెబుతారు! ఎందుకంటే జీవితమెంత కష్టమైనదైనా ఇష్టంగా మలుచుకోవడం ఆమెకు తెలుసు కనుక. కష్టం లేకుండా సుఖం దక్కదని ఆమె నమ్ముతారు కనుక. చదువుకుంటూనే ఆమె పశువులను కాసేందుకు వెళ్లింది కనుక. స్కూలు నుంచి రాగానే కలలూ, కన్నీళ్లూ కలగలిసిన జీవితం వన్మతిది. ఆమెకు, ఆ ఇంటికీ నాలుగు పశువులే జీవనా ఆధారం. కుటుంబ పోషణ కోసం వన్మతి తల్లి పాడిని నమ్ముకుంది. తండ్రి చెన్నయ్యప్ప డ్రైవర్. ఆయనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో తల్లి పశుపోషణలో తనవంతు సాయంగా వన్మతి సాయంత్రాలు పశువుల ఆలనాపాలనా చూసుకునేది. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్నీ అంతే ఆనందంగా పంచుకుంటుంది వన్మతి. పలకా బలపంతో బడికెళ్లిన ప్పట్నుంచి నుంచి సివిల్స్ రాసే వరకూ చదువూ, గేదెలే ఆమె లోకం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ కొయ్యకి తగిలించి పశువులను తోలుకొని వాటితో పాటే ఆరు బయట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది. కలెక్టరమ్మను చూశాక వన్మతి స్వగ్రామమైన తమిళనాడులోని ఇండోర్ జిల్లా సత్యమంగళం. బళ్లో ఉన్నా, పచ్చికబయళ్లలో ఉన్నా ఆమె కలలు కనడం మాత్రం ఆగలేదు. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనే కోరిక నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది. ఇంట్లోనూ, అడవిలోనూ ఓ పాఠ్య పుస్తకం ఆమె వెంట ఉండేది. ఓ రోజు వాళ్ల కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టరు మాటలూ, ఆదరణ కూడా వన్మతి ఆశలకు మరింత బలం చేకూర్చాయి. తన కాలేజీకొచ్చిన మహిళా కలెక్టరు గారిని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది. అంతే. తను కూడా కలెక్టర్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది. ఎందులోనైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కావాల్సిన మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది. అంతే కాదు తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు వన్మతి. ఇంటర్ తర్వాత కూడా చదువెందుకూ పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అన్నవాళ్లే.. వన్మతి బంధువులు, చుట్టపక్కల వాళ్లూ! వాళ్లతోపాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్లు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు. ఎవరొద్దన్నా వినలేదు మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వన్మతి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదన్నది వన్మతి అభిప్రాయం. నిజంగా డబ్బే ముఖ్యమనుకుంటే ఆమె ఏ ఇతర ఉద్యోగాలనో సంపాదించుకోగలదు. కానీ ఆమె లక్ష్యం అది కాదు. జిల్లా కలెక్టరై పదిమందికి సహాయపడాలని అనుకుంది. అందుకే ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే, సివిల్స్ ప్రిపరేషన్ని కొనసాగించింది. వన్మతి తండ్రి, తల్లీ ఇద్దరూ వన్మతి ఇష్టాలని గౌరవించారు. పెద్దగా చదువుకోని ఆ తల్లిదండ్రులు కూతురి చదువుకోసం ఎంతైనా కష్టపడాలనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ల మాటలతో ఆమె కలలు చెదరకుండా కాపాడారు. మనసుని చదువుపై కేంద్రీకరించమన్నారు. పేదరికం అడ్డుపడుతున్నా, తమ కష్టార్జితంతో కన్నకూతురి అవసరాలను తీర్చారు. ఆమె చదువుతానన్న పుస్తకాన్నల్లా కొనిచ్చారు. వారి ప్రోత్సాహంతో ఆమె తన లక్ష్యంపై గురిపెట్టింది. దృష్టంతా చదువుపైనే. తొలిసారి యుపిపిఎస్సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది. కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి విజయం తనని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్‌లో 152 ర్యాంకుతో తమిళనాడు రాష్ట్రానికీ, తన ఊరికీ కీర్తిని తెచ్చిపెట్టింది వన్మతి. తండ్రికి తోడుగా ఆసుపత్రిలో ఇంటర్వ్యూ కి ఇక రెండు రోజులే ఉన్నప్పుడు ఆమె తన తండ్రితో ఐసియూలో ఉంది. జీవితమంతా డ్రైవర్‌గా గడిపిన తండ్రి వెన్నెముకకి వచ్చిన వ్యాధితో ఐసీయూలో పోరాడుతూనే తన కూతుర్ని చిర్నవ్వుతో ఇంటర్వ్యూకి సాగనంపారాయన. 2015 యుపిఎస్సీలో ర్యాంకు సాధించి లాల్‌బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణని పూర్తిచేసుకొన్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ప్రస్తుతం నందర్బార్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న వన్మతి తన ప్రజాసేవా సంకల్పాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. ఒక్క అపజయంతోనే కుంగిపోయే యువతరానికి వన్మతి పట్టుదల ఒక స్ఫూర్తి. – అరుణ -
ఈ పాఠం మన పిల్లలూ చదవాలి
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు. ‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్‌గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్. సంధ్య సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్‌ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ. దుర్గాభవానీ సికింద్రాబాద్‌లోనే రసూల్‌పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్‌ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు. కష్టంతోనే జీవితం ‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’. – సంధ్య తప్పకుండా ఐపీఎస్ అవుతా ‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్‌ను అయితీరుతాను. – దుర్గాభవానీ చదువుల గుడి మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం. సంధ్య ఫోన్ నెంబరు: 9959132466 దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698 -
సివిల్స్ టాపర్‌కు నేను స్ఫూర్తి : వర్మ
సాక్షి, హైదరాబాద్ : ట్విటర్లో తనదైన వ్యాఖ్యాలతో.. విరుచుకుపడే రామ్ గోపాల్‌వర్మ తనను విమర్శించే వారికి ఓ సూచన చేశాడు. ‘నేను ఎప్పుడూ క్రిమినల్స్ నుంచి, బూతు నుంచి స్ఫూర్తి పొందుతానని భావించేవారు.. ఈ సివిల్స్ టాపర్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. నేను చదువంటే భయపడే విద్యార్ధినే.. సివిల్ ఇంజనీరింగ్ రెండు సార్లు ఫెయిల్ అయినప్పటికి నేను గర్వపడతాను’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ‘ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వ్యక్తి ఓ సివిల్స్ టాపర్‌కి స్పూర్తి కల్గించాడు. యెడవల్లి అక్షయ్ నేను నిన్ను తప్పక కలుస్తాను.. మనం ఎడ్యుకేషన్ గురించి చర్చిద్దాం’ అని పోస్ట్ చేశారు. For all those who thought i inspire only criminals and perverts take a listen to what this Civil Topper is saying ..The irony is that I was a terrible student and failed in Civil engineering twice but proud about it😎 https://t.co/HVSy898CUh — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 Yedavalli Akshay kumar a Civils Topper takes inspiration from a failed Civil engineer ..Watch from 23:45 to 28:30 Hey Akshay I would like to meet you and talk to u about education https://t.co/BCECyhUpYI — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 -
విజయానికి గొడుగు పట్టింది
ఉద్యోగం చేస్తే ఒకరు చెప్పినట్టుగా చేయాలి.స్వయం ఉపాధి అయితే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. చదవిన చదువుకు ప్రయత్నం తోడైతే ఏమవుతుందో పద్మావతిని చూస్తే అర్థమవుతుంది. ఆమె ఇప్పుడు పుట్టగొడుగుల రైతు. ఇంటి వద్దే ఉంటూ మంచి సంపాదన పొందుతున్న గృహిణి. యూట్యూబ్ చూడటం ఆమెకు లాభించింది.ఒక వీడియో ఆమెను ఆకర్షించింది. హైదరాబాద్ నగరంలోని నాగోలు లక్ష్మీనరసింహ స్వామి కాలనీ(రోడ్ నెం:9) నివాసి ద్రోణంరాజు పద్మావతి జీవశాస్త్రంలో పట్టభద్రురాలు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి నగరానికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ దశలో మరో ఉద్యోగం వెతుక్కోవడం కన్నా స్వయం ఉపాధి కోసం సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఆ సమయంలోనే పుట్టగొడుగుల పెంపకంపై యూట్యూబ్‌లో తారసపడిన వీడియో ఆమెను ఆకర్షించింది. మనమెందుకు పుట్టగొడుగులు పెంచకూడదు అనిపించింది. జీవశాస్త్రంలో లోతైన అవగాహన కలిగిన పద్మావతికి తర్వాత ఏం చేయాలో పెద్దగా చెప్పాల్సిన పని లేకపోయింది. 40 రోజులకు తొలి దిగుబడి తన ఇంటి వద్ద 300 చదరపు అడుగులలో రేకుల షెడ్డు నిర్మించి 3 నెలల క్రితం పుట్టగొడుగుల పెంపకాన్ని పద్మావతి ప్రారంభించారు. 4 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేసి 350 బెడ్స్‌లో పుట్టగొడుగులు పెంచుతున్నారు. వాట్సప్, ఫోన్ ద్వారా ఈ రంగంలో నిష్ణాతులైన వారి దగ్గర సందేహాలను తీర్చుకుంటూ పుట్టగొడుగుల దిగుబడి మొదలెట్టారు. బెడ్ తయారు చేసి విత్తనం (స్పాన్) వేసిన 40 రోజులకు పుట్టగొడుగు చేతికి వస్తుంది. నెలన్నర కాలం పాటు ఆ బెడ్స్ నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుందని ఆమె అన్నారు. రోజుకు 5–10 కిలోల మిల్కీ పుట్టగొడుగులను విక్రయిస్తున్నానన్నారు. టోకుగా కిలో రూ. 200కు, రిటైల్‌గా రూ. 300 వరకు ధర పలుకుతున్నదని, లాభసాటిగా ఉందన్నారు. పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయని అంటూ.. మిల్కీ పుట్టగొడుగులు హైదరాబాద్ వాతావరణంలో బాగా పెరుగుతున్నాయన్నారు. తొలి సీజన్లో గడించిన అనుభవంతో పుట్టగొడుగుల సాగును త్వరలో మరో రెండు గదులకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ‘చాలా చేయాలని ఉంది. బ్యాంకులు లోన్ ఇస్తే బాగుండు’ అన్నారామె. అతి జాగ్రత్త పాటించాలి వరిగడ్డిని ఉడకబెట్టి బెడ్ తయారు చేయడం దగ్గర నుంచి, కొద్దిరోజుల పాటు చీకటి గదిలో నిల్వచేయడం, కలుషితం కాకుండా చూసుకోవడం, గాలిలో తేమ, గది ఉష్ణోగ్రత వంటివన్నీ జాగ్రత్తగా చేయడం ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని నేర్చుకోగలిగానని ఆమె తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగి మాదిరిగా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటూ.. అప్పుడే చక్కని దిగుబడి పొందగలుగుతామని పద్మావతి అన్నారు. సాధారణంగా మార్చి–నవంబర్ మధ్య కాలం పుట్టగొడుగుల సాగుకు అనువైన కాలమని.. అయితే, తాను చలికాలంలో ప్రారంభించడం వల్ల గది ఉష్ణోగ్రత, గాలిలో తేమ సరిచూసుకోవడానికి యంత్రాలను సమకూర్చుకోవలసి వచ్చిందని ఆమె అన్నారు. తొలి దశలో మౌలిక సదుపాయాలకు కొంత పెట్టుబడి అవసరమవుతుందని, తదనంతరం అంత పెద్దగా ఖర్చు ఉండదని ఆమె తెలిపారు. – చిత్రం సైదులు, సాక్షి, నాగోలు, హైదరాబాద్ రసాయనాలు వాడటం లేదు ఎటువంటి రసాయన ఎరువులు కలపకుండా ఆరోగ్యకరమైన మిల్కీ పుట్టగొడుగులను పెంచుతున్నాను. పుట్టగొడుగులు వారానికి రెండు సార్లు తినొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు కరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. విటమిన్ బీ, సీ తోపాటు కాల్షియం, మినరల్స్ అందుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పోతాయి. ప్రస్తుతం నగరంలో వీటికి మంచి డిమాండ్ ఉంది. అడిగిన వారికి ఊరగాయ కూడా పెట్టి ఇస్తున్నా. – ద్రోణంరాజు పద్మావతి (94907 55366), లక్ష్మీనరసింహస్వామి కాలనీ, నాగోలు, హైదరాబాద్ -
రెండు తరాలుగా వారికి కులంలేదు!
‘నమస్తే అండీ.. నా పేరు క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని ఆయన చెప్పగానే.. ప్రజలు ఆయన వైపు అయోమయంగా చూస్తారు. ఏమిటీ వింత పేరు అన్నట్టుగా ఉండే వారి అయోమయం చూపులను చూసి.. క్యాస్ట్‌లెస్ జూనియర్ లోలోపల నవ్వుకుంటారు. కానీ, అత్యంత అరుదైన ఆయన నామం వెనుక పెద్ద కథే ఉంది. ఆయనే కాదు.. ఆయన తోబుట్టువుల పేర్లు విన్నప్పుడు కూడా జనం ఇలాగే విస్తుపోతుంటారు. ఆయన సోదరుడి పేరు క్యాస్ట్‌లెస్ (కులం లేదు). సోదరి పేరు షైన్ క్యాస్ట్‌లెస్. కేరళ రాజధాని కొచ్చి నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణించి.. కొల్లాం జిల్లాలోని పునలూరుకు వెళితే.. అక్కడ ఓ ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌పై ఇలాంటి ఓ అరుదైన పేరు దర్శనమిస్తుంది. ‘కులంలేని ఇల్లు’ అని మలయాళంలో రాసి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద ఫసులుద్దీన్ అలికుంజ్. పుట్టుకతో ముస్లిం. ఆయన సహచరి ఏజ్నెస్ గాబ్రియెల్.. క్రైస్తవ మతస్తురాలు. ఇద్దరూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. ఫసులుద్దీన్ను ఏజ్నెస్ ప్రేమిస్తుందని తెలిసి.. కుటుంబసభ్యులు ఆమెను ‘హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఫసులుద్దీన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి మరీ ఆమెను విడిపించారు. 1973లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒకటయ్యారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా 19 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు ఏ మతాన్ని పాటించలేదు. అయితే, తమ ఆచరణ వల్ల పిల్లలకు ఇబ్బంది ఎదురుకాకూడదని 1992లో వారు తమ కలయికను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించారు. తమ ఆస్తులు వారసత్వంగా తమ పిల్లలకు దక్కడంలో ఇబ్బంది ఎదురుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తాను పదో తరగతిలో ఉన్నట్టు గుర్తుచేసుకుంటారు వారి రెండోకొడుకు క్యాస్ట్‌లెస్ జూనియర్. అయితే, ఆ సమయంలో ఇటు ఫసులుద్దీన్, అటు ఏజ్నెస్ కుటుంబాలు.. వారికి పుట్టబోయే పిల్లలు తమ మతాన్నే అనుసరించాలని ఒత్తిడి తెచ్చారు. వారి పిల్లలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫసులుద్దీన్కానీ, ఏజ్నెస్కానీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ‘మా తల్లిదండ్రులిద్దరూ హేతువాదులు. వారు లౌకికవాదాన్ని ఆచరించేవారు. తమ కుటుంబసభ్యుల ఒత్తిడిని లెక్కచేయక వారు జీవనాన్ని సాగించారు’ అని అంటారు క్యాస్ట్‌లెస్ జూనియర్. సహజంగా తండ్రి మతమే పుట్టబోయే పిల్లలకు వస్తుందనే చాలామంది నమ్ముతారు. ‘కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. 1974లో మా అన్నయ్య పుట్టినప్పుడు.. అమ్మనాన్నలు అతనికి ‘క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు’ అని నవ్వుతారు క్యాస్ట్‌లెస్ జూనియర్. ఆ తర్వాత 1975లో తమకు పుట్టిన రెండో బాబుకు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని, 1983లో పుట్టిన చిన్నకూతురికి ‘షైన్ క్యాస్ట్‌లెస్’ అని నామకరణం చేశారు ఫసులుద్దీన్ దంపతులు. కులాన్ని, మతాన్ని అనుసరించకపోవడం వల్ల తమ పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోలేదని, స్కూల్ రికార్డ్స్ల్లోగానీ, ఇతర ప్రతాల్లోగానీ కులం, మతం అని ఉన్న చోట ‘నిల్’ అని రాసేవారని ఫసులుద్దీన్ గుర్తుచేసుకుంటారు. కాన్వెంట్ స్కూల్వాళ్లు తమ ఇంటికి వచ్చి పిల్లలు పేర్లు మార్చాలని అడిగేవారని, కానీ 18 ఏళ్లు వచ్చిన తర్వాత తమ పేర్లపై పిల్లలే నిర్ణయం తీసుకుంటారని స్కూల్వాళ్లకు చెప్పి పంపేవాళ్లమని ఆయన చెప్తారు. క్యాస్ట్‌లెస్, క్యాస్ట్‌లెస్ జూనియర్, షైన్ క్యాస్ట్లెస్లకు పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎవరూ మతపరమైన ఆచారాలు పాటించలేదు. కట్నంగానీ, పూజారిగానీ లేకుండా కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారు తమ వివాహాలను రిజిస్టర్ చేయించుకున్నారు. ‘పెళ్లికి చాలాముందే మా భాగస్వాములకు మా దృక్పథం ఏమిటో చెప్పాం. వాళ్లు అంగీకరించారు’ అంటారు క్యాస్ట్‌లెస్. మీ పిల్లలకు పెళ్లిళ్లు కావని, వారికి మంచి సంబంధాలు రావని ఫసులుద్దీన్, ఏజ్నెస్ను వాళ్ల కుటుంబాలు బెదిరించేవి. ఆ బెదిరింపులు ఉత్తవేనని వీరి పెళ్లిళ్లు నిరూపించాయి. సమాజం కూడా తమ కుటుంబ జీవనవిధానాన్ని అంగీకరించిందని క్యాస్ట్‌లెస్ అంటారు. కులం నేపథ్యం చూడకుండా ఒక్క ఓటు కూడా వేయని మన సమాజంలో పునలూరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను గెలుపొంది.. 2005-10 మధ్యకాలంలో వైస్ చైర్మన్‌గా సేవలు అందించానని ఆయన గుర్తుచేసుకుంటారు. క్యాస్ట్‌లెస్ ఆయన తోబుట్టువులు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంబీఏ చేసిన క్యాస్ట్‌లెస్ భార్య పేరు సబిత, దుబాయ్‌లో నివాసముంటారు. వీరు తమ పిల్లలకు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్’, ‘ఇండియన్ క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు. న్యాయవాది అయిన క్యాస్ట్‌లెస్ జూనియర్.. పునలూరు బార్ అసోసియేషన్ సభ్యుడు. హిందు మహిళ అయిన రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ‘అగ్నా క్యాస్ట్‌లెస్ జూనియర్’, ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని పేరు పెట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పీహెచ్డీ చేస్తున్న షైన్ క్యాస్ట్‌లెస్ వ్యాపారవేత్త చెగువరెను పెళ్లాడారు. వీరికి అలైదా చెగువరె అనే కూతురు ఉంది. క్యాస్ట్‌లెస్ అనే పేరును కొనసాగించడం అన్నది తమ వ్యక్తిగత అభీష్టమని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని ఫసులుద్దీన్ కుటుంబం అంటుంది. అయినా, మీరు చనిపోతే.. మీ మృతదేహాలను ఖననం చేస్తారా? లేక పూడ్చిపెడతారా? అంటూ బంధువులు కొత్త కొత్త సందేహాలతో తమ వద్దకు వస్తారని, తమ మృతదేహాలను సైంటిఫిక్ కమ్యూనిటీకి అందజేసి.. వారికి ఉపయోగిపడితే చాలు అని తాము భావిస్తున్నామని, ఇది అప్పుడు బతికి ఉన్న కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకుంటారని క్యాస్ట్‌లెస్ జూనియర్ ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అన్నారు. కులానికి అతీతంగా సమాజంలో హుందాగా బతకగలమని చాటిన ‘క్యాస్ట్‌లెస్’ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.. కాదంటారా? ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో పంచుకోండి. -
ఆ న్యాయమూర్తుల నుంచి స్ఫూర్తి పొందుదాం
సాక్షి, హైదరాబాద్: స్వీయ ప్రయోజనాలకు కాక వ్యవస్థ విలువలను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన న్యాయమూర్తుల నుంచి న్యాయవ్యవస్థలో ఉన్నవారందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. న్యాయమూర్తుల నైతికత అన్న పునాదిపైనే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమైందని తెలిపారు. ఈ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ప్రతీ న్యాయమూర్తి, న్యాయవాది శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 69వ గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన ఏసీజే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెహ్రూ కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని వివరించారు. ‘1954లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పతంజలి శాస్త్రి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ పదవిని స్వీకరించాలని జస్టిస్ బిజోన్ కుమార్ ముఖర్జీని ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కోరారు. ఈ వినతిని జస్టిస్ ముఖర్జీ సున్నితంగా తిరస్కరించారు. తనకన్నా సీనియర్ ఉండగా, తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టలేనని తేల్చి చెప్పారు. నెహ్రూ ఒత్తిడి చేయగా, న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తానే తప్ప పదవిని చేపట్టబోమని అన్నారు. జస్టిస్ ఎం.సి.మహాజన్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాతనే జస్టిస్ ముఖర్జీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించారు. స్వీయ ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలను ఉన్నత స్థితిలో నిలిపిన ఇటువంటి న్యాయమూర్తులను అనుసరించి, వారి నుంచి మనం అందరం స్ఫూర్తి పొందాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యంగ రచన ఎలా జరిగింది.. అందుకు కారకులెవరు.. తరువాత పరిణామాలను ఆయన వివరించారు. తాత్కాలిక భవనంలో హైకోర్టు తగదు తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనంజయ తప్పుపట్టారు. దీనిపై అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం న్యాయవాదుల సంఘానికి ఇవ్వాలని ఆయన ఏసీజేను కోరారు. కాగా గణతంత్ర వేడుకల్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తడంపై ఏసీజే ఒకింత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ అడ్వొకేట్స్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
యువతకు వివేకానంద స్ఫూర్తి
జిన్నారం(పటాన్చెరు): యువతకు వివేకానంద స్ఫూర్తి అని డీసీసీ అ«ధ్యక్షురాలు సునితారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిన్నారం మండలంలోని ఇమాంనగర్‌లో శనివారం వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వివేకానందుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. పటాన్చెరు నియోజకర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఇమాంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకులే నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఏర్పాటవుతుందని, ఇందుకు నాయకులు కాటాశ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శశికళా, శంకర్‌యాదవ్‌లు ఉన్నారని తెలిపారు. పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జెడ్పీఫ్లోర్ లీడర్ ప్రభాకర్, నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, శంకర్ యాదవ్, శశికళ, నిర్మల, నాగేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మద్దివీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లేశ్ తదతరులు పాల్గొన్నారు. -
ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?
అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తరువాత రాష్ట్ర ఏర్పాటు చరిత్రాత్మక ఘట నలు. సకల జనులు కలసి, సబ్బండ వర్గాలు ఏకమై సుదీర్ఘ కాలం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా, త్యాగాల కారణంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోవడమే పెద్ద విషాదం. ఈ అంశాన్ని వెల్లడించమే అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఉద్దేశం. గోచికట్టి గొంగడేసుకుని పాట పాడి, వంటా వార్పూ చేసి, రాస్తారోకోలలో పాల్గొని, రైలు పట్టాల మీద బైఠాయించి, బంద్‌లు పాటించి, సమ్మెలు చేసి, సత్యాగ్రహాలు నిర్వహించి తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులతో తెగించి కొట్లాడినారు. ఉద్యమానికి ఊతమిచ్చి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన వారు ఎందరో. తరువాత ఎన్నికలలో తెలంగాణవాదుల గెలుపుకోసం రకరకాల మార్గాలలో ప్రచారాలు చేసి, నేను సైతం అన్న తీరులో ప్రతి వ్యక్తి సమరశీలతతో కదం తొక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సంకుచితమైనది కాదు. ఆంధ్రా పాలకులను వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి ఇది సాగలేదు. అసలు ఆంధ్రపాలకులను ద్వేషించడమే దాని ధ్యేయం కాదు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే ఉద్యమం ఎదిరించింది. ‘సచి వాలయంలో కూర్చుని చక్రం తిప్పడం కుదరదు’ అని రాష్ట్ర సాధనోద్యమం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమం గురించి కాళోజీ నారాయణరావు చేసిన వ్యాఖలను గుర్తు చేసుకోవాలి. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అన్న గరిమెళ్ల వారి గేయంలోని మాటలను ఉటంకిస్తూ కాళోజీ, ‘స్వాతంత్య్రోద్యమం తెల్లవారిని వెళ్లగొట్టడం కోసమే కాదు, దొరతనాన్ని కూడా అంతం చేయడానికి సాగింది’అని పేర్కొనేవారు. సామాజిక, ఆర్థిక రంగాల మీద గుప్పెడు మంది పెత్తనాన్ని కూలదోయాలని తెలంగాణ ఉద్యమం అనుకున్నది. ఉద్యమ ఆకాంక్షలు సమష్టి అధికారాన్ని సమష్టి ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులుగా సీమాంధ్ర పాలకులు కార్పొరేట్ శక్తులకూ, కాంట్రాక్టర్లకూ, రియల్ ఎస్టేట్ డీలర్లకూ మేలు కలిగించే రీతిలో వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు, ప్రధానంగా రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమలకు చెందినవారు, చిరువ్యాపారులు బాగా నష్టపోయారు. ఇజ్జత్‌తో బతకగలమన్న విశ్వాసం అడుగంటి పోవడంతో 1990 దశకం నుంచి రైతులు, చేతివృత్తుల వారు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వనరులలో వాటా, అ«ధికారంలో భాగం దక్కుతుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది. అభివృద్ధి నమూనా మారిపోయి బతుకు తెరువు అవకాశాలు పెరుతాయని, అందివస్తాయని భావించింది. ఉద్యోగాలు దొరుకుతాయని యువతీయువకులు బలంగా విశ్వసించారు. అసలు సమష్టి జీవితాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకోవాలన్న ఆశయంతోనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. కానీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ఆంధ్ర పాలకుల వలెనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలనూ, వారి ఆకాంక్షలనూ పక్కన పెట్టింది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టింది. చిల్లరపైసలు ఇక్కడి ప్రజల ముఖాన కొట్టి గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పేజీలకు పేజీలు పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజా ప్రయోజన పథకాల మీద వెచ్చించిన దానికంటే, ఆ ప్రకటనలకే ఎక్కువ ఖర్చయిందేమో కూడా! మిషన్ భగీరథ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఆంధ్ర పాలకుల జేబులలోనికే వెళ్లాయి. ఉద్యోగాల ఊసే లేదు నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ నినాదాలే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్. ఇందులో నియామకాల నినాదానికి ఆకర్షితులు కావడం వల్లనే యువతీ యువకులు ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ వారికి ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమం కోసం ఆత్మార్పణం చేసుకున్నవారు రాసిపెట్టిన నోట్లలో పేర్కొన్నారు కూడా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగింది వేరు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటికి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగ భర్తీ ప్రకటనలు వెలువడతాయన్న ఆశతో అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ పోస్టులు మాత్రం అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి. జరిగిన పరీక్షలైనా అస్తవ్యస్తంగా జరిగాయి. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికీ, ఉపాధి అవకాశాలు పెంచడానికీ ఇచ్చిన అన్ని సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలండర్‌ను ప్రకటించాలని, ప్రైవేట్ సంస్థలలో భూమిపుత్రులకు రిజర్వేషన్లు పాటించాలని చేసిన కీలక విజ్ఞాపనలు ప్రభుత్వం చెవికెక్కలేదు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు. సంక్షోభంలో వ్యవసాయం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా రైతుల బలవన్మరణాలు ఆగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మూడేళ్లలో పంటల ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక సుమారు రూ. 500 కోట్లు తాము నష్టపోవడం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కరువు నష్టానికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ముట్టలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన రూ. 800 కోట్ల పరిహారం కూడా చేరలేదు. రైతులు ఏం పంట వేసుకోవాలో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వానికి తోచక పోవచ్చునని రైతు సంఘాలన్నీ కలసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరమైన, విలువైన సూచనలు ఇచ్చాయి. రైతు ఆదాయాన్ని పెంచటానికి సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు. రైతులను ఆదుకోవటానికి వ్యవసాయ కమిషన్ వేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు కావలసిన అప్పులు ఇప్పించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, పంటల ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవటానికి నిధిని ఏర్పాటు చేయాలని, చిన్న రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలను సబ్సిడీకి ఇవ్వాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. సంక్షేమ పథకాల అమలు–తీరుతెన్నులు ప్రజలకు అవసరమయ్యే ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించక పోయేసరికి చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. సింగరేణిలో ఓపెన్ కాస్టు గనులను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ జరగనే లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నమే లేదు. నిజాం షుగర్స్‌ను తెరిచి, నడిపిస్తామన్న హామీని మరిచి ఇవాళ పూర్తిగా మూసేశారు. నిర్వాసితుల కోసం 2013 భూసేకరణ చట్టం కల్పించిన మానవీయ పద్ధతులు రద్దయిపోయాయి. దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకోవడానికి, నిర్వాసితుల హక్కుల రద్దు కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి నల్లాలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి మళ్లీ కొత్త పైపులు పరుస్తున్నారు. అదికూడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. అందుకైన వేల కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపగలిగితే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కావలసినన్ని నిధులుండేవి. ఇప్పటివలెనే అమలైతే మూడెకరాల పథకం కింద భూమిలేని దళితులందరికీ భూమి పంచడానికి 230 సంవత్సరాలు పడుతుంది. సాగునీటి పథకాల ఖర్చు తగ్గించే లక్ష్యంతో డిజైన్ చేస్తే సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతే ఉండదు. అది అట్లుండగా వార్తలకెక్కిన భూ కుంభకోణాలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ డీలర్లతో కుమ్మక్కై వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అప్రజాస్వామిక వైఖరి అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలువరు. గజేంద్రుడు వేడుకుంటే వైకుంఠపురిలోని విష్ణుమూర్తి దిగొచ్చాడు. కానీ ఎన్ని మొక్కినా మన ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలను కలువడు. తమ సమస్యలు నలుగురికీ వినిపించడానికి ఉన్న ఒక్క వేదిక ఇందిరా పార్కు వద్దనున్న ధర్ణాచౌకును కూడా మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త కూడా రాయవద్దని మీడియాపై జులుం చెలాయిస్తున్నారు. రాష్ట్రాన్ని తేవడానికి ప్రజలు చేసిన త్యాగాలకు, బలిదానాలకు ఇవాళ గుర్తింపు లేదు. విలాసాలు, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఆస్తులు, కాంట్రాక్టుల పంపకాలు, ప్రచారాలు ఇదీ పాలకుల వ్యవహారం. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించడానికే మొదలుపెట్టినాం. ప్రజలు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎంతోమంది నియంతల పాలనను అంతం చేసిన మనకు ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవడం పెద్ద పని కాదు. - వ్యాసకర్త టీజేఏసీ ఛైర్మన్ యం. కోదండ రామ్ మొబైల్ : 98483 87001 -
హిందూ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకరవిజయేంద్ర సరస్వతి కోలంక (కాజులూరు) : హిందూ దేశ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. గ్రామానికి చెందిన విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులగుర్త వ్యాఘ్రేశ్వరశర్మ దంపతుల ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన కోలంక వచ్చారు. స్వామీజీకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు. అష్ట సోమేశ్వరాలయాల్లో ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున ఉన్న కోలంక పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆలయాల పురోహితులు వింజరపు సత్యనారాయణాచార్యులు, ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు, కొత్తలంక సుబ్రహ్మణ్యశర్మ, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వరదా శేషారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు డీవీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపిన క్రీడలు
భానుగుడి (కాకినాడ) : వారు చీకటిలో వెలుగును వెతుకుతూ పరుగెత్తారు.లక్ష్యాన్ని ఊహించుకుని బరువులు విసిరారు. విధి వంచించినా ప్రతి క్రీడలోనూ తమదైన ప్రతిభ చాటారు. మొత్తానికి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన పలు పోటీల్లో వారు చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. చూపరుల హృదయాలను కదిలించింది.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, చందరంగం, క్యారమ్స్, షాట్‌ఫుట్, సైకిల్ రేస్ వంటి పలుక్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 850 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రీడా పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. విజేతలకు డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో బహుమతీ ప్రధానం చేస్తామని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. -
కేరళ పంచాయతీ వ్యవస్థ దేశానికే ఆదర్శం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: కేరళలోని పంచాయతీ పాలనా విధానం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కేరళ ఎర్నాకులం జిల్లా పరక్కడావు బ్లాక్ పంచాయతీ, శ్రీమూలనగరం గ్రామ పంచాయతీలను మంత్రి బృందం సందర్శించింది. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థలో అమలుచేస్తున్న పథకాల తీరుపై అక్కడి అధికారులను జూపల్లి అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా గుర్తింపు పొందిన ఎర్నాకులంలో విద్యా వ్యవస్థ తీరును కూడా మంత్రి పరిశీలించారు. తెలంగాణాలో పర్యటనకు రావాలని అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. అనంతరం కేరళ మాజీ సీఎం ఊమెన్చాందీతో జూపల్లి కొద్దిసేపు భేటీ అయ్యారు. శనివారం రాత్రి జూపల్లి, కమిషనర్ నీతూకుమారిప్రసాద్, ఇతర అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. -
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
‘అమ్మ’సేవలు ఆదర్శవంతం
సామాజిక సేవా కార్యక్రమాల్లో ’అమ్మ ఫౌండేష¯ŒS’ పలు రంగాల్లో ఉచిత శిక్షణ సామాజిక సేవా కార్యక్రమాలతో ‘అమ్మ’ ఫౌండేష¯ŒS పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, గృహిణులకు కుట్టు శిక్షణ, కారు డ్రైవింగ్ వంటి రంగాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అమ్మ ఫౌండేష¯ŒS రెండేళ్లుగా ముందుకు సాగుతోంది. నగరం ప్రధాన కేంద్రంగా మన జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ ఫౌండేష¯ŒS ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మాకనపాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 2014లో నగరం కేంద్రంగా అమ్మ ఫౌండేష¯ŒS ఏర్పాటు చేశారు. నగరంతో పాటు అప్పనపల్లి, అయినవిల్లి మండలం నేదునూరు, పెదపాలెం, అంబాజీపేట మండలం వక్కలంక కొత్తపేట మండలం వాడపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సీతారామపురంలో ఫౌండేష¯ŒS కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంప్యూటర్, కుట్టు శిక్షణ ఇస్తున్నారు. – మామిడికుదురు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు... పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణలో అమ్మ ఫౌండేష¯ŒS విశేషంగా సేవలందిస్తోంది. అనాథ పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడంతో పాటు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్‌లు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్, గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఈ ఫౌండేష¯ŒS సభ్యులు విశేషంగా సేవలందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సేవలకు నెలకు రూ.రెండు లక్షలు పేద కుటుంబానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్నో కష్టాలు పడిన ఆయన పేదలకు తనవంతుగా సేవలందించాలని అమ్మ ఫౌండేష¯ŒSను ఏర్పాటు చేశారు. తనకు ఉన్న వాహనాల ద్వారా నెలకు రూ.4.50 లక్షల ఆదాయం వస్తోందని దానిలో రూ.రెండు లక్షలు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నానని నవీ¯ŒS చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటే లక్ష్యం వృద్ధుల కోసం భవనం నిర్మించి అందులో 50 మందికి ఆశ్రయం కల్పించాలన్నది నా అశయం. కుటుంబ సభ్యుల ఆదరణ నోచుకోనివారికి ఆసరాగా నిలవాలన్నది నా ప్రయత్నం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. – మట్టపర్తి నవీ¯ŒS కుట్టు శిక్షణతో ఉపాధి అమ్మ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నా. నాతో పాటు ఎంతో మంది మహిళలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. – లక్కింశెట్టి సాయిసీతామహలక్ష్మి, శివకోడు


