ఉమెన్ పవర్
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి.
వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది.
‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.
‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్‌ల ఆర్డర్‌ను డెలివరీ చేయడం లేదు. ఇన్‌స్పిరేషన్‌ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.
ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో
నిండిపోయింది.


