భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్ ముచ్చల్ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్లో మంధన ఈ విధంగా రాసుకొచ్చారు.

వివాహం రద్దు
గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.
🚨 A STATEMENT BY SMRITI MANDHANA 🚨 pic.twitter.com/HAoHLlSIHt
— Johns. (@CricCrazyJohns) December 7, 2025

ప్రైవసీ ఇవ్వండి
ఇదే పోస్ట్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

కెరీర్పై దృష్టి
మంధన కెరీర్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.
అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.
కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే మంధన ముచ్చల్తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.



