breaking news
Palash Muchhal
-
మాస్క్‌తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్‌గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్‌తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
స్మృతి పెళ్లి: ఆ వార్తలపై తొలిసారి స్పందించిన కుటుంబం
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేశాడంటూ ఓ వర్గం ట్రోల్ చేస్తుండగా.. ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందని మరికొందరు వాదిస్తున్నారు.ఇలాంటి తరుణంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమితా ముచ్చల్ ఇటీవల స్పందిస్తూ.. ‘‘స్మృతి- పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. వారి వివాహం జరుగుతుంది’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. దీంతో స్మృతి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని అభిమానులు సంతోషించారు.కొత్త తేదీ ఇదేనంటూ...ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ పెళ్లి (Smriti Mandhana Wedding Postponed)కి కొత్త తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. డిసెంబరు 7న వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై స్మృతి మంధాన సోదరుడు శ్రావణ్ మంధాన (Shravan Mandhana) తాజాగా స్పందించాడు.తొలిసారి స్పందించిన మంధాన కుటుంబంహిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకైతే తెలియదు. ఇప్పటికీ ఈ వివాహం ఇంకా వాయిదా పడే ఉంది’’ అని శ్రావణ్ మంధాన రూమర్లను కొట్టిపాడేశాడు. స్మృతి- పలాష్‌ల పెళ్లి గురించి ఇప్పటి వరకు తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.2019 నుంచి ప్రేమలో..కాగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 2019 నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఈ విషయాన్ని బయటపెట్టిన ఈ జంట.. ఇటీవలే తమ వివాహ తేదీని కూడా వెల్లడించారు. నవంబరు 23న తాము పెళ్లితో ఒక్కటికానున్నట్లు తెలిపారు.అందుకు తగ్గట్లుగానే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, పెళ్లికి మరి కొన్ని గంటల సమయం ఉందనగా అనూహ్య రీతిలో తంతు వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. వరుడు పలాష్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు.తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి..ఇంతలో పలాష్ తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి.. ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేసింది. దీంతో పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ విషయం తెలిసి స్మృతి తండ్రి.. పలాష్‌తో గొడవపడి గుండెపోటుకు గురయ్యాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఇటు ముచ్చల్.. అటు మంధాన కుటుంబం స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు.దీంతో అనుమానాలు మరింత బలపడగా.. పలాష్ తల్లి మాత్రం త్వరలోనే తన కుమారుడి వివాహం జరుగుతుందని చెప్పడం గమనార్హం. అయితే, ఈ విషయంపై ఇంత వరకు గుంభనంగా ఉన్న మంధాన కుటుంబం మాత్రం తొలిసారి మౌనం వీడి.. పెళ్లికి కొత్త తేదీ ఖరారు చేయలేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Or Palash Muchhal: ఎవరు రిచ్? -
స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్డేట్ చూశారా?
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వరుడు, స్వరకర్త పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేసిన కారణంగానే అంగరంగ వైభవంగా జరగాల్సిన అర్థాంతరంగా వాయిదా పడిందన్నపుకార్లు జోరుగా వ్యాపించాయి. ధృవీకరించని చాట్లు వైరల్ అయ్యాయి. స్మృతి-పలాష్ పెళ్లి వాయిదాకు సంబంధించి స్పష్టమైన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అనేక ఊహాగానాలు రోజుకొకటి వస్తూనే ఉంది. ఇన్ని పరిణామాల మద్య స్మృతి-పలాష్ ఇన్‌స్టా మార్పు అభిమానులు ఆశ్చర్యపరుస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో పలాష్ ముచ్చల్ - స్మృతి మంధాన ఇద్దరూ దిష్టి ('blueye') ఎమోజీని చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. స్మృతి , హల్ది ,మెహందీ వేడుకల ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే వారిద్దరూ ఇన్‌స్టా బయోకు ఒకే ఎమోజీని వాడటం సంచలనంగా మారింది.స్మృతి-పలాష్ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వారు అకస్మాత్తుగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని తొలుత వార్తలు వచ్చాయి. తరువాత, పెళ్లి ఎందుకు వాయిదా పడిందనే దానిపై సోషల్ మీడియాలో అనేక ఇతర వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, స్మృతి మరియు పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో గణనీయమైన మార్పు చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు. మరోవైపు ఇన్ని ఊహాగానాలు, పుకార్ల మధ్య ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పలాష్ ముచ్చల్ తల్లి అమిత ముచ్చల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది యాదృచ్చింగా జరిగిందా? ఇన్‌స్టాలో వీరిద్దరి లేటెస్ట్ అప్డేట్ ఏంటో అర్థం కాగా ఫ్యాన్స్ మాత్రం ఒక పక్క తెగ సంతోషపడుతూనే, మరో పక్క అయోమయంలో పడిపోయారు. -
త్వరలోనే నా కుమారుడి పెళ్లి: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్‌తో చాట్ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అని, అలాంటి అమ్మాయికి పలాష్ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్ కూడా చాన్నాళ్ల క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.మానసిక వేదన వర్ణనాతీతంహిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్ కలలు కన్నాడు.తొందర్లోనే పెళ్లి!నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్‌ల పెళ్లి విషయమై స్పందించలేదు.ఘనంగా వేడుకలుకాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లారు.ఆ వీడియోలు డిలీట్ చేసిన స్మృతిఈ నేపథ్యంలో పలాష్ తల్లి అమిత ముచ్చల్ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత? -
చాట్లను బయటపెట్టింది నేనే..
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవడానికి తానే కారణమని ఓ యువతి అంగీకరించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశానని, తనకు మరో ఉద్దేశం ఏదీ లేదని వెల్లడించింది. పలాష్ ముచ్చల్‌తో జరిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్షాట్లను బయటపెట్టింది తానేనని తెలిపింది. పలాష్ ఎలాంటి వాడో తెలియాలన్న భావనతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే పలాష్‌తో 4 నెలల క్రితం చాటింగ్ చేశానని, అతడి పెళ్లి ఆగిపోవడానికి వీటికి సంబంధం లేదని తెలిపింది. అందరూ అనుకుంటున్నట్టుగా తాను కొరియోగ్రాఫర్ కాదని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.''స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమైన చాట్లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. పలాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మధ్య చాట్లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (పలాష్ ముచ్చల్) గురించి బహిర్గతం చేశాను.నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. పలాష్‌తో చేసిన చాట్‌ను బయటపెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్యతిరేకత రావడంతో నా సోషల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివచ్చింది. పలాష్‌తో జరిపిన చాట్లను గమనిస్తే.. నేను తప్పు చేయలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మహిళకు అన్యాయం నేను చేయలేదు. దయచేసి నన్ను టార్గెట్ చేయవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.చదవండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయంకాగా, స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో మేరీ డికోస్టా అనే యువతి పేరుతో అనధికారిక చాటింగ్ స్క్రీన్షాట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆన్లైన్లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫలితంగా సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ (Palash Muchhal) కుటుంబాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్‌కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్లో కనిపించింది.पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టుఈ ఎపిసోడ్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్‌కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి. ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా -
ఆగిన స్మృతి పెళ్లి.. జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్ సెమీస్‌లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.చాంపియన్ జట్టు ఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడబడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.అక్కాచెల్లెళ్ల మాదిరిభారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్మెంట్ విషయాన్ని జెమీమా సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే స్మృతి వెల్లడించింది.ఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, సంగీత్ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్ లీక్ కావడం సందేహాలకు తావిచ్చాయి.ఆగిన వివాహంమరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్ బాష్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమైంది.స్మృతి కోసం సంచలన నిర్ణయండబ్ల్యూబీబీఎల్లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్‌లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.హోబర్ట్ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్‌లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ సీజన్లో హీట్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్ హ్యారికేన్స్‌తో మ్యాచ్ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్లో భారత్ తరఫున డబ్ల్యూబీబీఎల్ ఆడిన ఏకైక ప్లేయర్ జెమీమా కావడం విశేషం.చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా! -
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.వరల్డ్‌కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత? -
స్మృతి వర్సెస్ పలాష్: ఎవరి నెట్‌వర్త్ ఎంత?
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్‌తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్ పేరిట ఓ అకౌంట్ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు వెళ్లాయనేలా స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్.. డికోస్టాతో డేటింగ్ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్ డిస్టేన్స్’ ఉందంటూ పలాష్.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్ చేసిన పాత రొమాంటిక్ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో స్మృతి- పలాష్ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్‌వర్త్ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్ క్రికెట్ స్టార్ స్మృతిభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్ నెట్‌వర్త్ ఎంత?ఇక పలాష్ విషయానికొస్తే.. మ్యూజిక్ కంపోజర్‌గా, ఆల్బమ్స్ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్ షోలు, రాయల్టీల ద్వారా పలాష్‌కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్‌వర్త్ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్ రిలేషన్లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
-
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (Palash Mucchal)పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్ మూలాలున్న పలాష్ ముచ్చల్‌తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పలాష్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్.. స్మృతి వరల్డ్‌కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్ తనతో చాట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ ‘పర్సనల్’ చాట్ చేసినట్లు వైరల్ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్‌రాయుళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసినప్పటికీ.. పలాష్‌తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్ ఇచ్చారు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్‌గా, వైస్ కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్‌లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్‌ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!.. స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!
ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్ ముచ్చల్‌తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.తప్పనిసరి పరిస్థితుల్లో..ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.నాన్న చూడని వేడుక నాకొద్దుకానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము.వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. వారం రోజులుగా వేడుకలుకాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ, సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్‌ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్ -
డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఆదివారం(నవంబర్ 23) ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో మంధాన-ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు.తొలుత పలాష్ మెడలో స్మృతి దండ వేయగా.. అతడు స్టార్ ఓపెనింగ్ బ్యాటర్‌కు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'తేను లేకే మైన్ జావంగా' వంటి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, 'టీమ్ బ్రైడ్' (వధువు జట్టు), 'టీమ్ గ్రూమ్' (వరుడి జట్టు) మధ్య ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన 'టీమ్ బ్రైడ్' ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే పలాశ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అనంతరం తన ఎంగేజ్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్మృతి అభిమానులతో పంచుకుంది.చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటనoh my god smriti's girl gang performed for her 🥹💕 pic.twitter.com/1MzVGpycCD— IWCT WORLD CHAMPIONS🎊 (@mandyyc0re) November 22, 2025 Smriti Mandhana and Palash muchhal dancing together ❤️ pic.twitter.com/cIFvv3WkCl— JosD92 (@JosD92official) November 22, 2025 -
స్మృతి WEDS పలాశ్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్‌లు, క్యాప్‌తో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్ ‘ఎస్ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్ పిచ్ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్‌లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్‌స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్‌లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్ప్రైజ్.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్‌తో స్మృతిని సర్ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్‌కు గంభీర్ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్, టీమిండియా 'క్వీన్' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధ్రువీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మున్నా భాయ్ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్ చేసింది. మంధన-ముచ్చల్ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు. మంధన-ముచ్చల్ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది. చదవండి: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన -
స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.భారత జట్టు ఓపెనర్‌గా భారత జట్టు ఓపెనర్‌గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్‌లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (WCL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది.ఆరేళ్లుగా ప్రేమప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇండోర్ కోడలు కాబోతోందిఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్‌నగర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్ 1995లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్లో కంపోజర్‌గా సిర్థపడ్డాడు. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.పెళ్లి డేట్ ఫిక్స్!ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ‘అమ్మానాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను’ -
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు.


