సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్‌కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.
భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్‌లో కనిపించింది.
पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E
— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025
కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టు
ఈ ఎపిసోడ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్‌లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్‌లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.
ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్
కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి.
ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా


