డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది.
తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్‌లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్‌గా కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్..7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్ గార్డనర్ 49 పరుగులతో రాణించింది.
నందినీ శర్మ హ్యాట్రిక్..
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ నందిని శర్మ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన నందిని బౌలింగ్‌లో రెండో బంతికి కశ్వి గౌతమ్ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్ తీసి స్ట్రైక్ కనిక అహుజకు ఇచ్చింది.
అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్, ఆరో బంతికి రేణుకా సింగ్ క్లీన్ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్‌గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.
చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్..


