టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 20 ఓవర్ వేస్తున్న సమయంలో సుందర్‌కు వెన్నునొప్పి తలెత్తింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడియాడు.
వాషీ స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. సుందర్ తిరిగి ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అతడి గాయంపై ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే అప్‌డేట్ ఇచ్చాడు. సుందర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని భోగ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సుందర్ బ్యాటింగ్‌కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు.
అయితే తొలుత సుందర్ పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కేవలం వెన్ను నొప్పి అనే తెలియడంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే సైడ్ స్ట్రెయిన్ అయితే కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.
అటువంటి సందర్భంలో వచ్చే నెలలో జరగాల్సిన దూరంగా ఉండక తప్పుదు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 27 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


