జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. అయితే కర్ణాటక జట్టుకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్యూ టీమ్ భారీ స్కోర్ చేసేసింది. షుభమ్ పుండిర్ (121) సెంచరీతో.. యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధవన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో రాణించారు.
చివరి వరుస ఆటగాళ్లు అబిద్ ముస్తాక్ (28), యుద్‌వీర్ సింగ్ (30) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మూడో రోజు తొలి సెషన్‌లోనే జమ్మూ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రసిద్ద్ కాకుండా కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, విజయ్ కుమార్ వైశాక్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలో వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రాహుల్ త్వరగా ఔట్ కావడం ఈ మ్యాచ్‌లో కర్ణాటక గెలుపోటములను తప్పక ప్రభావితం చేస్తుంది.
మూడో రోజు లంచ్ విరామం సమయానికి కర్ణాటక స్కోర్ 35-1గా ఉంది. మయాంక్ అగర్వాల్ (16), కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కర్ణాటక ఇంకా 549 పరుగులు వెనుకపడి ఉంది.


