Jammu and Kashmir
-
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
పహల్గాం/న్యూఢిల్లీ: ఒక ఫొటోగ్రాఫర్ చెట్టు మీది నుంచి తీసిన వీడియో పహల్గాం ఉగ్ర ఘటన దర్యాప్తులో కీలకంగా మారింది. అలాగే ఘటన సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి విహారయాత్రకు వచ్చిన ఒక సైనికాధికారి ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తు అధికారులకు ఎంతో సాయపడుతోంది. నాటి ఘటన క్రమాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. ఆదివారం జమ్మూలో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ, డీఐజీ, ఎస్పీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎన్ఐఏ బృందం సాయపడటం తెల్సిందే. దాడి నుంచి బయటపడి స్వస్థలాలకు వెళ్లిన పర్యాటకుల నుంచి వేర్వేరు బృందాలు వాంగ్మూలాలను సేకరిస్తున్నాయి. సైన్యాధికారి ఏం చెప్పారంటే... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న సైనికాధికారి కాల్పుల వేళ తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో దాచేశారు. ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, తొలుత ఎవరిని చంపారు, తర్వాత ఎటు వెళ్లారు వంటి వివరాలను వాంగ్మూలంలో చెప్పారు. ‘‘తొలుత ఇద్దరు ఉగ్రవాదులు చిన్నపాటి దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా వచ్చి పర్యాటకులను ‘కల్మా’ చదవాలని ఆదేశించారు. చదవని నలుగురిని తలపై కాల్చిచంపారు. దాంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఉగ్రవాదులు వారి తల, గుండెకు గురి చూసి కాల్చడంతో మరికొందరు చనిపోయారు. కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవి నుంచి బయటికొచ్చి పర్యాటకులపైకి కాల్పులకు దిగారు’’ అని ఆయన వివరించినట్టు సమాచారం. కాల్పుల ఘటనను ఉగ్రవాదులు తమ బాడీ క్యామ్‌లలో రికార్డ్ చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ పెళ్లయిన ఆరు రోజులకే దాడిలో చనిపోవడం తెలిసిందే. దాంతో ఆయన భార్య హిమాన్షీ గుండెలవిసేలా రోదిస్తూనే ఫోన్ చేసి పోలీసులకు వెంటనే సమాచారమిచ్చారు. దాడిపై వారికి వచ్చిన తొలి కాల్ అదే. దాంతో పహల్గాం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. 22 గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి చంపారు భద్రతా బలగాల కంటబడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోకాకుండా అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకర పర్వత సానువుల గుండా వచ్చినట్టు వెల్లడైంది. కోకెర్నాగ్ అటవీ ప్రాంతం గుండా 22 గంటలు ట్రెక్కింగ్ చేసి మరీ బైసారన్ చేరుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులను కాల్చే క్రమంలో ఒక స్థానికుడు, మరో పర్యాటకుడి నుంచి వాళ్లు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్తూ వాటిని మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలుస్తోంది. దాడిలో ఏకే 47, ఎం4 మెషీన్గన్లు వాడినట్టు జాగా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ప్రాణభయంతో చెట్టెక్కి, వీడియో తీసి...ఉగ్రవాదులు దాడికి దిగిగినప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు ప్రాణభయంతో చెట్టెక్కి కొమ్మల్లో నక్కారు. అలా వారి కంట పడకుండా తప్పించుకున్నారు. కళ్లెదుటే అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించిన తీరును కెమెరాలో బంధించారు. దాడి క్రమాన్ని స్పష్టంగా పట్టిచ్చిన ఆ వీడియో ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారింది. -
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. -
పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. Assam | A woman named Dadhichi Dimple alias Dimple Baruah from Golaghat district of Assam was detained by the Crime Branch from Guwahati for making controversial and anti-national comments on the #PahalgamTerrorAttack.At least 19 people have been arrested in Assam, Meghalaya,… pic.twitter.com/MgJp6TehmC— OTV (@otvnews) April 27, 2025వారిపై కఠిన చర్యలు తప్పవ్అయితే, ఈ అరెస్టులు,సోషల్ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
అశ్రుతర్పణం
శివమొగ్గ(కర్ణాటక): జమ్ముకాశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు. శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్ సమీపం నుంచి బైక్ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు బైక్ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు. భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్ భూషణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్ భూషణ్ ఇంటికి ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాశ్మీర్ టూర్ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పారీ్టల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు. -
దాడిని తీవ్రంగా ఖండించిన అరబ్ దేశాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని ఇరాక్, జోర్డాన్, ఖతార్ తదితర అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన ఈ దేశాలు, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి. యూరప్ దేశాల సమాఖ్య ఈయూ కూడా దారుణాన్ని ఖండించింది. భారత్‌కు సంఘీభావం తెలిపింది. లక్ష్యమేదైనా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దేశ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా, పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని మోదీకి గురువారం ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలిపారు. అమాయకులను దారుణంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల పైశాచికాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మెలోనీ, మాక్రాన్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని, దాడికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారని విదేశాంగ శాఖ తెలిపింది. -
కావలి కన్నీటి నివాళి
కావలి: జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకల తుపాకీ తూటాలకు బలైపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గురువారం సాయంత్రం పూర్తయ్యాయి. కశ్మీర్ నుంచి విమానంలో చెన్నైకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో రోడ్డు మార్గంలో కావలిలోని ఆనాల వారి వీధిలో ఉన్న మధుసూదన్ ఇంటి వద్దకు భౌతికకాయాన్ని గురువారం ఉదయం తీసుకువచ్చారు. మధుసూదన్ పార్థివదేహాన్ని చూడగానే అతడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పట్టణ వాసులు వేలాదిమంది తరలివచ్చి నివాళి అర్పించారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం కావలి చేరుకుని మధుసూదన్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళి అర్పించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఐ లవ్ యూ డాడీ తండ్రి భౌతికకాయం వద్ద మధుసూదన్ కుమారుడు దత్తు, కుమార్తె మేధు ఐలవ్ యూ డాడీ అంటూ వెక్కివెక్కి విలపించిన తీరు అందరిచేత కంటతడి పెట్టించింది. ఎక్కడికీ వెళ్లొద్దు డాడీ... మా దగ్గరే ఉండి పో డాడీ అంటూ వారిద్దరూ గుండెలవిసేలా రోదించారు. సాయంత్రం నగర వీధుల్లో మధుసూదన్ అంతిమయాత్ర సాగింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాడెను మోశారు. అనంతరం బుడంగుంట శ్మశానవాటికలో మధుసూదన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. 2 గంటలకుపైగా సమావేశం కొనసాగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యలపై అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరింది.ఉగ్ర దాడులను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్లో శాంతి నెలకొనాలని.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి: మిథున్రెడ్డిఉగ్రదాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి. భద్రతను మరింత పటిష్టం చేయాలి. త్వరగా ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్ చేశారు.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్ అవేదన వ్యక్తం చేశారు.కశ్మీర్ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేశారు. Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1— Prakash Raj (@prakashraaj) April 24, 2025 -
ఇక భారత్ విడిచి వెళ్లాల్సిందే.. పాక్ పౌరులకు హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది. -
ఇండియా రివెంజ్ మామూలుగా ఉండదు.. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్
-
పహల్గామ్ లో సాక్షి.. ఉగ్రదాడి ఘటనాస్థలం నుంచి.. Exclusive Coverage
-
ఉగ్రవాదులకు లోకల్ సపోర్ట్.. బాడీ క్యామ్ ద్వారా వీడియో రికార్డ్
-
పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్. – భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు. -
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి. పాక్ పౌరులను భారత్‌లోకి అనుమంతించేది లేదు. పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉంది. అందుకు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ (Cabinet Committee on Security) సమావేశం కొనసాగింది. అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో విక్రమ్ మిస్రీ వెల్లడించారు. #WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/WsRKE39vEO— ANI (@ANI) April 23, 2025👉ఇండస్ వాటర్ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేత కొనసాగుతుంది. 👉అటారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు తక్షణమే మూసివేతఅటారి చెక్‌పోస్టును తక్షణమే మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో ఆ మార్గం గుండా భారత్‌కు వచ్చిన పాకిస్తానీయులు మే 1వ,2025 తేదీ లోపు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. 👉పాక్ పౌరులకు SAARC వీసా మినహాయింపు నిలిపివేతSAARC Visa Exemption Scheme (SVES) ద్వారా పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ వీసాతో భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లో దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది.👉 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులకు 'పర్సోనా నాన్ గ్రాటా'విధింపు భారత్‌లో ఉన్న పాక్ రక్షణ, నౌకా, వాయుసేన సలహాదారులపై ''persona non grata' విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ విడిచిపెట్టాలి.👉 ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణపహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ పాక్‌లోని ఇస్లామాబాద్ హైకమిషన్ నుండి భారత రక్షణ, నౌకా,వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది. -
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి గురించి జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇరువురి నేతల మధ్య జరిగిన సంభాషణను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు.జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని అమెరికా ఖండిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఉగ్రవాదంపై చేసే పోరాటంలో భారత్‌కు అండగా అమెరికా ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదం విషయంలో భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. Usha and I extend our condolences to the victims of the devastating terrorist attack in Pahalgam, India. Over the past few days, we have been overcome with the beauty of this country and its people. Our thoughts and prayers are with them as they mourn this horrific attack. https://t.co/cUAyMXje5A— JD Vance (@JDVance) April 22, 2025జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రపంచం దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. కాగా, జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జేడీ వాన్స్ దంపతుల్ని సాధరంగా ఆహ్వానించారు. -
Pahalgam: ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు కొనసాగిన భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ (Cabinet Committee on Security)సమావేశం ముగింది. 9:15 నిమిషాలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌లు పాల్గొన్నారు. సీసీఎస్ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, నావికా దళం అధిపతి త్రిపాఠి, సైన్యాధిపతి ద్వివేది, వైమానిక దళాధిపతి అమన్ ప్రీత్ సింగ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy— ANI (@ANI) April 23, 2025 -
పహల్గాం ఉగ్రదాడి.. అధికారికంగా 26 మంది మృతుల వివరాలు విడుదల
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 26 మంది బాధితుల వివరాలను అధికారులు విడుదల చేశారు.ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టుల మృతదేహాలకు శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అధికారులు మృతుల వివరాల్ని అధికారింగా ప్రకటించారు. ఈ మృతుల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.పహల్గాం ఉగ్రదాడి.. అధికారికంగా మృతుల వివరాలు విడుదలసుశీల్ నాథ్యాల్ – ఇండోర్ సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాంహేమంత్ సుహాస్ జోషి – ముంబైవినయ్ నార్వాల్ – హర్యానా అతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్రనీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్బిటన్ అధికారి – కోల్కతాసుదీప్ నియుపానే – నేపాల్శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్ ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశామనీష్ రంజన్ – బీహార్ఎన్. రామచంద్ర – కేరళసంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబైదినేష్ అగర్వాల్ – చండీగఢ్సమీర్ గుహార్ – కోల్కతాదిలీప్ దసాలీ – ముంబైజే. సచంద్ర మోలీ – విశాఖపట్నంమధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరుసంతోష్ జాఘ్డా – మహారాష్ట్రమంజు నాథ్ రావు – కర్ణాటకకస్తుబ గంటోవత్య – మహారాష్ట్రభరత్ భూషణ్ – బెంగళూరుసుమిత్ పరమార్ – గుజరాత్యతేష్ పరమార్ – గుజరాత్టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్ శైలేష్‌భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్ హెల్ప్ లైన్ ఏర్పాటుమరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో అనంత్ నాగ్ పోలీసులు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు సహాయం చేసేందుకు, బాధితుల కుటుంబాలకు కీలకమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అనంతనాగ్ హెల్ప్ డెస్క్ కోసం అధికారులు రెండు కాంటాక్ట్ నంబర్లను విడుదల చేశారు. వాటిలో ఒకటి 9596777669, 01932-225870, అలాగే 9419051940లో వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను కూడా విడుదల చేశారు.కుటుంబసభ్యులు, పర్యాటకులు కోసం 0194-2457543,0194-2483651 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం శ్రీనగర్ అదనపు డిప్యూటీ కమిషనర్ (ADC) ఆదిల్ ఫరీద్ 7006058623ను సంప్రదించవచ్చు. -
దాడి మొత్తం పాకిస్థాన్ నుంచే ఆపరేట్ చేసినట్టు నిఘా వర్గాల గుర్తింపు
-
పహల్గామ్ దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్
-
జమ్మూ కాశ్మీర్ ఘటనపై జగన్ రియాక్షన్
-
నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
కశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి మృతి
-
శోకసంద్రంలో జమ్మూ.. సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులు
-
జమ్మూకశ్మీర్ లో తరచూ ఉగ్రదాడులు
-
పహెల్ గామ్ లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
-
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు
-
నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!
పహల్గాం: బైసారన్. పహల్గాంకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్ పట్టణం. సుదూరాల దాకా పరుచుకున్న అందమైన మైదానాలు, పైన్ అడవులు, మంచు కొండలతో పర్యాటకులకు స్వర్గధామంగా అలరారుతుంటుంది. దశాబ్దాలుగా సినిమా షూటింగులకు, ట్రెక్కర్లకు ఇది ఫేవరెట్ స్పాట్. ఇక్కడికి చేరుకోవాలంటే కాలినడక లేదా గుర్రాలే శరణ్యం. వేసవి కావడంతో కొద్ది రోజులుగా పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో ఉగ్రవాదులు అదను చూసి పంజా విసిరారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భారీ ఆయుధాలతో సమీప అడవుల్లోంచి వచ్చిపడ్డారు. రకరకాల రైడ్లను, స్థానిక రుచులను ఆస్వాదిస్తూ, ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్న పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఊహించని దాడితో హాహాకారాలు చెలరేగాయి. పర్యాటకులంతా ప్రాణభయంతో తలో దిక్కు పరుగులు తీశారు. చుట్టూ మైదాన ప్రాంతం కావడంతో కనీసం దాక్కునే వీలు కూడా లేకుండా పోయింది. ఆ క్రమంలో రెండు పర్యాటకుల బస్సులను కూడా ఉగ్రవాదులు అడ్డుకున్నట్టు సాక్షులు తెలిపారు. వారిని ఒక్కొక్కరిగా పేర్లడుగుతూ బస్సుల్లోంచి కిందకు దించారు. హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. పేరు తప్పు చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి నిర్థారించుకున్నారు. తర్వాత పాయింట్ బ్లాంక్‌లో కాల్చేశారు. దాంతో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా నేలకొరిగారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఎటు చూసినా శవాలు, తూటా గాయాలకు కుప్పకూలి లేవలేక అల్లాడుతున్న వాళ్లతో పరిస్థితి భీతావహంగా మారింది. ఉగ్రమూకల కోసం గాలిస్తున్న ఆర్మీ జవాన్లు మృతదేహాల వద్ద మహిళలు గుండెలవిసేలా రోదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘తూటా నా భర్త తలలోంచి దూసుకెళ్లింది. నా కళ్లముందే కన్నుమూశాడు’’ అంటూ ఓ మహిళ హృదయవిదారకంగా విలపించింది. తన పక్కనున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపింది. ముష్కరులు జమ్మూలోని కిష్త్వార్ గుండా పాక్ నుంచి చొరబడి కొకెర్నాగ్ మీదుగా వచ్చిపడ్డట్టు భావిస్తున్నారు.బొమ్మనహళ్లి: భార్య, కుమారునితో కలిసి అప్పటిదాకా ప్రకృతిని ఆస్వాదించాడు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపాడు. కాసేపటికే వాళ్ల కళ్లముందే ఉగ్ర కాల్పులకు బలయ్యాడు. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్‌రావ్ అనే 47 ఏళ్ల రియల్టర్ విషాదాంతమిది. విహారయాత్ర కోసం భార్య పల్లవి, కుమారునితో కలిసి 19వ తేదీన ఆయన కశ్మీర్ వెళ్లారు. బైసారన్‌లో ఉండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. మంజునాథ్ తూటాలకు బలవగా భార్య, కుమారుడు అభిజేయ సురక్షితంగా బయటపడ్డారు. ఉగ్రవాదులు తమను కావాలనే వదిలేశారని పల్లవి చెప్పారు. ‘‘ఆ సమయంలో 500 మంది దాకా పర్యాటకులం ఉన్నాం. అప్పుడే గుర్రం దిగాం. నా కొడుకు తినేందుకు ఏమైనా దొరుకుతుందా అని నా భర్త దగ్గర్లోని హోటల్లో విచారిస్తున్నారు. అబ్బాయితో పాటు నేనక్కడికి వెళ్తుండగానే కాల్పుల శబ్దం వచ్చింది. ఆర్మీ జవాన్లు కాల్పులు జరుపుతున్నారనుకున్నాం. కానీ జనం పరుగులు చూసి నేను కూడా పరిగెత్తాను. అప్పటికే నా భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ముగ్గురు ఉగ్రవాదులు బిస్మిల్లా, బిస్మిల్లా అంటున్నారు. వాళ్లు హిందువులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. మగవారిని తీవ్రంగా కొడుతున్నారు. ‘‘నా భర్తను ఎందుకింత దారుణంగా హత్య చేశారు, నన్నూ చంపెయ్యండి అన్నాను. ‘మా అమ్మను, నన్ను కూడా చంపండిరా’ అని నా కొడుకు కూడా గట్టిగా అరిచాడు. అయినా వాళ్ల గుండెలు కరగలేదు. ‘మిమ్మల్ని చంపేది లేదు. ఇక్కడ జరిగింది పోయి మీ మోదీకి చెప్పుకొ’మ్మన్నారు. కశ్మీర్ చూడాలనేది నా భర్త కల. మా కర్మ కొద్దీ ఇక్కడికొచ్చాం’’ అంటూ ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.మగవారే లక్ష్యంగా అంతులేని ఉన్మాదంనరమేధంలోనూ ఉగ్రవాదులు అంతులేని ఉన్మాదం ప్రదర్శించారు. మగవారిని మాత్రమే లక్ష్యంగా ఎంచుకున్నారు. భార్యాపిల్లల కళ్లముందే వారిని కర్కశంగా కాల్చి చంపి వికృతానందం పొందారు. కాల్పులకు తెగబడింది ఐదుగురు ఉగ్రవాదులని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘తమకు సమీపంగా ఉన్న 40 మంది పర్యాటకులను చుట్టుముట్టారు. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఒక్కో పర్యాటకున్నీ పేరడిగి మరీ కాల్చారు’’ అని ఒక మహిళ చెప్పుకొచ్చింది.కంటతడి పెట్టిస్తున్న సరదా వీడియోఘటనకు కాస్త ముందు పల్లవి దంపతులు తీసుకున్న సరదా వీడియో వైరల్‌గా మారి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రకృతి సోయగాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నామని, ముందు రోజే షికారా (బోట్) రైడింగ్ అద్భుతంగా సాగిందని మంజునాథ్ ఉత్సాహంగా చెబుతూ కన్పిస్తున్నాడు. భర్త మృతదేహాన్ని త్వరగా తరలించాలని అధికారులను పల్లవి వేడుకున్నారు. వాహనాలు వచ్చే వీల్లేనందున హెలికాప్టర్లో తరలించాలని కోరారు.మృతుల్లో హైదరాబాద్ ఐబీ కార్యాలయ ఉద్యోగిసాక్షి, సిటీ బ్యూరో: ఇంటెలిజెన్స్ బ్యూరో హైదరాబాద్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పని చేస్తున్న మనీశ్ రంజన్ కశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించారు. బిహార్‌కు చెందిన ఆయన 2022లో హైదరాబాద్ బదిలీ అయ్యారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద మూడు రోజుల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లారు. ఉగ్రవాదులు అడ్డుకున్న టూరిస్టు బస్సుల్లో ఒక దాంట్లో మనీశ్ కుటుంబం ఉంది. ఆయనను కుటుంబం నుంచి వేరు చేశారు. పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు. తల భాగం ఛిద్రమై భార్యాపిల్లల ఎదుటే కన్నుమూయడంతో వాళ్లు తీవ్ర షాక్‌కు లోనయ్యారు. మనీశ్ మృతి పట్ల హైదరాబాద్ ఐబీ కార్యాలయ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.గుర్రాలపైనే ఆస్పత్రికిఘటనా స్థలి హృదయ విదారక దృశ్యాలకు వేదికగా మారింది. ఎటు చూసినా రక్తం మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులే. ఆదుకోవాలంటూ మిన్నంటిన రోదనలే. గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు తక్షణం స్పందించారు. పర్యాటకులు అక్కడికి చేరుకోవడానికి ఉపయోగించిన పోనీల (పొట్టి గుర్రాల) మీదే క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కాసేపటికే స్థానిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అంబులెన్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బాధితులను హెలికాప్టర్లలో తరలించారు. మిగతావారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ పహల్గాం క్లబ్‌కు చేర్చారు.పిరికిపంద చర్య: రాష్ట్రపతి ముర్ముతీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ఉగ్ర దాడిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని క్షమార్హం కాని పిరికిపంద చర్యగా ముర్ము అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాందీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులు దాడిని ఖండించారు. పర్యాటకుల మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈ ఘటన షాక్‌కు గురి చేసింది. క్షత్రగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.అప్పుడూ క్లింటన్ పర్యటిస్తుండగానే...జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యం చేసుకోవడం ఇది తొలిసారేమీ కాదు. 2000 మార్చి 21న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ అనంత్‌నాగ్ జిల్లా చట్టీసింగ్పురాలో టెర్రరిస్టులు చెలరేగిపోయారు. ఏకంగా 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ⇒ 2000లోనే అమర్నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ⇒ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ⇒ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. ⇒ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. ⇒ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ⇒ 2005లో పుల్వామాలో కిక్కిరిన మార్కెట్ ప్రాంతంలో కార్లో పేలుడు పదార్థాలు నింపి పేల్చేయడంతో 13 మంది పౌరులు, ముగ్గురు సీఆరీ్పఎఫ్ జవాన్లు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ⇒ 2006లో 9 మంది నేపాలీ, బిహారీ కూలీలను కాల్చి చంపారు. ⇒ 2017లో అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగొస్తున్న భక్తుల బృందంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు 8 మంది బలయ్యారు. 100 రౌండ్ల కాల్పులుబాణసంచా అనుకున్నా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా ఒక పర్యాటకుడు మైదాన ప్రాంతాల్లో మిత్రునితో సరదాగా నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘‘తొలుత బాణసంచా కాలుస్తున్నారేమో అనుకుని అంతగా పట్టించుకోలేదు. కానీ కాల్పుల శబ్దం అంతకంతకూ పెరిగిపోయింది. అంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటంతో ఉగ్ర దాడి అని అర్థమై వెంటనే పరుగులు తీశాం. కనీసం 100 రౌండ్ల దాకా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు. -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.జమ్మూకశ్మీర్ దుర్ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహెల్ గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025టూరిస్టులపై కాల్పులుమంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్ గామ్‌లో బైసరీన్ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. -
Pahalgam: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి
జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా పహెల్ గామ్‌లో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల దాడిలో 27మంది టూరిస్టులు మరణించారు. పదిమందికిపై టూరిస్ట్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరీన్ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే, ఈ బైసరీన్ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాలమీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.A newlywed’s honeymoon turned into horror in #Pahalgam as terrorists shot her husband for not being Muslim. They asked his name, caste then killed him point-blank in kashmir. Her life shattered forever.#Kashmir #UPSC pic.twitter.com/4s1OYAdsiE— Rebel_Warriors (@Rebel_Warriors) April 22, 2025 భారత ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పెహల్ గామ్‌లో ట్రెక్కింగ్ టూర్‌కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులను చెక్ చేశారు.మతం అడిగి తెలుసుకున్నారు. ముస్లింలు కాని వారిని పక్కన నిలబెట్టి కాల్పులు జరిపారు.పేరు, మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారని ఓ బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులపై ఎదురుదాడికి దిగాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించాయి.టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. భారీగా బద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సేపటికే.. పర్యాటకులపై దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. ప్రధాని మోదీ ఆరాకాల్పుల ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖండించారు. కాల్పుల ఘటనపై అమిత్‌షాతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఫోన్లోనే పరిస్థితులను అమిత్‌షా వివరించారు. అయితే ఘటనాస్థలికి వెళ్లాలని అమిత్‌షాకు సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో అమిత్‌షా హుటాహుటీన కాశ్మీర్‌కు బయల్దేరారు. I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected. Those behind this heinous act will be brought…— Narendra Modi (@narendramodi) April 22, 2025న్యాయ స్థానం ముందు నిలబెడతాంమరోవైపు ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పెట్టే ప్రసక్తిలేదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం గొప్పది. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయ స్థానంలో నిలబెడతాం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ఇది క్రూరమైన చర్య : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు. ఇది క్రూరమైన చర్య. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. The terrorist attack on tourists in Pahalgam of Jammu and Kashmir is shocking and painful. It is a dastardly and inhuman act which must be condemned unequivocally. Attacking innocent citizens, in this case tourists, is utterly appalling and unpardonable. My heartfelt condolences…— President of India (@rashtrapatibhvn) April 22, 2025 ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదుజమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిపై హోంశాఖ అత్యున్నత సమీక్ష నిర్వహించింది. ఉగ్రవాదుల దాడి నన్ను కలిచి వేసింది. ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir. My thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences.…— Amit Shah (@AmitShah) April 22, 2025 ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిజమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడిన దేశ వ్యతిరేక శక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటై నిలబడుతుందని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
అమర్జీత్ సింగ్ దులత్ పుస్తకం జమ్ము –కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్ ఆయన మీద రాసిన ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్‌కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్)’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్ సాహిబ్ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్ తన తండ్రి షేక్ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్ ‘‘శ్రీనగర్‌కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్ కథనం ప్రధానంగా ఫరూఖ్ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్‌పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్‌కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్ సాహిబ్ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్ సాహిబ్ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-కరణ్ థాపర్ -
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ కు చెందిన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వరద నీటికి ఒక్క రాత్రిలోనే తమ జీవితం తల్లకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు, ఇళ్లులు అన్నీ కూడా ఆ ఘటనతో కోల్పోయమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో ఓం సింగ్ అనే దుకాణదారుడు తన షాపు ఎలా నీటిలో కొట్టుకుపోయిందో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను అవతలి వైపు ఉంటున్నాను. కానీ అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంది. మేము ఇక్కడకి సకాలంలో చేరుకోలేక పోయాం. నేను ఇక్కడికి చేరుకునే సరికి నా షాపు సహా మొత్తం మార్కెట్ అంతా అదృశ్యమైంది. దీనిని నేను కళ్లారా చూశాను. ఇలాంటింది చూడటం ఇదే తొలిసారి’ అని రాంబన్ నివాసి ఓమ్ సింగ్ తెలిపాడు.ఇది ఒక్క రాంబన్ పరిస్థితే కాదు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. తమ సర్వస్వం కోల్పోయామని వారు విలపిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొండచరియలు విరిగిపడటమే కాదు తాము సర్వస్వం కోల్పోయామని అంటున్నారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు కొందరు పేర్కొన్నారు.#WATCH | Ramban, J&K: Om Singh, a local, says, "I live on the other side, but even there, the flow of water was very strong, we could not make it here in time. When I reached here, I saw the whole market, including my shop, had vanished... This is the first time I am seeing… https://t.co/aPfmXKXGjZ pic.twitter.com/VjIFqY4ySd— ANI (@ANI) April 20, 2025 #WATCH | Jammu and Kashmir: Several buildings have been damaged due to a landslide following heavy rains and hailstorm in Ramban district pic.twitter.com/jx3MGycq4s— ANI (@ANI) April 20, 2025 -
జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)
-
Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!
Amarnath Yatra 2025 భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అమర్నాథ్యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్ర ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 25 నుండి ప్రారంభం కానుంది. మొత్తం 38 రోజులపాటు అంటే ఆగస్టు 19 వరకు ఇది సాగనుంది. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఎపుడు, ఎలా చేసుకోవాలి? నిబంధనలేంటి , ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.2025 ఏడాదికి సంబంధించిన అమర్నాథ్ ప్రయాణానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 14నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది. శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15,000 మంది యాత్రికులు ఇక్కడికి తరలివస్తారుచదవండి: అమర్నాథ్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!అమర్నాథ్ యాత్ర బుకింగ్ ఫీజు , అవసరమైన పత్రాలు ?ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ అధికారికంగా ఏప్రిల్ 14న ప్రారంభమైంది మరియు శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) అధికారిక వెబ్సైట్ మరియు గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.ముందుగా శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా https://jksasb.nic.in/ కి వెళ్లాలి.హోమ్‌పేజీలో, ఎగువన ఉన్న 'ఆన్లైన్ సేవలు' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.ఎంపికల జాబితా నుండి 'యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.సూచనలు, నియమాలు , ముఖ్యమైన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి. వాటిని చదివిన తర్వాత, 'నేను అంగీకరిస్తున్నాను' పై క్లిక్ చేయండి.తర్వాత 'రిజిస్టర్' బటన్‌ను ఎంచుకోవాలి..మీరు పేరు, ఇష్టపడే యాత్ర తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మొదలైన మీ వివరాలను నమోదు చేయాలి.అలాగే, మీ తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం (CHC) స్కాన్ చేసిన కాపీతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అప్లోడ్ చేయండి.తరువాత, ఒక ఓటీపీ వస్తుంది. ఈ OTPని నమోదు చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించాలి.దాదాపు రెండు గంటల్లోపు, చెల్లింపు చేయడానికి మీకు లింక్ అందుతుంది. చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీ యాత్ర పర్మిట్‌ను నేరుగా పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.బాబా అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ మునుపటిలాగే ఆధార్ కార్డ్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా జరుగుతుంది. భక్తులు బుకింగ్ కోసం రూ. 150 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ : ఆధార్ కార్డుతో పాటు ఆరోగ్య ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలి. అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు బ్యాంకుల శాఖలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆసుపత్రులు , వైద్య కేంద్రాల వైద్యుల బృందాల గురించి సమాచారాన్ని అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎటువంటి సమస్య లేకుండా వారి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని పొందడం ద్వారా ముందస్తు బుకింగ్ కోసం దరఖాస్తు చేసు కోవచ్చు.గ్రూపులుగా భక్తులు ఎలా నమోదు చేసుకోవాలి? రుసుము ఎంత?అమర్నాథ్ యాత్రకు కొంతమందితో కలిసి గ్రూపుగా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమూహ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది.. ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తుల కోసం, దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ పొందడానికి చివరి తేదీ మే 20. ఒక రోజులో గరిష్టంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 30కి మాత్రమే అనుమతి. గ్రూప్ సభ్యులకు రిజిస్ట్రేషన్ ఒక్కొక్కరికి రూ. 250 రుసుము బుకింగ్‌కు చివరి తేదీ మే 31.ఎన్ఆర్ఐ భక్తులుNRI యాత్రికులకు ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1550. దీన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలలో ఆరోగ్య ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ , స్కాన్ చేసిన ఫోటోలు సమర్పించాలి. విదేశీ యాత్రికులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ కోసం తమ పత్రాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐటీ విభాగం సీనియర్ మేనేజర్‌కు పంపవచ్చు. భక్తులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా మరింత సమాచారాన్ని పొందవచ్చు. -
అమర్నాథ్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!
Amarnath Yatra 2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్నాథ్యాత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్ర ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రోజుల మాత్రమే పరిమితం. బాబా బర్ఫానీ యాత్రగా చెప్పుకునే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు వరకు సాగనుంది. శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15వేల మంది యాత్రికులు ఇక్కడికి తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. 2025 ప్రయాణానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 14 నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది.జమ్మూ కాశ్మీర్‌లోని అమర్నాథ్ గుహకు సాగే అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ల కంటే తక్కువ 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు. అంతేకాదు అమర్నాథ్కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్‌కు ఒక్క భక్తుడు మాత్రమే అర్హులు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు అని గమనించాలి. అమర్ నాథ్ యాత్ర 40-60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 14 తేదీ నుంచే ప్రారంభం అయింది. ఈ యాత్ర ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్లలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్రబోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది.ఈ కష్టతరమైన ప్రయాణానికి జాగ్రత్తలు, తీసుకెళ్లకూడని ఆహారపదార్థాలు, తీసుకెళ్ల కూడని వస్తువుల జాబితాను కూడా ప్రకటించారు. ఈ యాత్ర సమయంలో జంక్ ఫుడ్ యాత్రికులకు పెద్ద అడ్డంకిగా మారింది. చాలా మంది భక్తులు లంగర్ సేవలను ఎంచుకుంటారు. ఇక్కడ స్వచ్ఛంద సేవకులు, సంస్థలు మార్గంలో కమ్యూనిటీ కిచెన్లను నిర్వహిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజనం, పానీయాలను అందిస్తాయి. వీటికితోడు స్థానిక వ్యాపారులు నడిపే స్థానిక తినుబండారాలు, రెస్టారెంట్లు , టీ స్టాళ్లు కూడా యాత్రికులకు ప్రాంతీయ వంటకాలు , రిఫ్రెష్మెంట్లు ఉండనే ఉంటాయి.నిషేధిత ఆహార పదార్థాలుమాంసాహార ఆహారాలు: అన్ని రకాల మాంసం ఉత్పత్తులుమత్తు పదార్థాలు: ఆల్కహాల్, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాలువేయించిన ఆహారాలు: పూరీ, బతురా, పిజ్జా, బర్గర్, స్టఫ్డ్ పారంతా, దోస, వేయించిన రోటీ, వెన్నతో బ్రెడ్క్రీమ్ ఆధారిత వంటకాలు: భారీ క్రీమ్‌తో తయారుచేసిన ఏదైనా ఆహారంసంభారాలు: ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్ఫాస్ట్ ఫుడ్స్: చౌమీన్ , ఇతర సారూప్య తయారీలు, శీతల పానీయాలుతీపి మిఠాయిలు: కర్రా హల్వా, జలేబీ, గులాబ్ జామున్, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా తదితర స్వీట్లుకొవ్వు ,ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్: చిప్స్, కుర్కురే, మత్తి, నమ్కీన్ మిశ్రమం, పకోరా, సమోసా, వేయించిన డ్రై ఫ్రూట్స్అనుమతి ఉన్న ఆహార పదార్థాలుస్టేపుల్స్: తృణధాన్యాలు, పప్పులు, బియ్యంతాజా ఉత్పత్తులు: ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ సలాడ్, పండ్లు, మొలకలుసహజ తీపి పదార్థాలు: బెల్లం లాంటివి,దక్షిణ భారత వంటకాలు, సాంబార్, ఇడ్లీ, ఉత్తపం, పోహాపానీయాలు: హెర్బల్ టీ, కాఫీ, తక్కువ కొవ్వు పెరుగు, షర్బత్, నిమ్మకాయ గుజ్జు/నీరుఎండిన పండ్లు: అంజీర్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ఇతర వేయించని రకాలుడెజర్ట్లు- స్వీట్లు: ఖీర్ (బియ్యం/సాబుదానా), తెల్ల ఓట్స్ (దలియా), తక్కువ కొవ్వు పాలు సావైన్, తేనె, ఉడికించిన స్వీట్లు (క్యాండీ)తేలికపాటి స్నాక్స్: వేయించిన పాపడ్, ఖాక్రా, నువ్వుల లడ్డు, ధోక్లా, చిక్కీ (గుచక్), రేవేరిఫులియన్ మఖానే, ముర్మారా, డ్రై పెథా, ఆమ్లా మురబా, ఫ్రూట్ మురబా, పచ్చి కొబ్బరి లాంటివి తీసుకెళ్ళొచ్చు. -
వక్ఫ్ చట్టంపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం
-
Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ మానీ బల్లా రోడ్డు, ఫాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్ అధికార ప్రతినిథి తెలిపారు.ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. -
Ranji Trophy: ఒక్క పరుగు జమ్మూ కశ్మీర్ కొంప ముంచింది.. సెమీస్‌కు కేరళ
పుణే: ఒక్క పరుగే కదా అని తేలిగ్గా తీసుకుంటే... ఆ ఒక్క పరుగే ఒక్కోసారి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఈ ఒక్క పరుగు విలువ ఎలాంటిదో అటు కేరళ జట్టుకు... ఇటు జమ్మూ కశ్మీర్ జట్టుకు తెలిసొచ్చింది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ చేరుకోవాలని ఆశించిన జమ్మూ కశ్మీర్ జట్టుకు ఒక్క పరుగు నిరాశను మిగిల్చింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో సంపాదించిన ఒక్క పరుగు ఆధిక్యం కేరళ జట్టుకు ఆరేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే... జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన 399 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరి రోజు ఆట ముగిసేసరికి 126 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు సాధించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. సల్మాన్ నిజర్ (162 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (118 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) 43 ఓవర్లు ఆడి ఏడో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి జమ్మూ కశ్మీర్ విజయాన్ని అడ్డుకున్నారు. భారత్‌లోని పిచ్‌లపై చివరిరోజు 299 పరుగులు చేయాలంటే ఏ స్థాయి టోర్నీలోనైనా కష్టమే. ఈ నేపథ్యంలో కేరళ బ్యాటర్లు ఆఖరి రోజు క్రీజులో నిలదొక్కుకొని సాధ్యమైనన్ని బంతులు ఆడాలని... జమ్మూ కశ్మీర్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకోరాదని... మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడారు. చివరకు తమ ప్రయత్నంలో కేరళ బ్యాటర్లు విజయవంతమయ్యారు. వెరసి కేరళ, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య ఐదు రోజుల రంజీ ట్రోఫీ చివరి క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’గా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జట్టుకు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. జమ్మూ కశ్మీర్‌పై 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న కేరళ జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ఈనెల 17 నుంచి జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో కేరళ తలపడుతుంది. ఆ ఇద్దరు అడ్డుగోడలా... ఓవర్‌నైట్ స్కోరు 100/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ బుధవారం తొలి సెషన్లో నింపాదిగా ఆడి 46 పరుగులు జోడించి ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ సమయానికి కేరళ 146/3తో ఉంది. రెండో సెషన్లోనూ కేరళ బ్యాటర్లు ఎలాంటి ప్రయోగాలకు పోలేదు. ఆచితూచి ఆడుతూ వికెట్లను కాపాడుకున్నారు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో కేరళ సచిన్ బేబీ (162 బంతుల్లో 48; 7 ఫోర్లు), జలజ్ సక్సేనా (48 బంతుల్లో 18; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆదిత్య సర్వాతే (27 బంతుల్లో 8; 2 ఫోర్లు) కూడా అవుటయ్యాడు. దాంతో టీ విరామానికి కేరళ 216/6 స్కోరుతో వెళ్లింది. టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్లో మరో నాలుగు వికెట్లు తీస్తే జమ్మూ కశ్మీర్‌కు విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ లభించేది. కానీ సల్మాన్ నిజర్, అజహరుద్దీన్ మొండి పట్టుదలతో ఆడి జమ్మూ కశ్మీర్ జట్టు ఆశలను వమ్ము చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించడంతోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన నిజర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సంక్షిప్త స్కోర్లు జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 280; కేరళ తొలి ఇన్నింగ్స్: 281; జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 399/9 డిక్లేర్డ్; కేరళ రెండో ఇన్నింగ్స్: 295/6 (126 ఓవర్లలో) (రోహన్ 36, అక్షయ్ 48, సచిన్ బేబీ 48, సల్మాన్ నిజర్ 44 నాటౌట్; అజహరుద్దీన్ 67 నాటౌట్, యు«ద్వీర్ 2/61, సాహిల్ 2/50). -
Ranji Trophy: పారస్ డోగ్రా సెంచరీ... విజయం దిశగా జమ్మూ కశ్మీర్
పుణే: రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) జట్టు కేరళతో క్వార్టర్ ఫైనల్లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 180/3తో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ కశ్మీర్ జట్టు 100.2 ఓవర్లలో 399/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (Paras Dogra) (232 బంతుల్లో 132; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో చెలరేగగా... కన్హయ్య (64; 5 ఫోర్లు), సాహిల్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రోహన్ (36), ఆక్షయ్ చంద్రన్ (32 బ్యాటింగ్), కెప్టెన్ సచిన్ బేబీ (19 బ్యాటింగ్) తలా కొన్ని పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న కేరళ జట్టు విజయానికి ఇంకా 299 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం జమ్మూ కశ్మీర్‌కు అనుకూలంగా వస్తే చరిత్ర అవుతుంది. ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లవుతుంది. -
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలా ఉంటాయంటూ ఒమర్ అబ్దులా వ్యాఖ్యానించారు. రామాయణం వీడియోను ఆయన షేర్ చేశారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడిన కాంగ్రెస్.. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన ఆఖరి పోరాటం నిరాశే మిగిల్చింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారం చేసింది. కనీసం ఒక ఖాతా కూడా తెరవలేదు. 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆప్ షాక్ ఇచ్చింది. దీంతో ఒంటరి పోటీ విషయంలో కాంగ్రెస్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. -
Republic Day-2025: జమ్ము స్టేడియానికి బాంబు బెదిరింపు
శ్రీనగర్: నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు సన్నాహాలు జరుగున్నాయి. దీనిలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో జమ్ము పోలీసులకు ఎంఏఎం స్టేడియంపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్టేడియంలో అణువణువునా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కశ్మీర్ లోయలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె విర్ది మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయని అన్నారు.దేశవ్యాప్తంగా నేడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని భారత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతుంది.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘భారత్ కిరీటంలో రత్నం’
జౌన్పూర్ (యూపీ): Pakistan Occupied Kashmir)పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి (Rajnath Singh)రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. (Jammu Kashmir)జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకిస్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. జౌన్పూర్ జిల్లా నిజాముద్దీన్ పూర్ గ్రామంలో బీజేపీ సీనియర్ నేత జగత్ నారాయణ్ దూబే ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఆ దేశానికి ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే విదేశీ భూభాగం తప్ప మరేమీ కాదన్నారు. అక్కడ ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను కూల్చివేయాలని, లేదంటే తగిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పాక్ నేత అన్వర్ ఉల్హక్ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రక్షణ మంత్రి మండిపడ్డారు. మత ప్రాతిపదికన భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ప్రస్తుతం అత్యధికంగా 5జీని ఉపయోగిస్తున్న భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి
జమ్ముకశ్మీర్‌ను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. రాజౌరి జిల్లాలో వ్యాపించిన ఈ రహస్య వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 15కుపెరిగింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా జమ్మూలోని ఒక ఆసుపత్రిలో తొమ్మిదేళ్ల బాలిక అంతుచిక్కని రుగ్మతతో మరణించింది. దీంతో రాజౌరి జిల్లాలోని మారుమూల గ్రామమైన బాధల్లో గడచిన ఒకటిన్నర నెలల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగింది.గత ఏడాది డిసెంబర్ 7 నుండి..ఈ అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి పోలీసులు ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే బాధల్ గ్రామంలో మరణాలకు అంతుచిక్కని వ్యాధి కారణమనే వాదనను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ ఖండించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జబీనా అనే బాలిక బుధవారం సాయంత్రం మృతిచెందిందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో ఆమె నలుగురు తోబుట్టువులు, తాత కూడా మృతిచెందాడని వారు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 నుండి కోట్రాంకా సబ్ డివిజన్లోని బాధల్ గ్రామంలోని మూడు కుటుంబాల్లో ఇటువంటి పరణాలు సంభవించాయని తెలుస్తోంది.ప్రయోగశాలలకు నమూనాలుతాజాగా ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఐదుగురు మరణించారని తెలియగానే ఆరోగ్య శాఖ ఇంటింటికీ వెళ్లి 3,500 మంది నుంచి నమూనాలను తీసుకుని, వివిధ ప్రయోగశాలలకు పరీక్ష కోసం పంపిందన్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో మరో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి సహాయం కోరామన్నారు. దీంతో పలు వైద్య బృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు.11 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటుమరోవైపు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుధల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) వజాహత్ హుస్సేన్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు రాజౌరి ఎస్ఎస్పీ గౌరవ్ సికార్వర్ తెలిపారు. ఏదైనా వ్యాధి కారణంగా మరణాలు సంభవించినట్లయితే, అది వెంటనే వ్యాపించి ఉండేదని, అది ఆ మూడు బాధిత కుటుంబాలకే పరిమితమై ఉండేదికాదన్నారు. పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ) మైక్రోబయాలజీ విభాగం బాధితుల నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్? -
Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం
2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యకాలంలో మనం గడచిన ఏడాది మిగిల్చిన గురుతులను ఒకసారి నెమరువేసుకుందాం. ముఖ్యంగా 2024 ఎంతో ప్రత్యేకంగా నిలిచిన జమ్ముకశ్మీర్ గురించి చర్చిద్దాం.2024 అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార హోదాను దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అత్యధిక మెజారిటీతో కొత్త అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే పూర్తి రాష్ట్ర హోదా లేని కారణంగా ఈ ప్రభుత్వానికి మునుపటిలా అత్యధిక అధికారాలు లేవు. దీంతో పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడపడం ఒమర్ అబ్దుల్లాకు సవాల్‌గా మారింది. అయితే ఈసారి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలసిల్లింది.జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. 2024లో ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General election) గత 35 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. 58.46 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి, 63.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి వేర్పాటువాదులు, జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమాత్-ఎ-ఇస్లామీ నిషేధానికి గురైనా, దానికి మద్దతు పలికిన అభ్యర్థులు 10 స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో చాలామంది తమ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమాత్‌పై నిషేధం విధించారు.మరోవైపు జమ్ము డివిజన్లోని రియాసి, దోడా, కిష్త్వార్, ఉధంపూర్లలో పాకిస్తానీ ఉగ్రవాదులు(Pakistani terrorists) దాడులకు పాల్పడటం భారత భద్రతా ఏజన్సీల ఆందోళనను పెంచింది. జూన్ 9న రియాసిలో ఏడుగురు యాత్రికులు శివ్ ఖోరీ తీర్థయాత్ర నుండి బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అదేవిధంగా ఉధంపూర్, కిష్త్వార్లలో ముగ్గురు గ్రామ రక్షణ గార్డులు మృతిచెందారు. వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో 18 మంది భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు.రాబోయే 2025లో జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా సంస్థలు మరింత ఉత్సాహంగా పాక్ చొరబాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. 2019కి ముందున్న కాశ్మీర్ అందాలను కాపాడుతూ, ఇక్కడ అల్లరి మూకల హింసాకాండ చెలరేగకుండా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: 100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాక్ టెర్రరిస్ట్‌లు హతం
ఢిల్లీ : భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్తాన్ తీవ్ర వాదుల్ని హత మార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి ప్రతి ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టామని తెలిపారు. వారిలో అధిక శాతం(60) పాక్ ముష్కరులు ఉన్నట్లు నిర్ధారించారు.ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలు-జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతర ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారని డేటా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాలలో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు హతమార్చారు. నియంత్రణ రేఖ (Line of Control (LoC),ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ)17 మంది, జమ్మూకశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా భద్రత బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయి. జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని సంఖ్యలు సూచిస్తున్నాయి. స్థానిక ఉగ్రవాద సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్లో 60 ఉగ్రదాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారు. -
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీ (11 ఎంఎల్ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.🚨 SAD NEWS! 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector. Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care.PRAYERS 🙏 pic.twitter.com/oltXwzFCIH— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024 -
మళ్లీ ఓడిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో శనివారం దక్కన్ ఎరెనా మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్ 3–0తో తెలంగాణపై ఘనవిజయం సాధించింది. తెలంగాణ రక్షణ పంక్తి లోపాలను ఆసరా చేసుకొని కశీ్మర్ స్ట్రయికర్లు, మిడ్‌ఫీల్డర్లు పదేపదే గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళ్లారు. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే జమ్మూ కశీ్మర్ ఖాతా తెరిచింది. హయత్ బషీర్ (5వ ని.లో) చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం ఇదే స్కోరుతో ముగిసింది. ద్వితీయార్ధంలో అరుణ్ నగియల్ (74వ ని.), ఆకిఫ్ జావిద్ ( 88 వ ని.) స్వల్ప వ్యవధిలో చేసి గోల్స్‌లో జమ్మూ జట్టు 3–0తో తెలంగాణపై ఏకపక్ష విజయం సాధించింది. కశీ్మర్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి విజయం కాగా... నాలుగు మ్యాచ్‌లాడిన ఆతిథ్య తెలంగాణ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ గ్రూపు నుంచి సర్వీసెస్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ సరీ్వసెస్ 2–0తో రాజస్తాన్‌పై గెలుపొందింది. వరుసగా మూడు విజయాలతో నాకౌట్ చేరింది. రాజస్తాన్‌కు క్వార్టర్స్ చేరే అవకాశం మిగిలుంది. సోమవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో జమ్మూ కశీ్మర్‌పై గెలిస్తే రాజస్తాన్ నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. -
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం కద్దర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.Kulgam, Jammu and Kashmir: Encounter started between Security forces and militants in Kadder village of Behibagh, under the jurisdiction of Kulgam District, J&K. Heavy exchange of gunfire going on. Two terrorists are believed to be trapped pic.twitter.com/Etwtwlless— IANS (@ians_india) December 19, 2024‘ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన సమాచారం మేరకు కుల్గాం జిల్లా ఖాదర్‌లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఐదురుగు టెర్రరిస్ట్‌లు మృతి చెందగా.. ఇద్దరు భారత సైనికులకు గాయాలయ్యాయి’అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ విభాగం ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యంమరోవైపు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఏరివేత చేయడంలో భద్రతా బలగాలు కీలక ఆపరేషన్లు చేపట్టాయి. ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని గగాంగీర్, గందర్బల్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్ట్‌ను శ్రీనగర్ జిల్లాలో కాల్చి చంపారు.గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, ఖన్యార్ ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులను, అక్టోబర్ నెలలో కాశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో డాక్టర్, ఆరుగురు కార్మికులు మృతి చెందారు. టెర్రరిస్ట్‌ల కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్‌ను మట్టుబెట్టింది. -
SMT 2024: చెలరేగిన బౌలర్లు.. 32 పరుగులకే ఆలౌట్! టోర్నీ చరిత్రలోనే
సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 32 పరుగులకే కుప్పకూలింది.జమ్మూ బౌలర్ల దాటికి అరుణాచల్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేకపోయారు. జట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు.అరుణాచల్ సాధించిన 32 పరుగులలో 8 రన్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. జమ్మూ బౌలర్లలో స్పిన్నర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో అరుణాచల్ పతనాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌలర్లు అకీబ్ నబీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ పడగొట్టారు. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జమ్మూ ఫాస్ట్ బౌలర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్లకు జాక్‌పాట్ తగిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్ను రూ.30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.అరుణాచల్ చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన అరుణాచల్ ప్రదేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవలం 30 పరుగులకే ఆలౌటైంది.చదవండి: ICC Rankings: వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్‌కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
రణరంగంలా మారిన జమ్మూకశ్మీర్
-
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రసాభాస
-
Video: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly. ANY misadventure will get befitting reply! Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA's in their place. DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టుల కే సాత్ అంటూ నినాదాలు చేశారు. -
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
రాంబిల్లి (యలమంచిలి): దేశ రక్షణ రంగంలో జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన వీర జవాన్ హవల్దారు గంగిరెడ్ల శివశంకరరావు అంత్యక్రియలు గ్రామస్తులు, బంధువులు, తోటి ఆర్మీ అధికారుల అశ్రునయనాల మధ్య సోమవారం దిమిలి గ్రామంలో సైనిక లాంఛనాలతో ఘనంగా జరిగాయి. దిమిలి గ్రామానికి చెందిన గంగిరెడ్ల శివశంకరరావు ఈ నెల 1వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ శ్రీనగర్ వద్ద ఆర్మీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. జవాను భౌతికకాయాన్ని సోమవారం ఉదయం స్వగ్రామం దిమిలి తీసుకువచ్చారు. భౌతికకాయం ఉంచిన అంతిమయాత్ర రథాన్ని అచ్యుతాపురం ప్రధాన రహదారి గుండా వెంకటాపురం మీదుగా దిమిలి గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు, బంధువులు దారిపొడవునా పూలు చల్లుకుంటూ సుమారు 15 కిలోమీటర్ల వరకు ద్విచక్రవాహనాలతో జవాను అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శివశంకర్ భౌతికకాయం వద్ద ఆర్మీ అధికారులు, నేవీ సిబ్బంది జాతీయ పతాకం ఉంచి, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేసి ఘన నివాళులర్పించారు. శివశంకర్ చివరిసారిగా ధరించిన యూనిఫాం, జాతీయపతాకాన్ని భార్య కృష్ణవేణి (లక్ష్మి), తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు అందజేశారు. అనంతరం ఆర్మీ అధికారులు, సుబేదార్ సుజన్‌సింగ్, ఆనంద్‌సింగ్, ఎన్.ఎస్.రాజ్‌కుమార్, జి.యోగానంద్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు పరేడ్ నిర్వహించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. మృతిచెందిన జవాన్ శివశంకర్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తెలు జగదీశ్వరి, దివ్య, కుమారుడు యశ్వంత్, తండ్రి సన్యాసినాయుడు, తల్లి వరహాలు ఉన్నారు. ఆర్మీలో చేరి 23 సంవత్సరాలు గడిచి మరో ఏడాది సంవత్సరంలో హవల్దారుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్న దశలో శివశంకర్ ఆకస్మిక మృతి గ్రామస్తులను విషాదంలో ముంచింది. దసరా పండగకు స్వగ్రామం వచ్చి కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడిపి మేనకోడలి పెళ్లిని దగ్గర ఉండి జరిపించి మరలా విధులకు వెళ్లి రెండు వారాలు గడవక ముందే విగతజీవిగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య జవాన్ శివశంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల వైస్ ఎంపీపీ కొట్టాపు శ్రీలక్ష్మి , మాజీ సైనికోద్యోగి వడ్డీ కాసులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు, న్యాయవాది కరణం శ్రీహరి, గ్రామ పెద్దలు, మాజీ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. తొలి రోజే ఆర్టికల్ 370 రగడ
-
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..
-
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్
-
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్
-
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
అమిత్‌షాతో సీఎం ఓమర్ అబ్దుల్లా భేటీ.. రాష్ట్ర హోదాపై హామీ?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగాస్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్ భేటీలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
యాంటీ టెర్రర్ ఆపరేషన్.. కొత్తగా ఏర్పడిన ఉగ్ర సంస్థ విచ్ఛిన్నం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.శ్రీనగర్, గాందర్బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.టీఎల్ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్‌తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది. జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
ఇక సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం పోరాటం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.రాధా కుమార్ వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
-
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ విషెస్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. సురిందర్ కుమార్ చౌదరీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి జరగాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతేగాక ప్రమాణస్వీకారానికి ముందు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.చదవండి: J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్ <Congratulations to Shri Omar Abdullah Ji on taking oath as the Chief Minister of Jammu and Kashmir. Wishing him the very best in his efforts to serve the people. The Centre will work closely with him and his team for J&K's progress. @OmarAbdullah— Narendra Modi (@narendramodi) October 16, 2024ఇక జమ్ముకశ్మీర్ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇది. -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు. -
నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. బుధవారం శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించనున్నారు.పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తార ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎస్కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన ఐదుగురితో కలుపుకుంటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీ 40, భాగస్వామ్య కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. ఇవికాకుండా, ఒమర్ అబ్దుల్లాకు ఆప్ ఏకైక సభ్యుడు, ఐదుగురు ఇండిపెండెంట్లు మద్దతు పలికారు. -
జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఆప్ మద్దతు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది. కాగా మ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా గెలుపొందింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
పాకిస్తానీలకు ఇక్కడేం పని?
పాకిస్తాన్ అంటే భారత్‌కు ఎంత శతృదేశమో తెలియనిది కాదు. జమ్ము కశ్మీర్లో ఎడతెగని ఉగ్రవాదాన్ని నడిపిస్తోంది. దీంతో పచ్చని లోయ నెత్తుటి మడుగులా మారింది. దేశంలో పేలుళ్లకు తరచూ కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో బెంగళూరులోను, రాష్ట్రంలోను పాకిస్తానీలు పట్టుబడడం చర్చనీయాంశమైంది.బనశంకరి: గత కొద్దిరోజులుగా బెంగళూరులోని జిగిణిలో అక్రమంగా మకాం వేసిన ఏడుమంది పాకిస్తాన్ పౌరులను పోలీసులు కనుగొని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బెంగళూరు, దావణగెరె ప్రాంతాల్లో మరికొందరు పాకిస్తానీలను నిర్బంధించారు. తాజాగా దాడులు నిర్వహించి బుధవారం మరో 14 మంది పాకిస్తాన్ పౌరులను జిగిణి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుతో సహా ఉత్తర కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి దొరికిన పాకిస్తానీల సంఖ్య 22కు పెరిగింది.మత ప్రచారం పేరుతోభారత్లో, అందులోనూ కన్నడనాట పాకిస్తాన్ పౌరులు పెద్దసంఖ్యలో తలదాచుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు వారిని లోతుగా విచారించి సమాచారం రాబడుతున్నారు. వీరందరూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మకాం పెట్టారు. ఈ కేసు కింగ్‌పిన్, మెహదీ ఫౌండేషన్ ముఖ్యుడు పర్వేజ్ ఢిల్లీలో అరెస్ట్ కాగా, అతని నుంచి పోలీసులు పాకిస్తాన్ పౌరుల గురించి ఆరా తీస్తున్నారు. జిగిణిలో పాకిస్తాన్ పౌరులు అరైస్టెన వెంటనే మరింత దర్యాప్తు కోసం 4 బృందాలను ఏర్పాటుచేసి వివిధ రాష్ట్రాలకు పంపించారు. చైన్నె, ఢిల్లీ, హైదరాబాద్ కు తరలిన పోలీసులు బృందం మెహదీ ఫౌండేషన్‌తో టచ్‌లో ఉన్న 22 మందిని అరెస్ట్ చేశారు. అరైస్టెన పాకిస్తాన్ పౌరులందరూ మత ప్రచారం కోసం భారత్ కు దొంగచాటుగా వచ్చి వివిధ రాష్ట్రాల్లో మకాంపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. వీరు స్థానికుల పేర్లతో ఆధార్, రేషన్ తదితరాలను తీసుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలున్నాయి.బయటకు రాకుండా ఇంట్లోనేపీణ్యాలో నివాసం ఉండే పాకిస్తాన్ దంపతులను పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఈ దంపతులు మూడేళ్ల నుంచి పీణ్యా ఆంధ్రహళ్లి మెయిన్‌రోడ్డులోని ఇంట్లో రహస్యంగా మకాం వేసినట్లు తెలిసింది. బయటికి రాకుండా ఇంట్లోనే గడిపేవారు. పేర్లు కూడా మార్చుకున్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఎందుకు ఉంటున్నారు? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 2019లో బెంగళూరు నగరానికి చేరుకున్న పాకిస్తానీ సయ్యద్, అతని కుటుంబం మతప్రచారం చేస్తున్నారు. అంతకు ఐదేళ్ల కిందటే భారత్‌లోకి చొరబడ్డారు. యూట్యూబ్‌లో మత ప్రచార కార్యక్రమాలు పోస్టు చేసేవారు. నకిలీ పేర్లతో అందరూ ఆధార్‌కార్డు తయారు చేసుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ పాకిస్తాన్ పౌరులు కుటుంబం బెంగళూరులో నివాసం ఉన్నట్లు తెలిసి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. మిగిలిన పాకిస్తానీల ఆచూకీ కనిపెడతామని, ఈ విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైందని ఆరోపించారు. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్‌కు గురయ్యారు. కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
ఎన్నికల్లో నెగ్గిన ఉగ్రవాద బాధితురాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఏకైక మహిళా అభ్యర్థి షగున్ పరిహర్(29) విజయం సాధించారు. కిష్్టవార్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్అభ్యర్థి, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై 521 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. పరిహర్కు 29,053, కిచ్లూకు 28,532 ఓట్లు లభించాయి. కిష్టవార్ స్థానం కిచ్లూ కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గం. ఇక్కడ కిచ్లూ రెండుసార్లు, ఆయన తండ్రి మూడుసార్లు గెలిచారు. అయినప్పటికీ ఈసారి కిచ్లూను పరాజయం పలుకరించింది. ఉన్నత విద్యావంతురాలైన షగున్ పరిహర్ ఉగ్రవాద బాధితురాలు. 2018 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఆమె తండ్రి అజిత్ పరిహర్, చిన్నాన్న అనిల్ పరిహర్ ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పరిహర్ బీజేపీ జిల్లా నేతగా చురుగ్గా పనిచేశారు. తన గెలుపు జమ్మూకశీ్మర్ ప్రజలకే చెందుతుందని షగున్ పరిహర్ అన్నారు. -
కాశ్మీర్ లో కూటమి కింగ్.. ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ
-
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
జమ్మూకశ్మీర్ ఫలితంపై ఫరూక్ అబ్దుల్లా హర్షం
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం
-
కశ్మీర్ మూడో విడత పోలింగ్‌లో 68 శాతం ఓటింగ్
జమ్మూ/శ్రీశ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడో విడతలో మంగళవారం జరిగిన పోలింగ్‌లో 68.72 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు మించి జనం ఓటేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లో 66.78% ఓటింగ్ నమోదైంది. ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించే బారాముల్లా, సొపోర్ అసెంబ్లీ స్థానాల్లో 30 ఏళ్లలోనే అత్యధికంగా ఈసారి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఈసీ తెలిపింది.అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జమ్మూకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అత్యధికంగా సాంబాలో 73.45%, ఉధంపూర్‌లో 72.91% మంది ఓటేయగా, కథువా లో 70.53%, జమ్మూలో 66.79%, బందిపొరాలో 64.85%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.జమ్మూ జిల్లాలోని ఛాంబ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వివరించింది. సొపోర్ నియోజకవర్గంలో 41.44%, బారాముల్లా అసెంబ్లీ స్థానంలో 47.95% మంది ఓటు వేశారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని ఈసీ తెలిపింది. గతంలో ఇక్కడ తరచూ ఎన్నికలను బహిష్కరించే ఆనవాయితీ నడిచిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఓటింగ్ శాతం 63.45 అని ఈసీ పేర్కొంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, రీపోలింగ్ అవసరం కూడా లేదని వివరించింది. ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
Jammu and Kashmir Assembly Polls: సాయంత్రం 5 గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడవ, చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అత్యంత ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాలకు చెందిన 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదైంది. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91%, సాంబా (72.41%), కథువా (70.53%), జమ్ము (66.79%), బండిపోరా (63.33%), కుప్వారా (62.76%), బారాముల్లా (55.73%) పోలింగ్ నమోదైంది.నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబ్ మొదటి 10 గంటల్లో 77.35% పోలింగ్‌తో ముందంజలో ఉంది. ఒకప్పుడు తీవ్రవాద, వేర్పాటువాదుల కోటగా ఉన్న సోపోర్ సెగ్మెంట్లో అత్యల్పంగా 41.44% పోలింగ్ నమోదైంది.#JKAssemblyPolls2024Voting percentage upto 05:00 pm for #PhaseII: 65.48%#NoVoterToBeLeftBehind #IVote4Sure #Trends #MyVoteMyPride pic.twitter.com/FCPCPnohga— CEO UT OF J&K (@ceo_UTJK) October 1, 2024జమ్ము కశ్మీర్ చివరి దశ పోలింగ్: మధ్యాహ్నం 1 గంట వరకు 44 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు 28.12 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఉదంపూర్‌లో 33.84 శాతం ఓటింగ్ నమోదైంది. బారాముల్లాలో 23.20 శాతం ఓటింగ్ నమోదైంది. #WATCH | Baramulla, J&K: National Conference candidate from Sopore, Irshad Rasool Kar casts his vote in the third and the last phase of Assembly elections today pic.twitter.com/DIbJ3iHvqQ— ANI (@ANI) October 1, 2024జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తుదివిడత పోలింగ్‌లో మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజానికి చెందినవారు, గూర్ఖా కమ్యూనిటీవారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.#WATCH सांबा: जम्मू-कश्मीर विधानसभा चुनाव के तीसरे चरण का मतदान शुरू हो गया है। लोग भारी संख्या में मतदान करने के लिए पहुंच रहे हैं। वीडियो सांबा के एक मतदान केंद्र से है। pic.twitter.com/iyDIei160g— ANI_HindiNews (@AHindinews) October 1, 2024శాంతియుతంగా ఓటింగ్ జరిగేందుకు పోలింగ్ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము రీజియన్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 61.38 శాతం పోలింగ్ నమోదుకాగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయ్యింది. నేడు జరగనున్న తుదివిడత ఎన్నికల్లో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల 1.94 లక్షల మంది యువకులు, 35,860 మంది వికలాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన 32,953 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక -
ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్ కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మోదీకి తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్ కీ బాత్ గురించి మాట్లాడరని విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతండటంతో ప్రధాని మోదీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. భారత కూటమి, కాంగ్రెస్‌లు మోదీ సైకాలజీని మార్చేశాయని అన్నారు.‘ఈ రోజుల్లో ప్రధాని మోదీ ముఖం మారిపోయింది, ఆయన మూడ్ మారిపోయింది. దీనికి కారణం భారత కూటమి, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలే. ప్రధాని, బీజేపీ విభజన రాజకీయాలు వ్యప్తి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని వ్యాపింపజేశారు. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. చదవండి: సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విద్యావంతులకు ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇది నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన బహుమతి’ అంటూ సెటైర్లు వేశారు. జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అర్హులని అన్నారు. కాగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరగ్గా, రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. -
ఆ మూడు కుటుంబాల పాలన అంతమే ఈ ఎన్నికలు: అమిత్ షా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు.ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో శనివారం కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూలో మూడు కుటుంబాలు (గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా)హింసను ప్రేరేపించాయని, కాబట్టి ఆ మూడు పార్టీల (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.‘1947 నుంచి పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ జమ్ము సైనికులు భారత్‌కు రక్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దైర్యసాహాలు ప్రదర్శించి బుల్లెట్లను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యువతకు రాళ్లు, తుపాకులు బదులు పెన్నులు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లను ఏర్పాటు చేస్తాం.जम्मू-कश्मीर के मेंढर की जनसभा में लोगों का उत्साह बता रहा है कि यहाँ भाजपा की जीत सुनिश्चित है। https://t.co/7gGuXRtocV— Amit Shah (@AmitShah) September 21, 2024మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీలు, వెనుకబడిన తరగతులు, గుజ్జర్ బకర్వాల్లు, పహారీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఆ బిల్లును నేను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఫరూక్ అబ్దుల్లా పార్టీ దానిని వ్యతిరేకించి ఇక్కడి గుజ్జర్ సోదరులను రెచ్చగొట్టడం చేశారు. అప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాను. గుజ్జర్-బకర్వాల్ సోదరుల రిజర్వేషన్లను తగ్గించకుండా కొండ ప్రాంత ప్రజలకు.. ఆ హామీని నెరవేర్చాం’అని పేర్కొన్నారు.जम्मू-कश्मीर का ये चुनाव, यहाँ तीन परिवारों का शासन समाप्त करने वाला चुनाव है। अब्दुल्ला परिवार, मुफ्ती परिवार और नेहरू-गांधी परिवार... इन तीनों परिवारों ने यहां जम्हूरियत को रोक कर रखा था। अगर 2014 में मोदी सरकार न आती तो पंचायत, ब्लॉक, जिले के चुनाव नहीं होते: श्री @AmitShah…— Office of Amit Shah (@AmitShahOffice) September 21, 2024 కాగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్ నిర్వహించగా.. రెండో దశ సెప్టెంబరు 25న, చివరిదశ అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. -
జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం ఎవరికో.. కశ్మీర్లో కదం తొక్కిన ఓటర్లు (ఫొటోలు)
-
జమ్మూ కశ్మీర్ లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్
-
ఉగ్రవాదం అంతమే లక్ష్యం : అమిత్‌షా
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఈ సందర్భంగా మొదటి దశ ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిష్త్వార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌ను తిరిగి తీవ్రవాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తీవ్రవాదంపై అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఉగ్రవాదులు,దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచి పెట్టాలని యోచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ప్రాంత అమరవీరుల్ని స్మరించుకుంటూ.. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని హామీ ఇస్తున్నాను’అని అన్నారు.ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పునరుద్ఘాటించారు. కాగా,జమ్మూ కశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. VIDEO | "Today, I remember all the martyrs from this region and make a promise before you, that we will end terrorism in such a way that it will never rise again. There are efforts being made to support terrorism here again. The NC and Congress have even made promises that if… pic.twitter.com/cZi1Zacljs— Press Trust of India (@PTI_News) September 16, 2024ఇదీ చదవండి : సందీప్ ఘోష్ ఓ అబద్ధాల పుట్ట.. -
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సెగ
-
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతిఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024 -
Jammu and Kashmir: 42 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాకు ప్రధాని మోదీ
పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ సిద్ధమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరగనున్న ఈ ఎన్నికల పోరుకు అన్ని పార్టీలు వ్యూహరచనల్లో తలమునకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగింది.కాగా జమ్ముకశ్మీర్‌లో కమలం వికసించేలా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ నుంచి ఎన్నికల సందడి చేస్తున్నారు. నేడు(శనివారం) ఉదయం 11 గంటలకు దోడాలో జరిగే ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జమ్ములో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎన్నికల ర్యాలీ శాంతియుతంగా, సజావుగా జరిగేందుకు దోడా, కిష్త్వార్ జిల్లాల వ్యాప్తంగా బహుళ అంచెల భద్రతను మోహరించారు. అయితే గత 42 ఏళ్లలో దోడాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1982లో దోడాలో ప్రధానమంత్రి పర్యటించారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
జమ్ముకు పర్యటకులు ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ -
Haryana: ఆసక్తికరమైన పోరు
జమ్మూ– కశ్మీర్లో తొలి విడత పోలింగ్‌కు మరొక్క వారమే మిగిలింది. హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రచారం ఊపందుకుంటుంటే, హర్యానాలో అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరింది. కశ్మీర్‌ను అటుంచితే... కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటు విఫలమవడంతో హర్యానా ఆసక్తి రేపుతోంది. బహుముఖ పోటీ అనివార్యమయ్యేసరికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఆప్ ఒంటరి పోరుకు దిగడమే కాక, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కలాయత్ లాంటి చోట్ల గెలిచిన ఊపుతో, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపి, పట్టణ ప్రాంతాలకే కాక మిగతా చోట్లకూ తన ఉనికిని విస్తరించు కోవాలని సాహసిస్తోంది. వీధికెక్కి పోరాడినా, లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించని కేంద్ర సర్కార్ వైఖరితో విసిగిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్రంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మహిళా రెజ్లర్లపై జనంలో సానుభూతి, పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఆగ్రహం, జాట్లు సహా వివిధ వర్గాల్లో అసంతృప్తి మధ్య అధికార బీజేపీ ఎదురీదుతోంది.మొత్తం 90 స్థానాలకు గాను కాషాయపార్టీ ఇప్పటికే 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా 3 స్థానాలను హర్యానా లోక్‌హిత్ పార్టీ (హెచ్ఎల్పీ) లాంటి చిరు మిత్రపక్షాల కోసం అట్టి పెట్టింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే అసంతృప్తి జ్వాలలు రగిలినా, రెండో విడత జాబితా కూడా ప్రకటించేసరికి అది మరింత పైకి ఎగసింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ, మాజీ మంత్రులకూ టికెట్లు నిరాకరించేసరికి సమస్య పెద్దదైంది. పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్ల మొదలు పలువురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హర్యానా శాఖ వైస్ ప్రెసిడెంటైన మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కొందరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ టికెట్ దక్కలేదని కినుక వహించి, పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసలైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి, పనిచేయనివారికీ, అసలు ఆ నియోజకవర్గ పౌరులే కానివారికీ సీట్లు కేటాయిస్తోందని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. నిజానికి ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన నయబ్ సైనీని కొంతకాలం క్రితం సీఎంను చేశాక హర్యానాలో పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది. ఇప్పుడూ సైనీనే సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ఎన్నికలకు వెళుతోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగిపోయిందని చెబుతున్నారు. ఏళ్ళ తరబడిగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కొత్తవారికీ, ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికీ బీజేపీ పట్టం కట్టడం సైతం రేపు ఎన్నికల్లో పార్టీని కొంత దెబ్బ తీయవచ్చు. దానికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆశావహ సీఎం అభ్యర్థుల తాకిడి ఉండనే ఉన్నాయి. పదేళ్ళుగా అధికారంలో కొనసాగాక బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చిత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి, వరు సగా మూడోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కాషాయపార్టీకి ఇప్పుడది సులభం కాకపోవచ్చు. కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలంటే ఎక్కడైనా అధికార పక్షం పట్ల వ్యతిరేకత సహజం. బీజేపీలోని వర్గవిభేదాలు, రైతులు – జాట్ల లాంటి వర్గాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లో దాని పట్ల అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలసి అక్టోబర్ 8న పోలింగ్‌లో విపక్షానికి అనుకూలించవచ్చు.లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళి, ప్రాథమిక ఒపీనియన్ పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు కొంత అనుకూలత కనిపిస్తోంది. కానీ, అంతర్గత విభేదాలు ఆ పార్టీనీ పీడిస్తున్నాయి. స్వతంత్రు లుగా బరిలోకి దిగే అసమ్మతులతో అన్ని పార్టీలకూ చిక్కే. మరోపక్క ఎన్నికలిప్పుడు బీజేపీ,కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ కావడంతో అధికారపక్ష వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుంది, అది బీజేపీకి ఎంత మేర లాభిస్తుంది అన్నది ఆసక్తికరం. గతంలోకి వెళితే –∙2019 ఎన్నికల్లో హర్యా నాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంతకు పదేళ్ళ ముందూ అలాగే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీల వారు, స్వతంత్రులు కీలకమవుతారు. ఈ ‘ఇతరులు’ పాతికేళ్ళ క్రితం 30 శాతం ఓట్లు సాధిస్తే, క్రితంసారి అది 18 శాతానికి పడిపోయింది. అయితేనేం, ప్రతిసారీ వారు 8 నుంచి 16 సీట్ల మధ్య గెలుస్తున్నారని మర్చిపోలేం. 2009లో కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కింది. 2019లో బీజేపీ సైతం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో ఎన్నికల అనంతర పొత్తుతోనే అధికారం చేపట్టింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇతరుల’కు 8 శాతం ఓట్లే వచ్చినా, స్థానిక అంశాలు ప్రధానమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్ర గణనీయమవుతుంది. కాకపోతే, స్థానికమైన జేజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని తన పట్టును నిలుపుకోలేకపోతోందనీ, సాంప్ర దాయిక రైతు ఓటర్లున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) బలం ప్రస్తుతం కొద్ది స్థానాలకే పరిమితమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న నిరుద్యోగం, లోపించిన పారిశ్రామికీకరణ, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అంశాలు బీజేపీని వెనక్కి లాగుతున్నాయి. హర్యానా జనాభా 20 శాతం దళితులే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారిలో 68 శాతం మంది, అలాగే సగానికి పైగా ఓబీసీలు ‘ఇండియా’ కూటమికి మద్దతునిచ్చినట్టు విశ్లేషణ. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగి, జాట్లు సహా ఇతర చిరకాల సమర్థక వర్గాల నుంచి విపక్షానికే మద్దతుంటే... అధికార పక్షా నికి చిక్కులు తప్పకపోవచ్చు. నిరుడు కర్ణాటక లానే ఇప్పుడు హర్యానాలో బీజేపీకి శృంగభంగం జరగవచ్చు. అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠకు పెనుసవాలుగా మారింది అందుకే! -
బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్ రషీద్.. మోదీపై పోరాటం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు రషీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ 2 వరకు బెయిల్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ‘అయిదున్నర సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత.. నన్ను నేను బలంగా భావిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గ ప్రజల గురించి గర్వపడుతున్నాను.నా ప్రజలను ఎప్పుడూ నిరాశపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఘోరంగా విఫలమైన మోదీ 'నయా కాశ్మీర్' కథనంపై పోరాడతాను. ఆగస్ట్ 5, 2019న ఆయన ఏం చేసినా (ఆర్టికల్ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని రషీద్ పేర్కొన్నారు.VIDEO | Lok Sabha MP from Jammu and Kashmir's Baramulla Engineer Rashid walks out of Tihar Jail, a day after he was granted interim bail in a terror funding case."After remaining in jail for 5.5 years, I feel myself stronger and proud of my people. I take a pledge that I will… pic.twitter.com/SdsIc9vsu0— Press Trust of India (@PTI_News) September 11, 2024మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్ తెలిపారు. ‘ఆయన (ఒమర్ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసమని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. తాను బీజేపీ బాధితుడినని, చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.కాగా 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019 నుంచి రషీద్ జైలులోనే ఉన్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్.. ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
‘ఈ పదేళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే!’
జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి అధికరణ 370.. కనుమరుగైన చరిత్ర అని, అది ఎన్నటికీ మళ్లీ తెర మీదకు రాబోదని బీజేపీ సీనియర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండబద్ధలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారాయన.భారత దేశ చరిత్ర.. అందులో జమ్ము కశ్మీర్‌కంటూ కొన్ని పేజీలుంటే 2014-2024 మధ్య పాలనను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. కానీ, ఒక్క విషయం స్పష్టం చేయదల్చుకున్న. ఆర్టికల్ 370 ఎన్నటికీ తిరిగి రాదు. అది గతించిన అధ్యాయం అని అన్నారాయన.బీజేపీ పాలనకు ముందు జమ్ము కశ్మీర్ ఎలా ఉండేదో దేశం మొత్తానికి తెలుసు. 2014 దాకా ఉగ్రవాదంతో పాటు వేర్పాటువాదం ఇక్కడ రాజ్యమేలేవి. ఇక్కడి పరిస్థితులను కొందరు అవకాశవాద రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. కానీ, బీజేపీ పదేళ్ల పాలనలో ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా కట్టడి అయ్యాయి అని పేర్కొన్నారు. 1947 నుంచే జమ్ము కశ్మీర్ మా హృదయాలకు దగ్గరగా ఉండేది. ఇది ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే. ఇక్కడ శాంతి స్థాపనే మా ముందున్న లక్ష్యం. వచ్చే ఐదేళ్ల కోసం ప్రభుత్వ ఏర్పాటునకు మాకు ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో జమ్మును చేరుస్తాం అని అని అమిత్ షా ప్రసంగించారుబీజేపీ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..జమ్ము కశ్మీర్ రాజౌరిలో టూరిస్ట్ హబ్ ఏర్పాటు. తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పన.తికా లాల్ తప్లూ విస్తాపిత్ సమాజ్ పురన్వాస్ యోజన (TLTVPY) పేరిట కశ్మీర్ పండిట్లను సురక్షితంగా వెనక్కి రప్పించడం.. వాళ్లకు భద్రత కల్పించడంజమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం సమూల నిర్మూలన.. అందుకు సంబంధించి శ్వేత పత్రం విడుదలUnion HM #AmitShah unveils J&K BJP manifestoWe have taken a lot of resolutions in J&K Sankalp Patra. However, I would like to say that our biggest resolution is 'Surakshit, Viksit aur Samrudh J&K ka nirman karna...': Union HM @AmitShah#SankalpPatra #AmitShah #BJP pic.twitter.com/73x1RIXGlT— TIMES NOW (@TimesNow) September 6, 2024 BJP's promise for a new Jammu-Kashmir.Additional coverage of Rs 2 lakhs under Ayushman Bharat Yojana. #BJPJnKSankalpPatra pic.twitter.com/ENCMpQUkb8— BJP (@BJP4India) September 6, 2024 BJP's promise for a new Jammu-Kashmir.Threefold increase in old age, widow and disability pensions. #BJPJnKSankalpPatra pic.twitter.com/1KG4CWszpO— BJP (@BJP4India) September 6, 2024కూటమిపై విసుర్లుఅదే సమయంలో.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌వి అవకాశవాద రాజకీయమని షా మండిపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోను ప్రస్తావించిన ఆయన.. ఒక రాజకీయ పార్టీ అలాంటి మేనిఫెస్టో ఎలా పెడుతుంది?. దానికి కాంగ్రెస్‌లాంటి జాతీయ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది?. ఈ విషయంలో రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలి.. అని కోరారాయన.ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
J&K: 30 ఏళ్లలో తొలిసారి.. అసెంబ్లీ బరిలో మహిళా కాశ్మీరీ పండిట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.అయితే జమ్మూకశ్మీర్‌లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్ల విషయంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్లు ఉన్నారు.మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం
జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం శ్రీకారం చుట్టారు. బనిహాల్, దూరూ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విపక్షాల ‘ఇండియా’కూటమి సాయంతో జమ్మూకశీ్మర్ రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తాం. తమ కూటమి వచ్చే నెలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది’’అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో నేషనల్ కాన్ఫెరెన్స్ పారీ్టతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం తెల్సిందే. దూరూలో జరిగిన సభలో ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 8వ తేదీల్లో మూడు దశల్లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే. 2019 ఆగస్ట్‌లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. ‘‘ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఆధునిక భారతదేశ చరిత్రలో కేంద్రపాలిత ప్రాంతాలు సైతం రాష్ట్రహోదా సాధించాయిగానీ ఏ రాష్ట్రం కూడా తన రాష్ట్రహోదాను కోల్పోలేదు. రాష్ట్రహోదాను మాత్రమే పునరుద్దరిస్తే సరిపోదు. ఇక్కడి ప్రజల హక్కులను పునరుద్ధరించాలి. స్వాతం్రత్యానికి పూర్వం రాజుల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండేవారు. అలాగే ఇప్పుడూ ఇక్కడ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ 21వ శతాబ్దపు రాజుగా పాలిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంత ప్రజలుగా ఇక్కడి స్థానికులకు దక్కాల్సిన ప్రయోజనాలు, ఉద్యోగాలు, కాంట్రాక్టులను ఆయన బయటి వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు’’అని ఆరోపించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయసు మినహాయింపును 40 దాకా పెంచుతాం. రోజువారీ వేతనాలను క్రమబద్దీకరిస్తాం. అధిక విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం’అని అన్నారు. కన్యాకుమారి నుంచి కశీ్మర్‌కు తాను చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచి్చన ‘‘విద్వేష మార్కెట్లలో ప్రేమ దుకాణాలను తెరుద్దాం’నినాదాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు. మత రాజకీయాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్‌తో దోస్తీ జమ్మూకశీ్మర్‌లో బీజేపీ మత, విభజన రాజకీయాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్‌తో జట్టుకట్టామని నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీఏ మిర్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీలో ఫరూక్ అబ్దుల్లా ఓటర్లనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘పోటీలో ఉన్నది ఎన్సీ అభ్యర్థా కాంగ్రెస్ అభ్యర్థా అనేది చూడకండి. మాలాగే మీరు కూడా చేయిచేయి కలిపి అందరం విభజన శక్తులపై పోరాటం చేద్దాం’’అని అన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురి ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గురువారం కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా బలంగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.‘ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అదించింది. దీంతో 28, 29 తేదీల్లో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా మచల్, కుప్వారా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాం. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కదలికలుపై కాల్పులు జరిపాం. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు’ అని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొంది.OP PHILLORA, TANGDHAR #Kupwara Based on intelligence inputs regarding likely infiltration bids, a Joint anti-infiltration Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 28-29 Aug 24 in general area Tangdhar, Kupwara. One terrorist is likely to… pic.twitter.com/R2N6ql2NgM— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 29, 2024 ఇవాళ ఉదయం కుప్వారా మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కర్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.J-K: One terrorist likely killed in anti-infiltration Op in KupwaraRead @ANI Story | https://t.co/R5Q1x1r2rp#Infiltration #Kupwara #IndianArmy pic.twitter.com/8aJvooyP4i— ANI Digital (@ani_digital) August 29, 2024 -
RaGa: మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్‌ను పాలించాలనుకోవడం అవివేకమన్నారు. గత వారం ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా విద్యారి్థనులతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు ఇక రాహుల్‌గాంధీ నిత్యం ఎదుర్కొనే అత్యంత పెద్ద ప్రశ్నను విద్యారి్థనుల నుంచి మరోసారి ఎదుర్కొన్నారు. సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి గురించి విద్యార్థులను ఆయన అడగ్గా.. వెంటనే వారు రాహుల్‌ను అదే ప్రశ్న అడిగారు. అయితే తాను 20, 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా ఆ ఒత్తిడిని అధిగమించానని చె ప్పారు. పెళ్లి చేసుకుంటారా? అని మరో విద్యారి్థని అడగ్గా.. ‘ఇప్పటికైతే ఆలోచన చేయలేదు.. భవిష్యత్‌లో చెప్పలేను’అని సమాధానమిచ్చారు. చేసుకుంటే మాత్రం మమ్మల్ని ఆహ్వానించండంటూ విద్యార్థినులంతా ఒకేసారి కోరారు. ‘తప్పకుండా’అని చెప్పడంతో విద్యార్థుల నవ్వులతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదాను తొలగించడం భారత చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. అది చేసిన విధానం తమకు నచ్చలేదని, రాష్ట్ర హోదాను తిరిగి పొందడం, అందులో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు ప్రాతినిధ్యం ఉండటం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ను, జమ్మూను నడపాలనుకోవడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినరు. మొదటి నుంచి తాము చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అదే అసలు సమస్య. తనది తప్పని చూపించినా ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అనుకోవడం బలం కాదు.. బలహీనత. ఆత్మన్యూనత నుంచే ఇలాంటివి వస్తాయి’’అని రాహుల్ విద్యార్థులతో వ్యాఖ్యానించారు. The women of Kashmir have strength, resilience, wisdom and a whole lot to say. But are we giving them a chance for their voices to be heard? pic.twitter.com/11Te8MM5fH— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2024యూట్యూబ్ ఛానల్లో వీడియో... ఇదే వీడియోను రాహుల్‌గాంధీ తన వ్యక్తిగత యూట్యూబ్ చానల్లోనూ పోస్టు చేశారు. వివిధ కళాశాలల్లో లా, ఫిజిక్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తాను లోతుగా అర్థం చేసుకున్నానని రాహుల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళలపై వేధింపుల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడానని, ఇటువంటి ఘటనలు వ్యవస్థాగత సమస్యలను ఎలా ప్రతిబింబిస్తాయి, ప్రాంతాలకతీతంగా మహిళల భద్రత, గౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకున్నారని వెల్లడించారు. కశీ్మర్ మహిళలకు గొప్ప శక్తి, నిలదొక్కుకునే ధైర్యం, వివేకం ఉన్నాయని, ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతారని కొనియాడారు. వారికి గౌరవం, భద్రతతోపాటు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు. -
‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్‌గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్)లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీసుల్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ను అమలు చేయడం తెలిసిందే. సోమనాథన్ కమిటీ సూచనలతో..మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్పీఎస్పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డీఏ ఆధారిత పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పారీ్టల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్‌ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి, దానికి చేయాల్సిన మార్పుచేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత: మోదీ యూపీఎస్‌తో ప్రభుత్వోద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బాక్సు యూపీఎస్ విశేషాలివీ... 👉 అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సరీ్వసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. 👉అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సరీ్వసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కలి్పస్తుంది. 👉 అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్‌లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్తగా ఏకమొత్త ప్రయోజనం 👉 ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం. 👉 సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. 👉ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు. 👉 ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. 👉 యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందన్నారు. 👉 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. బాక్సు కేబినెట్ ఇతర నిర్ణయాలు బయో ఈ–3, విజ్ఞాన్ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విజ్ఞాన్ధారలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నొవేషన్లకు సంబంధించి మూడు ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచి్చంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి రూ.10,579 కోట్లు కేటాయించారు. బయో ఈ–3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయో టెక్నాలజీకి మరింత ప్రోత్సహమందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. విజ్ఞాన్‌ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్‌ను ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు. -
J&K Assembly Polls: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఎన్సీతో పొత్తు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఎలాగైనా బీజేపీని అడ్డుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పొత్తు, సీట్ల షేరింగ్‌పై కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంపై నేనషల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టతనిచ్చాడు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్లేందుకు రెండు పార్టీలు అంగీకరించాయని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న పర్యటించారు. శ్రీనగర్‌లో పార్టీ శ్రేణులతో వీరు సమావేశం అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలోనూ సమావేశమై పొత్తుల విషయాలు చర్చించారు. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని చూస్తుండగా.. జమ్మూ డివిజన్లో ఎన్సీకి 12 సీట్లను ఆఫర్ చేసినట్లు సమాచారంఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. జమ్మూలోని డివిజన్లోని రెండు లోక్‌సభ స్థానం, లఢక్‌లోని ఒకస్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేసింది. కశ్మీర్‌లోని మూడు స్థానాల నుంచి ఎన్సీ మూడు అభ్యర్ధులను నిలబెట్టింది. ఎన్సీ రెండు చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఓటమి చెందిందిఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జమ్ముకశ్మీర్‌కు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్ము డివిజన్లో 43 స్థానాలు, కశ్మీర్ డివిజన్లో 47 సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న.. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. -
J&K: అసెంబ్లీ ఎన్నికల ముందు.. పీడీపీ పార్టీకి కీలక నేత రాజీనామా
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం మెహబూబాఫ్తీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నేతృత్వంలోని జమ్మకశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను పీడీపీ నుంచి వైదొలిగినట్లు సుహైల్ బుఖారీ వెల్లడించారు. అందుకు గల కారణాలను ఆయన వివరించలేదు.అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సుహైల్ బుఖారీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగూరా-క్రీరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు, అయితే గత నెలలో మాజీ మంత్రి బషారత్ బుఖారీ తిరిగి పీడీపీలోకి రావడంతో ఆయనకు వాగూరా-క్రిరీ టికెటు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సుహైల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.జర్నలిస్టు అయిన సుహైల్ బుఖారీ.. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఆయన సన్నిహితుడు. ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సలహాదారుగా కూడా పనిచేశారు. -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...?
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధావులు, జాతీ యవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లా డుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటు న్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్య టించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు.2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే శాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదా రులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరు ద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తు న్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయ మని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫ ల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాల నను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగి పోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబు తున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వస తులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తు న్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రా యంతో ఆరోపిస్తున్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియ మిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వ కేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు.‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపు తున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవు తోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరు తున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించు కోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబు తున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్ను కోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావా లనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.– జి. మురళీకృష్ణ, వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ ఒకరు మృతిచెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ సైనికులపై దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు అందుకు ధీటుగా సమాధానమిచ్చాయి. డూడూ ప్రాంతంలోని చీల్లో ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. #WATCH जम्मू-कश्मीर: उधमपुर के दूदू इलाके में तलाशी अभियान जारी है।आज सुबह दूदू इलाके के चील में आतंकवादियों और सुरक्षा बलों के बीच हुई गोलीबारी में CRPF के एक इंस्पेक्टर की मौत हो गई।(वीडियो वर्तमान समयानुसार नहीं है) pic.twitter.com/f44WSoYbRU— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 ఈ ఎన్కౌంటర్ గురించి ఉధంపూర్ డీఐజీ రయీస్ మహ్మద్ భట్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ టీమ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఒక సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారని, ఈ దాడిలో మరో సీఆర్పీఎఫ్ అధికారి గాయపడ్డారని తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇటీవలి కాలంలో జమ్మూ పరిధిలోని పీర్ పంజాల్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఉగ్ర దాడులతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీర్ పంజాల్‌లోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. #WATCH जम्मू-कश्मीर: दूदू में आतंकवादियों के साथ मुठभेड़ में CRPF के एक इंस्पेक्टर की जान चली गई।उधमपुर के डीआईजी रईस मोहम्मद भट ने कहा, "यह बहुत दुखद है लेकिन यह हमारी ड्यूटी का हिस्सा है...यह जंगल वाला इलाका है, यहां सड़कें और नेटवर्क की समस्या है। यहां हम कई तरह की चुनौतियों… pic.twitter.com/qGkwEvM7xf— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
జమ్ములో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వేగంగా సిద్ధమవుతోంది. సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలిచ్చింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ కు 1953కు ముందున్న స్వయం ప్రతిపత్తిని కోరతామని ఎన్సీ మేనిఫెస్టో పేర్కొంది. ఈ మేరకు 2000 జూన్‌లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సారథ్యంలో కేంద్ర కేబినెట్ దీన్ని తిరస్కరించింది. 2019లో నరేంద్ర మోదీ సర్కారు ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశీ్మర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కోరతామని, కశీ్మరి పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చూస్తామని మేనిఫెస్టోలో ఎన్సీ హామీ ఇచి్చంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు, నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తామని పేర్కొంది. పేదలకు ఏడాదికి 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ అన్నారు. అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఒమర్ వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతి గృహిణికి నెలకు రూ.5,000 ఆర్థికసాయం అందజేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. భావసారూప్య పార్టీలతో కూటమికి సిద్ధంజమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా శ్రీనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశీ్మర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. ఎన్సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశీ్మర్ చీఫ్‌గా కర్రాను నియమించింది. సోమవారం న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్సీ, పీడీపీలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పచ్చజెండా ఊపాయన్న తారిక్ అహ్మద్..భావ సారూప్యం కలిగిన ప్రాంతీయ పారీ్టలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అధిష్టానం ఇప్పటికే ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్‌తో, ఆయన సొంతపార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం చర్చల ప్రశ్నే లేదన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు: ఒమర్ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో తమదే విజయమని, రాష్ట్ర హోదా సాధించుకుంటామని అన్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఒమర్ చెప్పారు. అదే సమయంలో, ఇతర పార్టీల ఓటు బ్యాంకు చీలి పోయిందని చెప్పారు. ఈ విషయం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. -
జమ్ము కశ్మీర్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
జమ్ము కశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.జమ్ము కశ్మీర్లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు. VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
Jammu and Kashmir: కింగ్‌మేకర్‌గా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు
జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన 16 స్థానాలు కింగ్‌మేకర్ పాత్రను పోషించనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగకు చెందిన తొమ్మిది సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఉత్సాహం నెలకొంది.జమ్ముకశ్మీర్‌లోని ఈ 16 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెండుగా అవకాశాలుంటాని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఖాతాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్సీ ఖాతాలో ఏడు, కాంగ్రెస్ ఖాతాలో రెండు, అప్నీ పార్టీ ఖాతాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. 16 రిజర్వ్డ్ సీట్లలో 13 జమ్మూ డివిజన్లో ఉండగా, మూడు కాశ్మీర్లో ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆరింటిలో, కాంగ్రెస్‌కు ఒక చోట ఆధిక్యం లభించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన తొమ్మిది స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో, ఎన్సీ ఒకదానిలో, కాంగ్రెస్ ఒకదానిలో ఆధిక్యం దక్కించుకుంది.తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇప్పుడున్న సమీకరణలు మారిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్లో కూడా మూడు సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ పహారీ, గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలనూ ఎన్సీ కైవసం చేసుకుంది. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధా వులు, జాతీయవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటున్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. 2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది. రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకి స్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తున్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది. కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాలనను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగిపోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబుతున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వసతులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తున్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రాయంతో ఆరోపిస్తు న్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియమిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వకేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు. ‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టు బడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపుతున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవుతోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరుతున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరి కకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.జి. మురళీకృష్ణ వ్యాసకర్త పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-
ఎట్టకేలకు కశ్మీర్ ఎన్నికలు
పదేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలూ...దాదాపు ఆరేళ్లనుంచి ప్రజా ప్రభుత్వం జాడా లేని జమ్మూ–కశ్మీర్లో ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దఫాలుగా ఈ ఎన్నికలుంటాయని ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 30లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించి తీరాలని సుప్రీంకోర్టు నిరుడు డిసెంబర్లో ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ ప్రకటన తప్పలేదు. జమ్మూ–కశ్మీర్ ఆఖరి దశ ఎన్నికలతోపాటే... అంటే అక్టో బర్ 1న హరియాణా అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయి. రెండుచోట్లా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడవుతాయి. హరియాణాతోపాటే నవంబర్ నెలాఖరుకు గడువు ముగుస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయని అందరూ భావించారు. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే జనవరితో పూర్తవుతుంది. కానీ మహారాష్ట్రలో గణేశ్ చతుర్థి, దీపావళి కారణంగా ఆ ఎన్నికలు విడిగా నిర్వహిస్తామని ఈసీ చెబుతోంది. కశ్మీర్లో ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటలముందు భారీ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు జరVýæటం యాదృచ్ఛికం కాదు. విపక్షంలో ఉండగా కశ్మీర్ పరిణామాలపై ఒంటికాలిపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన తొలినాళ్లనుంచీ అదొక అంతుచిక్కని పజిల్‌గా మారిందన్నది వాస్తవం. గవర్నర్ పాలన వచ్చినా, ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తినిచ్చే 370 అధికరణను రద్దుచేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు– జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించినా ఆశించిన స్థాయిలో ప్రశాంతత ఏర్పడలేదు. కశ్మీర్ లోయ ఎంతో కొంత నయం. అంతక్రితం పెద్దగా ఉగ్రవాద ఘటనల జాడలేని జమ్మూ ప్రాంతంలో ఆ ఉదంతాలు పెరిగాయి.21 మంది జవాన్లు ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారు. నిరుడు ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకొచ్చాక ఇంతవరకూ 17 సార్లు భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 18మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈమధ్య ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు జనం మార్పు కోరుకోవటంతోపాటు ఆ మార్పులో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న వైనం కళ్లబడిందని ప్రధాన ఎన్నికల కమిష నర్ రాజీవ్ కుమార్ అన్నారు. వారు బుల్లెట్లకన్నా బ్యాలెట్లే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడి ప్రజలైనా బుల్లెట్లు కోరుకోరు. తమ జీవనం సజావుగా సాగాలనీ, కనీస అవసరాలు తీరా లనీ కాంక్షిస్తారు. అది అసాధ్యమైనప్పుడే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.దాన్ని ఏ శక్తులు ఎలా ఉపయోగించుకుంటాయన్నది వేరే విషయం. ఆయనన్నట్టు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ– కశ్మీర్, లద్దాఖ్‌లలో జనం బారులు తీరిన మాట వాస్తవం. కానీ అంతక్రితం కూడా ఇదే పరిస్థితి. అది రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014 నవంబర్, డిసెంబర్ నెలల్లో చివరిగా ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్ని కలప్పుడు సైతం ఉగ్రవాదుల బెదిరింపులు, వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపు బేఖా తరు చేసి వోటర్లంతా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. కానీ వారికి దక్కిందేమిటి? ఎవరికీ మెజారిటీ రాని స్థితిలో మూడు నెలల పాటు గవర్నర్ పాలన తప్పలేదు. ఆ తర్వాత ఊహించని రీతిలో పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా అది ముచ్చటగా మూడేళ్లు కూడా నడవలేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి ఆరు, కశ్మీర్‌కు ఒకటి అదనంగా వచ్చాయి. దీనికితోడు పాక్ ఆక్ర మిత కశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలున్నాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెరి గాయి. ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల సరళి గమనిస్తే 24.36 శాతం ఓట్లతో బీజేపీ ముందంజలో ఉండగా, 22.3 శాతంతో నేషనల్ కాన్ఫరెన్స్ రెండోస్థానంలో ఉంది.కాంగ్రెస్‌కు 19.38శాతం, పీడీపీకి 8.48 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చెరో రెండు సీట్లూ గెల్చుకున్నాయి. యూఏపీఏ కింద అరెస్టయిన పాత్రికేయుడు ఇంజనీర్ రషీద్ జైల్లోవుంటూ బారా ముల్లా స్థానంనుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. మొత్తానికి ప్రస్తుతం తనకు అనుకూల వాతా వరణం ఉన్నదని బీజేపీ విశ్వసిస్తోంది. తాజా ఎన్నికల ప్రకటనకు అది కూడా కారణం కావొచ్చు. హరియాణాలో ఈసారి ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా లేదు. 2014లో 90 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాలు గెల్చుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... 2019లో 40తో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో పది సీట్లు గెల్చుకున్న దుష్యంత్ చౌతాలాతో కూటమి కట్టి పాలించింది. అయితే ఆ పార్టీ మూణ్ణెల్లక్రితం మద్దతు ఉపసంహరించుకోగా దిన దినగండంగా నెట్టుకోస్తోంది. ఈసారి స్పష్టమైన మెజారిటీతో అధికారం ఖాయమని కాంగ్రెస్ అను కుంటున్నా అదంత సులభం కాదని విశ్లేషకుల అంచనా. అంతర్గత పోరును అదుపు చేసుకుని, విప క్షాలతో కలిస్తేనే బీజేపీని నిలువరించటం వీలవుతుందని వారంటున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వా లెలా ఉంటాయన్న సంగతి పక్కనబెడితే... ముందు ఎన్నికలకు విశ్వసనీయత తీసుకురాటం ఎలా గన్నది ఈసీ పరిశీలించాలి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 140 స్థానాల్లో పోలైన వోట్లకన్నా లెక్కించిన ఓట్లు అయిదు కోట్లు అధికమని వోట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ) బయటపెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ అధిక వోట్లు 47 లక్షలు. పర్యవసానంగా ఇతర రాష్ట్రాల మాటెలావున్నా ఏపీలో కూటమి సర్కా రుకు ఈవీఎం ప్రభుత్వమన్న ముద్రపడింది. పైగా కొన్నిచోట్ల సీల్ చేసిన ఈవీఎంల బ్యాటరీచార్జింగ్ పెరిగిన వైనం కూడా వెల్లడైంది. ఇంత అస్తవ్యస్తంగా నిర్వహణ ఉంటే ఇలాంటి ఎన్నికలను ఎవరైనా విశ్వసించగలరా? ఎన్నికల సంఘం ఆలోచించాలి. -
అందుకే మహారాష్ట్రకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌తోపాటు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఆ రెండు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి వీటి షెడ్యూల్ గురించి సీఈసీ రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా అవసరాల దష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక.. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం అయ్యిందని, ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పితృ పక్షం, దీపావళి, గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగుల, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు.చివరిసారి హర్యానాకు, మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమ్ముకి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి(జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ). ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని చెప్పారు. -
జమ్ముకశ్మీర్ డీజీపీగా.. ఏపీ కేడర్ ఐపీఎస్ నలిన్ ప్రభాత్ నియామకం
జమ్ముకశ్మీర్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా(డీజీపీ) సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ కశ్మీర్లో డీజీపీగా ఆర్ఆర్ స్మైన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్ 30 ముగియనుంది. కాగా స్మైన్ 1991 బ్యాచ్‌కు చెందిన జమ్మూకశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. 11 నెలలపాటు డీజీపీగా సేవలు అందించారు. ఈ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రభాత్. అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT) కేడర్‌కు అతని డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG)కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎస్డీజీ)గా నియమితులయ్యారు.అక్టోబర్ 1న డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆర్టికల్ 370 రద్దు అనంతరం సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మరో వారం, పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.మూడు పోలీసు గ్యాలెంట్రీ మెడల్స్‌తో సహా అనేక గౌరవాలను అందుకున్నారుగ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్(ITBP) 14వ బెటాలియన్(శ్రీనగర్), 21వ బెటాలియన్(శ్రీనగర్), 16వ బెటాలియన్(లడఖ్)లకు కమాండెంట్‌గా పనిచేశారు. తర్వాత సీఆర్పీఎఫ్లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.ఇలా సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించింది. -
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
జమ్మూ కశ్మీర్లో పేలుడు.. నలుగురి మృతి
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం పేలుడు సంభవించింది. సోపోర్ పట్టణంలోని షేర్ కాలనీలో స్క్రాప్ డీలర్ దుకాణంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో(40), మహమ్మద్ ఆజర్(25), ఆజిమ్ అష్రఫ్ మిర్(20), ఆదిల్ రషీద్ భట్(23) గా స్థానిక అధికారులు గుర్తించారు.పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని సహాయక చర్యులు చేపట్టారు. ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే షాప్ డీలర్, మరికొంతమంది ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
లోయలో పడిన టాటా సుమో.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాందంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనం టాటాసుమో కిష్త్వార్ వైపు నుంచి వస్తున్న సమయంలో లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి
న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. -
జమ్మూలో దాడుల వెనుక...
కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్‌తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్‌లోని బారాముల్లా వరకు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్ పంజాల్‌కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్‌లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్‌కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్లో కంటే అఫ్గాన్ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్‌లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్–రాజౌరీ సెక్టార్లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్ వారి బ్రిగేడ్‌ను తూర్పు లద్దాఖ్‌కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్ కొంతమంది రిజర్వ్ బలగాలతో భర్తీ అయింది.ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్‌పుర్ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్ సింగ్‌ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్ భల్లాను 52.8 శాతంతో జుగల్ కిషోర్ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్‌కు అవకాశం వస్తుంది. కశ్మీర్ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.జ్యోతీ మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్‌కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్‌నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్‌లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. -
కథువా ఉగ్రదాడిని ఖండించిన భారత్.. ప్రతీకారం తీర్చుకుంటాం!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. -
అల్మరాలో నక్కిన టెర్రరిస్ట్‌లు.. బయటకు లాగి మరి ఎన్కౌంటర్..
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో భద్రతపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పట్టాయి.ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని చింగామ్,సౌత్ కాశ్మీర్ కుల్గామ్ అనే ప్రాంతాలలో నివసించేందుకు టెర్రరిస్ట్‌లకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్‌ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశాయి. మదర్గాంలో తొలి ఎన్కౌంటర్ జరగ్గా.. రెండో ఎన్కౌంటర్ కుల్గాం జిల్లా చింగాం అనే ప్రాంతంలో జరిగింది. సైనికులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు టెర్రరిస్ట్‌లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం చెందారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బర్డి తెలిపారు. ఇక ఎన్కౌంటర్లో హతమైన టెర్రరిస్ట్‌లు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందినవారని,వారిలో ఒకరు లోకల్ కమాండర్‌గా పోలీసులు నిర్ధారించారు.చింగాంలో హతమైన నలుగురు టెర్రరిస్ట్‌లు యావర్ బషీర్ దార్,జాహిద్ అహ్మద్ దార్, త్వాహిద్ అహ్మద్ రాతీర్, షకీల్ అహ్ వ్వానిలు కాగా, మదర్గాంలో మృతి చెందిన టెర్రరిస్ట్‌లు ఫైసల్, అదిల్లుగా గుర్తించారు.మదర్గాంలో జరిగిన టెర్రరిస్ట్‌ల ఎదురు దాడిలో పారా కమాండో, లాన్స్ నాయక్ ప్రదీప్ నాయిన్, చింగాం గ్రామంలోని ఫ్రిసాల్ ఏరియాలో వన్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన హవల్దార్ రాజ్‌కుమార్ వీరమరణం చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ జవాన్ వీరమరణం
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కల్గామ్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ అమరవీరుడైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని మెడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మా అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులను వారి రహస్య స్థావరంలో మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఓ సైనికులు సైతం ప్రాణాలువిడిచాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్రమాణం
జైలు నుంచి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
జమ్ములో మొదలైన ఎలక్షన్ హీట్
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే జమ్ముతో పాటు దేశంలో అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది.గురువారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జమ్ములో పర్యటించారు. జమ్ము బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు.. జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ, ఇతర నేతలతో రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు అక్కడి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు వాళ్లు. దీంతో జమ్ములోని మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది. ఎన్నికలకు హడావిడి మొదలవుతుండడంతో.. రాబోయే రోజుల్లో బీజేపీ అగ్రనేతలంతా జమ్ముకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. కానీ, రవీందర్ రైనా నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొనసాగుతుందని సంకేతాలు మాత్రం ఇచ్చింది. జమ్ము కశ్మీర్ శాసనసభ నవంబర్ 2018లో రద్దు అయ్యింది. ఆగస్టు 2019లో రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. ఆపై రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లఢక్) విడిపోయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి జమ్ముకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్రం చెబుతోంది. -
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్‌కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్‌కు లోక్‌సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్‌లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో కలిగిన హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి మొదలు కానుంది.. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రారంభమైంది.తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి.అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలు కానుంది.కాగా జమ్మూకశ్మీర్ ఉగ్రదాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారుఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి. -
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ ఇప్పటికే అధికారకంగా ప్రారంభించింది.ఈ క్రమంలో రిజిస్టర్ లేని పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా జమ్మూలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే..ఇక 2014లో జమ్మూ కాశ్మీర్లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎం అయ్యారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణానంతరం ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.2019 జూన్ 18న బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఆగష్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఉంది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది, కశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు., ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD— ANI (@ANI) June 3, 2024 ‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
లోయలో పడిన బస్సు.. 16 మంది మృత్యువాత
జమ్మూకశ్మీర్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 15 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.వివరాలు.. జిల్లాలోని అఖ్నూర్ చుంగీ మోర్ ప్రాంతంలో ఈఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దాదాపు 150 అడుగుల లోయలోకి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లా శివ్ ఖోరీ ప్రాంతానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 25 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు, స్థానికులతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ
ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరించేనో? లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈసారి సిట్టింగ్ ఎంపీ జామ్యంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ బదులు తాషి గ్యాల్సన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్ లద్దాక్ ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్స్టాన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్ రాజాపై నెగ్గారు. చెవాంగ్ 2009 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్ ఎన్సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా సేరింగ్ నామ్గ్యల్ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్ కాంగ్రెస్ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్ నామ్గ్యల్ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్–ఎన్సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్ఏబీ, కేడీఏ డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్లు తక్కువ 1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్ నమోదవుతోంది.స్థానికుల డిమాండ్లులద్దాక్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.... శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది. ఓటర్లలో నిరుత్సాహం... శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది. వలసదారులకు ఉన్నచోటే ఓటు! జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్‌కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు.