పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌ | JD Vance strongly condemned terror attack in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌

Apr 23 2025 7:21 PM | Updated on Apr 23 2025 7:32 PM

JD Vance strongly condemned terror attack in Jammu and Kashmir

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి గురించి జేడీ వాన్స్‌ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురి నేతల మధ్య జరిగిన సంభాషణను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు.

జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని అమెరికా ఖండిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఉగ్రవాదంపై చేసే పోరాటంలో భారత్‌కు అండగా అమెరికా ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదం విషయంలో భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు.   

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రపంచం దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.    

కాగా, జేడీ వాన్స్‌ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. జేడీ వాన్స్‌ దంపతుల్ని సాధరంగా ఆహ్వానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement