శ్రీజ, సత్యన్‌లపై భారీ అంచనాలు  | Delhi set to welcome the 22nd Commonwealth Table Tennis Championship | Sakshi
Sakshi News home page

శ్రీజ, సత్యన్‌లపై భారీ అంచనాలు 

Jul 27 2026 6:32 AM | Updated on Jul 27 2026 6:32 AM

Delhi set to welcome the 22nd Commonwealth Table Tennis Championship

నేటి నుంచి కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: ఒకవైపు గ్లాస్గో వేదికగా కామన్వెల్త్‌ క్రీడలు కొనసాగుతుండగా... మరోవైపు భారత్‌ వేదికగా నేటి నుంచి 22వ కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో పలువురు భారత స్టార్‌లు బరిలోకి దిగనున్నారు. పురుషుల టీమ్‌ విభాగంలో సత్యన్‌ జ్ఞానశేఖరన్, హరీ్మత్‌ దేశాయ్, మానవ్‌ ఠక్కర్, మనుశ్‌ షా, పాయస్‌ జైన్‌లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వచ్చే నెల 2 వరకు కొనసాగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ప్లేయర్ల నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

మహిళల విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ ఆకుల శ్రీజపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్‌ ప్లేయర్‌ మనికా బాత్రా ఈ టోర్నీకి ఎంపిక కాకపోగా... శ్రీజతో పాటు సుతీర్థ ముఖర్జీ, యశస్విని, సిండ్రెల్లా దాస్, స్వస్తిక ఘోష్‌ బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో టాప్‌ సీడ్‌ సింగపూర్, కెనడా, మలేసియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి భారత ప్యాడ్లర్లకు ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 23 పురుషుల, 18 మహిళల జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 1.10 లక్షల డాలర్లు (1.06 కోట్లు) కాగా... కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో దశలవారీగా పోటీలు జరగనున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement