చరిత్ర సృష్టించిన అనాహత్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు | Anahat Singh becomes first Indian to win world junior squash title | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అనాహత్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు

Jul 26 2026 4:46 AM | Updated on Jul 26 2026 7:29 AM

Anahat Singh becomes first Indian to win world junior squash title

Photo Credit: Khel India Twitter

ఒంటారియో (కెనడా): భారత రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌... ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్‌ సీడ్‌ అనాహత్‌ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్‌ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్‌ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ చాంపియన్‌గా అవతరించింది. 

2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో కాంస్యం నెగ్గిన అనాహత్‌... ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. 

 

Read: సిరీస్ విజ‌యం.. టీ20ల్లో నంబ‌ర్‌వ‌న్‌గా టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement