US Open: సెమీస్‌లో గాఫ్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన రైబాకినా | Rybakina edges out Gauff to set up US Open final against Sabalenka | Sakshi
Sakshi News home page

US Open: సెమీస్‌లో గాఫ్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన రైబాకినా

Sep 11 2026 10:47 AM | Updated on Sep 11 2026 11:52 AM

 Rybakina edges out Gauff to set up US Open final against Sabalenka

యుఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్‌లో అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ పోరాటం ముగిసింది. శుక్రవారం వరల్డ్ నంబర్ 2 ఎలెనా రైబాకినాతో జరిగిన సెమీఫైనల్లో 3-6, 6-4, 6-4 తేడాతో గాఫ్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో గాఫ్ ఇంటి ముఖం పట్టగా.. రైబాకినా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెప్టెంబ‌ర్ 12న జ‌ర‌గ‌నున్న తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబాలెంకాతో రైబాకినా త‌ల‌ప‌డ‌నుంది.

ఇక సెమీస్ విషయానికి వ‌స్తే.. ఆరంభంలో గాఫ్ ఆధిపత్యం ప్రదర్శించి ఆరో గేమ్‌లో సర్వీస్ బ్రేక్ చేసి మొదటి సెట్‌ను 3-6తో సొంతం చేసుకుంది.  అయితే రెండో సెట్‌లో  గాఫ్ వరుస తప్పిదాలు చేయడంతో రైబాకినా తిరిగి పుంజుకుంది. ఈ కజకిస్తాన్ టెన్నిస్ స్టార్‌ రెండో సెట్‌ను 6-4తో గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేసింది. 

అనంత‌రం నిర్ణ‌యాత్మ‌క మూడో సెట్ కూడా చివ‌రివ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఆరంభంలోనే రైబాకినా 5-3 ఆధిక్యంలోకి వెళ్లగా.., గాఫ్ మళ్లీ బ్రేక్ సాధించింది. అయితే చివరికి సర్వీస్‌ను నిలబెట్టుకున్న 6-4 తేడాతో రైబాకినా విజయాన్ని ఖాయం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement