breaking news
US Open 2026
-
నాలుగేళ్లకే షుగరొచ్చినా ఇప్పుడాయన ఛాంపియన్..!
మూడు నెలల కిందట ఇదే ఏడాది 2026 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్లావియో కొబొల్లీని ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు అలెగ్జాండర్ జ్వెరెవ్. కానీ అతడు తేల్చుకోవాల్సిన పాత లెక్క ఒకటుంది. అదీ... ఆరేళ్ల కింద 2020 నాటి ఓ పాత కథ ఇది...అది 2020 నాటి యూఎస్ ఓపెన్. ఆరోజు 23 ఏళ్ల జ్వెరెవ్‌కి ప్రత్యర్థిగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ ఆడుతున్నాడు. జ్వెరెవ్ మొదటి రెండు సెట్లూ గెలిచాడు. దాదాపుగా చేతికి అందేంత దగ్గర్లో ఒక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ!! ఇక కావాల్సింది కేవలం రెండంటే రెండు పాయింట్లే!! కానీ... జ్వెరెవ్ ఆ తర్వాత మూడు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. మళ్లీ ఆరేళ్ల తర్వాత... తేదీ 2026 సెప్టెంబర్ 13... న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియం... పాతికవేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపాయిన స్టేడియం. ఒకవైపు అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్. ఆట జరుగుతున్నది న్యూయార్క్‌లోనే కావడంతో తమ దేశపు ఆటగాడే గెలవాలన్న కోరిక చాలామందిలో ఉండటం మామూలే. అందుకే... ‘దాదాపు 99.9% మంది ప్రేక్షకులు బెన్ షెల్టన్ గెలవాలని కోరుకుంటున్నారేమో’ అంటూ జ్వెరెవ్ సరదాగా ఓ కామెంట్ కూడా చేశాడు. చివరికి... తన ప్రత్యర్థి బెన్ షెల్టన్‌ను జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. ఇప్పుడు జ్వెరెవ్ చేతిలో ట్రోఫీ! ఆరేళ్ల కిందట అతడు రన్నరప్. కానీ ఇప్పుడు చాంపియన్!! చుట్టూ ఎందరో ఫ్యాన్స్ ఉండవచ్చు. కానీ జ్వెరెవ్ మనసులో ఒకరున్నారు. ఒకరే ఉన్నారు. ఆ ఒకే ఒక వ్యక్తి ఆమె తల్లి ఇరీనా! అతడి మనసులో ఆ తల్లి అన్న మాటలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటే జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసప్పటి కాలానికి వెళ్లాలి. జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి కథ ఇది... డాక్టర్ చెప్పాడు... ‘‘ఈ నాలుగేళ్ల చిన్నారికి టైప్–1 డయాబెటిస్’’ అని! అప్పుడు అతడి కుటుంబ సభ్యులు అడిగారు ‘‘ఇక ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది?’’ అని. ‘‘స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకుంటే అది కష్టం కావచ్చు’’ అన్నాడు డాక్టర్. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడంటే... జ్వెరెవ్ తల్లి ఇరీనా కూడా మాజీ టెన్నిస్ ప్లేయరే. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది పేరెంట్స్ సాధారణంగా ఏమంటారు? ‘‘సరే.... ముందు హెల్త్. ఆ తర్వాతే స్పోర్ట్స్...’’ అని. కానీ జ్వెరెవ్ తల్లి... ఇరీనా అలా అనుకోలేదు. ఆమె తన నాలుగేళ్ల కొడుకును చూసి...‘‘నా కొడుకు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది టైప్–1 డయాబెటిస్ నిర్ణయించదు. అతడు టెన్నిస్ ప్లేయర్ కావాలంటే టెన్నిస్ ప్లేయర్. లేదా ఇంకేదైనా... మరేదైనా కావాలంటే అదీ’’.టైప్–1 డయాబెటిస్ కొనసాగింది... ప్రతిరోజూ గుచ్చే సూదులూ... రోజూ తాను కళ్లజూసే రక్తపుబొట్లు... రోజు వాడాల్సిన మందులతో! కానీ జీవితమూ కొనసాగింది. అదీ అతడి ఇష్టప్రకారమే... ప్రాక్టీస్... ఫిట్నెస్... మ్యాచులు. ప్రయాణాలూ... విజయాలతో! తన చిన్నప్పటి నుంచీ టైప్–1 డయాబెటిస్ కండిషన్‌తోనే.. ఎన్నో కండిషన్ల మధ్యన అతడు జీవిస్తున్నాడు. టెప్–1 డయాబెటిస్ అంటే ఏమిటో, దానితో జీవితమెలా ఉంటుందో చూద్దాం...టైప్–1 డయాబెటిస్ అంటే...?పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. చిన్నారుల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. ఎందుకు వస్తుందంటే...టైప్–1 డయాబెటిస్ ఎందుకొస్తుందనే కారణం నిర్దిష్టంగా తెలియదుగానీ... సాధారణంగా పిల్లలకు సోకే వైరస్లు, రకరకాల పర్యావరణ అంశాల వంటి చాలా కారణాలతో ఇది రావచ్చన్నది వైద్య నిపుణుల అభిప్రాయం.గుర్తించడమెలా? టైప్–1 డయాబెటిస్ లక్షణాలు పిల్లలందరిలోనూ ఒకేలా ఉండకపావచ్చు. ఈ కింది లక్షణాల్లో ఏవైనా కనిపించినప్పుడు పేరెంట్స్ వాటిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అవి... → నీళ్లు ఎక్కువగా తాగుతుండటం; పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేసిన పిల్లలూ మళ్లీ్ల పక్క తడపటం మొదలుపెట్టడం ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం → వెంటవెంటనే అలసిపాతుండటం, నీరసంగా ఉండటం → వారి జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపాతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అదేపనిగా పేరుకుపాయిన అధిక గ్లూకోజ్ వల్ల కీటోన్స్ అనే విష పదార్థాలు రక్తంలో పేరుకుపాతాయి. దాంతో ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు. → తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం) ∙శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పిపడిపావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపాయే కండిషన్‌ను ‘కీటో అసిడోసిస్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ఇది. టైప్–1 డయాబెటిస్ (మేనేజ్మెంట్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్‌ను నాలుగు అంశాల నిర్వహణ ద్వారా సమర్థంగా మేనేజ్ చేయవచ్చు. అవి.. 1. ఇన్సులిన్ : ఈ పిల్లల విషయంలో ఇన్సులిన్ ఇవ్వడం రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ. ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్ ద్వారానే జరగాలి. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మం కింది ‘సబ్‌క్యుటేనియస్ పొర’లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్ వంటి ఉపకరణాలు, ఇన్సులిన్ పంప్స్ వంటి ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2. గ్లూకోజ్ మానిటరింగ్ : పిల్లలకు కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపాదు. వారు తిన్న మోతాదును బట్టి ఎంత ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్’ ఉపయోగపడుతుంది. పిల్లల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గితే గ్లూకోజ్గానీ లేదా చక్కెరగానీ తినిపించాలి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే... ఇన్సులిన్ ఇవ్వాలి. 3. ఆహారం : చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. ఈ క్రమంలో ఎక్కువ చక్కెరలూ లేదా తీపి పదార్థాలు లేని మంచి సమతులాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆహారంలో తగిన పాళ్లలో కార్బోహైడ్రేట్స్ సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపాటీన్లు... ఇవి పప్పు, కోడి మాసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్లు...మొ.) ఇవ్వాలి. ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాల కోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్నట్ ఇవ్వవచ్చు. వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. 4. శారీరక శ్రమ : పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా ఇలాంటి పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత ఎక్కువగా అవసరం. చివరిగా... మరోసారి జ్వెరెవ్ విషయానికి వస్తే... ఈ సమస్య ఉన్న పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రుల జీవితాల్లో ఆర్థిక పరిమితులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని గమనించినందుకో ఏమోగానీ... ‘జ్వెరెవ్ ఫౌండేషన్’ డయాబెటిస్తో జీవిస్తున్న పిల్లలకు... ముఖ్యంగా ఇన్సులిన్ అందని ప్రాంతాల్లో ఉన్నవారికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తోంది. బహుశా... తన నాలుగేళ్ల వయసులో ఎదురైన సమస్యను గుర్తించి ఇప్పుడతడు చాలామంది జీవితాలకు ఉపయోగపడేలా తన ఫౌండేషన్‌ను ఉపయోగిస్తున్నాడని భావించవచ్చు. అతడి ఆర్థికస్థితి అందుకు అనుమతిస్తోంది. కానీ... మన దేశంలోనూ ఇలాంటి చిన్నారుల పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమూ మనందరికీ ఉంది. రక్తంలోని చక్కెరను ఇంత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరమేమిటంటే? పిల్లల రక్తంలో చక్కెర మోతాదులు చాలాకాలం పాటు నియంత్రణలో లేకపాతే భవిష్యత్తులో వాళ్లలో చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నియంత్రణలోని లేని చక్కెర వల్ల పిల్లల కిడ్నీలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలకు హాని జరగవచ్చు. నాడీవ్యవస్థపై దుష్ప్రభావాలు పడవచ్చు. ఇవన్నీ బాల్యంలో కనిపించకపావచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.ఇటీవలి పురోగతి... టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో వారి రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్ ఆగ్యుమెంటెడ్ పంపులు, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వంటి కొన్ని ఆధునిక పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడమూ సాధ్యమవుతోంది. అయితే ఈ పురోగతి ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాలపై చాలా ఆర్థికభారాన్నే మోపుతోంది. భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్ అందేలా చూసేందుకు – ఇన్సులిన్ జీన్ థెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.డాక్టర్ బి. శిరీష కుసుమసీనియర్ పీడియాట్రిక్ఎండోక్రైనాలజిస్ట్ యాసీన్ -
నాలుగేళ్లకే డయాబెటిస్.. తల్లి మలిచిన యోధుడు!
యూఎస్ ఓపెన్ 2026 టైటిల్‌ను ప్రపంచ నంబర్‌వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు. బెన్ షెల్టన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజేతగా నిలిచిన జ్వెరెవ్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా జ్వెరెవ్ నెగ్గిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జ్వెరెవ్.. తన టెన్నిస్ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తన తల్లేనని చెప్పాడు. తన మ్యాచ్‌లను ఆమె సాధారణంగా ప్రత్యక్షంగా చూడకపోయినా, తాను ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నాడు. నాలుగేళ్ల కుమారుడికి డయాబెటిస్ ఉన్నట్లు వైద్యులు చెప్పిన సమయంలో ఒక తల్లి ఎంతో బలంగా నిలబడాల్సి ఉంటుందని జ్వెరెవ్ చెప్పాడు. తన తల్లి అప్పుడే “నా కొడుకు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాడు. టెన్నిస్ ఆటగాడు కావాలనుకుంటే టెన్నిస్ ఆటగాడే అవుతాడు. ఈ అనారోగ్యం మనల్ని నిర్వచించదు" అనే ధైర్యాన్ని తనకు ఇచ్చిందని గుర్తుచేసుకున్నాడు.నాలుగేళ్ల వయసులో తనకు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు వైద్యులు తన భవిష్యత్తులో జీవితం, క్రీడలకు అనేక పరిమితులు ఉంటాయని వివరించారు. ఈ పరిస్థితిలో అతడి శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ జీవితాంతం నిర్వహణ అవసరం ఉంటుంది. తన అనారోగ్యాన్ని జ్వెరెవ్ చాలా సంవత్సరాల పాటు వ్యక్తిగతంగానే ఉంచుకున్నాడు. 2022లో తొలిసారి బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత తన పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా డయాబెటిస్తో జీవిస్తున్న చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు, వారికి మద్దతు అందించేందుకు కృషి చేస్తున్నాడు.మ్యాచ్‌ల సమయంలోనూ జ్వెరెవ్ తన గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంటాడు. అవసరమైనప్పుడు ఇన్సులిన్ పెన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటాడు. గ్రాండ్ స్లామ్ వంటి అత్యున్నత స్థాయి మ్యాచ్‌లలో ఒత్తిడి నడుమ కూడా మార్పుల సమయంలో ఇన్సులిన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతూనే డయాబెటిస్ ను కూడా సమర్థంగా నిర్వహిస్తున్న జ్వెరెవ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. యూఎస్ ఓపెన్ టైటిల్ అనంతరం తల్లికి అతడు ఇచ్చిన ఈ భావోద్వేగ నివాళి అందరిని కంటతడి పెట్టించింది.For every kid who was told “you can’t.” ❤️ pic.twitter.com/N5pZamAb88— US Open Tennis (@usopen) September 13, 2026ఇదీ చదవండి: దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత -
యూఎస్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్
ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ టైటిల్‌ను జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు. అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలిసారి ఫ్లషింగ్ మెడోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జ్వెరెవ్ 6-3, 7-6(2), 5-7, 6-2తో షెల్టన్‌ను ఓడించాడు. దీంతో 2026లో అతడి ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది.ఫైనల్‌ను జ్వెరెవ్ దూకుడుగా ప్రారంభించాడు. బేస్‌లైన్ నుంచి పదునైన షాట్లతో షెల్టన్‌పై ఒత్తిడి పెంచాడు. అమెరికా ఆటగాడి డబుల్ ఫాల్ట్‌లు కూడా జ్వెరెవ్‌కు కలిసొచ్చాయి. ఆరంభంలోనే సర్వీస్ బ్రేక్ సాధించిన అతడు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో షెల్టన్ పోరాటం పెంచాడు. సర్వీస్‌తో పాటు ర్యాలీల్లోనూ జ్వెరెవ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. అయితే కీలక సమయంలో జ్వెరెవ్ తన స్థాయిని చూపించాడు. 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైబ్రేక్‌ను 7-2తో గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో 2-0తో ముందంజ వేశాడు.మూడో సెట్ అతడిదేరెండు సెట్లు కోల్పోయినా షెల్టన్ వెనక్కి తగ్గలేదు. మూడో సెట్లో మరింత దూకుడుగా ఆడుతూ జ్వెరెవ్ రిథమ్‌ను దెబ్బతీశాడు. 3-3 వద్ద జ్వెరెవ్ సర్వీస్‌పై తొలి బ్రేక్‌పాయింట్ అవకాశాన్ని సృష్టించాడు. దానిని జర్మన్ ఆటగాడు కాపాడుకున్నప్పటికీ.. షెల్టన్‌కు నమ్మకం పెరిగింది. 5-5 తర్వాత షెల్టన్ కీలక సమయంలో పుంజుకున్నాడు. జ్వెరెవ్ సర్వీస్‌పై వరుసగా మూడు సెట్ పాయింట్లు సాధించాడు. ఒకదాన్ని కోల్పోయినా రెండో అవకాశంలో జ్వెరెవ్ ఫోర్‌హ్యాండ్ వాలీ బయటకు వెళ్లడంతో బ్రేక్ సాధించాడు. చివరకు 7-5తో మూడో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచాడు.నాలుగో సెట్లో ఛాంపియన్ గేమ్ఇక్కడే జ్వెరెవ్ తన కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించాడు. గతంలో యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆధిక్యాన్ని కోల్పోయిన అనుభవం ఉన్నా ఈసారి ఆ తప్పును పునరావృతం చేయలేదు. నాలుగో సెట్ ఆరంభంలోనే షెల్టన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. షెల్టన్ పోరాడుతున్నా జ్వెరెవ్ కంట్రోల్ తప్పలేదు. 4-2 వద్ద మరోసారి సర్వీస్ బ్రేక్ సాధించి టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. 5-2 వద్ద ఛాంపియన్షిప్ కోసం సర్వ్ చేస్తూ ఒక డబుల్ ఫాల్ట్ చేసినా వెంటనే ఏస్, ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో పుంజుకున్నాడు. చివరకు షెల్టన్ ఫోర్‌హ్యాండ్ బయటకు కొట్టడంతో మ్యాచ్ ముగిసింది.టైటిల్ గెలిచిన అనంతరం జ్వెరెవ్ తన తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆమె ప్రొత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యాడు.ఆరేళ్ల తర్వాత నెరవేరిన కల2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో రెండు సెట్ల ఆధిక్యంలో ఉన్న జ్వెరెవ్ డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని అధిగమిస్తూ ఆరేళ్ల తర్వాత అదే వేదికపై టైటిల్ అందుకున్నాడు. మరోవైపు షెల్టన్ 2003లో ఆండీ రాడిక్ తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా మెన్స్ విన్నర్‌గా నిలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినా ఆ కల నెరవేరలేదు.ఇప్పుడు.. ఈ విజయంతో జ్వెరెవ్ 2026లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్నాడు. యూఎస్ ఓపెన్ విజయం అతడి కెరీర్లో 26వ టైటిల్‌గా నిలిచింది. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ ఆటగాడిగా కూడా జ్వెరెవ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. యూఎస్ ఓపెన్ టైటిల్‌తో జ్వెరెవ్ తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణంలో మరో పెద్ద అడ్డంకిని అధిగమించాడు. ఇక 2026 సీజన్‌ను రెండు మేజర్ టైటిళ్లతో ముగించే దిశగా దూసుకెళ్తున్నాడు.ఇదీ చదవండి: యూఎస్ విమెన్ సింగిల్స్ విజేతగా రిబాకినా -
రిబాకినాదే టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) చాంపియన్‌గా అవతరించింది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారూస్)తో జరిగిన ఫైనల్లో రిబాకినా 2 గంటల 21 నిమిషాల్లో 6–4, 5–7, 6–2తో గెలుపొందింది. రిబాకినా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కాగా...తొలిసారి ఆమె యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. నేడు తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న రిబాకినా 2022లో వింబుల్డన్, 2026లో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. 2024, 2025 చాంపియన్ సబలెంకా ‘హ్యాట్రిక్’ సాధించాలని ఆశించినా రిబాకినా అద్భుత ఆటతీరుతో బెలారూస్ స్టార్ ఆశలను వమ్ము చేసింది. విజేత రిబాకినాకు 55 లక్షల డాలర్లు (రూ. 52 కోట్ల 49 లక్షలు), రన్నరప్ సబలెంకాకు 28 లక్షల డాలర్లు (రూ. 26 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
చేజారిన టైటిల్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన సబలెంకా! వీడియో
యూఎస్ ఓపెన్-2026లో పోలాండ్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు తీవ్ర నిరాశ ఎదురైంది. వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆమె కల నెరవేరలేదు. ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎలెనా రిబాకినా చేతిలో 6-4, 5-7, 6-2 తేడాతో సబలెంకా ఓటమి పాలైంది. అయితే ఈ పరాజయం అనంతరం సబలెంకా తీవ్ర అసహనానికి గురైంది. తన సొంత తప్పిదాల కారణంగా ఓటమి పాలవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. విజేతగా నిలిచిన రిబాకినాను అభినందించిన తర్వాత సబలెంకా బెంచ్ వద్దకు వెళ్లి తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. కొట్టి ముక్కలు చేసింది. అంతటితో ఆగకుండా ప్రజెంటేషన్ సమయంలో తనను చిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్‌లో?Luego del episodio con Coco Gauff en el Australian Open 2026, se prohibieron las cámaras en los vestuarios de los Grand Slams.Tranquilamente esta podría ser Aryna Sabalenka en este momento. pic.twitter.com/qZFFGWAzFZ— Tiempo De Tenis (@Tiempodetenis1) September 12, 2026Sealed with a kiss 💋 pic.twitter.com/Awu53dRWEC— US Open Tennis (@usopen) September 12, 2026 -
యూఎస్ ఓపెన్ విజేతగా రిబాకినా
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా వరల్డ్ నంబర్ 2 ఎలెనా రిబాకినా నిలిచింది. రిబాకినా శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో బెలారస్ స్టార్ అరీనా సబలెంకాను 6-4, 5-7, 6-2 తేడాతో ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్ధి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన రిబాకినా 6-4తో సెట్‌ను గెలుచుకుని శుభారంభం చేసింది. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంకా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలుత రెండు సెట్ పాయింట్లను కాపాడుకున్న సబలెంకా.. అనంతరం రిబాకినా సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో కజకిస్థాన్ స్టార్ రిబాకినా విజృంభించింది. సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేస్తూ 6-2తో సెట్‌తో పాటు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాయం చేసుకుంది.ఇది రిబాకినాకు మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ విజయంతో ఆమె మహిళల టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి కజకిస్థాన్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.చదవండి: హారిసన్–స్కప్‌స్కీ జోడీకి పురుషుల డబుల్స్ టైటిల్The winning moment 🏆Elena Rybakina is the 2026 US Open CHAMPION!#USOpen pic.twitter.com/2a8mGJ742E— wta (@WTA) September 12, 2026 -
అల్కరాజ్ను ఓడించినోడు ఫైనల్‌కు; 23 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా?
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో బెన్ షెల్టన్ 4-6, 6-3, 6-3, 7-5తో తన దేశానికే చెందిన ఫ్రాన్సెస్ టియాఫోను మట్టికరిపించాడు. తొలి సెట్‌ను ఓటమితో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత ఫుంజుకున్న షెల్టన్ రెండు వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. ఇక నాలుగో సెట్లో ఇరువురు హోరాహోరీగా తలపడినప్పటికీ, చివరకు షెల్టన్నే విజయం వరించింది. రేపు జరగనున్న ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో షెల్టన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. క్వార్టర్స్‌లో అల్కరాజ్ను చిత్తు చేసిన షెల్టన్ సెమీస్‌లోనూ టియాఫోపై అదే జోరును ప్రదర్శించి విజయం అందుకున్నాడు. ఇప్పటివరకు యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరడమే షెల్టన్‌కు అత్యుత్తమంగా ఉండేది. తొలి బ్లాక్ అమెరికన్గాతాజాగా ఆ రికార్డును సవరించిన షెల్టన్ టైటిల్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచాడు. 1972 తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి బ్లాక్ అమెరికన్‌గా బెన్ షెల్టన్ రికార్డులకెక్కాడు. అంతేకాదు షెల్టన్ టైటిల్ సాధిస్తే మరో రికార్డు కూడా అందుకోనున్నాడు. ఆండీ రాడిక్ (2003) తర్వాత యూఎస్ ఓపెన్ గెలిచిన అమెరికన్ ప్లేయర్‌గా షెల్టన్ నిలవనున్నాడు. ఆనాటి యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండీ రాడిక్.. జువాన్ కార్లోస్ ఫెర్రోరోను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. 23 సంవత్సరాల తర్వాత ఒక అమెరికన్‌గా షెల్టన్‌కు టైటిల్ గెలిచే అవకాశమొచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం షెల్టన్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తన నానమ్మకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు నివాళి అర్పించాడు. అమ్మమ్మకు అంకితం"ఇది చాలా భావోద్వేగభరితమైనది. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మ, నాన్న చాలా త్యాగాలు చేశారు. ఈ ఏడాది నా తల్లిని పోగొట్టుకున్నాను. నిజానికి ఆమె వల్ల ఇవాళ నేను టెన్నిస్ ఆడగలుగుతున్నా. ఆమె లేకపోయుంటే బెన్ షెల్టన్ అనేవాడు ఇక్కడ ఉండేవాడు కాదేమో. ఇదంతా ఆమె కోసమే. విజయాన్ని నాకెంతో ఇష్టమైన మా అమ్మమ్మకు అంకితం చేస్తున్నా." అని కన్నీటిపర్యంత మయ్యాడు.మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జ్వెరెవ్ 6-3, 7-6 (9-7), 7-6 (8-6)తో కచనోవ్‌పై కష్టపడి విజయం సాధించాడు. జ్వెరెవ్ యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జ్వెరెవ్ రెండో గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. జ్వెరెవ్ చేతిలో షెల్టన్ ఐదుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరి యూఎస్ ఓపెన్ ఫైనల్లో షెల్టన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా లేక జ్వెరెవ్‌కు దాసోహమంటాడా అనేది చూడాలి.Ben recognizes his family's sacrifices and hard work it took to get here 👇 pic.twitter.com/yZXKG27APp— US Open Tennis (@usopen) September 12, 2026 Ben's biggest moment has arrived! pic.twitter.com/kBUBCxJV6U— US Open Tennis (@usopen) September 12, 2026First Grand Slam final and it's at home! pic.twitter.com/tY8WskcvZ5— US Open Tennis (@usopen) September 12, 2026చదవండి: శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలీదు -
ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7-5, 6-2తో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై సునాయాస విజయాన్ని అందుకుంది. కేవలం రెండు సెట్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన సబలెంకా నాలుగోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే 2024, 2025 యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సబలెంకా హ్యాట్రిక్‌పై కన్నేసింది. అంతేకాదు హార్డ్‌కోర్ట్‌పై వరుసగా మూడో టైటిల్ అందుకునేందుకు సబలెంకా అడుగు దూరంలో నిలిచింది. మరో సెమీస్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్‌ను ఓడించిన రిబాకినా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రేపు జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో డిపెండింగ్ చాంపియన్ సబలెంకాతో రిబాకినా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గతంలో రెండుసార్లు (2024, 2025 యూఎస్ ఓపెన్) ఫైనల్లో పెగులాను ఓడించి టైటిల్ అందుకున్న సబలెంకా ఈసారి పెగులాను సెమీస్‌లోనే చిత్తు చేయడం విశేషం.మ్యాచ్‌లో 29 విన్నర్లతో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన సబలెంకా మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడుతూ.. ‘నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. గత రెండు యూఎస్ ఓపెన్ టోర్నీల్లో పెగులాను ఫైనల్లో చిత్తు చేసి టైటిల్ అందుకుంటే, ఈసారి మాత్రం ఆమెతో పోటీ సెమీస్‌లోనే ఎదురైంది. ఇదే హార్డ్కోర్టుపై నెల రోజుల క్రితం పెగులా నన్ను సెమీస్‌లో ఓడించింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకున్నా (నవ్వుతూ). అయితే పెగులాను మ్యాచ్‌లో మాత్రమే ప్రత్యర్థిగా చూస్తాను. బయటం మేం మంచి స్నేహితులం. ఇక న్యూయార్క్ నగరం నాకు చాలా ఇష్టం. వరుసగా మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచిన నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చింది.THREE-PEAT: STILL ON 🗽Aryna Sabalenka defeats Pegula 7-5, 6-2 and will once again compete in the US Open championship match on Saturday! pic.twitter.com/1mLbWR0HXG— US Open Tennis (@usopen) September 11, 2026 Del 2023 al 2026, Aryna Sabalenka he llegado a la Final del US Open. Dominante 🤯 pic.twitter.com/Eo2kpEZ2av— US Open Tennis (@usopen) September 11, 2026Read: నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్! -
US Open: సెమీస్‌లో గాఫ్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన రైబాకినా
యుఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్‌లో అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ పోరాటం ముగిసింది. శుక్రవారం వరల్డ్ నంబర్ 2 ఎలెనా రైబాకినాతో జరిగిన సెమీఫైనల్లో 3-6, 6-4, 6-4 తేడాతో గాఫ్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో గాఫ్ ఇంటి ముఖం పట్టగా.. రైబాకినా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 12న జరగనున్న తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబాలెంకాతో రైబాకినా తలపడనుంది.ఇక సెమీస్ విషయానికి వస్తే.. ఆరంభంలో గాఫ్ ఆధిపత్యం ప్రదర్శించి ఆరో గేమ్‌లో సర్వీస్ బ్రేక్ చేసి మొదటి సెట్‌ను 3-6తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో గాఫ్ వరుస తప్పిదాలు చేయడంతో రైబాకినా తిరిగి పుంజుకుంది. ఈ కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ రెండో సెట్‌ను 6-4తో గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేసింది. అనంతరం నిర్ణయాత్మక మూడో సెట్ కూడా చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరంభంలోనే రైబాకినా 5-3 ఆధిక్యంలోకి వెళ్లగా.., గాఫ్ మళ్లీ బ్రేక్ సాధించింది. అయితే చివరికి సర్వీస్‌ను నిలబెట్టుకున్న 6-4 తేడాతో రైబాకినా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా నంబర్‌వన్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అసాధారణ ఆటతీరు కనబరిచి అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. నాలుగు గంటల 28 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ షెల్టన్ 6–7 (5/7), 6–1, 6–3, 1–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.కాగా 2023లో తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న షెల్టన్... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. గతంలో అల్కరాజ్తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన షెల్టన్ నాలుగో ప్రయత్నంలో తొలి విజయం రుచి చూశాడు. షెల్టన్ తన కెరీర్లో టాప్–3 ర్యాంకర్‌పై గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అల్కరాజ్తో జరిగిన మ్యాచ్‌లో షెల్టన్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు.అనంతరం అల్కరాజ్ తేరుకొని నాలుగో సెట్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 6–6తో సమం కావడంతో ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. కీలకమైన సూపర్ టైబ్రేకర్‌లో షెల్టన్ తొలుత పది పాయింట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. అమెరికా కాలమానం ప్రకారం షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి గం. 11:05 నిమిషాలకు మొదలై బుధవారం తెల్లవారుజామున గం 3:33 నిమిషాలకు ముగిసింది.అంతకుముందు 2022లో అల్కరాజ్, యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 7న బుధవారం రాత్రి గం. 9:35కు మొదలై సెప్టెంబరు 8న గురువారం తెల్లవారుజామున గం. 2:50 నిమిషాలకు ముగిసింది. టియాఫో మూడోసారి... సెమీఫైనల్లో అమెరికాకే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫోతో షెల్టన్ ఆడనున్నాడు. దాంతో ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆడటం ఖాయమైంది. అమెరికాకే చెందిన ప్రపంచ 46వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టియాఫో 5–7, 3–6, 7–5, 6–3, 7–6 (10/6)తో గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తొలి రెండు సెట్లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకోవడం విశేషం. 2022 సెమీఫైనల్లో అల్కరాజ్ చేతిలో, 2024 సెమీఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓడిపోయిన టియాఫో ఈసారి షెల్టన్‌పై గెలుస్తాడా లేదా వేచి చూడాలి. షెల్టన్, టియాఫోలలో ఎవరు గెలిచినా వారి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ అవుతుంది. కొత్త వరల్డ్ నంబర్‌వన్ రిబాకినా.. సెమీస్‌లో పెగులామహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) సెమీఫైనల్ చేరుకొని తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంది. క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 3–6, 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–3తో ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. -
అల్కరాజ్ గెలుపు గర్జన
న్యూయార్క్: గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ దూసుకుపోతున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ స్పెయిన్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 20వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ 6–4, 6–3, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ అల్కరాజ్కు ఇబ్బంది ఎదురుకాలేదు. మణికట్టు గాయంతో నాలుగు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేశాడు. టామీ పాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 33 విన్నర్స్ కొట్టాడు. 32 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను ఒక్కసారి మాత్రమే కోల్పోయాడు. సెమీఫైనల్లో చోటు కోసం అమెరికా ఆశాకిరణం, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ తో అల్కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ 6–2, 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. 1 గంట 52 నిమిషాల పోరులో షెల్టన్ 12 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోని ఈ అమెరికా ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2021 చాంపియన్, ఏడో సీడ్ మెద్వెదెవ్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 11వ సీడ్ టియాఫో (అమెరికా) 7–6 (7/1), 6–4, 7–6 (8/6)తో మెద్వెదెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 7–6 (8/6), 6–4, 6–4తో ఎచ్వెరీ (అర్జెంటీనా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నిలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.స్వియాటెక్ అవుట్మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్, 2022 చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. 121వ ర్యాంకర్ కిన్వెన్ జెంగ్ 7–5, 6–3తో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో సీడ్ నొస్కోవా (చెక్ రిపబ్లిక్), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పెగూలా 6–3, 6–4తో సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై, నొస్కోవా 7–5, 5–7, 6–4తో 11వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై, ఆండ్రీవా 5–7, 6–4, 6–3తో పొటపోవా (ఆ్రస్టియా)పై గెలుపొందారు. -
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్‌ను ఆపిన సబలెంకా
యూఎస్ ఓపెన్ 2026లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి అరినా సబలెంకా మ్యాచ్‌కు అనూహ్య అంతరాయం ఏర్పడింది. కోర్టు చుట్టుపక్కల నుంచి గంజాయి వాసన బలంగా వస్తుండటంతో ఆమె మ్యాచ్‌ను కాసేపు ఆపి అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 3-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ చేస్తుండగా కోర్టులోకి గంజాయి వాసన వస్తోందని సబలెంకా ఫిర్యాదు చేసింది."ఎవరో గంజాయి కాలుస్తున్నారు. వాసన చాలా బలంగా ఉంది. దయచేసి ఏదైనా చేయగలరా..?" అంటూ సబలెంకా అంపైర్‌ను కోరింది. అనంతరం మ్యాచ్ తిరిగి కొనసాగింది.మ్యాచ్ అనంతరం సబలెంకా ఈ ఘటనపై స్పందించింది. ఎవరైనా తమకు నచ్చిన విధంగా వినోదం పొందడంపై తనకు అభ్యంతరం లేదని, అయితే టెన్నిస్ కోర్టు సమీపంలో గంజాయి కాల్చకుండా ఉంటే మంచిదని చెప్పింది. అత్యుత్తమ స్థాయిలో ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వాసనను తట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందంటూ నవ్వులు పూయించింది.కాగా, యూఎస్ ఓపెన్ సందర్భంగా గతంలో కూడా ఆటగాళ్లు గంజాయి వాసనపై ఫిర్యాదులు చేశారు. ప్రాంగణంలో ధూమపానం అనుమతించకపోయినా, న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి వినోదం కోసం గంజాయి వినియోగం చట్టబద్ధం. సమీపంలోని ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ ప్రాంతం నుంచి గాలి ద్వారా వాసన టెన్నిస్ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, హ్యాట్రిక్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. మూడో రౌండ్లో 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్)పై కష్టపడి గెలిచి, ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. చదవండి: సబలెంకా జోరు -
US Open 2026: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ
యూఎస్ ఓపెన్ 2026 సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్ 3 ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ ఘణంగా బోణీ కొట్టాడు. గాయం కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న అతడు.. తొలి రౌండ్లో రష్యాకు చెందిన రోమన్ సఫియులిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు.ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6-4, 6-4, 6-4 తేడాతో సఫియులిన్ను ఓడించాడు. కుడి మణికట్టు గాయం కారణంగా ఏప్రిల్ తర్వాత సింగిల్స్ మ్యాచ్ ఆడని అల్కరాజ్కు ఇది అదిరిపోయే రీఎంట్రీ.గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా లేదా అనే సందేహాల మధ్య బరిలోకి దిగిన అల్కరాజ్, ఆరంభం నుంచే తన దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. సఫియులిన్ కొన్ని దశల్లో పోటీ ఇచ్చినా, కీలక పాయింట్లలో అల్కరాజ్ ఆధిపత్యం కొనసాగించాడు.గతేడాది యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన అల్కరాజ్ ఈసారి కూడా టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు టెన్నిస్‌కు దూరంగా ఉన్నప్పటికీ, తొలి మ్యాచ్‌లోనే తన ఫిట్నెస్, పోరాట పటిమను చాటుకున్నాడు. రెండో రౌండ్లో అల్కరాజ్ పోర్చుగల్‌కు చెందిన జామీ ఫరియాతో తలపడతాడు. చదవండి: US Open 2026: సబలెంకా శుభారంభం -
US Open 2026: సబలెంకా శుభారంభం
యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబలెంకా శుభారంభం చేసింది. ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఆమె, తొలి రౌండ్లో కొలంబియాకు చెందిన కామిలా ఒసోరియోపై 6-2, 6-4 తేడాతో సునాయాస విజయం సాధించింది. తద్వారా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. గత 21 యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ల్లో సబలెంకాకు ఇది 20వ విజయం కావడం విశేషం. రెండో రౌండ్లో సబలెంకా పోలినా ఇయాట్చెంకోతో తలపడనుంది.పేలవ ఫామ్యూఎస్ ఓపెన్‌కు ముందు సబలెంకా పేలవ ఫామ్‌లో ఉండింది. ఏప్రిల్ నుంచి ఆమె రికార్డు 17-7గా ఉంది. ఇటీవల ఆడిన రెండు హార్డ్కోర్ట్ టోర్నీల్లోనూ ప్రారంభ దశలోనే నిష్క్రమించింది. దీంతో యూఎస్ ఓపెన్‌లో ఆమె టైటిల్‌ను కాపాడుకోగలదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సబలెంకా తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసి తొలి రౌండ్‌ను అధిగమించింది.చదవండి: జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం! -
తొలి రౌండ్లోనే వీనస్ విలియమ్స్ అవుట్
యూఎస్ ఓపెన్-2026లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే దిగ్గజ నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా.. తాజాగా అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా మొదటి రౌండ్లో సోఫియా కెనిన్‌తో తలపడ్డ వీనస్ వరుస సెట్లలో 6-2, 7-6 (6) తేడాతో ఓటమిపాలైంది.కాగా జూలై 2025లో చివరిసారిగా సింగిల్స్ మ్యాచ్ గెలిచిన 46 ఏళ్ల వీనస్ విలియమ్స్‌కు ఇది వరుసగా 14వ ఓటమి కావడం గమనార్హం. అంతేకాదు 2019 తర్వాత వీనస్ తొలి రౌండ్లోనే వరుసగా ఓడిపోవడం ఇది ఆరోసారి. న్యూయార్క్‌లోని ఆర్థర్ స్టేడియంలో పురుషుల సింగిల్స్‌లో భాగంగా జకోవిచ్- మరియానో నవోనే మ్యాచ్ 4 గంటల 36 నిమిషాల పాటు సాగగా.. వీనస్- సోఫియా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.ఈ క్రమంలో ఆది నుంచే 27 ఏళ్ల సోఫియా వీనస్‌పై ఆధిపత్యం కనబరిచింది. కేవలం 32 నిమిషాల వ్యవధిలోనే ఆమె తొలి సెట్ గెలవడం ఇందుకు నిదర్శనం. అయితే, ఆ తర్వాత సోఫియా చేసిన తప్పులను తనకు అనుకూలంగా మార్చుకున్న వీనస్ సెకండ్ సెట్లో ఆకట్టుకుంది. కానీ ఆఖరికి సోఫియానే పైచేయి సాధించింది. కాగా అమెరికాకే చెందిన సోఫియా కెనిన్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2020లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచింది కెనిన్. -
US Open 2026: జకోవిచ్‌కు ఊహించని షాక్
యూఎస్ ఓపెన్-2026లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ తగిలింది. అర్జెంటీనాకు చెందిన యువ ఆటగాడు మరియానో నవోనె చేతిలో 7-6 (7/5), 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జకోవిచ్ ఓటమి చవిచూశాడు. సుదీర్ఘంగా సాగిన ఈ ఐదు సెట్ల పోరులో ఓడిపోవడంతో, జకోవిచ్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాడు. దీంతో 25వ మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న జకోవిచ్ కలలు ఆదిలోనే కరిగిపోయాయి. ఆది నుంచే ఇబ్బందిపడ్డ జొకోవిచ్వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆర్థర్ ఆషే స్టేడియం కప్పును పూర్తిగా మూసివేయగా.. 39 జకోవిచ్ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. పదే పదే తలపై ఐస్‌బ్యాగ్ పెట్టుకుని ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. కాసేపు ఏసీ వేయాలంటూ సూపర్వైజర్ను కోరాడు.ఇక చివరి సెట్‌కు ముందు మెడికల్ టైమ్ అవుట్ కూడా తీసుకున్నాడు. వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్య బృందాన్ని పిలిపించుకున్నాడు. కానీ మునుపటిలా మైదానంలో కదల్లేకపోయాడు. ఈ క్రమంలో జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన నవోనె సులువుగానే మ్యాచ్ గెలిచాడు.భావోద్వేగంతొలి రౌండ్లోనే ఓటమి నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన జకోవిచ్.. మైదానం వీడే సమయంలో అభిమానులకు అభివాదం చేశాడు. ప్రేక్షకులు లేచి నిలబడి అతడికి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.Novak Djokovic with a heartfelt moment to the crowd after his 1st round loss at the U.S. OpenHe struggled with his body tonight, but kept fighting for 4 hours & 36 minutes at 39 years oldLeaving with grace and & nothing but loveWhat a legend. 🥹 pic.twitter.com/wDO16xpKsa— The Tennis Letter (@TheTennisLetter) August 31, 2026


