ఫైన‌ల్లో స‌బ‌లెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు! | Sabalenka-Beat-Pegula-Enters Final-Eyes-Hat-trick-US Open 2026-Title | Sakshi
Sakshi News home page

US Open 2026: ఫైన‌ల్లో స‌బ‌లెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!

Sep 11 2026 12:31 PM | Updated on Sep 11 2026 12:50 PM

Sabalenka-Beat-Pegula-Enters Final-Eyes-Hat-trick-US Open 2026-Title

Photo Credit: Twitter

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మ‌హిళ‌ల సింగిల్స్ విభాగంలో బెలార‌స్ స్టార్ అరీనా స‌బ‌లెంకా ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీఫైన‌ల్లో స‌బ‌లెంకా 7-5, 6-2తో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై సునాయాస విజ‌యాన్ని అందుకుంది. 

కేవ‌లం రెండు సెట్ల‌లోనే ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేసిన స‌బ‌లెంకా నాలుగోసారి యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఇప్ప‌టికే 2024, 2025 యూఎస్‌ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన స‌బ‌లెంకా హ్యాట్రిక్‌పై క‌న్నేసింది. అంతేకాదు హార్డ్‌కోర్ట్‌పై వ‌రుస‌గా మూడో టైటిల్ అందుకునేందుకు స‌బ‌లెంకా అడుగు దూరంలో నిలిచింది. 

మ‌రో సెమీస్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్‌ను ఓడించిన రిబాకినా టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది. రేపు జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లో డిపెండింగ్ చాంపియ‌న్ స‌బ‌లెంకాతో రిబాకినా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక‌ గ‌తంలో రెండుసార్లు (2024, 2025 యూఎస్ ఓపెన్‌) ఫైన‌ల్లో పెగులాను ఓడించి టైటిల్ అందుకున్న స‌బ‌లెంకా ఈసారి పెగులాను సెమీస్‌లోనే చిత్తు చేయ‌డం విశేషం.

మ్యాచ్‌లో 29 విన్నర్లతో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన సబలెంకా మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడుతూ.. ‘నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. గత రెండు యూఎస్ ఓపెన్ టోర్నీల్లో పెగులాను ఫైనల్లో చిత్తు చేసి టైటిల్ అందుకుంటే, ఈసారి మాత్రం ఆమెతో పోటీ సెమీస్‌లోనే ఎదురైంది. 

ఇదే హార్డ్‌కోర్టుపై నెల రోజుల క్రితం పెగులా నన్ను సెమీస్‌లో ఓడించింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకున్నా (నవ్వుతూ). అయితే పెగులాను మ్యాచ్‌లో మాత్రమే ప్రత్యర్థిగా చూస్తాను. బయటం మేం మంచి స్నేహితులం. ఇక న్యూయార్క్ నగరం నాకు చాలా ఇష్టం. వరుసగా మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచిన నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చింది.

 

Read: నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement