PC: X
న్యూజిలాండ్‌తో రాబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. సర్రే జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినా.. హెడ్డింగ్లీ వేదికగా ఎసెక్స్‌తో పోరులో మాత్రం అతడు చెలరేగిపోయాడు.
తన స్పిన్ మయాజాలంతో ఎసెక్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఎసెక్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ యూపీ స్పిన్నర్ మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి కివీస్‌తో సిరీస్‌కు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు బలమైన సంకేతాలు పంపాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో యార్క్‌షైర్ విజయం సాధించింది.
ఇటీవల శ్రీలంక పర్యటనలో కుల్దీప్ యాదవ్‌కు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడే అవకాశం లభించింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ మొత్తం మీద అతడికి కేవలం 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో ఏకంగా అతడిని తుది జట్టు నుంచే తప్పించి, అతడి స్థానంలో సారాంశ్ జైన్‌కు చోటు కల్పించారు. అనారోగ్యం కారణంగానే కుల్దీప్‌కు విశ్రాంతి ఇచ్చామని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. కానీ అనారోగ్యం ఏమి లేదని, కావాలనే అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారనే ప్రచారం గట్టిగా సాగింది. ఏదేమైనప్పటికి కుల్దీప్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు మరోసారి గట్టి సమాధానమిచ్చాడు.
చదవండి: వైభవ్‌పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే


