ఐఫోన్‌ డ్యూ లాంచ్‌ : శాంసంగ్‌ సెటైర్లు మామూలుగా లేవుగా! | So Far So Same Samsung Roasts Apple Over Its First Foldable iPhone Duo | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ డ్యూ లాంచ్‌ : శాంసంగ్‌ సెటైర్లు మామూలుగా లేవుగా!

Sep 10 2026 6:14 PM | Updated on Sep 10 2026 6:43 PM

So Far So Same Samsung Roasts Apple Over Its First Foldable iPhone Duo

ఆపిల్ సంస్థ తన తొలి  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'iPhone Duo'ను అట్టహాసంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఆ పిల్‌ ఫోన్‌ లవర్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కానీ   ప్రత్యర్థి సంస్థ  శాంసంగ్ (Samsung) మాత్రం ఎద్దేవా చేస్తోంది. ఇన్నాళ్లకు ఫోల్డబుల్ టెక్నాలజీలోకి ఎంట్రీ ఇచ్చింది అంటూ సెటైర్లు వేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఫోల్డబుల్ సాంకేతికతలోకి ఆపిల్ ఆలస్యంగా అడుగుపెట్టడంపై శామ్‌సంగ్ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులతో ఎద్దేవా చేసింది.  ‘‘మేం  వదిలేసిన పదార్థాలను మీరు వేడి చేయడం పూర్తయ్యాక మాకు చెప్పండి’’ అంటూ  వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అంతేకాదు తామిక  త్రీ ఫోల్డ్‌  (tri-fold) స్క్రీన్‌లతో  రాబోతున్నాం అంటూ మరో పోస్ట్‌లో ఊరించింది. "ఇది సరికొత్త ది సిమ్స్ సీక్వెల్‌లా ఉంది", "ఇప్పటివరకు అంతా ఒకేలా ఉంది" అంటూ యాపిల్ డిజైన్‌ను విమర్శించింది.

శాంసంగ్‌    ఏడేళ్ల ముందే 2019లోనే తమ తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను లాంచ్ చేసింది. గడిచిన ఏడేళ్లలో శాంసంగ్, గూగుల్, మోటోరోలా వంటి బ్రాండ్లు పలు తరాల ఫోల్డబుల్ ఫోన్లను తెచ్చి స్క్రీన్ మడతలు (creases), హింజ్ నాణ్యత, ఫోన్ బరువు వంటి సమస్యలను పరిష్కరించాయి కూడా. 

సుమారు రూ. 1.67 లక్షలకు పైగా ధరలో  ఐఫోన్‌ డ్యూ లాంచ్‌ అయింది.  మడిచినప్పుడు చైనీస్ ఫోల్డబుల్ ఫోన్ల కంటే ఇది కాస్త మందంగా ఉన్నప్పటికీ, ఈ డివైజ్‌ను పూర్తిగా తెరిచినప్పుడు  7.6 అంగుళాల స్క్రీన్‌తో ఆపిల్‌  ఉత్పత్తుల్లోనే అత్యంత సన్నని (thinnest) ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది ఆలస్యంగా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్, మెరుగైన డిజైన్ ,డేటా ప్రైవసీ పరంగా తమ ఫోన్ ప్రత్యర్థుల కంటే మెరుగ్గా నిలుస్తుందని యాపిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం

 

ఇదీ చదవండి: ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్‌మీడియాలో పేలుతున్న మీమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement