1980s ఫొటో క్రేజ్.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్! | 1980s AI Photo Craze Cybercriminals Find a New Way to Scam Users | Sakshi
Sakshi News home page

1980s ఫొటో క్రేజ్.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్!

Sep 10 2026 6:29 PM | Updated on Sep 10 2026 7:10 PM

1980s AI Photo Craze Cybercriminals Find a New Way to Scam Users

ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980ల వింటేజ్ ఫొటోల ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. యూజర్లు తమ ఫొటోలను చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌లోకి అప్‌లోడ్ చేసి, వాటికి పాతకాలపు లుక్ ఇస్తున్నారు. 1980ల నాటి హెయిర్‌స్టైల్, దుస్తులు, ఆభరణాలు, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్ వంటి మార్పులతో ఫొటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు కూడా.. దీనిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటోల పేరుతో మోసాలు
వింటేజ్ ఫొటోలు క్రియేట్ చేస్తామంటూ.. కొందరు నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్, సోషల్ మీడియా లింకులను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. వాటిని నమ్మి ఫొటోలు అప్‌లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం లేదా ఇతర సున్నితమైన వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మరికొన్ని.. నకిలీ ఏఐ టూల్స్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి, వాటి ద్వారా ఫోన్‌లోకి మాల్వేర్ పంపించే అవకాశం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏఐ ఫొటోలు తయారు చేసుకోవాలనే ఆసక్తితో తెలియని వెబ్‌సైట్లు, యాప్స్ లేదా అనుమానాస్పద లింకులను ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఫొటోలు, గుర్తింపు పత్రాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారాన్ని తెలియని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నప్పటికీ, ఆన్‌లైన్ భద్రతను మాత్రం మర్చిపోవద్దని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement