ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్‌ దంపతులు | IAS IPS Couple Now Posted in the Same District | Sakshi
Sakshi News home page

ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్‌ దంపతులు

Sep 10 2026 7:30 AM | Updated on Sep 10 2026 8:09 AM

IAS IPS Couple Now Posted in the Same District

సాక్షి, చెన్నై : తమిళనాడు ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే జిల్లాలో భార్యాభర్తలిద్దరూ కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్‌ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం  14 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా సిప్‌కాట్‌  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారిణి కేథరీన్‌ శరణ్యను వేలూరు  మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. ఈమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, కేథరీన్‌ శరణ్య భర్త శివరామన్‌  ఇప్పటికే వెలూరు జిల్లా  జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెల్లూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన భార్య కూడా అదే జిల్లాకు కార్పొరేషన్‌ కమిషనర్‌గా రావడం విశేషం. 

తొలి మహిళా కమిషనర్‌ రికార్డు 
2008లో వెల్లూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా హోదా పెంచిన తర్వాత, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న తొలి మహిళా అధికారిగా కేథరీన్‌ శరణ్య రికార్డు సృష్టించారు.  

చదవండి: ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement