వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌.. | YS Jagan Press Meet Today In Tadepalli At 11 AM, Key Focus On Contemporary Issues | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌..

Sep 10 2026 9:19 AM | Updated on Sep 10 2026 12:57 PM

Key highlights of YS Jagans media conference

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. మెగా డీఎస్సీ కుంభకోణం గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌

  • 2025 మెగా డీఎస్పీలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి.
  • డీఎస్సీ అక్రమాలు బయటికొచ్చే కొద్దీ బాబులో బీపీ పెరుగుతోంది.
  • నా ప్రశ్నలకు బాబు, లోకేష్‌ సమాధానం చెప్పలేదు
  • ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారు.
  • రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రం తయారీ
  • 2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎ‍స్సీ
  • ప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టారు.
  • మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. బుల్డోజ్‌ చేస్తారు
  • ఫస్ట్‌ ర్యాంకర్‌ను వెరికేషన్‌కు ఎందుకు పిలవలేదు?
  • డీఎస్సీపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించాం
  • పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?
  • ఎస్‌ఈఆర్‌టీలో వ్యక్తికి ఫస్ట్‌ ర్యాంక్‌ ఎలా వచ్చింది?
  • మెరిట్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ ర్యాంకర్‌ పేరును ఎందుకు మార్చారు?
  • ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?
  • కోర్టుకు ఫస్ట్‌ ర్యాంకర్‌ ఎందుకు వెళ్లాడు.
  • జీవో నంబర్‌ 4, 47తో గేట్లు తెరిచారు.
  • ఆడియో, వీడియో కాల్స్‌ బయటకు వచ్చాయి.
  • డిఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు.
  • ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్‌లు పుట్టుకొస్తున్నాయి.
  • బాబు స్కామ్‌ల హిస్టరీలో ఇదొక ఆణిముత్యం
  • తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు.
  • నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
  • పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కుమ్మక్కయ్యారు
  • కొడుకును కాపాడాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.
  • వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.
  • 2013 జూడో సీనియర్‌ పోటీలో ఖమ్మంలో జరిగినట్లుగా ఏపీ జూడో అసోసియేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది.
  • ఖమ్మంలో అసలు సీనియర్‌ పోటీలు జరగలేదని తెలంగాణ అసోసియేషన్‌ తేల్చి చెప్పింది.
  • విశాఖలో అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు.
  • దొంగ సర్టిఫికెట్లు చూపినట్లు ఆధారాలున్నాయి.
  • ఏపీ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు.. లోకేష్‌ తోడల్లుడు భరత్‌.
  • డీఎస్సీ-2025, మెగా డీఎస్సీ కాదు, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన డీఎస్సీ అని చాలా రోజులుగా చెప్తున్నాం.
  • గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నారు.
  • ఇవిచూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి.
  • మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయి.
  • మరోవైపు సోషల్‌మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్‌ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. 
  • ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో అనేక సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించాను.
  • నేను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్‌. ఇందులో అర్థంకాకపోవడానికి కూడా ఏమీ లేదు.
  • గతంలోనైనా, ఎప్పుడైనా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు.
  • డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలనుకూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడంలేదా?
  • స్పోర్ట్స్‌ కోటా జీవోను మార్చి, అదివరకే ఉన్న 2% స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షే లేకుండా, డైరెక్ట్‌గా జీవో 4,47లతో గేట్లు ఎత్తారు.
  • పని అయిపోయాక, మళ్లీ జీవో నంబర్‌ 23, 25, జీవో నంబర్‌ 56 లతో, గేట్లు మూసేశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి?
  • టీచర్‌ పోస్టులకోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్‌ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది మొదలు, స్టేషనల్‌ బెయిల్‌ ఇచ్చి పంపడం వరకూ, ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? పైగా రిమాండ్‌కు పంపాం అంటూ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. 
  • ఇవే బేసిక్‌గా మెగా డీఎస్సీ స్కాంకు సంబంధించి పునాదులు.
  • ఇప్పుడు బయటకు వస్తున్న కేస్‌స్టడీస్‌ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోంది.
  • బాబుగారి స్కాంల హిస్టరీలో మరో ఆణిముత్యం ఇది.  నిరుద్యోగ యువకులను నట్టేటా ముంచి స్కాం ఇది.
  • స్పోర్ట్స్‌కోటా పేరుతో వీళ్లు చేసిన అక్రమాలు చూస్తే, వీడు మనవాడా? ఇతను దగ్గరనుంచి డబ్బులు ముట్టాయా… అయితే ఇచ్చేయ్‌ టీచర్‌ పోస్టు.. అన్న పద్ధతిలో ఈ రిక్రూట్‌మెంట్‌ చేశారు.
  • జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు.
  • పై స్థాయి నుంచి ఆదేశాలతో, కింది స్థాయి వరకూ కుమ్మక్కై, ఒక మోడస్‌ ఆపరండీ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ భర్తీచేశారు.
  • సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్‌ స్టడీకూడా చెప్తోంది.
  • స్పోర్ట్స్‌లో కోటా భర్తీచేసిన వాళ్ల జాబితా చూస్తే ‘జూడో ఆట’తో మొత్తం 39  మందికి ఎలాంటి ఎగ్జామ్‌ లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారు.
  • సాఫ్ట్‌బాల్‌ పేరిట, 38 మందికి ఇలానే పరీక్ష రాయకుండానే, టీచర్‌ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎవరంటే, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌.
  • మరికొన్ని కేసుల్లో  అయితే, శాపే చక్రంతిప్పింది.
  • విశాఖపట్నంలో ఏ ఎగ్జామ్‌ రాయకుండానే ‘యోగేశ్వర్రావు’ అనే అభ్యర్థికి స్పోర్ట్స్‌ కేటగిరీలో ఎస్‌జీటీ టీచర్‌ పోస్టు ఇచ్చారు.
  • ఈయన చెల్లెలికి కూడా ఇలానే స్పోర్ట్స్‌ కేటగిరీలో పోస్టు ఇచ్చారు.
  • కాని వీళ్లు విజేతల జాబితాలో లేరని తెలంగాణ ఖో – ఖో అసోసియేషన్‌ చాలా స్పష్టంగా చెప్తూ, ఆరోజు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను విడుదలచేశారు.
  • అంటే, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కుని. ఆమేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతోంది.
  • కాని ఏడుసార్లు వెరిఫికేషన్‌ చేయించామని చంద్రబాబు అధికారులతో చెప్పిస్తున్నారు.
  • కొన్ని కేసుల్లో, అభ్యర్థులు టెట్‌ పాస్‌ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.
  • ఒక కేటగిరీలో టెట్‌ అర్హత ఉంటే, మరో సబ్జెక్ట్‌కు సంబంధించి టీచర్‌ పోస్టు ఇచ్చారు.
  • ఇంకొన్ని కేసుల్లో అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్‌ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్‌లో పోస్టు ఇచ్చారు.
  • కర్నూలు జిల్లాలో ‘ఈడిగ ప్రభాకర్’ అనే అభ్యర్థికి, ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం ఇచ్చారు.
  • తన రిజర్వేషన్‌ కేటగిరి ప్రకారం ఎస్‌జీటీ పోస్టుకు టెట్‌లోలో 75 మార్కుల రావాలి.
  • కాని, 65 మార్కులు వచ్చినా, స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్ట్‌ ఇచ్చారు.
  • ఈ విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. మరి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఇచ్చారు?
  • ఈడిగ ప్రభాకర్‌కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని ఈ కేసును ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నంచేశారు.
  • కాని వీరు చూపిన హాల్‌ టికెట్‌ నంబర్‌ ఆధారంగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి, టెట్‌ డేటా చూస్తే,ఈ 77 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అంటే 2B కేటగిరీకి సంబంధించిన మార్కులు.
  • మరి ఇతనికి టెట్‌ 1ఏ-లో ఉన్న, ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?
  • ఈడబ్యుఎస్‌ రిజర్వేషన్‌ పేరిట పెద్ద ఎత్తున రాకెట్‌ నడిచినట్టు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి.
  • ఇతర కులాలకు చెందిన వాళ్లకు ఈడబ్యుఎస్‌ కింద పోస్టులు ఇచ్చారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
  • కడప జిల్లాలో రసూల్‌ అనే వ్యక్తి బీసీ-ఈ కేటగిరీ అయితే, 2009, 2012, 2018లో బీసీ-ఈ కిందే డీఎస్సీ పరీక్షలకోసం అప్లై చేస్తే, ఇప్పుడు మాత్రం అతనికి ఓసీ- ఈడబ్ల్యూఎస్‌ కింద పోస్టు ఇచ్చారు.
  • 1:1 రేష్యోలో అధికారుల వెరిఫికేషన్‌ ఏశాక, దాన్ని దాటి పోస్టులు ఎలా ఇవ్వగలిగారు? ప్రతి అభ్యర్థి  సర్టిఫికెట్లను 7సార్లు వెరిఫైచేశామని చెప్తున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎందుకు జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా, పోస్ట్‌లు ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఈ పనిచేశారు?
  • నిరుద్యోగ యువతకోసం న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నాం.
  • అర్హత లేనివారికి ఎవరు చెబితే పోస్ట్‌ ఇచ్చారు?
  • అసలు ఏ పరీక్షా లేకుండానే పోస్ట్‌లు ఇవ్వడం పెద్ద స్కాం.
  • నాలాంటి వాడు కూడా కాక్రోచ్‌ అవుతాడు- వైఎస్‌ జనన్‌
  • చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేయగలరా?
  • ఏ పరీక్షా లేకుండా గర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కాం
  • మరి అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబుగారి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, ఆయన కింద పనిచేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా?
  • చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, ఆయన కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా?
  • అందుకే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా  కోర్టులోనూ పోరాడుతున్నాం.
  • మరి కాక్రోచ్‌లు ఊరికే రావు. వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్‌లు వస్తాయి. నాలాంటి వాడుకూడా కాక్రోచ్‌ అవుతాడు.
  • మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే, టీచర్‌ పోస్టులు  కట్టబెట్టిన వీళ్లు, ఏపీపీఎస్‌సీలో కూడా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.
  • అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తే. అందులో 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీఓ నంబర్‌-4నే మీరు వాడుకున్నారు.
  • డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రికక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు.
  • ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల  భర్తీని నిలిపేశారు.
  • లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్‌ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.
  • ఇంత కష్టపడితే చివరకు స్కాంలతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని పోస్టులు ఇస్తున్నారు.
  • ప్రభుత్వంమీద, వ్యవస్థలమీద మరి నమ్మకం ఎవరికైనా ఎలా ఉంటుంది?



     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement