కాక్రోచ్‌లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్‌ జగన్‌ | DSC Scam Is Best Of CBNs Scam History Says YS Jagan | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్‌ జగన్‌

Sep 10 2026 12:02 PM | Updated on Sep 10 2026 12:28 PM

DSC Scam Is Best Of CBNs Scam History Says YS Jagan

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్‌ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.

డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్‌లు(కాక్రోచ్‌ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్‌ జగన్‌​ అన్నారు.

డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్‌ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు, టీడీపీ ఎంపీ భరత్‌ అని చెప్పారు. సాఫ్ట్‌ బాల్‌ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement