ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సిద్ధమైంది.
మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పంచనామా' వెబ్‌సిరీస్‌లో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించారు.
ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు.
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా 'పంచనామా' రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
సెప్టెంబర్ 11 నుంచి జీ5లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


