అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్‌ కేరళ కార్యకలాపాలు | Sabarimala: Waste transport by Clean Kerala Company Ltd was halted | Sakshi
Sakshi News home page

అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్‌ కేరళ కార్యకలాపాలు

Sep 9 2026 3:54 PM | Updated on Sep 9 2026 4:25 PM

Sabarimala: Waste transport by Clean Kerala Company Ltd was halted

పంబ , సన్నిధానంలో పనులు ప్రారంభించిన ఒక్క రోజే క్లీన్ కేరళ కంపెనీ తన వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలను అర్థాంతరంగా నిలిపేసింది. దాంతో  శబరిమల వ్యర్థాల నిర్వహణ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. దాదాపు ఒక ఏడాది పాటు జరిగిన చర్చల అనంతరం, శబరిమల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ వేరు చేసి తొలగించాలని ఒక అవగాహనకు వచ్చారు. 

ఈ ప్రణాళికలో భాగంగా, వేరు చేసిన వ్యర్థాల మొదటి విడతను సిద్ధం చేశారు. జీవవిచ్ఛిన్నం కానీ వ్యర్థాల సేకరణ అధికారిక ప్రారంభోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే , ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు. కొంతమంది అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాల సేకరణ మరియు విభజన నుండి క్లీన్ కేరళ కంపెనీని మినహాయించారు.

టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో , ప్రస్తుతానికి సన్నిధానం నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే సంచులలో ప్యాక్ చేసి పంబకు తరలించాలని నిర్ణయించారు. సన్నిధానం, పంబలోని వివిధ ప్రాంతాల నుండి చెత్త , ప్లాస్టిక్ బాటిల్స్ , గాజు సీసాలు , స్క్రాప్ సామాగ్రి మరియు నిర్మాణ శిధిలాలతో సహా పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసి తొలగించాలన్నది అసలు ప్రణాళిక. ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం , పునర్వినియోగించదగిన పదార్థాల కోసం దేవస్థానం బోర్డు ఒక స్థిరమైన మొత్తాన్ని అందుకుంటుంది, అయితే మిగిలిన వ్యర్థాలను శుద్ధి చేసి, పారవేసినందుకు రుసుములు వసూలు చేస్తారు కూడా. 

ఈ విషయమై ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదరలేదు. అయితే శబరిమల యాత్రా కాలం సమీపిస్తుండటంతో , ఒప్పందం ఇంకా కుదరకపోయినప్పటికీ పనులు ప్రారంభించాలని క్లీన్ కేరళ కంపెనీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఒక వాహనంతో శబరిమలకు చేరుకుని వ్యర్థాల తొలగింపు పనులను ప్రారంభించారు. తీరా ప్రారంభించాక ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ ఏర్పాటుపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ పనులను తక్షణమే నిలిపివేశారు. 

కాగా, క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ (CKCL) కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని చెబుతున్నారు అధికారులు.  కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కార్మిక వివాదాలు, అలాగే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లతో ఏర్పడిన సమన్వయ లోపాల వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే కొన్ని కార్మిక సంఘాలు నోక్కుకూలి' (పని చేయకుండానే డిమాండ్ చేసే అక్రమ కూలి) కోసం పట్టుబట్టడం కూడా ఒక కారణమనేది అధికారిక వర్గాల సమాచారం. 

(చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement