భార్య కోసం పోలీసు వాహనమే ఎత్తుకెళ్లాడు! | Thief Steals Police Patrol Vehicle! | Sakshi
Sakshi News home page

భార్య కోసం పోలీసు వాహనమే ఎత్తుకెళ్లాడు!

Sep 9 2026 9:25 AM | Updated on Sep 9 2026 9:26 AM

Thief Steals Police Patrol Vehicle!

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పోలీసు పెట్రోలింగ్‌ వాహనం చోరీకి గురైంది. మద్యానికి బానిసైన రజీ్వచమన్‌కు చెందిన ఎండీ.ఇజాజ్‌ భార్య గొడవ కారణంగా కాపురానికి రావడంలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అతడు కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను తీసుకొచ్చేందుకు సహకరించాలని పోలీసులను కోరాడు. ఈ సమయంలో పోలీసులు అతడిని పట్టించుకోవడంలేదనే కోపంతో అక్కడే పార్కింగ్‌ చేసిన పెట్రోలింగ్‌ ఇన్నోవా వాహ నాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. 

అప్రమత్తమైన రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించి వరంగల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఇజాజ్‌ వరంగల్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న క్రమంలో ఎల్కతుర్తి శివారులో వాహనం ప్రమాదానికి గురైంది. బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏసీపీ, సీఐలు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు.  

చదవండి: ఇందిరమ్మ టవర్స్‌ డిపాజిట్‌ వాపస్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement