తమాషా చేస్తున్నారా? లోపలేస్తా! | BRS Social Media Convenor Krishank Detained By Police After Heated Scene At His Residence | Sakshi
Sakshi News home page

తమాషా చేస్తున్నారా? లోపలేస్తా!

Sep 9 2026 7:42 AM | Updated on Sep 9 2026 9:32 AM

Karkhana CI Anuradha Overaction At BRS Leader Krishank's House

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ ముందస్తు అరెస్టు కోసం కంటోన్మెంట్‌ ఐదోవార్డు గృహలక్ష్మి కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన కార్ఖానా సీఐ అనూరాధ దురుసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం క్రిశాంక్‌ ఇంట్లోకి వెళ్లేందుకు సీఐ, ఇతర సిబ్బంది యత్నించారు. ఇంటికి లోపలి నుంచి తాళం ఉండటంతో పనివాళ్లతో వాగ్వాదానికి దిగారు. 

ఇంట్లో క్రిశాంక్‌ భార్య, చిన్న పాప మాత్రమే ఉందని చెప్పినా వినకుండా తలుపులు తీయాలంటూ పనివాళ్లను గద్దించారు. తమాషాలు చేస్తున్నారా? లోపలేస్తానంటూ కార్ఖానా సీఐ బెదిరించడం గమనార్హం. ఇంతలో క్రిశాంక్‌ భార్య సుహాసిని బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేడని చెబుతుండగా, ఫోన్‌ లోకేషన్‌ ఇక్కడే చూపిస్తుందని వాదించారు. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన క్రిశాంక్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.  

చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement