పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు | Passport To 13Days Old Child | Sakshi
Sakshi News home page

పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు

Sep 9 2026 7:17 AM | Updated on Sep 9 2026 8:05 AM

Passport To 13Days Old Child

యంగెస్ట్‌ పాస్‌పోర్టు హోల్డర్‌గా రికార్డు సాధించిన చిన్నారి వజ్రపు అగస్త్య ప్రిన్సి

ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన వజ్రపు అగస్త్య ప్రిన్సి అనే చిన్నారి పుట్టిన 13 రోజులకే ఇండియన్‌ పాస్‌పోర్టు పొంది ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్‌ రెండో కుమారుడు ఆశిష్‌ వ్యాపార రీత్యా లండన్‌లో నివాసముంటున్నారు.

 ఆశిష్‌ కు మే నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో కుమార్తె జన్మించింది. చిన్నారి పాస్‌పోర్టు కోసం విశాఖపట్టణంలో దరఖాస్తు చేసుకోగా 2026 జూన్‌ నెల 12వ తేదీన పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌ పోర్టుని జారీచేసింది. దీంతో 13 రోజుల్లో పాస్‌పోర్టు పొందిన చిన్నారిగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు మంగళవారం సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.    

చదవండి: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement