నో జిమ్‌, సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌? | No gym just walk The wellness trend everyone is talking about | Sakshi
Sakshi News home page

నో జిమ్‌, సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌?

Sep 8 2026 1:14 PM | Updated on Sep 8 2026 2:32 PM

No gym just walk The wellness trend everyone is talking about

బరువు తగ్గేందుకు సాధారణంగా అందరూ ఎంచుకునేంది జిమ్‌లో కసరత్తులు, క్రాష్‌ డైటింగ్‌లూను. ఇపుడు  సోషల్ మీడియాలో మరో వెల్నెస్ ట్రెండ్ వచ్చింది. బరువు తగ్గడంతోపాటు, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇది 'అత్యంత సులభమైన వ్యాయామాలలో' ఒకటి అంటూ తెగ ప్రచారం అవుతోంది. దాని పేరే లింఫాటిక్ వాకింగ్ (Lymphatic Walking). అసలేంటీ ట్రెండ్‌. ఎలా పనిచేస్తుంది? దీని లాభాలు, నష్టాలు తెలుసుకుందాం ఈ కథనంలో.

ఆలియా భట్ నుండి హేలీ బీబర్ వరకు, లింఫాటిక్ డ్రైనేజ్ గురించి చర్చ తెగ హల్‌ చల్‌ చేప్తోంది. కొన్నిసార్లు ఫేషియల్ మసాజ్ రూపంలో, కొన్నిసార్లు ఈ ట్రెండింగ్ నడకల రూపంలో. లింఫాటిక్ వాకింగ్ అనేది సాధారణ నడకలాంటిదే. కానీ ఇందులో ప్రత్యే మైన వేగంతో శరీర కదలికలు (చేతులు, శ్వాస తీసుకునే, అడుగులు) ఉంటాయి, గుండె రక్తాన్ని పంప్ చేసినట్లుగా, లింఫాటిక్ వ్యవస్థకు ద్రవాలను పంప్ చేయడానికి సొంత అవయవమేదీ ఉండదు.  అందుకే కేవలం శరీర కండరాల కదలికలు, డీప్‌ బ్రీతింగ్‌ ద్వారా మాత్రమే ఈ లిక్విడ్‌ ముందుకు కదులుతుంది. ఇది కణజాలాల నుండి అదనపు ద్రవాన్ని బయటకు పంపడానికి సహాయ పడుతుంది, రోగనిరోధక శక్తి పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని లింఫ్ వ్యవస్థను (రక్తనాళాల తరహాలోనే ద్రవాలను ప్రసరింపజేసే వ్యవస్థను) చురుగ్గా ఉంచడానికి చేసే ప్రత్యేకమైన, సరళమైన  ప్రక్రియ. ప్రతి అడుగు లేదా కదలికతో కండరాలు సంకోచించినప్పుడు, అవి వాటి పక్కన ఉన్న లింఫాటిక్ నాళాలను సున్నితంగా నొక్కి, ఈ ఏకమార్గ నాళాల ద్వారా ద్రవాన్ని ముందుకు నెడతాయి. దీన్నే మజిల్ పంప్ అంటాం.

ఇదీ చదవండి: సౌండ్‌ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు

 

లింఫాటిక్ వాకింగ్ 
Arm Swings నడిచేటప్పుడు చేతులను చాతి మరియు భుజాల స్థాయి వరకు కొద్దిగా పైకి, ముందుకు-వెనుకకు బాగా ఊపుతూ నడవడం.  ముక్కు ద్వారా గాలిని లోతుగా పీల్చుకుంటూ, నోటి ద్వారా వదులుతూ నడవడం.

అడుగుల కదలిక: మడమ (Heel) నుండి మొదలుపెట్టి కాలి వేళ్ల (Toe) వరకు పాదాన్ని నేలకు బలంగా ఆనిస్తూ అడుగులు వేయడం (Heel-to-toe pattern).

 

ప్రయోజనాలు:

  • వాకింగ్‌ ద్వారా వచ్చే లాభాల మాదిరిగానే క్రమంగా బరువు అదుపులోకి వస్తుంది.

  • కాళ్లు, చేతుల్లో నీరు పట్టడం  (Water Retention / Edema) వల్ల వచ్చే వాపు తగ్గుతుంది.

  • శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు త్వరగా బయటకు పంపేస్తుంది. 

  • తల్ల రక్తకణాలు శరీరంలో బాగా వ్యాపించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది.

  • జీర్ణక్రియ , రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

నోట్‌ : సాధారణ నడక కంటే లింఫాటిక్ వాకింగ్ ఎక్కువ శరీర కొవ్వును కరిగిస్తుందనడానికి లేదా ఒక ప్రత్యేకమైన “డిటాక్స్” ప్రభావాన్ని అందిస్తుందనడానికి ప్రస్తుతం బలమైన ఆధారాలు లేవు. డెస్క్ జాబ్స్ చేసేవారు, ఎక్కువ గంటలు ప్రయాణించే వారు, ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వ్యక్తులకు నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ వ్యాయామమైనా నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా, పట్టుదలగా చేయడం ముఖ్యం అనేది గమనించాలి.

ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్‌, దుబాయ్‌లో సింగర్‌ హఠాన్మరణం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement