సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రజల ప్రాణాలమీదికి తీసుకొస్తున్నా,తీరు మారడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక యువకుడు డేంజరస్ స్టంట్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాస్‌ల్యాండ్స్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న పహుంజ్ డ్యామ్ వద్ద ఈ సంఘటన జరిగింది.
రక్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వాయి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ కుమారుడు, 38 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ (32) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సమీపంలోని పహూజ్ డ్యామ్‌ను చూడటానికి వెళ్లాడు ఇన్‌స్టారీల్ కోసం ఒక స్టంట్ చేయాలను పూనుకున్నాడు. స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తుండగా, పుష్పేంద్ర డ్యామ్‌లోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న బాండ్రీ వాల్ ఎక్కి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్‌లోకి దూకాడు.
Jhansi - A young man suffered fractures in both legs after he jumped from a 30-foot-high dam in Jhansi while trying to shoot a social media reel. The incident took place at Pahuj Dam. Pushpendra Kumar Manauriya, 32, a resident of Parwai village under Raksa police station, had… pic.twitter.com/HpowlS0MO7
— NextMinute News (@nextminutenews7) September 7, 2026
డ్యామ్‌లో నీళ్లు ఎక్కువగా ఉంటాయని భావించి దూకినప్పటికీ, ఆ ప్రదేశంలో నీరు చాలా తక్కువగా ఉండటంతో నేరుగా నేలను బలంగా తాకాడు. ధఋఃథక్ష అతడి రెండు కాళ్లు తీవ్రంగా విరిగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితులు, స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పుష్పేంద్రను డ్యామ్ నుంచి బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం
నోట్ : సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం లేనిపోని సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు గతంలో చాలా చూశాం. ఇప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి, తల్లితండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. కొన్ని సెకన్ల రీల్ లేదా వైరల్ వీడియోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయవద్దని పోలీసులు, ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్


