ప్రతిసారి 'బిగ్‌బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్‌ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్‌లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. (Varshini Sounderajan)
ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. (bigg boss telugu 10)
వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది.
తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.
మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?
(Images Source : Instagram/varshini_sounderajan)


