రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్‌ వ్యవసాయం ..! కట్‌చేస్తే .. | Chandigarh Man Rs 90 Lakh Salary To Rs 1.44 Crore Microgreens Business | Sakshi
Sakshi News home page

రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్‌ వ్యవసాయం..! కట్‌చేస్తే ఏకంగా రూ. 1.44 కోట్లు..

Sep 7 2026 4:15 PM | Updated on Sep 7 2026 4:39 PM

Chandigarh Man Rs 90 Lakh Salary To Rs 1.44 Crore Microgreens Business

చాలామందికి కార్పొరేట్‌ జీవితంలో లక్షల్లో జీతం ఆర్జించాలన్నది డ్రీమ్‌. అందుకోసం ఎంతలానో కష్టపడుతుంటారు. కానీ కొందరు అంత లగ్జరీ లైఫ్‌ని సునాయాసంగా కాదనుకుని వ్యవసాయం వైపుగా అడుగులు వేసి రైతులనకు అండగా నిలుస్తుంటారు. ఆ క్రమంలో కొందరు భారీ లాభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్‌ నిఝూవన్‌ కూడా. అతడు ఏ పది, ఇరవై లక్షల జీతం కూడా ఏ రేంజ్‌ కార్పొరేట్‌ జీతాన్ని కాదనుకున్నాడో వింటే నోటమాటరాదు. మరి ఆ వ్యక్తి అంత లగ్జరీ లైఫ్‌ వదులుకుని అంతకుమించిన సక్సెస్‌ని ఎలా అందుకున్నాడో తెలుసుకుందామా..!.

చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్‌ నిఝూవన్‌ బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి మంచి మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. హాయిగా బిందాస్‌లా సాగిపోతున్నా లైఫ్‌కి సడెన్‌ బ్రేక్‌లు వేసి..అగ్రికల్చర్‌ రంగం వైపుకి అడుగులు వేశాడు. అది కూడా ఎలాంటి వ్యవసాయం ఎంచుకుంటే బెస్ట్‌ అని కూలంకషంగా తెలుసుకునేందుకు 2020లో తన ఉద్యోగానికి రిజైన్‌ చేసేశాడు. నియంత్రిత వాతావరణంలో పెంచగలిగే పోషకాలు అధికంగా ఉండే మొక్కతోట కూరలైన మైక్రోగ్రీన్‌ అనే ఇండో ఫార్మింగ్‌ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. 

అనుకున్నదే తడుపుగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు గానీ..పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే..తక్కువ మొత్తంలో పెట్టి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు మోహిత్‌. అందుకే కేవలం రూ. 30 వేలతో చండీగఢ్‌లోని తన ఇంటి రెండో అంతస్థులో వంద చదరపు అడుగుల స్థలంలో మైక్రోగ్రీన్స్‌ని పెంచడం ప్రారంభించాడు. తొలినాళ్లలో సాగు, ఉత్పత్తి, వినియోగదారులు కొనుగోలు చేసేలా వ్యాపార నమునాని నిర్మించడం వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. 

ఒక చిన్న ప్రయోగంగా మొదలుపెట్టి క్రమంగా ఎవర్‌గ్రీన్‌ మైక్రోగ్రీన్‌గా ఎదగడం ప్రారంభించింది. అలా చిన్న ర్యాక్‌ కాస్తా మూడు ర్యాక్లు, ట్రేలుగా వర్టికల్‌ ఇండోర్‌ఫామ్‌ని స్థాపించాడు. ప్రారంభంలో 21 సేంద్రీయా రకాలపై దృష్టిసారించి రసాయనాలు వినియోగించకుండా సాగు చేస్తే గణనీయమైన ఫలితం వచ్చింది. దాంతో నెమ్మదిగా తన ఫామ్‌ని 500 చదరపు అడుగులకు విస్తరించేలా సొంతంగా ఫామ్‌ని ఏర్పాటు చేశాడు. అది కాస్తా విస్తరించి ఏకంగా 12 వేల ట్రైలు ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి చేరుకుంది. 

అలా ప్రస్తుతం అతను నెలకు 12 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి ఏకంగా 1.44 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. కేవలం చిన్న వ్యాపార ప్రయోగంగా మొదలు పెట్టి..కోట్ల ఆదాయానికి చేరుకున్నాడు. అంతేగాదు ఇంటి మిద్దె నుంచి మొదలై..సొంతంగా ఫామ్‌ని నిర్మించుకునే రేంజ్‌కి వెళ్లాడు. అలాగే ఈ మైక్రోగ్రీన్స్‌ వ్యాపారంలోకి రావాలనుకునే రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. 

ఇ​క్కడ సాగు తోపాటు వాణిజ్యపరమైన అంశాలపై పట్టు సాధించడంతో విజయం సాధించగలిగాడు. అందుకని రైతులకు కూడా ఈ అంశాల్లో తర్ఫీదు పొందేలా సాయం చేస్తుంటాడు. ​కాగా మోహిత్‌ తన మైక్రోగ్రీన్‌ వ్యాపార సక్సెస్‌ జర్నీని నెట్టింట షేర్‌ చేసుకోవడంతో గొప్ప ప్రయాణం మిత్రమా..నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.

 

(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement