‘పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చారు’ | Allari Naresh Spoke About Jamba Lakidi Pamba Movie | Sakshi
Sakshi News home page

Allari Naresh: ‘పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చారు’

Sep 5 2026 5:46 PM | Updated on Sep 5 2026 6:11 PM

Allari Naresh Spoke About Jamba Lakidi Pamba Movie

ఈవీవీ సత్యనారాయణ. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు వినోదాత్మక చిత్రాలంటే గుర్తు వచ్చే మొదటి డైరెక్టర్‌ ఈయన. సినిమా చేసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు చివరి వరకు కుర్చిలో కూర్చొపెట్టడంలో డైరెక్టర్‌ సత్యనారాయణకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన తీసిన సినిమాలు అలాంటివి మరి. ‘ప్రేమ ఖైదీ’, ‘హలో బ్రదర్‌’, ‘అల్లుడా మజాకా’, ‘జంబలకిడి పంబ’, ‘కన్యాదానం’ వంటి మరెన్నో చిత్రాలు తీశారు.  ‘జంబలకిడి పంబ’తో ఓ డిఫరెంట్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఈ మూవీ కోసం అల్లరి నరేష్‌ ఓ బ్రాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌.. రైతుబిడ్డ ఝాన్సీ
రివర్స్‌ గేర్‌గా ..
‘జంబలకిడి పంబ కథను నాన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రాసుకున్నారు. ఈ సినిమాని నరేశ్‌ గారిని హీరోగా పెట్టి తీశారు. అయితే కథ వినిపించినప్పుడు టైటిల్‌ పేరు ‘రివర్స్‌ గేర్‌’ అని ఫిక్స్‌ అయ్యారు. కథలో అంతా రివర్స్‌గా జరుగుతుంటది అని.  రివర్స్‌ గేర్‌ అంటే బాగోదేమో, నెగెటివ్‌ టాక్‌ వెళ్తుంది అని నరేశ్‌గారు అభిప్రాయ పడ్డారు. తర్వాత మూవీ పేరుని  ‘జంబలకిడి పంబ’గా ఫిక్స్‌ చేశారు. 
సగం చూసి వెళ్లిపోయారు..
తర్వాత సినిమా కొనడానికి వచ్చే వాళ్లు మూవీ చూసి ఆడవాళ్లు మగాళ్లుగా అయిపోవడం ఏంటి.?  అంతా డిఫరెంట్‌గా ఉందని.. ఇదోక పిచ్చి సినిమా అన్నారు. సినిమా సగం చేసే వెళ్లిపోయారు. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో నాన్న సొంతంగా రిలీజ్‌ చేశారు. ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే.. ఆ రోజు మధ్యలో వెళ్లిపోయిన వారినే 100 రోజల ఫంక్షన్‌కు చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చారు’ అని అల్లరి నరేశ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్‌’ కొత్త ఇల్లు సిద్ధం

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement