‘పెద్ద సినిమాలకు అండగా నిలబడ్డాం’ | Mana Panel Press Meet About Elections | Sakshi
Sakshi News home page

‘పెద్ద సినిమాలకు అండగా నిలబడ్డాం’

Sep 5 2026 4:09 PM | Updated on Sep 5 2026 4:15 PM

Mana Panel Press Meet About Elections

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ‘మన ప్యానల్‌’ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు..  తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి  మన ప్యానెల్‌ కృషి చేస్తుందని తెలిపారు.

మేము అలాంటివి ఏం చేయలేదు..
సి కల్యాణ్ మాట్లాడుతూ ‘కొన్ని హామీలు చూసాం. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. గత రెండున్నర ఏళ్లుగా మీరేం చేశారు. ఇప్పుడు వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మన ప్యానెల్ ఉంది. ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లైమ్ వచ్చేలా మేమే చేశాం’ అని తెలిపారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘1990లో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పుడు పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు లేరు. అక్కడ నుండి ఇక్కడకు పరిశ్రమ వచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి బాగా సపోర్ట్ చేశారు.  నిర్మాతలకు అంతా తెలుసు. కౌన్సిల్ లో మేము అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాం’ అని తెలిపారు.

తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘గతంలో మమ్మల్ని ఎన్నికల సమయంలో వారు మోసం చేశారు. నేను చాలా మంది చిన్న నిర్మాతలకు అండగా నిలబడ్డాను. ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో క్లియర్ గా ఉంది. ఎన్నో పెద్ద సినిమాలకు కూడా మేము అండగా నిలబడ్డాం.’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement