లాజిక్‌లు వదిలేసి మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేయండి: ‘అల్లరి’ నరేశ్‌ | Allari Naresh about Ramba Oorvasi Menaka Movie | Sakshi
Sakshi News home page

లాజిక్‌లు వదిలేసి మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేయండి: ‘అల్లరి’ నరేశ్‌

Sep 5 2026 3:20 AM | Updated on Sep 5 2026 3:20 AM

Allari Naresh about Ramba Oorvasi Menaka Movie

రాజేష్, ‘అల్లరి’ నరేశ్, రాశీ సింగ్, చంద్రమోహన్‌

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తోందని యూనిట్‌ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం యూనిట్‌ నిర్వహించిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న చిన్న భయం ఉండేది. 

ఫస్ట్‌ డేనే మా సినిమాకు మంచి టాక్‌ రావడం సంతోషాన్నిచ్చింది. లాజిక్‌లు వదిలేసి ఒక మ్యాజిక్‌ని ఎంజాయ్‌ చేయండి. చూడనివాళ్ళు, థియేటర్స్‌లో చూసి, ఇంకా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అందరూ ‘నరేష్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటున్నారు. కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎమోషన్‌ గురించి కూడా గొప్పగా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు చంద్రమోహన్‌. ‘‘నరేష్‌గారి కామెడీ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. బీ, సీ సెంటర్స్‌లో మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు రాజేష్‌ దండా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement