సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్‌కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు.
సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్‌ఐర్‌లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.
నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్
ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్‌ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H
— ANI (@ANI) September 4, 2026
“Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.
We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”
- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026
CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్‌పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్
మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్‌కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్‌కాస్ట్‌లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు


