breaking news
jantar mantar dharna
-
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్‌కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐర్లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్‌ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H— ANI (@ANI) September 4, 2026 “Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్‌పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్ మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్‌కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్కాస్ట్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
5 రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి డబుల్ ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఓబీసీ జనగణన, రిజర్వేషన్ల పరిధి పెంపునకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు మద్దతు ఇస్తుండగా, అగ్రవర్ణాల వర్గాలు రిజర్వేషన్లలో మార్పులు చేయాలని, అవసరమైతే వాటిని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అటు అగ్రవర్ణాలను, ఇటు దళితులు, ఓబీసీలను ఒకేసారి సంతృప్తిపరచడం కష్టంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశం బీజేపీకి నష్టం కలిగించిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశం మరోసారి పార్టీకి రాజకీయంగా ఇరుకునపెట్టే పరిస్థితిగా మారింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలు కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని, రిజర్వేషన్ల పరిధిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అగ్రవర్ణ వర్గాలకు చెందిన యువత, సామాజిక సంస్థలు రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేయాలని, అవసరమైతే దాన్ని తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ‘రిజర్వేషన్ సంస్కరణ సత్యాగ్రహం’ లక్నోకు కూడా విస్తరించింది.బ్రజేశ్ పాఠక్‌ను కలిసిన ఆందోళనకారులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న హర్ష్ దూబే తదితరులు ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్‌ను కలిశారు. వారి డిమాండ్లను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ నిబంధన తీసుకురావాలని, ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నాయి. యూజీసీ తీసుకొచ్చిన దళిత, ఓబీసీ విద్యార్థులపై వివక్షను నిరోధించే నిబంధనలను కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.బ్రజేశ్ పాఠక్ ఆందోళనకారులతో మాట్లాడటంతో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ బీజేపీపై విమర్శలు ప్రారంభించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ రిజర్వేషన్ సంస్కరణ పేరుతో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పునూ అంగీకరించబోమని హెచ్చరించారు. దీంతో రిజర్వేషన్ల అంశం బీజేపీకి ఒకవైపు అగ్రవర్ణ ఓటర్ల అసంతృప్తి, మరోవైపు దళిత-ఓబీసీ ఓట్లపై ప్రభావం అనే ద్వంద్వ సవాలుగా మారింది.బీజేపీకి ఇది కొత్త సవాలు కాదు రిజర్వేషన్ల అంశం బీజేపీకి కొత్త సవాలు కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంతో విపక్షాలు బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందనే ప్రచారం చేశాయి. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ 29 లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌లోనూ ఎన్డీయేకు నష్టం జరిగింది. ఎన్నికల అనంతరం బీజేపీ సమీక్షలో రాజ్యాంగం-రిజర్వేషన్ అంశంపై విపక్షాలు నిర్మించిన ప్రచారం దళిత, ఓబీసీ ఓట్లపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందు 2015 బిహార్ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలన్న వ్యాఖ్య కూడా బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది.ఇప్పుడు బీజేపీ ముందున్న అసలు సమస్య అగ్రవర్ణ, ఓబీసీలు, దళితులను ఒకే రాజకీయ కూటమిలో కొనసాగించడం. గత దశాబ్దంలో బీజేపీ అగ్రవర్ణాలతో పాటు నాన్-యాదవ్ ఓబీసీలు, నాన్-జాటవ్ దళితులను తనవైపు తిప్పుకుని విస్తృత సామాజిక ఆధారం నిర్మించుకుంది. అయితే రిజర్వేషన్లపై అగ్రవర్ణ వర్గాల డిమాండ్లకు అనుకూలంగా అడుగు వేస్తే దళిత, ఓబీసీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి మార్పు చేయకపోతే సంప్రదాయ సవర్ణ ఓటు బ్యాంకులో అసంతృప్తి పెరగవచ్చు. అందుకే ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశం బీజేపీకి 2024 తరహాలో మరోసారి ‘డబుల్ ఛాలెంజ్’గా మారే అవకాశముంది.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
జంతర్ మంతర్ ఘటనలపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిశీలించాలని సోమవారం హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది. ఈ అంశంపై త్వరితగతిన మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల హింస, బలప్రయోగం ఆరోపణలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ.. మహిళా నిరసనకారులపై హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలను ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.స్వయంగా విచారణ చేపట్టాలని అభ్యర్థనమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.బాధిత మహిళలు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటిని స్వీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.నోడల్ అధికారుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణదీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల్లో మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, దాడుల అంశాలను ప్రాధాన్యంగా పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు తెలిపారు. కమిటీ చైర్‌పర్సన్‌కు నోడల్ అధికారులను నియమించే అధికారం ఇచ్చినట్లు చెప్పారు. నోడల్ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత బాధితులు ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ విధానంలో ఫిర్యాదులు స్వీకరించాలి అనే అంశాలను కమిటీ ప్రకటిస్తుందని వెల్లడించారు.జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీజంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసుల హింస, నిరసనకారుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. పోలీసుల అధిక బలప్రయోగం, మహిళా నిరసనకారులపై లక్ష్యంగా జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించనుంది.మహిళల ఆరోపణలపై అత్యవసర నివేదికమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ అంశంగా కాకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.జంతర్ మంతర్ ఘటనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం ఇప్పుడు కీలకంగా మారింది. బాధిత మహిళలకు ఫిర్యాదు చేసే స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపడం కమిటీ ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది. -
రెండు చరణాలకే కట్టుబడతాం
న్యూఢిల్లీ: జాతీయగేయం వందేమాతరంను పూర్తిగా ఆలపించాలన్న మోదీ సర్కార్ కొత్త నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తప్పుబట్టింది. మహాత్ముడు, నెహ్రూ, నేతాజీ, సర్దార్ పటేల్ తదితర దిగ్గజ నేతలు 1937లో చేసిన తీర్మానం మేరకే వందేమాతరం గేయంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరాభవన్’లో బుధవారం మధ్యాహ్నం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏకంగా నాలుగు గంటలకుపైగా సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీలతోపాటు అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగాం«దీ, అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్లతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి(తెలంగాణ), వీడీ సతీశన్(కేరళ), సుక్విందర్ సింగ్ సుఖూ(హిమాచల్ ప్రదేశ్), డీకే శివకుమార్(కర్ణాటక) పాల్గొన్నారు. తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయాలను కేసీ వేణుగోపాల్, జైరాంరమేశ్ మీడియాకు వెల్లడించారు. భేటీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని 33 మంది మాట్లాడారని తెలిపారు. ‘‘వందేమాతరంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని 1937 అక్టోబర్ 28న రవీంద్రనాథ్ ఠాకూర్ సూచనమేరకు నాటి దిగ్గజ నేతలు మహాత్మాగాం«దీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మౌలానా ఆజాద్ నిర్ణయించారు. మేం సైతం వాళ్ల నిర్ణయాలకే కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలే ఆలపిస్తాం. వందేమాతరం, జనగణమన అంటే మాకు ఒక భావోద్వేగ అంశం. బీజేపీకి మాత్రం ప్రతిదీ రాజకీయమే’’అని అన్నారు. హల్దా్వనీలో ఖర్గే సభ ముగిసిన తర్వాత ఆ ప్రాంగణాన్ని బీజేపీ అనుబంధ సంఘాలు శుద్ధి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వేణుగోపాల్ మండిపడ్డారు. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి విషయంలో ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. విఫలమైన విదేశాంగ విధానం నీట్ వంటి కీలక ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానించారు. 2014 ఏడాది నుంచి 154 పేపర్ లీకేజీ ఉదంతాలు వెలుగుచూశాయి. నీట్ పేపర్‌లీకేజీ ఘటనలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఉదంతాల్లో 90 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత 12 ఏళ్లలో ఉపాధి అవకాశాలు అడుగంటాయి. విద్యావ్యవస్థ వ్యాపారవ్యవస్థగా తయారైంది. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల చలో సంసద్ ర్యాలీ సహా పలు రాష్ట్రాల్లో ఉద్యమించిన యువతపై ఎలక్ట్రిక్ షాక్ బ్యాటన్లు, బాష్పవాయుగోళాలు, పెల్లెట్ గన్లు, ఏకంగా ఏకే–47ను ప్రయోగించారు’’అని సీడబ్ల్యూసీ తీర్మానంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాలు చోరీకి గురైన అంశంలోనూ ప్రభుత్వానిదే జవాబుదారీ అని నేతలు తెగేసిచెప్పారు. కీలక అంశాలపై ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాల్సిన వేళ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రాకుండా ముఖం చాటేశారని సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు సంపూర్ణ విజయం సాధించాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల గొంతుక) కార్యక్రమానికి యువతలో విశేషమైన స్పందన రావడంతో ఇకపై దేశవ్యాప్తంగా 800 పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని, కొన్ని సభల్లో మాత్రం రాహుల్ ప్రసంగిస్తారుని జైరాం రమేశ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాలు చైనా ఆక్రమణలోకి వెళ్లాయి. పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. విదేశాంగ విధానంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైంది’’అని జైరాం తెలిపారు. దేశభక్తి గురించి మాట్లాడే వారు ఇప్పుడు అమెరికాకు, చైనాకు లొంగిపోయారని కేసీ వేణుగోపాల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్య, పోటీ, ఉద్యోగ నియామక పరీక్షల్లో చేపట్టాల్సిన సమస్యలు, యువత లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై విద్యావేత్తలతో చర్చించి నివేదికను సిద్దంచేసి నెల రోజుల్లోపు ఖర్గేకు సమర్పించాలని నలుగురు ముఖ్యమంత్రులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను పెంచకుండా యథాతథంగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. ఈ 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై తమిళనాడు శాసనసభ ఆమోదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్య నుంచి ఉపాధికి మార్గం సుగమం చేస్తామన్న ఖర్గే సీడబ్ల్యూసీ భేటీలో తొలుత ఖర్గే మాట్లాడారు. ‘‘మోదీ సర్కార్ గత 12 ఏళ్లలో విద్యవ్యవస్థను నాశనంచేసింది. 90 వేల పాఠశాలలు మూతబడ్డాయి. విద్య ప్రైవేటీకరణతో ఉన్నత విద్య సామాన్యులకు అందనిద్రాక్ష అయింది. విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులు చొరబడ్డారు. యువతకు విద్య నుంచి నేరుగా ఉపాధి దక్కేలా కాంగ్రెస్ సమగ్ర విధానం తీసుకొచ్చే రోజు వస్తుంది. ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ రోడ్‌మ్యాప్ తెస్తాం’’అని ఖర్గే అన్నారు. ప్రక్షాళన దిశగా ‘సంగఠన్ సృజన్ అభియాన్’ రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు కార్యాచరణ, పార్టీ బలోపేతం, సంస్థాగత పటిష్టతపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టి ఎన్నికల తర్వాత పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేందుకు దేశవ్యాప్తంగా ‘సంగఠన్ సృజన్ అభియాన్’ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వేణుగోపాల్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. -
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయ వేదిక?!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసనల వేదికగా పేరొందిన జంతర్ మంతర్‌పై సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టింది. జంతర్ మంతర్ స్థానంలో నిరసనలకు మరో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం.. సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ సతీశ్ చంద్ర కౌశిక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల సరఫరాపైనా ప్రభావం పడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను ఇవాళ పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇందులో ప్రజల రాకపోకలు, ప్రాంతంలో అందుబాటు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ అంశంపై కేంద్రం నుంచి వివరాలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, ట్రాఫిక్ సమస్యలు, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన సరఫరాలు, అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవలి కొన్ని రాజకీయ నిరసనలను ప్రస్తావించినప్పటికీ.. ప్రతిపాదిత కార్యక్రమాలపై వ్యాఖ్యానించేందుకు ధర్మాసనం నిరాకరించింది. చట్ట ప్రకారం అధికారులు పరిస్థితులను నిర్వహిస్తారని పేర్కొంది.ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు ఉన్నప్పటికీ.. అదే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఈ పిటిషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సమాధానంపై తదుపరి పరిణామాలు ఆధారపడనున్నాయి. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
ఇది ఆరంభం మాత్రమే... రాజీనామా పై రఘవీరా రెడ్డి రియాక్షన్
-
కేంద్ర మంత్రులతో CJP సంచలన ప్రెస్ మీట్
-
లోకేష్ రాజీనామా చేయకపోయితే ఏపీలో కూడా జంతర్ మంతర్ ధర్నా..
-
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
నీట్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-
GEN- Z కేంద్రంకు మా సత్తా ఏంటో చూపించాం..!
-
GEN-Z సంబరాలు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి..
-
కొడుకు అభిజిత్ దీప్కే విజయంపై తల్లి ఎమోషనల్ వీడియో
-
సీజేపీ ఆందోళన ఎఫెక్ట్.. మెట్రోస్టేషన్లుక్లోజ్.. నెట్ కట్
-
వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL
-
అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!
-
మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్
-
అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు
-
50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం!
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శనివారం జరిగిన సీజేపీ నిరసనల్లో ఒక ఆసక్తిక ఘట్టం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వ్యంగ్యాత్మక ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ‘నీట్’ పరీక్షల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ఒక వ్యాపార కేంద్రంగానూ కనిపించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన లోగోలు, గుర్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిరసన స్థలంలోనే దుకాణాలు తెరిచారు. బొద్దింకల థీమ్‌తో డిజైన్ చేసిన మాస్కులు, జెండాలు, టీ-షర్టులను విక్రయిస్తూ సందడి చేశారు.లాభాల మార్జిన్‌పై నెటిజన్ల ట్రోల్స్ఈ విక్రయాలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఒక రిపోర్టర్ మాస్కులు అమ్ముతున్న వ్యక్తిని ‘ఈ మాస్కు ప్రింటింగ్ ఖరీదు ఎంత?’ అని అడగగా, అతడు ‘15 రూపాయలు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి దీన్ని ఉచితంగా పంచుతున్నారా?’ అని ప్రశ్నిస్తే.. ‘లేదు, 30 రూపాయలకు అమ్ముతున్నా’ అంటూ బదులిచ్చాడు. రూ.250 రూపాయలకు టీ-షర్టులు విక్రయించారు. మొత్తంగా చూస్తే 50 శాతం లాభంతో ఈ వ్యాపారం సాగింది.ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? -
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్‌మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్‌మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్‌మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్‌చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్‌గా వాంగ్‌చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్‌లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్‌లైన్‌ను వారం రోజులకు పొడిగించారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు
Congress Delhi dharna Updates..కొనసాగుతున్న కాంగ్రెస్ ధర్నా..బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలుఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీల మద్దతు👉ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా సభా స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిCongress Protest for 42% BC Quota at Jantar Mantar pic.twitter.com/9bh91VwPcQ— Naveena (@TheNaveena) August 6, 2025ఎమ్మెల్సీ విజయ శాంతి కామెంట్స్..బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది బీజేపీ.బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము వదలము.ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందు ఉందని అంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే..బీసీ బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉంటే EWS బిల్లు ఎలా అమలు అయ్యింది..బీసీలు తయారు చేసిన కుర్చీలో మీరు కూర్చున్నారు.కానీ మీరు బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.కొండా సురేఖ కామెంట్స్..42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి అని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నానుముస్లింలు మనుషులు కాదా?వారికి ఒటుహక్కు లేదా?రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ, వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ పిలవలేదు.రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందనే నమ్మకం నాకు లేదు. LIVE : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా https://t.co/R7xbpWWxBK— Telangana Congress (@INCTelangana) August 6, 2025 కనిమొళి కామెంట్స్..జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నాకు హాజరై మద్దతు పలికిన డీఎంకే ఎంపీ కనిమొళి50 శాతం న్యాయం కాదు.. సంపూర్ణ న్యాయం చేయాలి #WATCH | Delhi: On Congress workers holding a protest at Jantar Mantar over the 42% OBC reservation in Telangana state local bodies, DMK MP Kanimozhi says, "Tamil Nadu has 69% reservation. We stand in support to make centuries-old wrong into right. We stand with the Telangana… pic.twitter.com/QHWSCYJNc9— ANI (@ANI) August 6, 2025 కాసేపట్లో ధర్నా ప్రారంభం..కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా ప్రారంభం కానుంది.తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా.టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.👉తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.Massive protest at Delhi’s Jantar Mantar today demanding 42% BC reservations. Led by CM @revanth_anumula & TPCC chief Mahesh Kumar Goud, joined by ministers, MPs & BC leaders the protest will be innugarted by AICC president #MallikarjunKharge @kharge at 11 AM, LoP #RahulGandhi… pic.twitter.com/EolP9x0AxK— Ashish (@KP_Aashish) August 6, 2025👉జంతర్ మంతర్ వద్ద ధర్నాలో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.👉మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు. -
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్‌లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది. దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం. అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్‌తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు. -
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
అరాచక పాలనపై ధర్మాగ్రహ జ్వాల.. ఢిల్లీలో జగన్ ధర్నా (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు (ఫొటోలు)
-
ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?: వైఎస్ జగన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోంది. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు. చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలి. అన్న అన్ని వివరాలు రాసినట్టు.. అందులో లోకేష్ స్వయంగా ప్రకటించారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకొండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు.ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?. దయచేసి, మీరంతా ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి. ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. అందుకే మరోసారి నేషనల్ మీడియాను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి.ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. కాబట్టి, దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకొండి. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ విజ్ఞప్తి చేశారు. -
నేడు ఢిల్లీకి సీఎంలు సిద్ధరామయ్య, పినరయి విజయన్.. కేంద్రం తీరుకు నిరసన!
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, కేరళలోని అధికార ఎల్డీఎఫ్ పార్టీలు కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆందోళనకు నడుం బిగించాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నేడు (బుధవారం) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దౌర్జన్యాలకు, అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ చేసింది. చలో ఢిల్లీ పిలుపులో భాగంగా సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు (బుధవారం) కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ అన్యాయ, వివక్షాపూరిత విధానాల వల్ల 2017-18 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి రూ.1.87 లక్షల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నేటి ఉదయం 7 ఉదయం 11 గంటల నుండి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. గ్రాంట్లు ఇవ్వడంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సౌకర్యాల కల్పనలో కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు అన్యాయం చేసిందని సీఎం ఆరోపించారు. ‘మేరా ట్యాక్స్ మేరా అధికార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ నిరసనను ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తమ నిరసన భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) వ్యతిరేకం కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఐక్యంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటామన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా తమకు సరైన ఉపశమనం లభించలేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా అందలేదని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దేశ రాజధానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగింది. -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్‌మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
తగ్గిన ఉద్రిక్తత
న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు గాడిన పడుతున్నాయి. శనివారం ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. నిత్యావసరాలు సమకూర్చుకోవడంతోపాటు, దెబ్బతిన్న ఆస్తులను, మంటల్లో దహనమైన ఇళ్ల శిథిలాలను తొలగించి, చక్కదిద్దుకోవడం ప్రారంభించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు బలగాల కవాతు చేస్తున్నారు. అల్ల్లర్లను నిరసిస్తూ ‘ఢిల్లీ పీస్ ఫోరం’ అనే ఎన్జీవో జంతర్‌మంతర్ వద్ద శాంతి ర్యాలీ చేపట్టింది. జాతీయ జెండాను చేతబూనిన వందలాది మంది ప్రదర్శనకారులు జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. నిరసన తెలిపితే కేసులా?: కాంగ్రెస్ ఢిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని, దీనిపై నిగ్గు తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ కోరింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ శనివారం వ్యాఖ్యానించారు. ‘విద్వేష పూరిత ప్రసంగం అర్థం ఏంటి? బీజేపీ నేతల ప్రసంగాలు విద్వేషపూరితం కాదు. అదే ఆందోళనకారులు మాట్లాడితే సంఘ విద్రోహం కేసులు పెడుతున్నారు’ అని తెలిపారు. రెచ్చగొట్టడంలో వారికి ప్రావీణ్యం: నక్వి ప్రతిపక్షాలు ఢిల్లీ అల్లర్ల బాధితుల గాయాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి శనివారం ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజలను రెచ్చగొట్టడంలో మంచి నైపుణ్యం ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు. ఫిర్యాదుల కోసం... మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజీలను ఫార్వర్డ్ చేసి, ప్రచారం కల్పించడం నేరమని ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. వీటిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచి స్తోంది. ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలను మార్చి 7వ తేదీ వరకు తెరవరాదని ప్రభుత్వం నిర్ణయించింది. -
నిరసనలపై నిషేధం తగదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్, బోట్‌క్లబ్ వంటి ప్రాంతాల్లో నిరసనలు, బైఠాయింపులపై పూర్తి నిషేధం విధించటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు బదులు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జంతర్‌మంతర్, ఇండియా గేట్ దగ్గరి బోట్ క్లబ్ వద్ద వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తదితర స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య, హింసాయుత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విధించే 144వ సెక్షన్ వంటి ఆజ్ఞల్ని అధికారులు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ తరఫు లాయర్ వాదిస్తూ..‘జంతర్‌మంతర్ రోడ్డులో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలు చేపట్టే ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి ఆటంకం కలగటంతోపాటు, శబ్దకాలుష్యం, తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి నిషేధం తగదని, ప్రజల నిరసన హక్కుకు భంగం కలగకుండా మార్గదర్శకాలు రూపొం దించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. -
తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి
న్యూఢిల్లీ: తెలుగువాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదని, అతి మంచివాళ్లు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నాలో లక్ష్మీ పార్వతి ప్రసంగించారు. తమిళనాడు కంటే ఎదిగిపోతున్నామనే కుట్రతో సోనియాతో కలిసి రాష్ట్ర విభజనకు చిదంబరం కుట్ర చేశారని ఆరోపించారు. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టి కుంపట్లు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు నాటకాలు మానుకోవాలని సూచించారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తర్వాత వైఎస్ జగన్ ఒక్కరే పాటు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబట్టానికి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్ అని లక్ష్మీ పార్వతి అన్నారు. -
బాబును భావితరాలు క్షమించవు: ఎంపీ మేకపాటి
‘‘తెలుగువారందరూ 50-60 ఏళ్లుగా గొప్పగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నేడు మనం గర్వించే రాజధానిగా తయారైంది. అలాంటిది ఉన్నఫళంగా సీమాంధ్రలో వేరే రాజధాని కట్టుకోమంటే చంద్రబాబు కూడా సరేనంటూ నాలుగు లక్షల కోట్లు అడిగారు. విభజనకు సరేనని ఉత్తరం ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు.. తన ఎంపీలతో రాజీనామాలు చేయించి.. మరికొందరితో పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపచేయించారు. బాబును భావితరాలు కూడా క్షమించవు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు కూడా ఆలోచించాలి. తన మాట కాదని ఎంపీలు రాజీనామా చేశారా? ఆయనిచ్చిన ఉత్తరానికి వ్యతిరేకంగా చేశారా? అదే జరిగితే మీ పార్టీలో మీ మాటకు కట్టుబడే పరిస్థితి లేదా? తెలుగు ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో మీరు ఆడుతున్న నాటకాల్ని నేడు ప్రతి చిన్న కుటుంబంలోని వారూ గ్రహించారు, మీ మోసాల్ని ఎవరూ మెచ్చరు..’’ అని హితవు పలికారు. వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే.. ‘‘సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో సైతం జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజాభిమానం చాలా గొప్పగా ఉంది. మొత్తం 30-37 ఎంపీ సీట్లు గెలవడంతోపాటు, 180-190 అసెంబ్లీ సీట్లు సాధించి మా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏం చేసైనా ఈ అవకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విభజన ప్రకటన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచీ వాళ్ల ధ్యేయమంతా ఎలా ఇబ్బంది పెట్టాలన్నదే. ఆ ధ్యేయంతోనే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించింది. ఇది అనాలోచిత నిర్ణయం’’ అని విమర్శించారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి సీఎంగా ఉండగా తీర్మానం చేసి పంపితే.. దాన్ని పట్టించుకోకుండా ఇప్పటివరకూ తెలంగాణపై అసెంబ్లీలో ఏ తీర్మానం చేయని ఆంధ్రప్రదేశ్‌ను చీల్చాల్సిన అవసరం ఏమిటి? నేడు దేశంలో చాలా రాష్ట్రాలను విభజించాలని చాలా డిమాండ్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాటన్నింటి జోలికీ పోకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు ప్రజలను రాజకీయ కారణాలతో, తెలంగాణలో పది సీట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తారా?’’ అని మేకపాటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదు: జూపూడి రాష్ట్రాన్ని, కులాలను, కుటుంబాన్ని చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ దుయ్యబట్టారు. విభజనపై సీమాంధ్ర అగ్నిగుండంలా రగులుతోంటే బాబు సమైక్యంగా ఉండాలని అమెరికా సభల్లో కథలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ధర్నాలో జూపూడి మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే బాబు రాష్ట్ర విభజనపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘సమన్యాయం చేయలేకపోతే విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌కు లేదు. విజయమ్మ దీక్ష దేశ రాజకీయాల్లో మలుపు. జగన్ దీక్ష దేశ రాజకీయ నేతలను ఆలోచింపజేస్తుంది. ఆయన నాయకత్వంలో 42 మంది ఎంపీలు పార్లమెంటుకు వస్తే దేశ రాజకీయాలను శాసిస్తారనే భయంతోనే ఢిల్లీ పెద్దలు కుట్రతో ఆయనను జైలులో పెట్టారు’ అని ధ్వజమెత్తారు. జగన్‌ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డాయని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్‌రెడ్డి, టి.బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బాబు లేఖతోనే విభజన: ఉమ్మారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విడగొడితే తనకు అభ్యంతరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారని.. ఆ కారణంతోనే విభజనకు కాంగ్రెస్ సిద్ధపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారమిక్కడ వైఎస్ విజయమ్మ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే బాబు.. నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వండి, మేం వెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ బేరసారాలకు దిగారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని గమనించి వెంటనే ప్లేటు ఫిరాయిస్తూ సమస్యలంటూ ప్రధానికి లేఖ రాశారు. రెండు కళ్ల ధోరణి, రెండు నాల్కల ధోరణి మానుకోకపోతే బాబు చరిత్రహీనులవుతారు’ అని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్రకు వెళ్తే.. జనాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందనే మానుకున్నారని చెప్పారు.


