50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం! | How CJPs Delhi Rally Turned Into a Business Hub | Sakshi
Sakshi News home page

50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం!

Jun 7 2026 11:16 AM | Updated on Jun 7 2026 1:16 PM

How CJPs Delhi Rally Turned Into a Business Hub

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శనివారం  జరిగిన సీజేపీ నిరసనల్లో ఒక ఆసక్తిక ఘట్టం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వ్యంగ్యాత్మక ఉద్యమం ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ‘నీట్’ పరీక్షల ప్రక్రియలో  చోటుచేసుకున్న అక్రమాలపై  విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన  ఒక వ్యాపార కేంద్రంగానూ కనిపించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన లోగోలు, గుర్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిరసన స్థలంలోనే దుకాణాలు తెరిచారు. బొద్దింకల థీమ్‌తో డిజైన్ చేసిన మాస్కులు, జెండాలు, టీ-షర్టులను  విక్రయిస్తూ సందడి చేశారు.

లాభాల మార్జిన్‌పై నెటిజన్ల ట్రోల్స్
ఈ విక్రయాలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అందులో ఒక రిపోర్టర్ మాస్కులు అమ్ముతున్న వ్యక్తిని ‘ఈ మాస్కు ప్రింటింగ్ ఖరీదు ఎంత?’ అని అడగగా, అతడు ‘15 రూపాయలు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి దీన్ని ఉచితంగా పంచుతున్నారా?’ అని ప్రశ్నిస్తే.. ‘లేదు, 30 రూపాయలకు అమ్ముతున్నా’ అంటూ బదులిచ్చాడు. రూ.250 రూపాయలకు టీ-షర్టులు విక్రయించారు. మొత్తంగా చూస్తే  50 శాతం లాభంతో  ఈ వ్యాపారం సాగింది.

ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement