అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? | The Bitter Reality of a rs 1 Crore Package in New York Goes Viral | Sakshi
Sakshi News home page

అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?

Jun 7 2026 10:02 AM | Updated on Jun 7 2026 11:49 AM

The Bitter Reality of a rs 1 Crore Package in New York Goes Viral

న్యూయార్క్‌: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. కోట్లలో జీతం అనగానే భారతదేశంలోని చాలామంది ఎంతో సంబరపడిపోతుంటాయి. అయితే ఆ సంపాదన వెనుక ఉన్న అసలు నిజాలు, ఖర్చుల గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. న్యూయార్క్‌ నగరంలో నివసిస్తున్న యశ్ శర్మ అనే భారతీయుడు ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ప్రవాస భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టింది. అమెరికాలో రూ. 1 కోటి ప్యాకేజీ వచ్చినా, అక్కడ ఉండే పన్నులు, అద్దెల భారంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉండవచ్చని అతను చేసిన విశ్లేషణ నెటిజన్లలో చర్చకు దారితీసింది.

పన్నుల రూపంలో భారీ కోత
యశ్ శర్మ తన వీడియోలో న్యూయార్క్‌లో లభించే రూ. కోటి ప్యాకేజీపై పడే పన్నుల భారాన్ని వివరంగా లెక్కగట్టారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నివసించే వారికి ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్, న్యూయార్క్ సిటీ టాక్స్‌లతో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి రకరకాల పన్నులు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సంపాదనలో ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లిపోతుందని, దీంతో చేతికి వచ్చే మొత్తం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు

ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు
పన్నుల కోత తర్వాత మిగిలిన మొత్తంలో  అధికభాగం ఇళ్ల అద్దెలకే సరిపోతుందని యశ్ వివరించారు. న్యూయార్క్ లాంటి నగరంలో ఒక మోస్తరు లేదా మంచి ప్రాంతంలో నివసించాలన్నా నెలకు సుమారు రూ. రెండు లక్షల నుండి రూ. మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ భారీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ సంపాదించే వ్యక్తి కంటే, భారతదేశంలో రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం పొందే వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా, సంతోషంగా జీవించగలడని ఆయన అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల భిన్న స్పందనలు
‘ది డార్క్ సైడ్ ఆఫ్ ఎ ₹1 క్రోర్ ప్యాకేజీ ఇన్ న్యూయార్క్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేవలం డాలర్లను రూపాయిల్లోకి మార్చి చూసే వారికి అక్కడి ఖర్చులు అర్థం కావని కామెంట్లు పెడుతున్నారు. సంపాదన కంటే జీవన వ్యయం చాలా ముఖ్యమని కొందరు అంటుండగా, న్యూయార్క్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి అమెరికా అంతటా ఇలాగే ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పన్నులు, అద్దెలు నిజంగానే పెద్ద షాక్ ఇస్తాయనేది వాస్తవమని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement