వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.
ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.
అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు.


