NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు | Education Ministry Major Announcement about nta At 8 PM Today | Sakshi
Sakshi News home page

NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు

Jul 24 2026 7:05 PM | Updated on Jul 24 2026 8:25 PM

Education Ministry Major Announcement about nta At 8 PM Today

సాక్షి,న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.

పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్‌టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement