186 మందితో వెళుతున్న విమానం.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | malaysia airlines plane makes emergency landing in chennai | Sakshi
Sakshi News home page

186 మందితో వెళుతున్న విమానం.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Sep 7 2026 9:17 PM | Updated on Sep 7 2026 9:24 PM

malaysia airlines plane makes emergency landing in chennai

చెన్నై: కౌలాలంపూర్ నుంచి జెడ్డాకు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH156లోని నంబర్-2 ఇంజిన్‌లో అకస్మాత్తుగా సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫైలట్లు దీనిని వెంటనే సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణ సమయంలో విమానంలో  186 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమానం వాస్తవానికి చెన్నై విమానాశ్రయానికి సాయంత్రం  చేరుకోవాల్సి ఉంది. అయితే అత్యవసర పరిస్థితి కారణంగా ముందుగానే చెన్నైకి మళ్లించిన విమానం ముందుగానే సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయంలో అవసరమైన అత్యవసర స్పందనా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినట్లు విమానయాన అధికారులు తెలిపారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని చెన్నై విమానాశ్రయానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.ప్రస్తుతం విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యపై మలేషియా ఎయిర్‌లైన్స్ సాంకేతిక బృందాలు, సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇంజిన్‌లో అసలు ఎలాంటి సమస్య తలెత్తిందనే దానిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement