పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్‌ రాయబారి | Japanese Ambassador takes three Ganga dips in Rishikesh, calls it unforgettable | Sakshi
Sakshi News home page

పవిత్ర గంగలో మూడు మునకలు: అనుభూతిని పంచుకున్న జపాన్‌ రాయబారి

Sep 7 2026 2:44 PM | Updated on Sep 7 2026 2:55 PM

Japanese Ambassador takes three Ganga dips in Rishikesh, calls it unforgettable

భారత్‌లోని జపాన్ రాయబారి (Ambassador) ఓనో కేయిచి (Ono Keiichi) రిషికేష్ పర్యటన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.గంగోత్రి నదీ తీరాన  పవిత్ర గంగానదిలో మూడుసార్లు పవిత్ర స్నానం ఆచరించి, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, తన అనుభూతిని, అభిమానాన్ని చాటుకున్న వైనంగా నెట్టింట వైరల్‌గా మారింది. గంగలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో వివరించారు

జన్మాష్టమి వారాంతంలో జరిగిన ఈ అనుభవాన్ని ఓనో కేయిచి ఎక్స్  వేదికగా పంచుకుంటూ నిజంగా ఇది మరచిపోలేని క్షణం, అద్భుతం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా   ఆయన ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  రిషికేష్‌లోని గంగానది ఒడ్డున భద్రత కోసం ఉన్న గొలుసును పట్టుకుని ఆయన మూడుసార్లు నీటిలో మునిగారు.  ఈ అనుభవం తనకు ఎంత గొప్ప భక్తిని, కృతజ్ఞతా భావాన్నికలిగించిందని, జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. 

రిషికేశ్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య ఉండటం తనకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగించిందని ఒనో కేయిచి చెప్పారు. “చివరకు రిషికేశ్‌లో గంగానదిలో పూర్తిగా మూడుసార్లు మునిగాను. జన్మాష్టమి వారాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తున్న ప్రజల మధ్య నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కలిగింది.  ‘‘ఇది నిజంగా మరచిపోలేని క్షణం” అని ఆయన రాసుకొచ్చారు. అలాగే గంగా ఆరతి సందర్భంగా సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆచారాల్లో భాగంగా ఆయన నదీ తీరంలో మట్టి దీపాన్ని వెలిగించారు. ఈ ఫోటోలను కూడా  పంచుకున్నారు.
 

ఇదీ చదవండి : రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!


 

ఇదీ చదవండి : నో ఫుడ్‌, నో మనీ : కట్‌ చేస్తే కంపెనీ సీఈవోగా

కాగా భారతీయత, ప్రాధాన్యతలపై ఓనో కేయిచి ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదు.  21024 నవంబర్‌లో భారత జపాన్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన ఓనో కేయిచి, మొదటినుంచీ భారతీయ ఆహార పద్ధతులు, సంస్కృతి పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.గతంలో ఢిల్లీలో చేతితో బిర్యానీ తింటూ.. "సుషి" లాగే బిర్యానీని కూడా చేతితో తింటేనే అసలైన రుచి వస్తుందని చెప్పారు. అలాగే బిహార్ పర్యటనలో 'లిట్టి చోఖా' రుచి చూసి భోజ్‌పురి భాషలో "గజబ్ స్వాద్ బా" (అద్భుతమైన రుచి) అని ప్రశంసించారు.

ఇదీ చదవండి: రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్‌ : నెటిజన్లు ఫిదా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement