ఉత్తరాదిలో భారీ వర్షాలు | Heavy rains in several parts of North India | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిలో భారీ వర్షాలు

Sep 5 2026 5:09 AM | Updated on Sep 5 2026 5:09 AM

Heavy rains in several parts of North India

ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, బిహార్‌లో వరదలు  

హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గంగా  

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలు రోడ్లు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కన్నాట్‌ ప్లేస్, లూటెన్స్‌ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయి. గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీ వాణిజ్య కేంద్రం, శంకర్‌ చౌక్, శీతలా మాతా రోడ్‌ ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడింట ఒక వంతు జిల్లాలు వరదల బారిన పడ్డాయి. 

సుల్తాన్‌పూర్‌లో అత్యధికంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో సుమారు 3.53 లక్షల మంది ప్రజలు వరదల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వారణాసిలో గంగా నది హెచ్చరిక స్థాయిని దాటి ప్రమాద స్థాయికి పైన ప్రవహిస్తోంది.  హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా మొత్తం 102 రోడ్లను మూసివేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 

అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఎగువన ఉన్న నేపాల్, పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో బిహార్‌లోని ఐదు జిల్లాల్లో భీకర వరద పరిస్థితులు నెలకొన్నాయి. గంగ, గండక్, కోసి, బుర్హి గండక్, బాగ్‌మతి, పున్‌పున్, ఘఘ్రా నదులు ఉప్పొంగి అనేక ప్రాంతాలను ముంచెత్తాయి.     

ఢిల్లీ ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వరద  
ఉరుములతో కూడిన వర్షంతో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్ట్‌పోరును వరద నీరు ముంచెత్తింది. విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నెల 24వ తేదీన రోజంతా కురిసిన వర్షానికి వందల సంఖ్యలో విమానాలను దారి మళ్లించారు. 

అయితే, ఈసారి కేవలం గంటపాటు కురిసిన వర్షానికి ఇబ్బందులు తలెత్తాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వాల్సిన తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. వాటిలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏఐ 2541 విమానం కూడా ఉంది. పలు విమానాల షెడ్యూల్‌ ఆలస్యమైంది. టెరి్మనల్‌–3లోకి వర్షపునీరు చొచ్చుకొచ్చింది. ప్రయాణికులు మోకాలు లోతు నీటిలోనే నడవాల్సి వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement